శ్రీః
3 . తన్నైనైవిక్కిలేన్
తిరుప్పుల్లాణి దివ్యదేశమున వేంచేసియున్న కల్యాణ జగన్నాథన్ పెరుమాళ్ ను దర్శించిన తిరుమంగై ఆళ్వార్, ఆస్వామి ధ్యానములో పరకాలనాయకి అవస్థపొంది, తన మనస్సును, సఖులను ఆసర్వేశ్వరుని సేవించుకొందమని చెప్పుచున్నారు.
తన్నై నైవిక్కలేన్, వల్ వినైయేన్ తొழுదుమెழு,
పొన్నై నైవిక్కుమ్, అప్పూమ్ శెరున్ది మణ నీழల్ వాయ్,
ఎన్నై నైవిత్తు, ఎழிల్ కొణ్డు అకన్ఱ పెరుమానిడమ్,
పున్నై ముత్తమ్ పొழிల్ శూழ் న్దు, అழగాయ పుల్లాణియే ll 1768
వల్ వినైయేన్=క్రూరమైన పాపములుగల నేను;తన్నై నైవిక్కలేన్=(నాయొక్క స్వామి ఎడబాటును భరించలేక) నాయొక్క అంతమును చేసుకొనలేను(అది నాస్వామికి వ్యధ కలిగించును); (ఓ! నా మనసా!)పొన్నై నైవిక్కుమ్ అ ప్పూమ్ శెరున్ది మణమ్ నీழల్ వాయ్=బంగారమువంటి పుష్పములు, పుప్పొడి రేణువులు రాల్చుచుండు ఆ అందమైన శురుపున్నై చెట్లయొక్క పరిమళభరితమైన నీడలో; ఎన్నై నైవిత్తు = నన్ను సంశ్లేషించి; ఎழிల్ కొణ్డు అకన్ఱ= నాయొక్క మేని సౌందర్యమును హరించి విడిచి వెడలిపోయిన; పెరుమాన్ ఇడమ్ = సర్వేశ్వరునియొక్క నివాసస్థలమును; ముత్తమ్ = ముత్యముల వంటి మొగ్గలతో ఒప్పు; పున్నై పొழிల్ శూழ்న్దు = పున్నై చెట్లతో నిండిన తోటలతో చుట్టబడి; అழగాయ=మిక్కిలి సౌందర్యము కలిగియున్న; పుల్లాణియే=తిరు పుల్లాణి దివ్యదేశమును; తొழுదుమ్ = సేవించుకొందము; ఎழு = లేచి రమ్ము!.
క్రూరమైన పాపములుగల నేను,(నాయొక్క స్వామి ఎడబాటును భరించలేక) నాయొక్క అంతమును చేసుకొనలేను(అది నాస్వామికి వ్యధ కలిగించును), (ఓ! నా మనసా!) బంగారమువంటి పుష్పములు, పుప్పొడి రేణువులు రాల్చుచుండు ఆ అందమైన శురుపున్నై చెట్లయొక్క పరిమళభరితమైన నీడలో; ఎన్నై నైవిత్తు = నన్ను సంశ్లేషించి నాయొక్క మేని సౌందర్యమును హరించి విడిచి వెడలిపోయిన, సర్వేశ్వరుని యొక్క నివాసస్థలమును,ముత్యములవంటి మొగ్గలతో ఒప్పు పున్నై చెట్లతో నిండిన తోటలతో చుట్టబడి మిక్కిలి సౌందర్యము కలిగియున్న తిరు పుల్లాణి దివ్యదేశమును సేవించుకొందము, లేచి రమ్ము!.
ఉరుగి నెఞ్జే నినైన్దు ఇఙ్గిరున్దెన్, తొழுదుమెழு,
మురుగు వణ్డు ఉణ్ మలర్ కైదైయిన్ నీழలిల్, మున్నొరునాళ్,
పెరుగు కాదన్మై, ఎన్నుళ్ళమ్ ఎయ్ ద ప్పిరిన్దానిడమ్,
పొరుదు మున్నీర్ క్కరైక్కే, మణియున్దు పుల్లాణియే ll 1769
నెఞ్జే = ఓ! నా మనసా!; ఇఙ్గు ఇరున్దు = ఇచటనే ఉండి; నినైన్దు = తలచుకొనుచు; ఉరుగి ఎన్ = శోకములో మునిగియుండుట వలన ఏమి ప్రయోజనము?; వణ్డు = భ్రమరములు; మురుగు ఉణ్ = తేనెను పానముచేసియున్న; మలర్ =పుష్పములతో నిండిన; కైదైయిన్ నీழలిల్=మొగలి చెట్లయొక్క నీడలక్రింద; మున్నొరునాళ్=మునుపొక దినమున; ఎన్ ఉళ్ళమ్ = నా హృదయమున;పెరుగు కాదన్మై ఎయ్ ద = మిక్కుటముగ కోరిక రగులునట్లు; పిరిన్దాన్ ఇడమ్ = నన్ను విడిచి వెడలిపోయిన సర్వేశ్వరుని యొక్క నివాసస్థలమును; పొరుదు మున్నీర్ కరై కే = అలలుకొట్టుచున్న సముద్రపు తీరమునకే; మణి ఉన్దు = రత్నముల రాసులు కొట్టుకొనువచ్చెడి; పుల్లాణియే = తిరు పుల్లాణి దివ్యదేశమును; తొழுదుమ్ = సేవించుకొందము; ఎழு = లేచి రమ్ము!.
ఓ! నా మనసా! ఇచటనే ఉండి తలచుకొనుచు శోకములో మునిగియుండుట వలన ఏమి ప్రయోజనము? భ్రమరములు తేనెను పానము చేసియున్న పుష్పములతో నిండిన మొగలి చెట్లయొక్క నీడలక్రింద మునుపొక దినమున నా హృదయమున మిక్కుటముగ కోరిక రగులునట్లు నన్ను విడిచి వెడలిపోయిన సర్వేశ్వరుని యొక్క నివాసస్థలమును, అలలుకొట్టుచున్న సముద్రపు తీరమునకే రత్నముల రాసులు కొట్టుకొనువచ్చెడి తిరు పుల్లాణి దివ్యదేశమును సేవించుకొందము లేచి రమ్ము!.
ఏదుశెయ్ దాల్ మఱక్కేన్, మనమే తొழுదుమెழு,
తాదు మల్ గు తడమ్ శూழ் పొழிల్, తాழ் వర్ తొడర్ న్దు, పిన్
పేదై నిన్నైప్పిరియేన్, ఇని ఎన్ఱు అకన్ఱానిడమ్,
పోదునాళుమ్ కమழுమ్, పొழிల్ శూழ் న్ధ పుల్లాణియే ll 1770
మనమే = ఓ! నా మనసా!; ఏదు శెయ్ దాల్=ఏ పని చేయుచున్నను; మఱక్కేన్= మరువలేకున్నాను; తాదు మల్ గు=పూల పుప్పొడి రేణువులతో నిండినదియు;తడమ్ శూழ் = తటాకములతో చుట్టబడియున్నదియు; పొழிల్=తోటలయొక్క; తాழ்వర్= పొలిమేరల యందు;తొడర్ న్దు = నన్ను తనవెంట తీసుకునిపోయి; పేదై = ” నిర్మలమైన నా చెలీ!”; ఇని పిన్ = ఇకపై; నిన్నై = నిన్ను; పిరియేన్ = ఎన్నడును విడువను;ఎన్ఱు = అని చెప్పి; అకన్ఱాన్ ఇడమ్ = విడిచి వెడలిపోయిన సర్వేశ్వరుని యొక్క నివాసస్థలమును, నాళుమ్ పోదు కమழுమ్ = ఎల్లప్పుడును పుష్పములు పరిమళము వెదజల్లుచుండెడి; పొழிల్ శూழ் న్ధ=తోటలచే చుట్టబడియున్న; పుల్లాణియే=తిరు పుల్లాణి దివ్యదేశమును; తొழுదుమ్ = సేవించుకొందము;ఎழு = లేచి రమ్ము!.
ఓ! నా మనసా! ఏ పని చేయుచున్నను మరువలేకున్నాను.పూల పుప్పొడి రేణువులతో నిండినదియు,తటాకములతో చుట్టబడియున్నదియు, తోటలయొక్క పొలిమేరలయందు నన్ను తనవెంట తీసుకునిపోయి,” నిర్మలమైన నా చెలీ!” ఇకపై నిన్ను ఎన్నడును విడువను అని చెప్పి, విడిచి వెడలిపోయిన సర్వేశ్వరుని యొక్క నివాసస్థలమును, ఎల్లప్పుడును పుష్పములు పరిమళము వెదజల్లుచుండెడి తోటలచే చుట్టబడియున్న తిరు పుల్లాణి దివ్యదేశమును,సేవించుకొందము లేచి రమ్ము!..
కొఙ్గు ఉణ్ వణ్డే కరియాగవన్దాన్, కొడియేఱ్కు, మున్
నఙ్గలీశన్, నమక్కే పణిత్తమొழி శెయ్ దిలన్,
మఙ్గైనల్లాయ్ తొழுదుమెழு, పోయవన్ మన్నుమూర్,
పొఙ్గు మున్నీర్ క్కరైక్కే, మణియున్దు పుల్లాణియే ll 1771
నల్ మఙ్గాయ్ = ఉత్తమమైన నాసఖీ!; కొఙ్గు ఉణ్ వణ్డే కరి ఆగ = తేనె పానముచేయు భ్రమరమొక్కటే సాక్షిగ (మరియొకరికిని తెలియని విధముగ); కొడియేఱ్కు వన్దాన్ = పాపియైన నావద్దకు(సంశ్లేషమునకు) వచ్చిన; నఙ్గల్ ఈశన్=మనయొక్క సర్వేశ్వరుడు; మున్ = మునుపు; నమక్కే పణిత్త = మనకే చెప్పినట్టి; మొழி = వాక్కుల ననుసరించి; శెయ్ దిలన్ = నడుచుటలేదు; (ఆకారణముచే);అవన్ మన్నుమ్ ఊర్=ఆ సర్వేశ్వరుడు నివాసస్థలము మరియు;పొఙ్గు మున్నీర్ కరై కే=అలలుకొట్టుచున్న సముద్రపుతీరమునకే; మణి ఉన్దు = రత్నముల రాసులు కొట్టుకొనువచ్చెడి; పుల్లాణియే=తిరు పుల్లాణి దివ్యదేశమునకు; పోయ్ తొழுదుమ్ = పోయి సేవించుకొందము; ఎழு=లేచి రమ్ము!.
ఉత్తమమైన నాసఖీ! తేనె పానముచేయు భ్రమరమొక్కటే సాక్షిగ (మరియొకరికిని తెలియని విధముగ) పాపియైన నావద్దకు(సంశ్లేషమునకు) వచ్చిన మనయొక్క సర్వేశ్వరుడు మునుపు మనకు చెప్పిన వాక్కుల ననుసరించి నడుచుట లేదు. (ఆకారణముచే) ఆ సర్వేశ్వరుని నివాసస్థలము మరియు,అలలుకొట్టుచున్న సముద్రపు తీరమునకే రత్నముల రాసులు కొట్టుకొనువచ్చెడి తిరు పుల్లాణి దివ్యదేశమునకు పోయి సేవించుకొందము. లేచి రమ్ము!
ఉణరిల్ ఉళ్ళమ్ శుడుమాల్, వినైయేన్ తొழுదుమెழு,
తుణరి నాழల్ నఱుమ్ పోదు, నమ్ శూழ் కుழల్ పెయ్ దు, పిన్
తణరిల్ ఆవి తళరుమెన, అన్బుతన్దాన్ ఇడమ్,
పుణరి ఓదమ్ పణిలమ్, మణియున్దు పుల్లాణియే ll 1772
వినైయేన్ = పాపియైన నేను; ఉణరిల్ = తలచినంత మాత్రములోనే;ఉళ్ళమ్= మనస్సు; శుడుమ్ ఆల్ = తపించిపోవుచున్నది అయ్యో!;తుణరిన్ నాழల్ నఱుమ్ పోదు= పూల గుత్తులతో నిండిన ” నాழల్ ” చెట్లయొక్క పరిమళభరితమైన పుష్పములను;నమ్ శూழ் కుழల్ పెయ్ దు = నాయొక్క దట్టమైన కేశములయందు చుట్టి;తణరిల్ ఆవి తళరుమ్ ఎన అన్బు తన్దాన్ ఇడమ్ = “ఇక విరహమందు ప్రాణము అలసి సొలసిపోవునట్లు” ప్రీతి చేసిన సర్వేశ్వరుని నివాసస్థలమును మరియు; పుణరి ఓదమ్ పణిలమ్ మణి ఉన్దు = సమద్రపు అలలచే శంఖములు,రత్నములు తీరములందు కొట్టుకొనువచ్చెడి;పుల్లాణియే = తిరు పుల్లాణి దివ్యదేశమును; తొழுదుమ్ = సేవించుకొందము; ఎழு = లేచి రమ్ము!. నాప్రియసఖీ!
పాపియైన నేను తలచినంత మాత్రములోనే మనస్సు తపించి పోవుచున్నది, అయ్యో!, పూల గుత్తులతో నిండిన ” నాழల్ ” చెట్లయొక్క పరిమళభరితమైన పుష్పములను, నాయొక్క దట్టమైన కేశములయందు చుట్టి “ఇక విరహమందు ప్రాణము అలసి సొలసిపోవునట్లు” ప్రీతి చేసిన సర్వేశ్వరుని నివాసస్థలమును మరియు సమద్రపు అలలచే శంఖములు,రత్నములు తీరములందు కొట్టుకొనువచ్చెడి తిరు పుల్లాణి దివ్యదేశమును సేవించుకొందము లేచి రమ్ము!.నాప్రియసఖీ!
ఎళ్ గి నెఞ్జే నినైన్దు ఇఙ్గిరున్దెన్, తొழுదుమెழு,
వళ్ళల్ మాయన్, మణివణ్ణన్ ఎమ్మాన్ మరువుమ్ ఇడమ్,
కళ్ అవిழுమ్ మలర్ కావియుమ్, తూమడల్ కైతైయుమ్,
పుళ్ళుమ్ అళ్ళల్ పழనఙ్గళుమ్ శూழ் న్ద, పుల్లాణియే ll 1773
నేఞ్జే = ఓ! నా మనసా!; ఎళ్ గి = దుర్భర పరిస్థితులలో;నినైన్దు = తలచుకొనుచు;ఇఙ్గు ఇరున్దు ఎన్ = ఇచట ఉండి ప్రయోజనమేమున్నది?; వళ్ళల్ = ఉదారస్వభావుడును; మాయన్ = ఆశ్చర్య చేష్టితములు కలవాడును; మణివణ్ణన్ = నీలమణివంటి వర్ణముతో ప్రకాశించువాడును; ఎమ్మాన్ = నాయొక్క స్వామి సర్వేశ్వరుడు; మరువుమ్ ఇడమ్ = ఆశించిన నివాసస్థలమును; కళ్ అవిழுమ్ మలర్ కావియుమ్=తేనె లొలుకు వికసించిన ఎర్ర కలువులును;తూమడల్ కైతైయుమ్=తెల్లని దళములుగల మొగలి పుష్పములును; పుళ్ళుమ్ = పలు రకములైన పక్షులును; అళ్ళల్ పழనఙ్గళుమ్ = బాగుగ పండెడి పంట భూములతోను; శూழ் న్ద = చుట్టుకొనియున్న; పుల్లాణియే=తిరు పుల్లాణి దివ్యదేశమునకు; పోయ్ తొழுదుమ్ = పోయి సేవించుకొందము; ఎழு=లేచి రమ్ము!.
ఓ! నా మనసా!, ఈ దుర్భర పరిస్థితులలో తలచుకొనుచు ఇచట ఉండి ప్రయోజనమేమున్నది?, ఉదారస్వభావుడును, ఆశ్చర్య చేష్టితములు కలవాడును, నీలమణివంటి వర్ణముతో ప్రకాశించువాడును, నాయొక్క స్వామి సర్వేశ్వరుడుఆశించిన నివాసస్థలమును, తేనె లొలుకు వికసించిన ఎర్ర కలువులును,తెల్లని దళములుగల మొగలి పుష్పములును,పలురకములైన పక్షులును,బాగుగ పండెడి పంట భూములతో, చుట్టుకొనియున్న తిరు పుల్లాణి దివ్యదేశమునకు సేవించుకొందము లేచి రమ్ము!.
పరవి నెఞ్జే తొழுదుమెழு, పోయవన్బాలమాయ్,
ఇరవునాళుమ్, ఇనిక్కణ్ తుయిలాదు ఇరున్దెన్ పయన్,
విరవిముత్తమ్, నెడువెణ్ మణల్ మేల్ కొణ్డు, వెణ్ తిరై
పురవియెన్న ప్పుదమ్ శెయ్ దు, వన్దు ఉన్దు పుల్లాణియే ll 1774
నేఞ్జే=ఓ! నా మనసా!;ఇని=ఇప్పుడిక;ఇరవునాళుమ్=రాత్రింపగళ్లు; కణ్ తుయిలాదు ఇరున్దు ఎన్ పయన్ = నిదురలేక ఇచటుండి ఏమి ప్రయోజనము?;ముత్తమ్ విరవి = ముత్యములతో కలసి; నెడు వెణ్ మణల్ = అధికముగ తెల్లని ఇసుకను; మేల్ కొణ్డు=పైన వేసుకొని; వెణ్ తిరై = తెల్లని అలలు; పురవియెన్న = గుఱ్ఱములవలె; పుదమ్ శెయ్ దు వన్దు ఉన్దు = పైకెగియుచు వచ్చి నెట్టుచుండెడి; పుల్లాణియే = తిరుపుల్లాణి దివ్యదేశమునందే; అవన్ పాలమ్ ఆయ్ పోయ్ = ఆ సర్వేశ్వరునియందు నిశ్చలమైన ప్రీతితో పోయి; పరవి = స్తుతించి; తొழுదుమ్=సేవించుకొందము; ఎழு=లేచి రమ్ము!.
ఓ! నా మనసా!ఇప్పుడిక రాత్రింపగళ్లు నిదురలేక ఇచటుండి ఏమి ప్రయోజనము?,ముత్యములతో కలసి,అధికముగ తెల్లని ఇసుకను పైన వేసుకొని తెల్లని అలలు గుఱ్ఱములవలె పైకెగియుచు వచ్చి నెట్టుచుండెడి తిరుపుల్లాణి దివ్యదేశమునందే ఆ సర్వేశ్వరునియందు నిశ్చలమైన ప్రీతితో పోయి,స్తుతించి సేవించుకొందము లేచి రమ్ము!.
అలముమ్ ఆழி ప్పడైయుమ్ ఉడైయార్, నమక్కన్బరాయ్,
శలమదాగి తకవొన్ఱిలర్, నామ్ తొழுదుమెழு,
ఉలవుకాల్ నల్ కழிయోఙ్గు, తణ్ పైమ్బొழிలూడు, ఇశై
పులవుకానల్, కళి వణ్డినమ్ పాడు పుల్లాణియే ll 1775
అలముమ్ ఆழி పడైయుమ్ ఉడైయార్ = నాగలి, చక్రాయుధము కలిగిన సర్వేశ్వరుడు; నమక్కు అన్బర్ ఆయ్ = మన విషయమున ప్రేమ గలిగినవారి వలె ప్రవర్తించి; శలమ్ అదు ఆగి = కపటమును కలిగియుండి; తకవు ఒన్ఱు ఇలర్ = స్వల్పమైనను దయలేక యున్నారు;(అయినను);ఉలవు కాల్= వీచుచున్న దక్షిణపుగాలిగల; నల్ కழி = మంచి మార్గములతో; ఓఙ్గు తణ్ పై పొழிల్ ఊడు = ఉన్నతమైన చల్లని వ్యాపించియున్న తోటలు కలదియు;పులవు కానల్ కళి వణ్డు ఇనమ్=నీచు వాసనకొట్టుచున్న సముద్ర తీరమున తోటలలో గండు తుమ్మెదల సమూహములు; ఇశై పాడు = ఇంపుగ ఝంకారము చేయుచుండెడి; పుల్లాణియే = తిరు పుల్లాణి దివ్యదేశమును; తొழுదుమ్ = సేవించు కొందము; ఎழு = లేచి రమ్ము!.నాప్రియసఖీ!
నాగలి, చక్రాయుధము కలిగిన సర్వేశ్వరుడు మన విషయమున ప్రేమ గలిగినవారి వలె ప్రవర్తించి, కపటమును కలిగియుండి స్వల్పమైనను దయలేక యున్నారు.(అయినను), వీచుచున్న దక్షిణపుగాలిగల మంచి మార్గములతో ఉన్నతమైన, చల్లని వ్యాపించియున్న తోటలు కలదియు, నీచు వాసనకొట్టుచున్న సముద్రతీరమున తోటలలో గండు తుమ్మెదల సమూహములు ఇంపుగ ఝంకారము చేయుచుండెడి,తిరు పుల్లాణి దివ్యదేశమును సేవించు కొందము లేచి రమ్ము!. నాప్రియసఖీ!
ఓది నామమ్ కుళిత్తు ఉచ్చితన్నాల్, ఒళి మామలర్,
పాద నాళుమ్ పణివోమ్, నమక్కే నలమాదలిల్,
ఆదు తారానెనిలుమ్ తరుమ్, అన్ఱియుమ్ అన్బరాయ్,
పోదుమాదే తొழுదుమ్, అవన్ మన్ను పుల్లాణియే ll 1776
మాదే = ఓ! నా ప్రియసఖీ!; నమక్కే నలమ్ ఆదలిల్ = మనకే పురుషార్థమగుటవలన; కుళిత్తు = స్నానమాచరించి;నామమ్ ఓది = స్వామియొక్క దివ్యనామములను జపించి; ఒళి మా మలర్ పాదమ్ = ప్రకాశించుచున్న ఆ శ్లాఘ్యమైన పాదపద్మములను; నాళుమ్ పణివోమ్ = ప్రతిదినము సేవించుకొందము; ఆదు తారాన్ ఎనిలుమ్ = ఆ సర్వేశ్వరుడు ఏమియు ఒసగుకున్నట్లున్నను; తరుమ్ = (నిశ్చయముగ) ఒసగును; అన్ఱియుమ్ = ఒసగినను,ఒసగకపోయినను;అవన్ మన్ను పుల్లాణియే=ఆ జగన్నాథుని నివాసస్థలమైన తిరుపుల్లాణి దివ్యదేశమునే; తొழுదుమ్ = సేవించుకొందము; పోదు = రా! సఖీ!
ఓ! నా ప్రియసఖీ!, మనకే పురుషార్థమగుటవలన స్నానమాచరించి స్వామియొక్క దివ్యనామములను జపించి, ప్రకాశించుచున్న ఆ శ్లాఘ్యమైన పాద పద్మములను ప్రతిదినము సేవించుకొందము, ఆ సర్వేశ్వరుడు ఏమియు ఒసగుకున్నట్లున్నను, (నిశ్చయముగ) ఒసగును. ఒసగినను,ఒసగకపోయినను, ఆ జగన్నాథుని నివాసస్థలమైన తిరుపుల్లాణి దివ్యదేశమునే సేవించుకొందము. రా! సఖీ!
** ఇలఙ్గు ముత్తుమ్ పవళ క్కొழுన్దుమ్, ఎழிల్ తామరై,
పులఙ్గల్ ముర్ట్రుమ్ పొழிల్ శూழ் న్దు, అழగాయ పుల్లాణిమేల్,
కలఙ్గలిల్లా ప్పుగழாన్, కలియన్ ఒలిమాలై,
వలఙ్గొల్ తొణ్డఱ్కిడమావదు, పాడిల్ వైకున్దమే ll 1777
ఇలఙ్గు = మెరయుచున్న;ముత్తుమ్= ముత్యములతోను;పవళ క్కొழுన్దుమ్=పగడముల యొక్క కాంతులతోను;ఎழிల్ తామరై=అందమైన కమలములతోను; పులఙ్గల్ ముర్ట్రుమ్ =కనబడు ప్రదేశములంతటను; పొழிల్ శూழ் న్దు = తోటలతో చుట్టబడిన; అழగాయ పుల్లాణి మేల్ =అందమైన తిరు పుల్లాణి దివ్యదేశ విషయమై;కలఙ్గల్ ఇల్లా ప్పుగழாన్= ప్రశాంతచిత్తులు, మంచి కీర్తిగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలిమాలై = అనుగ్రహించిన ఈ సూక్తులమాలను; వలఙ్గొల్ తొణ్డఱ్కు= శక్తివంతమైన భాగవతులకు; పాడల్ = పాడినచో; వైకున్దమే = పరమపదమే; ఇడమావదు = నివాసస్థలమగును!.
మెరయుచున్న ముత్యములతోను,పగడములయొక్క కాంతులతోను,అందమైన కమలములతోను,కనబడు ప్రదేశములంతటను తోటలతో చుట్టబడిన, అందమైన తిరు పుల్లాణి దివ్యదేశ విషయమై, ప్రశాంతచిత్తులు, మంచి కీర్తిగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తుల మాలను,శక్తివంతమైన భాగవతులకు, పాడినచో, పరమపదమే నివాసస్థలమగును!.
*******