శ్రీః
శ్రీమతే రామనుజాయనమః
తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన
_______________
పెరియతిరుమొழி-9వపత్తు
____________
శ్రీః
1 . వఙ్గమామున్నీర్
తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని తిరుమంగైఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** వఙ్గ మా మున్నీర్ వరినిఱ ప్పెరియ, వాళ్ అరవినణైమేవి,
శఙ్గమ్ ఆర్ అమ్ కై తడ మలర్ ఉన్ది, శామమామేని యెన్ తలైవన్,
అఙ్గమాఱు ఐన్దువేళ్వి నాల్ వేదమ్, అరుమ్ కలైపయిన్ఱు, ఎరి మూన్ఱుమ్
శెఙ్గైయాల్ వళర్కుమ్ తుళక్కమిల్ మనత్తోర్, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1748
వఙ్గ = ఓడలు కలిగియున్న; మా = పెద్ద; మున్నీర్ = మూడురకములైన నీటితో ఒప్పు సముద్రమున:వరి = రేకలు మరియు; నిఱ = అందముగల;పెరియ = విశాలమైన; వాళ్= ప్రకాశించుచున్న; అరవు = శేషుని; ఇన్ = ఆహ్లాదకరమైన; అణై =తల్పముపై; మేవి = అమరియున్నవాడును ; శఙ్గమ్ ఆర్ అమ్ కై = శంఖము తన అందమైన హస్తమున గలవాడును;తడ మలర్ ఉన్ది=పెద్ద తామరపుష్పము నాభియందు కలవాడును; శామమ్ మా మేని =నీలి వర్ణముగల శ్లాఘ్యమైన తిరుమేని కలవాడును;ఎన్ తలైవన్ = నాయొక్క స్వామి;(ఎచట వేంచేసియున్నాడనగ); అఙ్గమ్ ఆఱు = వేదాంగములు ఆరు; ఐన్దు వేళ్వి=పంచ మహాయజ్ఞములు; నాల్ వేదమ్ = నాలుగు వేదములు;అరుమ్ కలై = (వేదములయొక్క ఉపబృంహణములైన) అపురూపమైన శాస్త్రములు, మొదలగు ఇవన్నియు; పయిన్ఱు =అభ్యసింపబడుచుండెడిదియు; ఎరిమూన్ఱుమ్=త్రేతాగ్నులను; శెమ్ కైయాల్ వళర్కుమ్=తమదివ్య హస్తములతో వృద్ధిపొందించుచుండు; తుళక్కమ్ ఇల్ మనత్తోర్ = భయరహితులైన నిశ్చలమైన మనస్సులుగల బ్రాహ్మణోత్తములు నివసించుచున్న; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు!
ఓడలు కలిగియున్న, పెద్ద, మూడురకములైన నీటితో ఒప్పు సముద్రమున, రేకలు మరియు అందముగల విశాలమైన ప్రకాశించుచున్న శేషుని ఆహ్లాదకరమైన తల్పముపై అమరియున్నవాడును, శంఖము తన అందమైన హస్తమున గలవాడును; పెద్ద తామరపుష్పము నాభియందు కలవాడును, నాయొక్క స్వామి, (ఎచట వేంచేసి యున్నాడనగ),వేదాంగములు ఆరు,పంచ మహాయజ్ఞములు,నాలుగు వేదములు, ( వేదములయొక్క ఉపబృంహణములైన ) అపురూపమైన శాస్త్రములు, మొదలగు ఇవన్నియు అభ్యసింపబడుచుండెడిదియు, త్రేతాగ్నులను తమ దివ్య హస్తములతో వృద్ధిపొందించు చుండు భయరహితులైన నిశ్చలమైన మనస్సులుగల బ్రాహ్మణోత్తములు నివసించుచున్న తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు!
కవళ మా కదత్త కరిఉయ్య, ప్పొయ్ గై క్కరామ్ కొళ కలఙ్గి, ఉళ్ నినైన్దు
తువళ మేల్ వన్దుతోన్ఱి, వన్ ముదలై తుణిపడ చ్చుడుపడై తురన్దోన్,
కువళై నీళ్ ముళరి క్కుముదమ్ ఒణ్ కழுనీర్, కొయ్ మలర్ నెయ్ దల్ ఒణ్ కழని,
తివళుమ్ మాళిగై శూழ் శెழுమణి ప్పురిశై, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1749
కవళమ్ = గ్రాసము ఆరగించటయే స్వభావముగల;మా కదత్త=మిక్కిలి మదించియున్న; కరి= గజేంద్రుడు; ప్పొయ్ గై=ఒక తటాకములో; కరామ్ = మొసలిచే; కొళ = పట్టుకొనబడి; కలఙ్గి = మిక్కిలి కలతచెంది; ఉళ్ నినైన్దు=(సర్వేశ్వరుని) హృదయమున తలచి;తువళ=వ్యధ కలిగియుండగ; ఉయ్య = ఆ గజేంద్రుడు ఉజ్జీవింపబడునట్లు; మేల్ వన్దు తోన్ఱి = దివినుండి ఏతెంచి దర్శనమొసగి; వన్ ముదలై = బలమైన ఆ మొసలి; తుణి పడ = ముక్కలగునట్లు; శుడు పడై=జ్వలించెడి చక్రాయుధమును;తురన్దోన్ = ప్రయోగించిన సర్వేశ్వరుడు(ఎచట వేంచేసియున్నాడనగ);కువళై=నీలోత్పములు; నీళ్ ముళరి = పెద్ద తామరపుష్పములు;కుముదమ్=నల్లకలువలు;ఒణ్ కழுనీర్= ఎర్రకలువలు; కొయ్ మలర్ నెయ్ దల్= కోయబడునట్లుండు ఈ కలువ పుష్పములతో నిండిన ;ఒణ్ కழని= అందమైన పొలములు కలదియు; తివళుమ్ మాళిగై శూழ் = అందముగ కనపించెడి భవనములచే చుట్టుకొనియున్నదియు; శెழு మణి పురిశై = శ్లాఘ్యమైన రత్నమయమయిన ప్రాకారములతోనున్న; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు!
గ్రాసము ఆరగించటయే స్వభావముగల మిక్కిలి మదించియున్న గజేంద్రుడు ఒక తటాకములో మొసలిచే పట్టుకొనబడి మిక్కిలి కలతచెంది (సర్వేశ్వరుని) హృదయమున తలచి వ్యధ కలిగియుండగ, ఆ గజేంద్రుడు ఉజ్జీవింపబడునట్లు, దివినుండి ఏతెంచి దర్శనమొసగి, బలమైన ఆ మొసలి ముక్కలగునట్లు జ్వలించెడి చక్రాయుధమును ప్రయోగించిన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ), నీలోత్పములు,పెద్ద తామర పుష్పములు, నల్లకలువలు,ఎర్రకలువలు కోయబడు నట్లుండెడి ఈ కలువ పుష్పములతో నిండిన అందమైన పొలములుగలదియు, అందముగ కనపించెడి భవనములచే చుట్టుకొనియున్నదియు,శ్లాఘ్యమైన రత్నమయమయిన ప్రాకారములతోనున్న తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు!
వాదై వన్దడర వానముమ్ నిలనుమ్, మలైగళుమ్ అలైకడల్ కుళిప్ప,
మీదుకొణ్డు ఉకళుమ్ మీనురువాగి, విరిపునల్ వరి అకట్టు ఒళిత్తోన్,
పోదు అలర్ పున్నై మల్లిగై మౌవల్, పుదువిరై మదుమలర్ అణైన్దు,
శీద వొణ్ తెన్ఱల్ తిశైతొఱుమ్ కమழுమ్, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1750
వాదై వన్దు అడర = కష్టములు ఎదుట అధికమైయుండగ; వానముమ్ = ఆకాశమును; నిలనుమ్ = భూమియును;మలైగళుమ్=పర్వతములును;అలై కడల్=అలలతో నిండిన సముద్రములో; కుళిప్ప = మునిగియుండగ; మీదు కొణ్డు = ఇవన్నింటిని తనమీద పెట్టుకొని; ఉగళుమ్ = సంతోషముతో సంచరించెడి; మీన్ ఉరు ఆగి = మత్స్య రూపము దాల్చి; విరి పునల్=వ్యాపించియున్న పెద్ద ప్రళయ జలములను;వరి అకడు = అందమైన తన రెక్కలలోనే; ఒళి త్తోన్=మరుగుపరిచిన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసియున్నాడనగ) పోదు = తగిన కాలములందు;అలర్ = వికసించుచుండెడి; పున్నై = పున్నై పుష్పములు; మల్లిగై=మల్లెలు; మౌవల్ = సన్నజాజులు మొదలగు వీటితోకూడిన; పుదు విరై = కొత్తగ పరిమళము వెదజల్లుచున్న; మదు మలర్=తేనెలొలుకు పుష్పములతో; అణైన్దు = స్పర్శించుచు ; శీద వొణ్ తెన్ఱల్ = చల్లని మనోహరమైన దక్షిణపు గాలి; తిశైతొఱుమ్ కమழுమ్ = అన్నిదిక్కులనుండి సువాసనను వెదజల్లుచుండెడి; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
కష్టములు ఎదుట అధికమైయుండగ,ఆకాశమును,భూమియును, పర్వతములును,అలలతో నిండిన సముద్రములో మునిగియుండగ, ఇవన్నింటిని తనమీద పెట్టుకొని సంతోషముతో సంచరించెడి మత్స్య రూపము దాల్చి,వ్యాపించి యున్న పెద్ద ప్రళయ జలములను, అందమైన తన రెక్కలలోనే మరుగు పరిచిన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసియున్నాడనగ), తగిన కాలములందు వికసించుచుండెడి, పున్నై పుష్పములు,మల్లెలు, సన్నజాజులు మొదలగు వీటితోకూడిన కొత్తగ పరిమళము వెదజల్లుచున్న తేనెలొలుకు పుష్పములను స్పర్శించుచు,చల్లని మనోహరమైన దక్షిణపు గాలి అన్నిదిక్కులనుండి సువాసనను వెదజల్లుచుండెడి తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు!.
వెన్ఱిశేర్ తిణ్మై విలఙ్గల్ మామేని, వెళ్ ఎయిర్ట్రు ఒళ్ ఎరి త్తఱుకణ్,
పన్ఱియాయన్ఱు పార్ మగళ్ పయలై తీర్తవన్, పఞ్జవర్ పాగన్,
ఒన్ఱలా ఉరువత్తు ఉలప్పిల్ పల్ కాలత్తు, ఉయర్ కొడి ఒళివళర్ మదియుమ్,
శెన్ఱుశేర్ శెన్ని చ్చికరనన్ మాడ, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1751
అన్ఱు = మునుపొకకాలమున; వెన్ఱి శేర్ = జయశీలమైన; తిణ్మై = బలమైన;విలఙ్గల్ మా మేని = పర్వతమువంటి పెద్ద శరీరముకలదియు; వెళ్ ఎయిర్ట్రు = తెల్లని కోరలుగల; ఒళ్ ఎరి = మండెడి అగ్నితో ఒప్పు;తఱు కణ్ = క్రూరమైన నేత్రములుగల; పన్ఱి ఆయ్ = వరాహ రూపము దాల్చి;పార్ మగళ్ = శ్రీ భూదేవియొక్క;పయలై తీర్తవన్=(ప్రళయ జలముల వలన సంభవించిన) విరహ వేదనను పోగొట్టినవాడును;పఞ్జవర్ పాగన్ =పంచ పాండవులకు సారథియైన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ);ఒన్ఱు అలా ఉరువత్తు = పలురకములైన ఆకారములు గల; ఉలప్పిల్ పల్ కాలత్తు = అంతములేని చిరకాలముగనున్న; ఉయర్ కొడి ఒళి వళర్ మదియుమ్ శెన్ఱు శేర్ శెన్ని శికరమ్ = ఉన్నతమైన ధ్వజములు మిక్కిలి ప్రకాశించుచున్న చంద్రమండలమునకు పోయి చేరునట్లు ఎత్తైన శిఖరములుగల; నల్ మాడమ్ = సుందరమైన భవనములు కలిగిన; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
మునుపొకకాలమున జయశీలమైన బలమైన పర్వతమువంటి పెద్ద శరీరముకలదియు, తెల్లని కోరలుగల, మండెడి అగ్నితో ఒప్పు క్రూరమైన నేత్రములుగల వరాహరూపముదాల్చి శ్రీ భూదేవి యొక్క(ప్రళయ జలములవలన సంభవించిన) విరహ వేదనను పోగొట్టినవాడును.పంచ పాండవులకు సారథియైన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసియున్నాడనగ),పలురకములైన ఆకారములు గల, అంతములేని చిరకాలముగనున్న, ఉన్నతమైన ధ్వజములు మిక్కిలి ప్రకాశించుచున్న చంద్రమండలమునకు పోయి చేరునట్లు, ఎత్తైన శిఖరములుగల సుందరమైన భవనములు కలిగిన తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
మన్నవన్ పెరియవేళ్వియిల్ కుఱళాయ్, మూవడి నీరొడుఙ్గొణ్డు,
పిన్నుమ్ ఏழுలగుమ్ ఈరడియాగ, పెరున్దిశై అడఙ్గిడ నిమిర్ న్దోన్,
అన్న మెన్ కమలత్తుఅణి మలర్ ప్పీటత్తు, అలైపునల్ ఇలైక్కుడైనీழల్,
శెన్నెల్ ఒణ్ కవరి అశైయ వీర్ట్రిరిక్కుమ్, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1752
మన్నవన్ = మహాబలి మహారాజుయొక్క; పెరియ వేళ్వియిల్ = మహాయఙ్ఞమున; కుఱళ్ ఆయ్ = వామనమూర్తియై వెడలి; మూవడి నీరొడుమ్ కొణ్డు = యాచించిన మూడడుగుల నేల కొరకు దానజలము స్వీకరించి; పిన్నుమ్ = తరువాత;ఏழுలగుమ్= సప్తలోకములను; ఈర్ అడి ఆగ = రెండు అడుగులచే కొలవబడునట్లు; పెరు దిశై అడఙ్గిడ=అన్ని దిక్కులు పాదమున అమరునట్లు;నిమిర్ న్దోన్=పెరిగినట్టి సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ); అన్నమ్ = హంసలు; మెన్ కమలత్తు మలర్ = మృదువైన తామర పుష్పమను, అణి పీటత్తు = అందమైన ఆసనమున, అలై పునల్ = అలలతో నిండిన జలమందుగల; ఇలై = ఆకుల; కుడై నీழల్ = గొడుగు నీడలలో; శెన్నెల్ ఒణ్ కవరి అశైయ = ఎర్ర ధాన్యపుపంటలు అందముగ వింజామరము వీచుచుండగ; వీర్ట్రిరిక్కుమ్ = సుఖముగ నివసించుచుండెడి; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
మహాబలి మహారాజుయొక్క మహాయఙ్ఞమున వామనమూర్తియై వెడలి, యాచించిన మూడడుగుల నేల కొరకు దానజలము స్వీకరించి, తరువాత సప్తలోకములను రెండు అడుగులచే కొలవబడునట్లు, అన్ని దిక్కులు తన పాదమున అమరునట్లు పెరిగినట్టి సర్వేశ్వరుడు (ఎచట వేంచేసియున్నాడనగ), హంసలు మృదువైన తామర పుష్పమను, అందమైన ఆసనమున, అలలతో నిండిన జలమందు గల ఆకుల గొడుగు నీడలలో, ఎర్ర ధాన్యపుపంటలు అందముగ వింజామరము వీచు చుండగ సుఖముగ నివసించుచుండెడి తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
మழுవినాల్ అవని అరశై మూవెழுకాల్, మణిముడి పొడిపడుత్తు, ఉదిర
క్కుழுవు వార్ పునలుళ్ కుళిత్తు, వెఙ్గోపమ్ తవిర్ న్దవన్ కులైమలి కదలి,
కుழுవుమ్ వార్ కముగుమ్ కురవుమ్ నఱ్పలవుమ్, కుళిర్ తరు శూద మాదవియుమ్,
శెழுమైయార్ పొழிల్ గళ్ తழுవునన్మాడ, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1753
మూ ఎழு కాల్ = ఇరువదియొక్క మార్లు; అవని అరశై = ఈ భూమియందున్న క్షత్రీయ రాజులయొక్క; మణిముడి = మణులతో పొదిగిన కిరీటములను; మழுవినాల్ = గండ్రగొడ్డలిచే; పొడి పడుత్తు = పొడి పొడి చేసి; ఉదిర క్కుழுవు = (వారియొక్క) రక్తపు సెలయేరు యొక్క; వార్ పునలుళ్ = వరదలయందు; కుళిత్తు = స్నానమాచరించి; వెమ్ కోపమ్ తవిర్ న్దవన్ = తనయొక్క తీవ్రమైన కోపమును వర్జించిన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ);కులై మలి కదలి కుழுవుమ్ = గెలలతో నిండిన అరటి మొక్కల తోపులును;వార్ కముగుమ్ = పెరిగిన పోకచెట్లును; కురవుమ్ = “కురవు” చెట్లును; నల్ పలవుమ్ = మంచి పనసచెట్లును; కుళిర తరు శూదమ్ = చల్లదనము నిచ్చు మామిడి చెట్లును;మాదవియుమ్= మాదవి లతలుమొదలగునవి; శెழுమైయార్ పొழிల్ గళ్ తழுవు = విస్తారముగగల తోటలచే చుట్టబడియున్న;నల్ మాడమ్=మంచి మేడలు మండపములు గల; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
ఇరువదియొక్క మార్లు ఈ భూమియందున్న క్షత్రీయ రాజులయొక్క మణులతో పొదిగిన కిరీటములను పొడి పొడి చేసి (వారియొక్క) రక్తపు సెలయేరు యొక్క వరదలయందు స్నానమాచరించి,తనయొక్క తీవ్రమైన కోపమును వర్జించిన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ),గెలలతో నిండిన అరటి మొక్కల తోపులును, పెరిగిన పోకచెట్లును, “కురవు”చెట్లును,మంచి పనసచెట్లును,చల్లదనము నిచ్చు మామిడి చెట్లును,మాదవి లతలు మొదలగునవి విస్తారముగగల తోటలచే చుట్టబడియున్న,మంచి మేడలు మండపములు గల తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
వానుళారవరై వలిమైయాల్ నలియుమ్, మఱికడల్ ఇలఙ్గైయార్ కోనై,
పానునేర్ శరత్తాల్ పనఙ్గనిపోల, ప్పరుముడియుదిర విల్ వళైత్తోన్,
కాన్ ఉలా మయిలిన్ కణఙ్గళ్ నిన్ఱాడ, క్కణముగిల్ మురశమ్ నిన్ఱదిర,
తేన్ ఉలా వరివణ్డు ఇన్నిశై మురలుమ్, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1754
వలిమైయాల్ = తన శక్తిచే; వానుళారవరై నలియుమ్=దేవతలను హింసించుచుండెడి; మఱికడల్ ఇలఙ్గైయార్ కోనై = అలలుకొట్టుచున్న సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురి వాసులకు ప్రభువైన రావణాసురునియొక్క; పరు ముడి = విస్తరించియున్న పది తలలు; ఉదిర = తెగి క్రిందపడునట్లు; విల్ వళైత్తోన్ = శారంగం విల్లును వంచి బాణములను ప్రయోగించిన సర్వేశ్వరుడు(ఎచట వేంచేసి యున్నాడనగ);కాన్ ఉలామ్= అడవిలో సంచరించుచుండెడి; మయిలిన్ కణఙ్గళ్ = నెమళ్ళు యొక్క సమూహములు; నిన్ఱు ఆడ = నిలిచి నృత్యములు చేయుచున్నదియు; కణమ్ ముగిల్ = మేఘముల గుంపులు; మురశమ్ నిన్ఱు అదిర=భేరీల వలె నిలిచి ఘోషించుచున్నదియు; తేన్ ఉలామ్ వరి వణ్డు = తేనెలలో సంచరించుచున్న అందమైన భ్రమరములు;ఇన్ ఇశై మురలుమ్ = ఇంపైన రాగములతొ ఝంకారము చేయుచుండెడి;తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
తన శక్తిచే దేవతలను హింసించుచుండెడి అలలుకొట్టుచున్న సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురి వాసులకు ప్రభువైన రావణాసురునియొక్క విస్తరించియున్న పది తలలు తెగి క్రిందపడునట్లు శారంగం విల్లును వంచి బాణములను ప్రయోగించిన సర్వేశ్వరుడు(ఎచట వేంచేసి యున్నాడనగ), అడవిలో సంచరించు చుండెడి నెమళ్ళు యొక్క సమూహములు నిలిచి నృత్యములు చేయుచున్నదియు, మేఘముల గుంపులు భేరీల వలె నిలిచి ఘోషించు చున్నదియు, తేనెలలో సంచరించుచున్న అందమైన భ్రమరములు ఇంపైన రాగములతొ ఝంకారము చేయుచుండెడి తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
అరవునీళ్ కొడియోన్ అవైయుళ్ ఆశనత్తై, అఞ్జిడాదే యిడ, అదఱ్కు
ప్పెరియ మామేని అణ్డమ్ ఊడురువ, పెరున్దిశై అడఙ్గిడ నిమిర్ న్దోన్,
వరైయిన్ మామణియమ్ మరదకత్తిరళుమ్, వయిరముమ్ వెదిర్ ఉదిర్ ముత్తుమ్,
తిరై కొణర్ న్దు ఉన్ది వయల్ తొఱుమ్ కువిక్కుమ్, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll1755
అరవునీళ్ కొడియోన్=సర్పధ్వజుడైన దుర్యోధనుడు;అవైయుళ్= తన రాజ్యసభలో; ఆశనత్తై= (సంహరింపదలచి మోసపూరితమైన) ఆసనమును; అఞ్జిడాదే ఇడ = బయములేక ఒసగ; అదఱ్కు= దానికి; పెరియ మా మేని = పెద్ద సాటిలేని రూపమును; అణ్డమ్ ఊడు ఉరువ = ఊర్ధ్వలోకముల ద్వారా పైకి పోవునట్లును; పెరు తిశై అడఙ్గిడ = సమస్త దిక్కులు తనలోఇముడునట్లును; నిమిర్ న్దోన్ = పెరిగినట్టి సర్వేశ్వరుడు(ఎచట వేంచేసి యున్నాడనగ ); వరైయిన్ మా మణియమ్ = సహ్యాద్రి పర్వతమందలి శ్లాఘ్యమైన రత్నములును; మరదక తిరళుమ్ = మరకతముల రాసులను; వయిరముమ్ = వజ్రములను; వెదిర్ ఉదిర్ ముత్తుమ్=వెదురుచెట్లు వెదజల్లు ముత్యములను;తిరై = నదుల అలలు; ఉన్ది కొణర్ న్దు=తోసుకుని పట్టుకొనివచ్చి;వయల్ తొఱుమ్ కువిక్కుమ్= పొలములద్వారా కుప్పలగ చేరవేయు చుండెడి; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
సర్పధ్వజుడైన దుర్యోధనుడు తన రాజ్యసభలో (సంహరింపదలచి మోసపూరితమైన) ఆసనమును బయములేక ఒసగ, దానికి,పెద్ద సాటిలేని రూపమును ఊర్ధ్వలోకముల ద్వారా పైకి పోవునట్లును, సమస్త దిక్కులు తనలో ఇముడునట్లును, పెరిగినట్టి సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ),సహ్యాద్రి పర్వతమందలి శ్లాఘ్యమైన రత్నములును, మరకతముల రాసులను, వజ్రములను, వెదురుచెట్లు వెదజల్లు ముత్యములను, నదుల అలలు తోసుకుని పట్టుకొనివచ్చి,పొలములద్వారా కుప్పలగ చేరవేయు చుండెడి, తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
పన్నియ పారమ్ పార్ మకట్కొழிయ, ప్పారదమా పెరుమ్బోరిల్,
మన్నర్ గళ్ మడియ మణినెడున్దిణ్డేర్, మైత్తునర్కు ఉయ్ త్త మామాయన్,
తున్ను మాదవియుమ్ శురపునై పొழிలుమ్ శూழ் న్దెழு శెణ్పకమలర్ వాయ్,
తెన్న వెన్ఱు అళిగళ్ మురన్ఱు ఇశైపాడుమ్, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే ll 1756
పార్ మకట్కు = భూమండలములోయున్న; పన్నియ పారమ్ = అధికమైన భారము;ఒழிయ = తొలగిపోవునట్లు; పారదమ్ మా పెరుమ్ పోరిల్ = మిక్కిలి గొప్ప భారత యుద్దమున; మన్నర్ గళ్ మడియ = రాజులు అంతమగునట్లు; మైత్తునర్కు = అర్జునునకు;మణి నెడు తిణ్ తేర్ ఉయ్ త్త= మణులతోఒప్పు పెద్ద దృఢమైన రథమును నడిపించిన; మా మాయన్ = గొప్ప ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ); తున్ను మాదవియుమ్ = దట్టమైన మాదవి లతలును; శురపునై పొழிలుమ్ = శుర పున్నై తోటలును; శూழ் న్దు ఎழு శెణ్పకమ్= చుట్టును పెరిగియున్న సంపంగి మొదలగు వీటియొక్క; మలర్ వాయ్=పుష్పములలో; అళిగళ్=భ్రమరములు; తెన్న ఎన్ఱు =” తెన్న తెన్న “అని; మురన్ఱు=ఆలపించుచు; ఇశైపాడుమ్ = రాగభరితముగ ఝంకారము చేయుచుండెడి; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానే = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
భూమండలములోయున్న అధికమైన భారము తొలగిపోవునట్లు మిక్కిలి గొప్ప భారత యుద్దమున, రాజులు అంతమగునట్లు అర్జునునకు మణులతో ఒప్పు పెద్ద దృఢమైన రథమును నడిపించిన గొప్ప ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు (ఎచట వేంచేసి యున్నాడనగ), దట్టమైన మాదవి లతలును,శుర పున్నై తోటలును,చుట్టును పెరిగియున్న సంపంగి మొదలగు వీటియొక్క పుష్పములలో భ్రమరములు ” తెన్న తెన్న “అని, ఆలపించుచు రాగభరితముగ ఝంకారము చేయుచుండెడి తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్నాడు! .
** కలై ఉలా అల్కుల్ కారిగై తిఱత్తు, కడల్ పెరుమ్పడైయొడుమ్ శెన్ఱు,
శిలైయినాల్ ఇలఙ్గై తీయెழ చ్చెర్ట్ర, తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానై,
మలైకులా మాడ మఙ్గైయర్ తలైవన్, మానవేల్ కలియన్ వాయొలిగళ్,
ఉలవు శొల్ మాలై యొన్బతోడొన్ఱుమ్, వల్లవర్కిల్లై నల్ కురవే ll 1757
కలై ఉలా అల్ గుల్ = మంచి వస్త్రము కలగియున్న నడుముగల; కారిగై తిఱత్తు = మిక్కిలి అందమైన సీతాదేవి నిమిత్తమై; కడల్ పెరుమ్ పడైయొడుమ్ శెన్ఱు=సముద్రము కంటె పెద్దదైన వానరసేనతోకూడ వెడలి; శిలైయినాల్ = శారంగం విల్లుతో;ఇలఙ్గై తీ ఎழு శెర్ట్ర = లంకాపురిని అగ్నిలో మండి నశించునట్లుజేసిన; తిరుక్కణ్ణఙ్గుడియుళ్ నిన్ఱానై = తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై; మలై కులా మాడమ్=కొండలని కొండాడబడు భవనములుగల; మఙ్గైయర్ తలైవన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువును; మానమ్ వేల్ = శ్లాఘ్యమైన శూలాయుధము కలిగిన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; వాయ్ ఒలిగళ్ = సూక్తులు; ఉలవు=మంచి కవితా లక్షణములతో నింపి;శొల్ మాలై ఒన్బతోడు ఒన్ఱుమ్ = చెప్పిన ఈ పది పాసురములను; వల్లవర్కు= పఠించువారికి; నల్ కురవు = అఙ్ఞానమను దౌర్భాగ్యము; ఇల్లై = ఉండదు!
మంచి వస్త్రము కలగియున్న నడుముగల మిక్కిలి అందమైన సీతాదేవి నిమిత్తమై సముద్రముకంటె పెద్దదైన వానరసేనతోకూడ వెడలి శారంగం విల్లుతో లంకాపురి అగ్నిలో మండి నశించునట్లుజేసిన తిరుక్కణ్ణఙ్గుడి దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై,కొండలని కొండాడబడు భవనములుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువును, శ్లాఘ్యమైన శూలాయుధము కలిగిన తిరుమంగై ఆళ్వార్ సూక్తులు మంచి కవితా లక్షణములతో నింపి, చెప్పిన ఈ పది పాసురములను పఠించువారికి అఙ్ఞానమను దౌర్భాగ్యము ఉండదు!
*****