పెరియతిరుమొழி-8వపత్తు (8)

 శ్రీః

8  . వానోర్

                          శ్రీమన్నారాయణుని  అవతారవైభవములను తిరుమంగై ఆళ్వార్ తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న శౌరి పెరుమాళ్ దివ్యమంగళ స్వరూపమున దర్శించుచున్నారు..

** వానోరళవుమ్ మ్ముదుమున్నీర్, వళర్ న్ద కాలమ్, వలియురువిన్

మీనాయ్ వన్దు వియన్దు ఉయ్యక్కొణ్డ, తణ్ తామరై క్కణ్ణన్,

ఆనా ఉరువిన్ ఆనాయన్, అవనై అమ్ మా విళై వయలుళ్,

కానార్ పుఱవిల్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1718

ముదు మున్నీర్ = ఉప్పొంగిన సముద్రపు జలములు; వానోర్ అళవుమ్ = దేవలోక పర్యంతము; వళర్ న్ద కాలమ్ = వ్యాపించియున్న కాలమున; వలి ఉరువిన్ మీనాయ్ వన్దు = శక్తివంత రూపమైన మత్స్యముగ అవతరించి; వియన్దు = అచ్చెరువొందునట్లు; ఉయ్యక్కొణ్డ = సర్వులను జీవింపచేసి కరుణించిన; తణ్ తామరై కణ్ణన్ = చల్లని కమల నేత్రుడైన; ఆనా ఉరువిన్ ఆన్ ఆయన్ అవనై = ఏ వికారములులేని దివ్యరూపముగల శ్రీకృష్ణునిగ అవతరించిన ఆ సర్వేశ్వరుని;అమ్ మా విళై వయలుళ్=అందమైన వ్యాపించి యున్న  పంట పొలములుగల; కాన్ ఆర్ పుఱవిల్ = అడవులతో నిండిన ప్రాంతములో; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

ఉప్పొంగిన సముద్రపు జలములు దేవలోకపర్యంతము వ్యాపించియున్న కాలమున,శక్తివంత రూపమైన మత్స్యముగ అవతరించి అచ్చెరువొందునట్లు సర్వులను జీవింపచేసి కరుణించిన,చల్లని కమల నేత్రుడైన ఏ వికారములులేని దివ్యరూపముగల శ్రీకృష్ణునిగ అవతరించిన ఆ సర్వేశ్వరుని, అందమైన వ్యాపించి యున్న పంట పొలములు గల, అడవులతో నిండిన ప్రాంతములో తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

మలఙ్గు విలఙ్గు నెడువెళ్ళమ్ మఱుక, అఙ్గోర్ వరైనట్టు,

ఇలఙ్గు శోది ఆర్ అముదమ్, ఎయ్ దుమళవు ఓరామైయాయ్,

విలఙ్గల్ తిరియ త్తడఙ్గడలుళ్, శుమన్దుకిడన్ద విత్తకనై,

కలఙ్గల్ మున్నీర్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1719

మలఙ్గు = (సముద్ర గర్భమునగల)” ఈల్ ” మొదలగు మత్స్యములు; విలఙ్గు = తడబడునట్లు; నెడు వెళ్ళమ్ మఱుక = పెద్ద జలరాసులు బురదగునట్లు; అఙ్గు = ఆ అగాధ ప్రదేశములో; ఓర్ వరై నట్టు=ఒక (మందర) పర్వతమును తోసి;ఇలఙ్గు శోది ఆర్ అముదమ్ = ప్రకాశించుచున్న తేజస్సుతో నిండిన అమృతము; ఎయ్ దుమ్ అళవు=ఉద్భవించు పర్యంతము; ఓర్ ఆమై ఆయ్=సాటిలేని కూర్మరూపమును దాల్చి; విలఙ్గల్ = ఆ మందర పర్వతము; తిరియ = తిరుగునట్లు; తడ కడలుళ్ = పెద్ద ఆసముద్రములో; శుమన్దు కిడన్ద =(ఆ పర్వతమును తన వీపున) ధరించి యుండిన;  విత్తకనై = ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుని; కలఙ్గల్ మున్నీర్ = బురదమయమయిన సముద్రమును చేరియున్న; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

(సముద్ర గర్భమునగల)” ఈల్ ” మొదలగు మత్స్యములు తడబడునట్లు,పెద్ద జలరాసులు బురదగునట్లు, ఆ అగాధ ప్రదేశములో ఒక (మందర) పర్వతమును తోసి, ప్రకాశించుచున్న తేజస్సుతో నిండిన అమృతము ఉద్భవించు పర్యంతము సాటిలేని కూర్మరూపమును దాల్చి,ఆ మందర పర్వతము తిరుగునట్లు ,పెద్ద ఆ సముద్రములో (ఆ పర్వతమును తన వీపున)ధరించి యుండిన ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుని, బురదమయమయిన సముద్రమును చేరియున్న తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

పారారళవుమ్ ముదు మున్నీర్, పరన్దకాలమ్, వళైమరుప్పిల్ 

ఏరారురువత్తు ఏనమాయ్, ఎడుత్త ఆర్ట్రల్ అమ్మానై,

కూరార్ ఆరల్ ఇరైకరుతి, కురుగు పాయ క్కయల్ ఇరియుమ్,

కారార్ పుఱవిల్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1720

ముదు మున్నీర్=ఉప్పొంగిన సముద్రపు జలములు;పార్ ఆర్ అళవుమ్=ఈభూమండల మంతటను; పరన్ద కాలమ్ = వ్యాపించియున్న కాలమున;వళై మరుప్పిల్=వంగియున్న కోరలుగల; ఏర్ ఆర్ ఉరువత్తు = మిక్కిలి సుందరమైన దివ్య రూపముగల;ఏనమాయ్= వరాహమూర్తిగ అవతరించి; ఎడుత్త = (ఈ భూమిని) పైకెత్తి ఉద్దరించిన; ఆర్ట్రల్ = శక్తివంతుడైన; అమ్మానై = సర్వేశ్వరుని;కూర్ ఆర్=వాడియైన (ముక్కలు గల); కురుగు= కొంగలు; ఆరల్ =  ” ఆరల్ ” అను మత్స్యములను; ఇరై కరుది = ఆహారముగ తీసుకొన తలచి; పాయ = (నీటిలో) ఈదుచుపోవుచున్న సమయమున; కయల్ = ” కయల్ ” మత్స్యములు; ఇరియుమ్ = భయపడి పారిపోవుచుండెడి; కార్ ఆర్ పుఱవిల్ = మేఘములు ఆవరించుయుండు తోటలుగల; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

          ఉప్పొంగిన సముద్రపు జలములు ఈభూమండల మంతటను వ్యాపించియున్న కాలమున వంగియున్న కోరలుగల మిక్కిలి సుందరమైన దివ్య రూపముగల వరాహమూర్తిగ అవతరించి  (ఈ భూమిని) పైకెత్తి ఉద్దరించిన శక్తివంతుడైన సర్వేశ్వరుని, వాడియైన (ముక్కలు గల) కొంగలు   ” ఆరల్ ” అను మత్స్యములను ఆహారముగ తీసుకొన తలచి (నీటిలో) ఈదుచుపోవుచున్న సమయమున “కయల్” మత్స్యములు భయపడి పారిపోవుచుండెడి, మేఘములు ఆవరించుయుండు తోటలుగల తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

ఉళైన్ద అరియుమ్ మానిడముమ్, ఉడనాయ్ తోన్ఱ ఒన్ఱువిత్తు,

విళైన్ద శీర్ట్రమ్ విణ్ వెదుమ్బ, వేర్ట్రోన్  అగలమ్ వెఞ్జమత్తు, 

పిళన్దు వళైన్ద వుగిరానై, పెరుమ్ తణ్ శెన్నల్ కులై తడిన్దు,

కళఞ్జెయ్ పుఱవిల్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1721

ఉళైన్ద = చూచినవెంటనే భయముతో వణకునట్లు; అరియుమ్ = సింహరూపమును; మానిడముమ్ = మనుజరూపమును; ఉడనాయ్ ఒన్ఱువిత్తు = జతచేసి ఒకరూపమై; తోన్ఱ=నరసింహమూర్తిగ అవతరించిన; (ఆ సమయమున)విళైన్ద శీర్ట్రమ్ = కలగియున్న కోపమును చూచి;విణ్ వెదుమ్బ=ఊర్ధ్వలోకమున గలవారు వణుకుచుండగ; వేర్ట్రోన్ = శత్రువైన హిరణ్యాసురుని యొక్క; అగలమ్ = వక్షస్థలమును; వెమ్ శమత్తు=తీవ్రమైన యుద్ధమందు; పిళన్దు=చీల్చిన;వళైన్ద వుగిరానై = వంగియున్న నఖములుగల స్వామిని; పెరుమ్ తణ్ శెన్నల్ కులై తడిన్దు=ఉన్నతముగ ఎదిగిన అందమైన ఎర్రధాన్యపు కంకులు బాగుగ ముదిరి; కళమ్ శెయ్ = చీకటి అలముకొనియున్న; పుఱవిల్ = సమీప ప్రాంతములుగల; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే=దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

      చూచినవెంటనే భయముతో వణకునట్లు సింహరూపమును,మనుజ రూపమును,జతచేసి ఒకరూపమై, నరసింహమూర్తిగ అవతరించిన ఆ సమయమున కలగియున్న కోపమునుచూచి ఊర్ధ్వలోకమున గలవారు వణుకుచుండగ శత్రువైన హిరణ్యాసురుని యొక్క వక్షస్థలమును తీవ్రమైన యుద్ధమందు చీల్చిన, వంగియున్న నఖములుగల స్వామిని,ఉన్నతముగ ఎదిగిన అందమైన ఎర్రధాన్యపు కంకులు బాగుగ ముదిరి చీకటి అలముకొనియున్న సమీప ప్రాంతములుగల తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

తొழுనీర్ వడివిల్  కుఱుళురువాయ్, వన్దుతోన్ఱి మావలిపాల్,

ముழுనీర్ వైయమ్ మున్ కొణ్డ, మూవావురువినమ్మానై,

ఉழுనీర్ వయలుళ్ పొన్ కిళైప్ప, ఒరుపాల్ ముల్లై ముగైయోడుమ్,

కழுనీర్ మలరుమ్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1722

తొழு నీర్=చూచువారెల్లరు సేవించునట్లు తగిన స్వభావముగల;వడివిల్=రూపములో;  కుఱుళ్ ఉరువాయ్ = వామనమూర్తిగ;వన్దు తోన్ఱి = అవతరించి; మావలిపాల్ = మహబలి యొక్క స్థానమున; మున్ = మునుపొకకాలమున; ముழுనీర్ వైయమ్ = సముద్రముచే చుట్టుకొనియున్న లోకమును; కొణ్డ = యాచించి పొందిన; మూవా ఉరువిన్ = ఏ వికారములులేని దివ్యరూపముగల; అమ్మానై = సర్వేశ్వరుని;ఉழுనీర్=ఎప్పుడును దున్నబడుటయే స్వభావముగాగల; వయలుళ్ పొన్ కిళైప్ప = పొలములలో బంగారము పండింపబడుచున్నదియు;ఒరుపాల్=మరియొక కొన్ని ప్రాంతము లందు; ముల్లై = మల్లెలు; ముగైయోడుమ్ = నల్లకలువలతోబాటు; కழுనీర్ = ఎర్రకలువలు; మలరుమ్ = పుష్పించుచుండెడి; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

        చూచువారెల్లరు సేవించునట్లు తగిన స్వభావముగల రూపములో వామనమూర్తిగ అవతరించి మహబలియొక్క స్థానమున మునుపొకకాలమున సముద్రముచే చుట్టుకొనియున్న లోకమును యాచించి పొందిన ఏ వికారములులేని దివ్యరూపముగల సర్వేశ్వరుని, ఎప్పుడును దున్నబడుటయే స్వభావముగాగల పొలములలో బంగారము పండింపబడుచున్నదియు,మరియొక కొన్ని ప్రాంతములందు మల్లెలు నల్లకలువలతోబాటు ఎర్రకలువలు పుష్పించుచుండెడి తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

వడివాయ్ మழுవే పడైయాగ, వన్దుతోన్ఱి మూవెழுకాల్, 

పడి ఆర్ అరశు కళైకట్ట, పాழிయానై అమ్మానై,

కుడియా వణ్డు కొణ్డు ఉణ్ణ, కోలనీలమ్ మట్టు ఉగుక్కుమ్,

కడియార్ పుఱవిల్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1723

వడి వాయ్ = మిక్కిలి వాడియైన; మழுవే = గండ్రగొడ్డలినే; పడై ఆగ = ఆయుధముగ; వన్దుతోన్ఱి = (పరశురామునిగ) అవతరించి; మూ ఎழுకాల్ = ఇరువదియొక్క మార్లు; పడి = ఈ భువిపై; ఆర్= నిండియున్న;అరశ = క్షత్రీయ రాజులైన;కళై=విరోధులను; కట్ట = నిర్మూలించిన; పాழிయానై= శక్తివంతుడైన;అమ్మానై=సర్వేశ్వరుని;వణ్డు = భ్రమరములు; కుడియా= తమ కుటుంబములతో;కొణ్డు ఉణ్ణ=(తేనెను)గ్రహించి పానముచేయునట్లు; కోలనీలమ్=అందమైన నీలోత్పములు;మట్టు ఉగక్కుమ్=తేనెను స్రవింపజేయుచుండెడి; కడియార్ పుఱవిల్= పరిమళభరితమైన ప్రాంతములతో చుట్టుకొనియున్న;కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

                            మిక్కిలి వాడియైన గండ్రగొడ్డలినే ఆయుధముగ (పరశురామునిగ) అవతరించి ఇరువదియొక్క మార్లు ఈ భువిపై నిండియున్న క్షత్రీయ రాజులైన, విరోధులను నిర్మూలించిన శక్తివంతుడైన సర్వేశ్వరుని, భ్రమరములు తమ కుటుంబములతో (తేనెను)గ్రహించి పానముచేయునట్లు,అందమైన నీలోత్పములు తేనెను స్రవింపజేయుచుండెడి, పరిమళభరితమైన ప్రాంతములతో చుట్టుకొనియున్న తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

వైయమెల్లామ్ ఉడన్ వణఙ్గ, వణఙ్గా మన్ననాయ్ తోన్ఱి,

వెయ్య శీర్ట్ర క్కడియిలఙ్గై, కుడికొణ్డు ఓడ వెఞ్జమత్తు, 

శెయ్ ద వెమ్ పోర్ నమ్ పరనై, చ్చెழுన్దణ్ కానల్ మణనాఱుమ్,

కైదై వేలి కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1724

వైయమ్ ఎల్లామ్ = లోకములంతయు, ఉడన్ వణఙ్గ = ఏకీభవించి పాదములపై పడి సేవింప; వణఙ్గా = తాను ఏఒక్కరికిని సేవించని; మన్నన్ ఆయ్ తోన్ఱి = రాజాధిరాజుగ ( శ్రీ రామచంద్రునిగ ) అవతరించి;వెయ్య శీర్ట్రమ్ = భయంకరమైన క్రోధముతో రగులు చుండునదియు; కడి = కోటలుగల; ఇలఙ్గై = లంకాపురివాసులు; కుడికొణ్డు ఓడ=తమ కుటుంబములతో యమలోకమునకు పరగెత్తునట్లు; వెమ్ శమత్తు = తీవ్రమైన యుద్ధమందు; వెమ్ పోర్ శెయ్ ద = తీవ్రమైన పోరుసలిపిన; నమ్ పరనై = మనయొక్కసర్వేశ్వరుని; శెழு = అందమైన; తణ్ =చల్లని; కానల్ = నీలోత్పముల ప్రాంతములు కలదియు; మణనాఱుమ్ = పరిమళము వెదజల్లు; కైదై వేలి = మొగలి చెట్లు కంచెలగ కలదియు; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!. 

        లోకములంతయు ఏకీభవించి పాదములపై పడి సేవింప,తాను ఏఒక్కరికిని సేవించని రాజాధిరాజుగ ( శ్రీ రామచంద్రునిగ ) అవతరించి, భయంకరమైన క్రోధముతో రగులుచుండునదియు, కోటలుగల లంకాపురివాసులు తమ కుటుంబములతో యమ లోకమునకు పరగెత్తునట్లు తీవ్రమైన యుద్ధమందు తీవ్రమైన పోరుసలిపిన మనయొక్క సర్వేశ్వరుని, అందమైన, చల్లని నీలోత్పముల ప్రాంతములు కలదియు, పరిమళము వెదజల్లుమొగలి చెట్లు కంచెలగ కలదియు,తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి  సేవించుకొంటిని!.

ఒర్ట్రై క్కుழைయుమ్ నాఞ్జిలుమ్, ఒరుపాల్ తోన్ఱ త్తాన్ తోన్ఱి,

వెర్ట్రిత్తొழிలార్ వేల్ వేన్దర్, విణ్ పాల్ చ్చెల్ల వెఞ్జమత్తు, 

శెర్ట్ర కొర్ట్రత్తొழிలానై, చ్చెన్దీ మూన్ఱుమ్ ఇల్లిరుప్ప,

కర్ట్ర మఱైయోర్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1725

ఒర్ట్రై కుழைయుమ్=ఒక చెవియందు వేలాడుచున్న కుండలముతోను;ఒరుపాల్ = ఒక ప్రక్కన; నాఞ్జిలుమ్ = నాగలితోను; తోన్ఱ = ప్రకాశించుచు; తాన్ తోన్ఱి = బలరామునిగ తాను అవతరించి;వెర్ట్రి తొழிలార్=జయము పొందుటయే స్వభావముగ గలవారును;  వేల్ వేన్దర్ = శూలాయుధములుగల రాజులు; విణ్ పాల్ శెల్ల = వీరస్వర్గము చేరునట్లు; వెమ్ శమత్తు= తీవ్రమైన యుద్ధమందు; శెర్ట్ర = ఆ రాజులను సంహరించిన; కొర్ట్రమ్ తొழிలానై = విజయ శీలుడైన సర్వేశ్వరుని;శెమ్ తీ మూన్ఱుమ్ = త్రేతాగ్నులని చెప్పబడు మూడు అగ్నులను; ఇల్ ఇరుప్ప=తమ గృహములందు జ్వలింప చేయుచుండునదియు; కర్ట్ర మఱైయోర్ = శాస్త్రములను అభ్యసించెడి వేదబ్రాహ్మణోత్తములు నివసించుచున్న; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

  ఒక చెవియందు వేలాడుచున్న కుండలముతోను,ఒక ప్రక్కన నాగలితోను ప్రకాశించుచు బలరామునిగ తాను అవతరించి,జయము పొందుటయే స్వభావముగ గలవారును, శూలాయుధములుగల రాజులు వీరస్వర్గము చేరునట్లు తీవ్రమైన యుద్ధమందు ఆ రాజులను సంహరించిన విజయశీలుడైన సర్వేశ్వరుని, త్రేతాగ్నులని చెప్పబడు మూడు అగ్నులను తమ గృహములందు జ్వలింప చేయుచుండునదియు, శాస్త్రములను అభ్యసించెడి, వేదబ్రాహ్మణోత్తములు నివసించుచున్న తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

తువరి క్కనివాయ్ నిలమఙ్గై, త్తుయర్ త్తీర్ న్దు ఉయ్య పారదత్తుళ్,

ఇవరిత్త అరశర్ తడుమాఱ, ఇరుళ్ నాళ్ పిఱన్ద అమ్మానై, 

ఉవరి ఓదమ్ ముత్తు ఉన్ద, ఒరుపాలొరుపాల్ ఒణ్ శెన్నల్,

కవరి వీశుమ్ కణ్ణపురత్తు, అడియేన్ కణ్డుకొణ్డేనే  ll 1726

తువరి కని వాయ్ = పత్తి పువ్వువలె సున్నితముగను, దొండపండువలె ఎర్రనైన అదరములుగల; నిలమఙ్గై = శ్రీ భూదేవి యొక్క;తుయర్ తీర్ న్దు ఉయ్య=పాపులను భరించెడి దుఃఖముపోయి సుఖముగ నుండుటకు; పారదత్తుళ్ = భారతయుద్దమున; ఇవరిత్త అరశర్=ఎదిరించిన మహారాజులను; తడుమాఱ=నశింపజేసిన; ఇరుళ్ నాళ్= అర్ధరాత్రి సమయమున; పిఱన్ద = శ్రీ కృష్ణునిగ అవతరించిన; అమ్మానై = సర్వేశ్వరుని; ఒరుపాల్ = ఒక ప్రక్కన; ఉవరి ఓదమ్ = సముద్రపు అలలు; ముత్తు = ముత్యములను; ఉన్ద = త్రోయుచుండునదియు; ఒరుపాల్ = మరియొక ప్రక్కన;ఒణ్=అందమైన;శెన్నల్ = ఎర్రధాన్యపు చేనులు; కవరి వీశుమ్ = వింజామరము వీచుచుండెడి; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని!.

పత్తి పువ్వువలె సున్నితముగను,దొండపండువలె ఎర్రనైన అదరములు గల శ్రీ భూదేవి యొక్క పాపులను భరించెడి దుఃఖముపోయి సుఖముగ నుండుటకు, భారత యుద్దమున ఎదిరించిన మహారాజులను నశింపజేసిన,అర్ధరాత్రి సమయమున శ్రీ కృష్ణునిగ అవతరించిన సర్వేశ్వరుని, ఒక ప్రక్కన సముద్రపు అలలు ముత్యములను త్రోయుచుండునదియు, మరియొక ప్రక్కన ఎర్రధాన్యపు చేనులు వింజామరము వీచుచుండెడి తిరుకణ్ణపురములో దాసుడైన నేను దర్శించి సేవించుకొంటిని .

** మీనోడు ఆమై కేழల్ అరి కుఱలాయ్, మున్నుమిరామనాయ్

త్తానాయ్; పిన్ను మిరామనాయ్ త్తామోదరనాయ్, క్కఱ్కియు

మానాన్ఱన్నై, కణ్ణపురత్తడియన్, కలయనొలిశెయ్ ద,

తేనార్ ఇన్ శొల్ తమిழ் మాలై, శెప్ప ప్పావమ్ నిల్లావే   ll 1727

మీనోడు=మత్స్యరూపముగను;ఆమై=కూర్మరూపముగను;కేழల్=వరాహరూపముగను; అరి = నరసింహరూపముగను;కుఱల్ ఆయ్=వామన రూపముగను;మన్నుమ్ ఇరామన్ ఆయ్ = పరశురామునిగను; తాన్ ఆయ్ = సాక్షాత్ అవతారమైన శ్రీ రామచంద్రునిగను; పిన్నుమ్ ఇరామనాయ్ = బలరామునిగను; దామోదరన్ ఆయ్ = శ్రీ కృష్ణునిగను; కఱ్కియుమ్ ఆనాన్ తన్నై = కల్కిగను అవతరింప స్వభావుడైన సర్వేశ్వరుని; కణ్ణపురత్తు = తిరుకణ్ణపురములో సేవించిన; అడియన్ = శేషభూతుడైన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలి శెయ్ ద = అనుగ్రహించిన; తేనార్ ఇన్ శొల్ = తేనె వలె మధురమైన సూక్తులుగల; తమిழ் మాలై = తమిళ భాషలో నున్న ఈ పాశురముల మాలను; శెప్ప = ప్రీతితో పాడగ; పావమ్ నిల్లావే = పాపములు నిలువలేవు!

      మత్స్యరూపముగను,కూర్మరూపముగను,వరాహరూపముగను, నరసింహ రూపముగను,వామన రూపముగను,పరశురామునిగను,సాక్షాత్ అవతారమైన శ్రీ రామచంద్రునిగను,బలరామునిగను,శ్రీ కృష్ణునిగను,కల్కిగను అవతరింప స్వభావుడైన సర్వేశ్వరుని తిరుకణ్ణపురములో సేవించిన శేషభూతుడైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన తేనె వలె మధురమైన సూక్తులుగల తమిళ భాషలో నున్న ఈపాశురముల మాలను ప్రీతితో పాడగ పాపములు నిలువలేవు!

*********

వ్యాఖ్యానించండి