శ్రీః
10 . ఎఙ్గళ్
తిరుక్కోట్టియూర్(గోష్ఠీపురం) దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న శౌమ్యనారాయణన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** ఎఙ్గళ్ ఎమ్మిఱై ఎమ్బిరాన్, ఇమైయోర్కు నాయగన్, ఏత్తు అడియవర్
తఙ్గళ్ తమ్ మనత్తు, పిరియాదు అరుళ్ పురివాన్,
పొఙ్గు తణ్ అరువి పుదమ్ శెయ్య, పొన్గళే శిదఱ ఇలఙ్గొళి,
శెఙ్గమల మలరుమ్, తిరుక్కోట్టియూరానే ll 1838
ఎఙ్గళ్ ఎమ్ ఇఱై = మనయొక్క విశిష్టమైన స్వామియును; ఎమ్ పిరాన్ = నాయొక్క ఉపకారకుడును; ఇమైయోర్కు నాయగన్ = నిత్యశూరులకు నాయకుడును; ఏత్తు = స్తుతించెడి; అడియవర్ తఙ్గళ్ తమ్ = భక్తులయొక్క; మనత్తు = హృదయమును; పిరియాదు = ఎన్నడును విడువక; అరుళ్ పురివాన్ = కరుణించు సర్వేశ్వరుడు; (ఎచట కలడనగ); పొఙ్గు = ఉప్పొంగిన; తణ్ =చల్లని; అరువి=సెలయేర్లు; పుదమ్ శెయ్య = పరవళ్ళు తొక్కుచు ప్రవహించి; పొన్ గళే శిదఱుమ్ = బంగారము,మణులు కురిపించుటచే; ఇలఙ్గు ఒళి = కాంతితో శబ్దించుచున్నదియు; శెమ్ కమల మలరుమ్= (మరియు) ఎర్రని కమలములు వికసించుచుండెడి; తిరుక్కోట్టియూరానే = తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
మనయొక్క విశిష్టమైన స్వామియును,నాయొక్క ఉపకారకుడును, నిత్యశూరులకు నాయకుడును, స్తుతించెడి భక్తులయొక్క హృదయమును ఎన్నడును విడువక కరుణించు సర్వేశ్వరుడు (ఎచట కలడనగ),ఉప్పొంగిన చల్లని సెలయేర్లు పరవళ్ళు తొక్కుచు ప్రవహించి,బంగారము,మణులు కురిపించుటచే కాంతితో శబ్దించు చున్నదియు,(మరియు) ఎర్రని కమలములు వికసించుచుండెడి తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
ఎవ్వనోయ్ తవిర్పాన్, ఎమక్కు ఇఱై ఇన్నకైత్తువర్ వాయ్, నిలమగళ్
శెవ్వి తోయవల్లాన్, తిరుమామగట్కు ఇనియాన్,
మౌవల్ మాలై వణ్డు ఆడుమ్, మల్లిగై మాలైయోడుమ్ అణైన్దు, మారుదమ్
తెయ్ వ నాఱ వరుమ్, తిరుక్కోట్టియూరానే ll 1839
ఎవ్వమ్ నోయ్ తవిర్పాన్ = దుఃఖభాజకమైన వ్యాధులను పోగొట్టువాడును; ఎమక్కు ఇఱై=మనయొక్క స్వామియును;ఇన్ నగై తువర్ వాయ్ నిలమ్ మగళ్=మనోహరమైన చిరునవ్వు,ఎర్రని అదరములుగల శ్రీ భూదేవియొక్క; శెవ్వి=సౌందర్యమును; తోయ వల్లాన్ = అనుభవింప సమర్ధుడును; తిరు మా మగట్కు ఇనియాన్ = శ్రీ మహాలక్ష్మికి భోగ్యమైన సర్వేశ్వరుడు(ఎచట కలడనగ);వణ్డు ఆడుమ్ = భ్రమరములు సంచరించు చుండునదియు; మౌవల్ మాలైయోడుమ్ = సన్నజాజి పుష్పములతోను; మల్లిగై మాలైయోడుమ్ = మల్లి పుష్పములతోను;అణైన్దు = చేరి; మారుదమ్ = మారుతము; తెయ్ వ నాఱ= దివ్యమైన పరిమళమును వీచుచు;వరుమ్=వచ్చి వ్యాపింపజేయుచున్న; తిరుక్కోట్టియూరానే = తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
దుఃఖభాజకమైన వ్యాధులను పోగొట్టువాడును,మనయొక్కస్వామియును, మనోహరమైన చిరునవ్వు, ఎర్రని అదరములుగల శ్రీ భూదేవియొక్క సౌందర్యమును అనుభవింప సమర్ధుడును, శ్రీ మహాలక్ష్మికి భోగ్యమైన సర్వేశ్వరుడు(ఎచట కలడనగ) భ్రమరములు సంచరించుచుండునదియు,సన్నజాజి పుష్పములతోను, మల్లెల పుష్పములతోను చేరి మారుతము దివ్యమైన పరిమళమును వీచుచు వచ్చి వ్యాపింప జేయుచున్న తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
వెళ్ళియాన్ కరియాన్, మణి నిఱ వణ్ణన్ విణ్ణవర్ తమక్కు ఇఱై, ఎమక్కు
ఒళ్ళియాన్ ఉయర్ న్దాన్, ఉలగేழுమ్ ఉణ్డు ఉమిழ்న్దాన్,
తుళ్ళునీర్ మొణ్డుకొణ్డు శామరైకర్ట్రై, శన్దనమ్ ఉన్దివన్దు అశై,
తెళ్ళునీర్ పుఱవిల్, తిరుక్కోట్టియూరానే ll 1840
వెళ్ళియాన్=(కృతయుగమున)తెల్లని వర్ణమువంటివాడును;కరియాన్=(కలియుగమున) నల్లని వర్ణము వంటివాడును;మణి నిఱ వణ్ణన్=(ద్వాపర యుగమున) నీలమణి వర్ణము వంటివాడును; విణ్ణవర్ తమక్కు ఇఱై=నిత్యశూరులకు నిర్వాహకుడును;ఉయర్ న్దాన్=మిక్కిలి గొప్పవాడును; ఎమక్కు ఒళ్ళియాన్ = నాకు తన సౌందర్యమును దర్శింపజేసిన వాడును; ఉలగు ఏழுమ్ ఉణ్డు =(ప్రళయకాలమున) సప్తలోకములను తన ఉదరమున ఉంచుకుని; ఉమిழ்న్దాన్ =(సృష్టికాలమున) వెలిబుచ్చిన సర్వేశ్వరుడు(ఎచట కలడనగ); తుళ్ళునీర్ = పొంగి పొర్లుతున్న “మణిముత్తాఱు” నదీ జలముల అలలు;శామరైకర్ట్రై= చాల చామరములను;శన్దనమ్=చందన వృక్షములును;మొణ్డు కొణ్డు వన్దు=సేకరించి కొని;ఉన్ది అశై=తోయుచు ప్రవహించుచున్న;తెళ్ళునీర్ పుఱవిల్= స్వచ్ఛమైన జలములతో నిండిన బాహ్యప్రదేశములుగల;తిరుక్కోట్టియూరానే = తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
(కృతయుగమున)తెల్లని వర్ణమువంటివాడును, (కలియుగమున)నల్లని వర్ణము వంటివాడును,(ద్వాపర యుగమున) నీలమణి వర్ణము వంటివాడును, నిత్యశూరులకు నిర్వాహకుడును,మిక్కిలి గొప్పవాడును, నాకు తన సౌందర్యమును దర్శింపజేసిన వాడును,( ప్రళయకాలమున ) సప్తలోకములను తన ఉదరమున ఉంచుకుని, ( సృష్టికాలమున ) వెలిబుచ్చిన సర్వేశ్వరుడు (ఎచట కలడనగ),పొంగి పొర్లుతున్న “మణిముత్తాఱు” నదీ జలముల అలలు, చాల చామరములను,చందన వృక్షములును, సేకరించి కొని తోయుచు ప్రవహించుచున్న, స్వచ్ఛమైన జలములతో నిండిన బాహ్య ప్రదేశములుగల తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడుసుమా!
ఏఱుమేఱి ఇలఙ్గుమ్ ఒణ్ మழுపర్ట్రుమ్, ఈశఱ్కిశైన్దు, ఉడమ్బిలోర్
కూఱుతాన్ కొడుత్తాన్, కులమామకట్కినియాన్,
నాఱు శెణ్బగ మల్లిగై మలర్ పుల్ గి, ఇన్ ఇళవణ్డు, నన్నఱుమ్
తేఱల్ వాయ్ మడుక్కుమ్, తిరుక్కోట్టియూరానే ll 1841
ఏఱుమ్ ఏఱి = వృషభ వాహనమును ఎక్కి సంచరించువాడును; ఇలఙ్గుమ్ ఒణ్ మழு పర్ట్రుమ్ = ప్రకాశించుచున్న అందమైన ఆయుధము గొడ్డలిని హస్తమున కలవాడును;ఈశఱ్కు ఇశైన్దు = శివునికి ఇచ్ఛాపూర్వకముగ; తాన్ ఉడమ్బిల్ ఓర్ కూఱు కొడుత్తాన్=తాను తన శరీరమున ఒక పక్కన వసించు స్థలమును ఒసగినవాడును; కులమ్ = శ్లాఘ్యమైన; మా మగట్కు ఇనియాన్ = శ్రీ మహాలక్ష్మికి భోగ్యమైన సర్వేశ్వరుడు(ఎచట కలడనగ); ఇన్ ఇళ వణ్డు = ఇంపైన బాల తుమ్మెదలు; నాఱు = పరిమళ భరితమైన; శెణ్బగమ్ = సంపంగిలు; మల్లిగై మలర్ = మల్లెలు మొదలగు పుష్పములను;పుల్ గి=చేరి; నల్ నఱుమ్ తేఱల్ = మంచి సువాసన కలిగిన తేనెలలో; వాయ్ మడుక్కుమ్=తమ నోటిని ఉంచి పానముచేయుచుండెడి; తిరుక్కోట్టియూరానే = తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
వృషభ వాహనమును ఎక్కి సంచరించువాడును, ప్రకాశించుచున్న అందమైన ఆయుధము గొడ్డలిని హస్తమున కలవాడును, శివునికి ఇచ్ఛాపూర్వకముగ, తాను తన శరీరమున ఒక పక్కన వసించు స్థలమును ఒసగినవాడును, శ్లాఘ్యమైన శ్రీ మహాలక్ష్మికి భోగ్యమైన సర్వేశ్వరుడు(ఎచట కలడనగ), ఇంపైన బాల తుమ్మెదలు, పరిమళ భరితమైన,సంపంగిలు, మల్లెలు మొదలగు పుష్పములను చేరి మంచి సువాసన కలిగిన తేనెలలో తమ నోటిని ఉంచి పానముచేయుచుండెడి తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
వఙ్గ మా కడల్ వణ్ణన్, మామణివణ్ణన్ విణ్ణవర్ కోన్, మదుమలర్
తొఙ్గల్ నీణ్ముడియాన్, నెడియాన్ పడికడన్దాన్,
మఙ్గుల్ తోయ్ మణి మాడ వెణ్ కొడి, మాగమీదు ఉయర్ న్దేఱి, వాన్ ఉయర్
తిఙ్గళ్ తాన్ అణవుమ్, తిరుక్కోట్టియూరానే ll 1842
వఙ్గ మా కడల్ వణ్ణన్ = ఓడలు తిరుగుచున్న మహా సముద్రమువంటి వర్ణముగల వాడును; మా మణి వణ్ణన్ = శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణము గలవాడును;విణ్ణవర్ కోన్= నిత్యశూరులకు నాధుడును;మదు మలర్ తొఙ్గల్=తేనెలొలుకు పూలమాలలును; నీళ్ ముడియాన్ = పొడుగైన కిరీటముగల శిరస్సుపై అలంకృతమైనవాడును; నెడియాన్ = సర్వోత్కృష్టుడును,పడి కడన్దాన్ =(త్రివిక్రమావతారమున) భూమిని కొలిచి స్వీకరించిన సర్వేశ్వరుడు (ఎచట కలడనగ); మఙ్గుల్ తోయ్ మణి మాడమ్ = మేఘ మండలమును స్పర్శించుచున్న మణిమయమయిన భవంతులపై కట్టిన; వెణ్ కొడి = తెల్లని ధ్వజములు;మాగమీదు ఉయర్ న్దు ఏఱి=ఆకాశములో ఉన్నతముగ వ్యాపించి; వాన్ ఉయర్ తిఙ్గళ్ తాన్ = మిక్కిలి ఉన్నతముగనున్న చంద్రునిని; అణవుమ్ = తాకుచుండెడి; తిరుక్కోట్టియూరానే = తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
ఓడలు తిరుగుచున్న మహా సముద్రమువంటి వర్ణముగల వాడును, శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణము గలవాడును,నిత్యశూరులకు నాధుడును, తేనె లొలుకు పూలమాలలును పొడుగైన కిరీటముగల శిరస్సుపై అలంకృతమైన వాడును, సర్వోత్కృష్టుడును,(త్రివిక్రమావతారమున) భూమిని కొలిచి స్వీకరించిన సర్వేశ్వరుడు (ఎచట కలడనగ), మేఘ మండలమును స్పర్శించుచున్న మణిమయమయిన భవంతులపై కట్టిన, తెల్లని ధ్వజములు ఆకాశములో ఉన్నతముగ వ్యాపించి, మిక్కిలి ఉన్నతముగనున్న చంద్రునిని తాకుచుండెడి తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
కావలన్ ఇలఙ్గైక్కిఱై కలఙ్గ, చ్చరమ్ శెలవుయ్ త్తు, మర్ట్రు అవన్
ఏవలమ్ తవిర్తాన్, ఎన్నై యాళుడై యెమ్బిరాన్,
నావలమ్బువి మన్నర్ వన్దు వణఙ్గ, మాల్ ఉఱైకిన్ఱదు ఇఙ్గెన,
తేవర్ వన్దు ఇఱైఞ్జుమ్, తిరుక్కోట్టియూరానే ll 1843
కావలన్ = “నేనే జగద్రక్షకుడను” అని అహంకారముగల; ఇలఙ్గైక్కు ఇఱై = లంకాపురికి ప్రభువైన రావణాసురుడు; కలఙ్గ=కలతచెందునట్లు;శరమ్ శెల ఉయ్ త్తు=బాణములను ప్రయోగించియు; మర్ట్రు=మరియు; అవన్ ఏవలమ్ తవిర్తాన్=ఆ రావణాసురునియొక్క బాణ ప్రయోగ సామర్ధ్యమును పోగొట్టి అంతమొందించినవాడును; ఎన్నై ఆళుడై = నాయొక్క కైంకర్యసేవను స్వీకరించి కరుణించిన; ఎమ్ పిరాన్ = నాయొక్క స్వామి (ఎచట కలడనగ); నా వలమ్ పువి మన్నర్ = జంబూద్వీపమందుగల మహారాజులు; వణఙ్గ = ఆశ్రయించగ; మాల్ ఇఙ్గు ఉఱైకిన్ఱదు ఎన వన్దు = “సర్వేశ్వరుడు ఈ దివ్య స్థలమందే నిత్యవాసము చేయుచున్నాడు” అని వచ్చి; తేవర్ =బ్రహ్మాదిదేవతలందరును; వన్దు ఇఱైఞ్జుమ్ = వచ్చి సేవించుకొనుచుండెడి; తిరుక్కోట్టియూరానే=తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
“నేనే జగద్రక్షకుడను” అని అహంకారముగల, లంకాపురికి ప్రభువైన రావణాసురుడు, కలతచెందునట్లు బాణములను ప్రయోగించియు,మరియు ఆ రావణాసురునియొక్క బాణ ప్రయోగ సామర్ధ్యమును పోగొట్టి అంతమొందించిన వాడును, నాయొక్క కైంకర్యసేవను స్వీకరించి కరుణించిన నాయొక్క స్వామి (ఎచట కలడనగ),జంబూద్వీపమందుగల మహారాజులు ఆశ్రయించగ, “సర్వేశ్వరుడు ఈ దివ్య స్థలమందే నిత్యవాసము చేయుచున్నాడు” అని వచ్చి;బ్రహ్మాదిదేవతలందరును వచ్చి సేవించుకొనుచుండెడి తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
కన్ఱుకొణ్డు విలఙ్గని యెఱిన్దు, ఆనిరైక్కు అழிవెన్ఱు, మామழை
నిన్ఱు కాత్తు ఉగన్దాన్, నిలమామగట్కినియాన్,
కున్ఱిన్ ముల్లైయిన్ వాశముమ్, కుళిర్ మల్లిగై మణముమ్ అళైన్దు, ఇళమ్
తెన్ఱల్ వన్దు ఉలవుమ్, తిరుక్కోట్టియూరానే ll 1844
కన్ఱు కొణ్డు = (వత్సాసురుడు ఆవేశించిన) లేగదూడను పట్టుకొని; విలఙ్గని = (కపిత్దాసురుడు ఆవేశించిన) వెలగు పండుపై; ఎఱిన్దు= విసిరి ఆ అసురలిద్దరిని చంపిన వాడును;ఆ నిరైక్కు అழிవు ఎన్ఱు =గో సమూహములకు హాని కలుగు చున్నదని తలచి; మా మழை = పెద్ద వర్షమును; నిన్ఱు కాత్తు = (గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి) తానునిలిచి గోవులను రక్షించి;ఉగన్దాన్ = ఆనందించినవాడును; నిలమ్ మా మగట్కు ఇనియాన్ = శ్రీ భూదేవికి భోగ్యమైన సర్వేశ్వరుడు (ఎచట కలడనగ);ఇళమ్ తెన్ఱల్= మంద మారుతము;కున్ఱిన్ ముల్లైయిన్ వాశముమ్=కొండమల్లెపూల సువాసనను;కుళిర్ మల్లిగై మణముమ్ = చల్లని మల్లెపూల సువాసనను; అళైన్దు = ధరించుకొని; వన్దు ఉలవుమ్ = వచ్చి (మాడవీధులలో) వ్యాపింపజేయుచుండు;తిరుక్కోట్టియూరానే= తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
(వత్సాసురుడు ఆవేశించిన) లేగదూడను పట్టుకొని (కపిత్దాసురుడు ఆవేశించిన) వెలగు పండుపై విసిరి ఆ అసురలిద్దరిని చంపిన వాడును, గో సమూహములకు హాని కలుగు చున్నదని తలచి పెద్ద వర్షమును (గోవర్ధన పర్వతమును గొడుగుగ పైకెత్తి) తానునిలిచి గోవులను రక్షించి ఆనందించినవాడును శ్రీ భూదేవికి భోగ్యమైన సర్వేశ్వరుడు (ఎచట కలడనగ), మంద మారుతము కొండమల్లెపూల సువాసనను, చల్లని మల్లెపూల సువాసనను ధరించుకొని వచ్చి (మాడవీధులలో) వ్యాపింపజేయుచుండు తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
పూఙ్గురున్దొశిత్తు ఆనై కాయ్ న్దు, అరిమాచ్చెగుత్తు, అడియేనై ఆళుగన్దు
ఈఙ్గు ఎన్నుళ్ పుగున్దాన్, ఇమైయోర్ గళ్ తమ్ పెరుమాన్,
తూఙ్గు తణ్ పలవిన్ కని, తొగు వాழைయిన్ కనియొడు మాఙ్గని,
తేఙ్గు తణ్ పునల్ శూழ், తిరుక్కోట్టియూరానే ll 1845
పూమ్ కురున్దు ఒశిత్తు = పుష్పించియున్న(అసురుడు ఆవేశించిన) కురున్దు వృక్షమును విరిచి పడగొట్టినవాడును; ఆనై కాయ్ న్దు=(కువలయాపీడమను) ఏనుగుపై కోపగించి అంతమొందించిన వాడును; అరి మా శెగుత్తు=(కేశియను)అశ్వమును చంపినవాడును; అడియేనై = ఈ దాసుని; ఆళ్ ఉగన్దు = పాలించుటకై సంతోషముతో; ఈఙ్గు ఎన్నుళ్ పుగున్దాన్ = ఈ సంసారమందే నాయొక్క హృదయమున వేంచేసియున్నవాడును; ఇమైయోర్ గళ్ తమ్ పెరుమాన్ = నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుడు (ఎచట కలడనగ); మాఙ్గని = మామిడిఫలములు; తూఙ్గు తణ్ పలవిన్ కని=(పండిపోయి) వేలాడుచున్న అందమైన పనసపండ్లు;తొగు వాழைయిన్ కని యొడుమ్ = అరటి పండ్ల గెలలతోకూడ; తేఙ్గు = నిశ్చలమైన;తణ్ పునల్ శూழ்= చల్లని జలాశయముతో చుట్టుకొనియున్న; తిరుక్కోట్టియూరానే = తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
పుష్పించియున్న(అసురుడు ఆవేశించిన)కురున్దు వృక్షమును విరిచి పడగొట్టినవాడును,(కువలయాపీడమను) ఏనుగుపై కోపగించి అంతమొందించిన వాడును,(కేశియను)అశ్వమును చంపినవాడును,ఈ దాసుని పాలించుటకై సంతోషముతో, ఈ సంసారమందే నాయొక్క హృదయమున వేంచేసియున్నవాడును, నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుడు (ఎచట కలడనగ) మామిడిఫలములు, (పండిపోయి) వేలాడుచున్న అందమైన పనసపండ్లు,అరటిపండ్ల గెలలతోకూడ, నిశ్చలమైన చల్లని జలాశయముతో చుట్టుకొనియున్న, తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
కోవైయిన్ తమిழ் పాడువార్, కుడమాడువార్ తడమామలర్ మిశై,
మేవు నాన్ముగనిల్, విలఙ్గు పురినూలర్,
మేవు నాన్మఱైవాణర్ ఐవగై వేళ్వి, ఆఱఙ్గమ్ వల్లవర్ తొழுమ్,
దేవదేవ పిరాన్, తిరుక్కోట్టియూరానే ll 1846
కోవై ఇన్ తమిழ் = నియమితత్వము కలిగిన మదురమైన తమిళ పాసురములైన సూక్తులను; పాడువార్ = (ఆశించి ఆదరముతో) గానముచేయువారును; కుడమ్ ఆడువార్ = కుండలు పైకెగరవేసి ఆడువారివలె నృత్యము చేయువారును; తడ మా మలర్ మిశై మేవు = మిక్కిలి పెద్ద (నాభి) కమలముపై స్థితుడైన; నాన్ ముగనిల్ = చతుర్ముఖ బ్రహ్మకంటె;విలఙ్గు పురినూలర్=యఙ్ఞోపవీతముతో మిక్కిలి ప్రకాశించుచున్న వారును;; మేవు నాల్ మఱై వాణర్ = నాలగు వేదములను ఆశించి అభ్యసించు వారును; ఐవగై వేళ్వి = పంచ మహాయజ్ఞములు అనుష్టానమునందును; ఆఱఙ్గమ్ = ఆరు వేదాంగములను నేర్చుకొనుట యందును; వల్లవర్ = సమర్ధులైన శ్రీవైష్ణవులు; తొழுమ్ = సేవించుచుండెడి; దేవదేవ పిరాన్ = దేవాదిదేవుడు; తిరుక్కోట్టియూరానే= తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
నియమితత్వము కలిగిన మదురమైన తమిళ పాసురములైన సూక్తులను,(ఆశించి ఆదరముతో) గానముచేయువారును, కుండలు పైకెగరవేసి ఆడువారివలె నృత్యము చేయువారును,మిక్కిలి పెద్ద (నాభి) కమలముపై స్థితుడైన చతుర్ముఖ బ్రహ్మకంటె, యఙ్ఞోపవీతముతో మిక్కిలి ప్రకాశించుచున్నవారును,నాలుగు వేదములను ఆశించి అభ్యసించు వారును, పంచ మహాయజ్ఞములు అనుష్టానమునందును,ఆరు వేదాంగములను నేర్చుకొనుట యందును,సమర్ధులైన శ్రీవైష్ణవులు సేవించుచుండెడి దేవాదిదేవుడు తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నాడు సుమా!
** ఆలు మావలవన్ కలికన్ఱి, మఙ్గైయర్ తలైవన్, అణి పొழிల్
శేల్ గళ్ పాయ్ కழని, తిరుక్కోట్టియూరానై,
నీలమాముగిల్ వణ్ణనై నెడుమాలై, ఇన్ తమిழாల్ నినైన్ద, ఇన్
నాలు మాఱుమ్ వల్లార్కు, ఇడమాగుమ్ వానులగే ll 1847
ఆలుమ్ మా వలవన్=ఆడెడు(ఆడల్ మా)అశ్వమును ఎక్కి నడపించు సామర్ధ్యముగల; మఙ్గైయర్ తలైవన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువైన; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; అణి పొழிల్ = సుందరమైన తోటలు; శేల్ గళ్ పాయ్ కழని = మత్స్యములు త్రుళ్ళిత్రుళ్ళి ఆడుచుండెడి పొలములు గల; తిరుక్కోట్టియూరానై = తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడును; నీలమాముగిల్ వణ్ణనై = నల్లని పెద్ద మేఘమువంటి వర్ణము కలవాడును;నెడు మాలై=ఆశ్రితులయందు అధిక వ్యామోహము గల సర్వేశ్వరుని; ఇన్ తమిழாల్ = ఇంపైన తమిళ పాసురములతో;నినైన్ద = ధ్యానించి అనుగ్రహించిన; ఇన్ నాలుమ్ ఆఱుమ్ = ఈ పది పాసురములను; వల్లార్కు= పఠించు సమర్ధులకు; వానులగే = పరమపదమే; ఇడమ్ ఆగుమ్ = నివాసస్థలమగును!.
ఆడెడు(ఆడల్ మా)అశ్వమును ఎక్కి నడపించు సామర్ధ్యముగల, తిరుమంగై దేశవాసులకు ప్రభువైన, తిరుమంగై ఆళ్వార్, సుందరమైన తోటలు, మత్స్యములు త్రుళ్ళిత్రుళ్ళి ఆడుచుండెడి పొలములుగల, తిరుక్కోట్టియూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడును, నల్లని పెద్ద మేఘమువంటి వర్ణము కలవాడును,ఆశ్రితులయందు అధిక వ్యామోహము గల సర్వేశ్వరుని, ఇంపైన తమిళ పాసురములతో, ధ్యానించి అనుగ్రహించిన ఈ పది పాసురములను పఠించు సమర్ధులకు, పరమపదమే నివాసస్థలమగును!.
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
************