పెరియతిరుమొழி-8వపత్తు (7)

శ్రీః

7  . వియముడై 

తిరు కణ్ణపురమ్ దివ్యదేశమున వేంచేసియున్న శౌరి పెరుమాళ్ యొక్క సౌలభ్యము; సౌశీల్యము తిరుమంగై ఆళ్వార్ వర్ణించుచున్నారు.

** వియముడై విడైయినమ్, ఉడైతర మడమగళ్,

కుయమిడై తడవరై, అగలమదు ఉడైయవర్,

నయముడై నడై అనమ్, ఇళైయవర్ నడైపయిల్,

కయమిడై కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1708

నయమ్ ఉడై నడై = అందమైన గమనముగల; అనమ్ = రాజహంసలు;ఇళైయవర్ నడై పయిల్ = యౌవన యువతుల గమనమును అభ్యసించు చున్నవియు;కుయమ్ మిడై = కడు తటాకములు కడు చేరువగ గల; కణపురమ్ = తిరుకణ్ణపురము;వియమ్ ఉడై విడై ఇనమ్ = బలిష్టములైన వృషభముల సమూహమును; ఉడై తర = అంతమొందించిన; కుయమ్ మిడై=వక్షోజములను కడు చేరువగ కలిగిన;తడ వరై అగలమదు ఉడైయవర్=పెద్ద పర్వతమువలె వక్షస్థలము కలిగిన; అడిగళ్ తమ్ = స్వామి శౌరి పెరుమాళ్ యొక్క;  ఇడమే = దివ్య స్థానమే సుమా!

అందమైన గమనముగల రాజహంసలు యౌవన యువతుల గమనమును అభ్యసించు చున్నవియు, కడు తటాకములు కడు చేరువగ గల తిరుకణ్ణపురము,బలిష్టములైన వృషభముల సమూహమును అంతమొందించిన ఆ సమయమున, మిక్కిలి వినయ విధేయతలుగల నప్పిన్నైపిరాట్టియొక్క వక్షోజములను కడు చేరువగ కలిగిన పెద్ద పర్వతమువలె వక్షస్థలము కలిగిన స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!

ఇణైమలి మరుదినొడు, ఎరుదిఇఱ ఇగల్ శెయ్ దు,

తుణైమలి ములైయవళ్, మణమిగు కలవియుళ్,

మణమలి విழవినొడు, అడియవర్ అళవియ,

కణమలి కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1709

మణమ్ మలి=అమిత ఆనందదాయకమగు;విழవినొడు=ఉత్సవములలో;అడియవర్ = శ్రీవైష్ణవులు; అళవియ = కిక్కిరిసి చేరియున్న;కణమ్ మలి=గుంపులతో నిండియుండెడి; కణపురమ్=తిరుకణ్ణపురము; ఇణై మలి=రెండు జతగా చేరియున్న;మరుది ఇఱ = మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు చేసినవాడును; ఎరుదినొడు = ఏడువృషభములతో; ఇగల్ శెయ్ దు = పోరు సలిపి; తుణై మలి ములైయవళ్ = చేరియున్న సౌందర్యముతో ఒప్పు వక్షోజములుగల నప్పిన్నైపిరాట్టితో;మణమ్ = వివాహముసంబంధముచే కలిగిన; మిగు కలవియుళ్ = మిక్కిలి సంశ్లేషానందము పొందిన; అడిగళ్ తమ్ = స్వామి శౌరి పెరుమాళ్ యొక్క; ఇడమే = దివ్య స్థానమే సుమా!

    అమిత ఆనందదాయకమగు ఉత్సవములలో శ్రీవైష్ణవులు కిక్కిరిసి చేరియున్నగుంపులతో నిండియుండెడి తిరుకణ్ణపురము,రెండు జతగా చేరియున్న మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు చేసినవాడును, ఏడువృషభములతో పోరు సలిపి ,చేరియున్న సౌందర్యముతో ఒప్పు వక్షోజములుగల నప్పిన్నైపిరాట్టితో వివాహము సంబంధముచే కలిగిన మిక్కిలి సంశ్లేషానందము పొందిన స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!

పుయల్ ఉఱు వరైమழை, పొழிదర మణినిరై,

మయలుఱ వరైకుడై, ఎడువియ నెడియవర్,

ముయల్ తుళర్ మిళైముయల్ తుళ, వళ విళైవయల్,

కయల్ తుళు కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1710

ముయల్ తుళర్ = పొలమును నాగలిచే కలపుమొక్కలను పెరికినపుడు;మిళై ముయల్ తుళ = చిన్న బొరియలనుండి కుందేళ్ళు బైటకు గెంతుచుండునదియు; వళమ్ విళై వయల్ = సమృద్దిగ పండించబడు పొలములలో; కయల్ = మత్స్యములు; తుళు = త్రుళ్ళిత్రుళ్ళి ఆడుచుండెడి; కణపురమ్ = తిరుకణ్ణపురము; పుయల్ ఉఱు = పెద్ద గాలితో కూడిన;వరై మழை = రాళ్ళ వర్షమును;పొழிదర=(ఇంద్రునిచే) కురిపించిన సమయమున; మణినిరై= అందమైన గోసమూహములు; మయల్ ఉఱ = కలతచెంది యుండగ;వరై కుడై=గోవర్ధనపర్వతమనుగొడుగును;ఎడువియ=పైకెత్తిన; నెడియవర్= మహాపురుషుడైన; అడిగళ్ తమ్ = స్వామి శౌరి పెరుమాళ్ యొక్క; ఇడమే = దివ్య స్థానమే సుమా!

    పొలమును నాగలిచే కలపుమొక్కలను పెరికినపుడు,చిన్న బొరియలనుండి కుందేళ్ళు బైటకు గెంతుచుండునదియు, సమృద్దిగ పండించబడు పొలములలో మత్స్యములు త్రుళ్ళిత్రుళ్ళి ఆడుచుండెడి తిరుకణ్ణపురము,పెద్ద గాలితో కూడిన రాళ్ళ వర్షమును (ఇంద్రునిచే) కురిపించిన సమయమున అందమైన గోసమూహములు  కలతచెంది యుండగ గోవర్ధనపర్వతమను గొడుగును పైకెత్తిన మహాపురుషుడైన స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!.

ఏదలర్ నగైశైయ, ఇళైయవర్ అళై వెణ్ణెయ్,

పోదుశెయ్ దు అమరియ, పునిదర్ నల్ విరైమలర్,

కోదియ మదుకరమ్, కులవియ మలర్ మగళ్,

కాదల్ శెయ్ కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1711

నల్ విరై మలర్ = మంచి పరిమళముగల పుష్పములను; కోదియ = ఘ్రాణించి అవి అసారమని విడిచి వచ్చిన; మదుకరమ్ = భ్రమరములు; కులవియ మలర్ మగళ్=చుట్టుకొని ఝంకారము చేయుచుండు  కమలవాసినియైన శ్రీమహాలక్ష్మి; కాదల్ శెయ్= ఆశించెడి; కణపురమ్=తిరుకణ్ణపురము;ఏదలర్= విరోధులైన శిశుపాలుడు మొదలగు వారు; నగై శైయ=పరహసించునట్లు;ఇళైయవర్ అళై వెణ్ణెయ్ పోదుశెయ్ దు= యౌవన యువతులు చిలికిపెట్టిన వెన్నను దొంగతనముగ ఆరగించి;అమరియ = ఆనందించిన; పునిదర్ = పవిత్రుడైన;అడిగళ్ తమ్=స్వామి శౌరి పెరుమాళ్ యొక్క;ఇడమే=దివ్య స్థానమే సుమా!

మంచి పరిమళముగల పుష్పములను ఘ్రాణించి అవి అసారమని విడిచి వచ్చిన భ్రమరములు, చుట్టుకొని ఝంకారముచేయుచుండు  కమలవాసినియైన శ్రీమహాలక్ష్మి ఆశించెడి తిరుకణ్ణపురము విరోధులైన శిశుపాలుడు మొదలగు వారు పరహసించునట్లు యౌవన యువతులు చిలికిపెట్టిన వెన్నను దొంగతనముగ ఆరగించి ఆనందించిన పవిత్రుడైన స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!.

తొణ్డరుమ్ అమరరుమ్, మునివరుమ్ తొழுదెழ, 

అణ్డమొడు అగలిడమ్, అళన్దవర్ అమర్ శెయ్ దు, 

విణ్డవర్ పడ, మదిళ్ ఇలఙ్గై  మున్నెరియెழ,

కణ్డవర్ కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1712

కణపురమ్ = తిరుకణ్ణపురము; తొణ్డరుమ్ = శ్రీ వైష్ణవులును; అమరరుమ్ = బ్రహ్మాది దేవతలును; మునివరుమ్ = యోగులును; తొழுదు ఎழ = సేవించి ఉద్ధరింపబడునట్లు; అణ్డ మొడు = ఊర్ధ్వలోకములతో పాటు; అగల్ ఇడమ్ = వ్యాపించియున్న భూలోకములును; అళన్దవర్ = కొలిచినవాడును; విణ్డవర్ పడ = శత్రువులు మరణించునట్లు; అమర్ శెయ్ దు = యుద్ధము చేసి; మదిళ్ ఇలఙ్గై = ప్రాకారములతో చుట్టుకొనియున్న లంకాపురి;మున్ = మునుపొకకాలమున;ఎరి ఎழ=అగ్ని దహించునట్లు; కణ్డవర్ = సంకల్పించినవారైన; అడిగళ్ తమ్ = స్వామి శౌరి పెరుమాళ్ యొక్క;ఇడమే= దివ్య స్థానమే సుమా! 

                తిరుకణ్ణపురము, శ్రీ వైష్ణవులును,బ్రహ్మాదిదేవతలును,యోగులును, సేవించి ఉద్ధరింపబడునట్లు, ఊర్ధ్వలోకములతో పాటు వ్యాపించియున్న  భూలోకములును కొలిచినవాడును, శత్రువులు మరణించునట్లు యుద్ధము చేసి ప్రాకారములతో చుట్టుకొనియున్న లంకాపురి, మునుపొక కాలమున అగ్ని దహించునట్లు కల్పించినవారైన స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!

మழுవు ఇయల్ పడైయుడై, యవనిడమ్ మழைముగిల్,

తழுవియ వురువినర్, తిరుమగళ్ మరువియ,

కొழுవియ శెழுమలర్, ముழுశియ పఱవై పణ్,

ఎழுవియ కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1713

తిరుమగళ్ మరువియ=శ్రీమహాలక్ష్మి నిత్యవాసము చేయుచుండు; కొழுవియ శెழு = మిక్కిలి సౌందర్యము కలిగిన; మలర్ = తామరపుష్పముయందు; ముழுశియ = కొట్టుమిట్టాడుచున్న; పఱవై పణ్ = విహంగముల రాగభరితమైన ఝంకారములు; ఎழுవియ = అంతటను వ్యాపించియుండెడి; కణపురమ్ = తిరుకణ్ణపురము;మழுవు ఇయల్ పడై ఉడైయవన్ ఇడమ్=గండ్రగొడ్డలి స్వభావసిద్దమైన ఆయధముగగల స్వామి యొక్క  నివాసస్థానము; ( మరియు ) మழை ముగిల్ తழுవియ ఉరువినర్ = వర్షా కాలమందలి మేఘమువంటి వర్ణము కలిగిన దివ్యమైన శరీరముగల; అడిగళ్ తమ్= స్వామి శౌరి పెరుమాళ్ యొక్క; ఇడమే = దివ్య స్థానమే సుమా!

శ్రీమహాలక్ష్మి నిత్యవాసము చేయుచుండు మిక్కిలి సౌందర్యము కలిగిన తామరపుష్పముయందు కొట్టుమిట్టాడుచున్న విహంగముల రాగభరితమైన ఝంకారములు అంతటను వ్యాపించియుండెడి తిరుకణ్ణపురము, గండ్రగొడ్డలి స్వభావసిద్దమైన ఆయధముగగల స్వామి యొక్క  నివాసస్థానము మరియు వర్షా కాలమందలి మేఘమువంటి వర్ణము కలిగిన దివ్యమైన శరీరముగల స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!.

పరిదియొడు అణి మది, పనివరై తిశై నిలమ్, 

ఎరితియొడు ఎన ఇన, ఇయల్వినర్ శెలవినర్,

శురుదియొడు అరుమఱై, ముఱై శొలుమ్ అడియవర్,

కరుదియ కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1714

శురుదియొడు = స్వరములతో కూడిన; అరుమఱై = అపూర్వమైన వేదములను; ముఱై శొలుమ్ = క్రమరీతిలో స్తుతించెడి; అడియవర్ = శ్రీవైష్ణవులు;కరుదియ = (తమకు భోగ్యమగ స్థానముగ తలచుచుండెడి)కణపురమ్ = తిరుకణ్ణపురము; పరిదియొడు = సూర్యునితో కూడి; అణి మది = అందమైన చంద్రుడు;పనివరై = హిమాలయము మొదలగు కులపర్వతములు;తిశై = దిక్కులు;నిలమ్ = భూమండలము;ఎరి తియొడు=జ్వలించెడి అగ్నియు;ఎన = అని చెప్పబడుచున్న;ఇన = ఇటువంటి పదార్దములన్నియు; ఇయల్వినర్ = తన స్వభావ సిద్దమైన రూపముగ కలవాడైన; శెలవినర్ = ఇవన్నిటిని ప్రవర్తింపజేయువాడైన; అడిగళ్ తమ్ = స్వామి శౌరి పెరుమాళ్ యొక్క; ఇడమే = దివ్య స్థానమే సుమా!

      స్వరములతో కూడిన అపూర్వమైన వేదములను క్రమరీతిలో స్తుతించెడి శ్రీవైష్ణవులు (తమకు భోగ్యమగు స్థానముగ తలచుచుండెడి)తిరుకణ్ణపురము, ” సూర్యునితోకూడి ,అందమైన చంద్రుడు,హిమాలయము మొదలగు కులపర్వతములు, దిక్కులు, భూమండలము,జ్వలించెడి అగ్నియు ” అని చెప్పబడుచున్న, ఇటువంటి పదార్దములన్నియు,తన స్వభావ సిద్దమైన రూపముగ కలవాడైన, ఇవన్నిటిని ప్రవర్తింప జేయువాడైన స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!.

పడి పుల్ గుమ్ అడియిణై, పలర్ తొழ మలర్ వైగు,

కొడి పుల్ గు తడవరై, అగలమదు ఉడైయవర్,

ముడి పుల్ గు నెడువయల్, పడై శెల అడి మలర్,

కడి పుల్ గు కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1715

ముడి పుల్ గు = నారుమడులతో ఒప్పుచున్న;నెడువయల్ = విశాలమైన పొలములలో; పడై=కలుపు మొక్కలు;శెల=తీయునపుడు;అడి=కాళ్ళకు తగిలెడి;మలర్=పుష్పములచే; కడి పుల్ గు = పరిమళము వెదజల్లబడుచుండెడి; కణపురమ్ =తిరుకణ్ణపురము; పలర్ తొழ = పలువురు భక్తులు సేవించునట్లు; పడి పుల్ గుమ్ అడియిణై ఉడైయవర్ = ఈ భూమండలమును కొలిచిన పాదద్వందములు కలవాడును; మలర్ వైగు కొడి = తామరపుష్పమందు వసించు శ్రీదేవిని; పుల్ గు తడవరై = కలగియున్న పెద్ద పర్వతమువంటి; అగలమదు ఉడైయవర్ = వక్షస్థలము కలవాడైన; అడిగళ్ తమ్ = స్వామి శౌరి పెరుమాళ్ యొక్క; ఇడమే = దివ్య స్థానమే సుమా!

        నారుమడులతో ఒప్పుచున్న విశాలమైన పొలములలో కలుపు మొక్కలు తీయునపుడు, కాళ్ళకు తగిలెడి పుష్పములచే పరిమళము వెదజల్లబడుచుండెడి తిరుకణ్ణపురము,పలువురు భక్తులు సేవించునట్లు, ఈ భూమండలమును కొలిచిన పాదద్వందములు కలవాడును, తామరపుష్పమందు వసించు శ్రీదేవిని కలగియున్న పెద్ద పర్వతమువంటి వక్షస్థలము కలవాడైన, స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!.

పులమను మలర్ మిశై, మలర్మగళ్ పుణరియ,

నిలమగళెన ఇన, మగళిర్ గళ్ ఇవరొడుమ్,

వలమను పడైయుడై, మణివణర్ నిదికువై,

కలమను కణపురమ్, అడిగళ్ తమ్ ఇడమే  ll 1716

నిది కువై = బంగారపు రాసులుగల;కలమ్ = ఓడలు;మను = కలిగియున్నసముద్ర సమీపమందున్న; కణపురమ్ = తిరుకణ్ణపురము; పులమ్ మను = ఇంద్రియములను హరించెడి సౌందర్యముగల; మలర్ మిశై = కమలవాసిని;మలర్మగళ్ = శ్రీమహాలక్ష్మితో; పుణరియ = కూడియున్న; నిలమగళ్ = శ్రీ భూదేవి; ఎన ఇన = అనబడు ఇటువంటి; మగళిర్ గళ్ ఇవరొడుమ్ = దివ్య మహిషీమణులు ఇరువురితోను; వలమ్ మను = తన కుడి హస్తమునందు; పడై ఉడై = చక్రాయుధము గల; మణి వణర్ = నీలమణివంటి వర్ణముతో ప్రకాశించు; అడిగళ్ తమ్ = స్వామి శౌరి పెరుమాళ్ యొక్క; ఇడమే = దివ్య స్థానమే సుమా!

    బంగారపు రాసులుగల ఓడలు కలిగియున్న సముద్ర సమీపమందున్న తిరుకణ్ణపురము, ఇంద్రియములను హరించెడి సౌందర్యముగల కమలవాసిని శ్రీమహాలక్ష్మితో కూడియున్న శ్రీ భూదేవి, అనబడు ఇటువంటి దివ్య మహిషీమణులు ఇరువురితోను, తన కుడి హస్తమునందు చక్రాయుధము గల నీలమణివంటి వర్ణముతో ప్రకాశించు స్వామి శౌరి పెరుమాళ్ యొక్క దివ్య స్థానమే సుమా!.

** మలి పుకழ் కణ్ణపురముడైయ, ఎమ్మడిగళై,

వలికెழு మదిళ్ అయల్, వయల్ అణి మఙ్గైయర్,

కలియన తమిழிవై, విழమియ ఇశైయినొడు,

ఒలిశొలుమ్ అడియవర్, ఉరు తుయర్ ఇలరే  ll 1717

మలి పుకழ் = శ్లాఘ్యమైన కీర్తిగల; కణ్ణపురమ్ = తిరుకణ్ణపురము; ఉడైయ = నివాస స్థానముగ గల; ఎమ్మడిగళై = మన స్వామి శౌరి పెరుమాళ్ విషయమై; వలి కెழு = దృఢత్వము కలిగిన; మదిళ్ = ప్రాకారములును; అయల్ = చుట్టుప్రక్కలంతటను; వయల్ = పొలములును; అణి = అందమైన; మఙ్గైయర్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువైన; కలియన్=తిరుమంగై ఆళ్వార్ యొక్క;ఇవై తమిழ்=ఈ  తమిళభాషలోనున్నపాశురములను; విழమియ ఇశైయినొడు = శ్లాఘ్యమైన రాగముతో;ఒలి శొలుమ్ = అభ్యసించెడి; అడియవర్= భక్తులు;ఉరు తుయర్ ఇలరే= తప్పక అనుభవింపవలసిన దుఃఖములనుండి విడుదల పొందుదురు!.

      శ్లాఘ్యమైన కీర్తిగల తిరుకణ్ణపురము నివాస స్థానముగ గల  మన స్వామి శౌరి పెరుమాళ్ విషయమై, దృఢత్వము కలిగిన ప్రాకారములును, చుట్టుప్రక్కలంతటను పొలములును, అందమైన తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ యొక్క ఈ తమిళ భాషలోనున్న పాశురములను శ్లాఘ్యమైన రాగముతో అభ్యసించెడి భక్తులు తప్పక అనుభవింపవలసిన  దుఃఖములనుండి విడుదల పొందుదురు!.

*********

వ్యాఖ్యానించండి