శ్రీః
7 . తన్దైతాయ
మళయాళ దేశములోగల తిరువల్లవాழ் దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న కోలప్పిరాన్ పెరుమాళ్ యొక్క దివ్య నామమును స్మరింపమని తమ మనస్సునకు తిరుమంగై ఆళ్వార్ ప్రబోధించుచున్నారు.
** తన్దైతాయ్ మక్కళే, శుర్ట్రమెన్ఱు ఉర్ట్రవర్ పర్ట్రినిన్ఱ,
పన్దమార్ వాழ்కైయే, నొన్దు నీ పழிయెనక్కరుదినాయేల్,
అన్దమాయ్ ఆదియాయ్, ఆదిక్కుమ్ ఆదియాయ ఆయనాయ,
మైన్దనార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1808
నెఞ్జే = ఓ! నా మనసా!; తన్దై తాయ్ మక్కళ్ = తండ్రి,తల్లి,పిల్లలు; శుర్ట్రమ్=ఙ్ఞాతులు; ఉర్ట్రవర్ ఎన్ఱు = మరియు బంధువులు అని; పర్ట్రి నిన్ఱ = పట్టుకొని యుండెడి; పన్దమ్ ఆర్ వాழ்కైయే = బంధములతో నిండిన సంసార జీవనమునకు; నీ నొన్దు = నీవు భయపడి; పழி యెన = ఈ జీవనము అధమమని; కరుదినాయేల్ = తలచినయెడల; అన్దమ్ ఆయ్ = (ప్రళయకాలమున) లయకు ఆశ్రయమైన వాడును; ఆది ఆయ = ఉత్పత్తికి స్థానమైన వాడును; ఆదిక్కుమ్ ఆది ఆయ = కారణావస్థలోనున్న చేతనాచేతనములకు నిర్వాహకుడును; ఆయన్ ఆయ=గోపాలకృష్ణునిగ అవతరించిన; మైన్దనార్= సర్వేశ్వరుని యొక్క ; వల్లవాழ்=తిరు వల్లవాழ் దివ్యదేశమును;శొల్లుమ్ ఆ=నోరార పలుకుటయందు; వల్లై ఆయ్ మరువు = దృఢమైన నిశ్చయము కలిగియుండుము!
ఓ! నా మనసా! తండ్రి,తల్లి,పిల్లలు,ఙ్ఞాతులు మరియు బంధువులు అని పట్టుకొని యుండెడి బంధములతో నిండిన సంసార జీవనమునకు నీవు భయపడి ,ఈ జీవనము అధమమని తలచిన యెడల, (ప్రళయకాలమున) లయకు ఆశ్రయమైనవాడును,ఉత్పత్తికి స్థానమైనవాడును, కారణావస్థలోనున్న చేతనాచేతనములకు నిర్వాహకుడును గోపాలకృష్ణునిగ అవతరించిన సర్వేశ్వరుని యొక్క తిరు వల్లవాழ் దివ్యదేశమును,నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము!
మిన్నుమ్ మా వల్లియుమ్ వఞ్జియుమ్ వెన్ఱ, నుణ్ ఇడై నుడఙ్గుమ్,
అన్న మెన్నడైయినార్ కలవియై, అరువరుత్తు అఞ్జినాయేల్,
తున్ను మామణిముడి ప్పఞ్జవర్కాగి, మున్ తూదు శెన్ఱ,
మన్ననార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1809
నెఞ్జే=ఓ! నా మనసా!;మిన్నుమ్=మెరుపును; మా వల్లియుమ్ = అందమైన తీగను; వఞ్జియుమ్ = “సీంథిల్”(తిప్ప తీగ) తీగను; వెన్ఱ = జయించిన; నుణ్ ఇడై = సన్నని నడుము; నుడఙ్గుమ్ = మృదువుగాను,అనువుగాను కలిగి; అన్నమ్ మెన్ నడైయినార్= రాజహంసవలె మెల్లని గమనముగల యువతులయొక్క; కలవియై = సంశ్లేషమునకు; అరువరుత్తు = మిక్కిలి వ్యధచెంది;అఞ్జినాయేల్= భయము కలిగియున్న యెడల; మున్=మునుపొకకాలమున; తున్ను మా మణిముడి పఞ్జవర్కు ఆగి = దట్టముగ శ్లాఘ్యమైన మణులతో పొదిగిన కిరీటములతో ఒప్పు పంచపాండవుల కొరకు; తూదు శెన్ఱ = దూతగ వేంచేసిన; మన్ననార్ = రాజాధిరాజైన గోపాలకృష్ణుని యొక్క;వల్లవాழ்=తిరు వల్లవాழ் దివ్యదేశమును;శొల్లుమ్ ఆ=నోరార పలుకుటయందు; వల్లై ఆయ్ మరువు = దృఢమైన నిశ్చయము కలిగియుండుము!
ఓ! నా మనసా! మెరుపును,అందమైన తీగను,”సీంథిల్”(తిప్ప తీగ) తీగను,జయించిన సన్నని నడుము, మృదువుగాను,అనువుగాను కలిగి రాజహంసవలె మెల్లని గమనముగల యువతులయొక్క సంశ్లేషమునకు మిక్కిలి వ్యధచెంది, భయము కలిగియున్నయెడల మునుపొకకాలమున దట్టముగ శ్లాఘ్యమైన మణులతో పొదిగిన కిరీటములతో ఒప్పు పంచపాండవుల కొరకు దూతగ వేంచేసిన రాజాధిరాజైన గోపాలకృష్ణుని యొక్కతిరు వల్లవాழ் దివ్యదేశమునునోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము !
పూణ్ ఉలా మెన్ ములై ప్పావైమార్, పొయ్యినై మెయ్యిదెన్ఱు,
పేణువార్ పేశు మప్పేచ్చై, నీపిழை యెనక్కరుదినాయేల్,
నీళ్ నిలా వెణ్ కుడై వాణనార్, వేళ్వియిల్ మణ్ ఇరన్ద,
మాణియార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1810
నెఞ్జే=ఓ! నా మనసా!; పూణ్ ఉలామ్=ఆభరణములతో ప్రకాశించుచున్న;మెల్ ములై= మృదువైన వక్షోజములుగల;పావైమార్=స్త్రీలయొక్క;పొయ్యినై=అసత్యములను; ఇదు మెయ్ ఎన్ఱు పేణవార్ పేశుమ్ = ఇవి సత్యములని ఆదరించెడివారు చెప్పుచుండెడి; అప్పేచ్చై = అటువంటి వాక్కులను; పిழை ఎన నీ కరుదినాయేల్ = తప్పులని నీవు తలచగలిగినయెడల; నీళ్ నిలా వెణ్ కుడై = వ్యాపించియున్న వెన్నెలవంటి తెల్లని ఛత్రముక్రింద ఒప్పు; వాణనార్ = సుసంపన్నుడైన మహబలియొక్క; వేళ్వియిల్ = మహాయాగమున; మణ్ ఇరన్ద=(మూడడుగుల) భూమిని యాచించిన; మాణియార్ = బ్రహ్మచారి వామనమూర్తియొక్క; వల్లవాழ்=తిరు వల్లవాழ் దివ్యదేశమును; శొల్లుమ్ ఆ=నోరార పలుకుటయందు; వల్లై ఆయ్ మరువు = దృఢమైన నిశ్చయము కలిగియుండుము!
ఓ! నా మనసా!ఆభరణములతో ప్రకాశించుచున్న మృదువైన వక్షోజములుగల స్త్రీలయొక్క అసత్యములను, ఇవి సత్యములని ఆదరించెడివారు చెప్పుచుండెడి, అటువంటి వాక్కులను తప్పులని నీవు తలచగలిగినయెడల వ్యాపించియున్న వెన్నెలవంటి తెల్లని ఛత్రముక్రింద ఒప్పు, సుసంపన్నుడైన మహబలి యొక్క మహాయాగమున (మూడడుగుల) భూమిని యాచించిన బ్రహ్మచారి వామనమూర్తి యొక్క తిరు వల్లవాழ் దివ్యదేశమును నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము!
పణ్ణులా మెన్మొழி ప్పావైమార్, పణై ములై యణైదు నామెన్ఱు,
ఎణ్ణువార్ ఎణ్ణమదు ఒழிత్తు, నీ పిழைత్తు ఉయ్య క్కరుదినాయేల్,
విణ్ణుళార్ విణ్ణిన్మీదు ఇయన్ఱ, వేఙ్గడత్తుళ్ళార్, వళఙ్గొళ్ మున్నీర్
వణ్ణనార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1811
నెఞ్జే=ఓ! నామనసా!;పణ్ ఉలామ్=శ్రావ్యమైన;మెల్ మొழி=మధురమైన వాక్కులుగల; పావైమార్ = స్త్రీలయొక్క; పణై ములై = పెద్ద వక్షోజములను; నామ్ అణైదుమ్ ఎన్ఱు = మేము ఆలింగనము చేసుకొందుమని; ఎణ్ణువార్ = తలచుచుండువారియొక్క; ఎణ్ణమ్ అదు ఒழிత్తు = అట్టి తలపులను విడిచిపెట్టి;నీ పిழைత్తు ఉయ్య కరుదినాయేల్= నీవు క్షేమముగ ఉజ్జీవింప తలచినయెడల; విణ్ ఉళార్ = నిత్యశూరులకై; విణ్ణిన్ మీదు = పరమపదమందు; ఇయన్ఱ = అమరియున్నవాడును; వేఙ్గడత్తు ఉళ్ళార్ = తిరు వేంకటాచలమందు వేంచేసియున్నవాడును;వళమ్ కొళ్ మున్నీర్ వణ్ణనార్ =సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క; వల్లవాழ் = తిరు వల్లవాழ் దివ్యదేశమును; శొల్లుమ్ ఆ = నోరార పలుకుటయందు; వల్లై ఆయ్ మరువు = దృఢమైన నిశ్చయము కలిగియుండుము!
ఓ! నామనసా! శ్రావ్యమైన, మధురమైన వాక్కులుగల స్త్రీలయొక్క పెద్ద వక్షోజములను,మేము ఆలింగనము చేసుకొందుమని తలచుచుండువారియొక్క, అట్టి తలపులను విడిచిపెట్టి, నీవు క్షేమముగ ఉజ్జీవింప తలచినయెడల,నిత్యశూరులకై పరమపదమందు అమరియున్నవాడును, తిరువేంకటాచలమందు వేంచేసియున్న వాడును అందమైన సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుని యొక్క తిరు వల్లవాழ் దివ్యదేశమును, నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము!
మఞ్జు తోయ్ వెణ్ కుడై మన్నరాయ్, వారణమ్ శూழవాழ்న్దార్,
తుఞ్జినార్ ఎన్బదోర్ శొల్లై, నీ తుయరెనక్కరుదినాయేల్,
నఞ్జు తోయ్ కొఙ్గైమేల్ అమ్ కై వాయ్ వైత్తు, అవళ్ నాళైయుణ్డ,
మైన్దనార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1812
నెఞ్జే=ఓ! నామనసా!; మఞ్జు తోయ్ వెణ్ కుడై మన్నర్ ఆయ్ = మేఘమండలమును తాకుచున్నట్లుండెడి ఎత్తైన తెల్లని ఛత్రములక్రింద ఒప్పు చక్రవర్తులై; వారణమ్ శూழ= ఏనుగుల సమూహములతో చుట్టబడి; వాழ்న్దార్ = సుఖముగనున్నవారు; తుఞ్జినార్ ఎన్బదు ఓర్ శొల్లై = నశించిపోయిరను నిజమైన విషయములను; తుయర్ ఎన= దుఃఖహేతువులని;నీ కరుదినాయేల్=నీవు తలచినయెడల;నఞ్జు తోయ్ కొఙ్గై మేల్ = విషము రాసుకొనియున్న(పూతనయొక్క) స్తనములపై; అమ్ కై వాయ్ వైత్తు= అందమైన చేతులును,నోటిని ఉంచి; అవళ్ నాళై ఉణ్డ మైన్దనార్ = ఆ పూతన యొక్క జీవిత కాలమును ముగించిన సర్వేశ్వరునియొక్క; వల్లవాழ் = తిరు వల్లవాழ் దివ్యదేశమును; శొల్లుమ్ ఆ = నోరార పలుకుటయందు; వల్లై ఆయ్ మరువు = దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
ఓ! నామనసా! మేఘమండలమును తాకుచున్నట్లుండెడి ఎత్తైన తెల్లని ఛత్రములక్రింద ఒప్పు చక్రవర్తులై,ఏనుగుల సమూహములతో చుట్టబడి, సుఖముగ నున్నవారు, నశించిపోయిరను నిజమైన విషయములను,దుఃఖహేతువులని నీవు తలచినయెడల, విషము రాసుకొనియున్న(పూతనయొక్క) స్తనములపై అందమైన చేతులును,నోటిని ఉంచి ఆ పూతనయొక్క జీవిత కాలమును ముగించిన సర్వేశ్వరునియొక్క తిరు వల్లవాழ் దివ్యదేశమును, నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
ఉరువిన్ ఆర్ పిఱవిశేర్, ఊన్ పొది నరమ్బు తోల్ కురమ్బైయుళ్ పుక్కు,
అరువి నోయ్ శెయ్ దు నిన్ఱ ఐవర్ తామ్, వాழ்వదఱ్కు అఞ్జినాయేల్,
తిరువినార్ వేదనాన్గు ఐన్దుతీ, వేళ్వియోడు,అఙ్గమాఱుమ్
మరువినార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1813
నెఞ్జే=ఓ! నామనసా!; ఉరువిన్ ఆర్ పిఱవి శేర్ = సూక్ష్మశరీరముతో కూడియుండి జన్మమును పొంది; ఊన్ పొది = మాంసము ఇమిడికొనియున్న; నరమ్బు తోల్ కురమ్బై యుళ్=నరములు,చర్మముకలిగిన గుడిసెలో; ఐవర్ తామ్=పంచేద్రియములు;పుక్కు= ప్రవేశించి; అరువి నోయ్ శెయ్ దు నిన్ఱు = వేదించుచు బాధపెట్టుచు నుండగ; వాழ்వదఱ్కు = నివాసిగయండుటకు; అఞ్జినాయేల్=నీవు భయపడుచున్నయెడల; తిరువిన్ ఆర్ = పరమప్రమాణములయొక్క సంపదలతో నిండిన; వేదనాన్గు = నాలుగు వేదములు; అఙ్గమాఱుమ్ = ఆరు వేదాంగములును; ఐన్దు తీ = పంచాగ్నులును; ఐన్దు వేళ్వియోడు = పంచ మహాయజ్ఞములతోను; మరువినార్ = కూడియుండెడి వారు నివసించుచుండెడి; వల్లవాழ் = తిరు వల్లవాழ் దివ్యదేశమును; శొల్లుమ్ ఆ = నోరార పలుకుటయందు; వల్లై ఆయ్ మరువు = దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
ఓ! నామనసా!,సూక్ష్మశరీరముతో కూడియుండి జన్మమును పొంది మాంసము ఇమిడికొనియున్న నరములు,చర్మము కలిగిన గుడిసెలో, పంచేద్రియములు ప్రవేశించి వేదించుచు బాధపెట్టుచు నుండగ, అట్టిదానియందు నివాసిగయండుటకు, నీవు భయపడుచున్నయెడల, పరమప్రమాణములయొక్క సంపదలతో నిండిన నాలుగు వేదములు, ఆరు వేదాంగములును, పంచాగ్నులును పంచ మహా యజ్ఞములతోను కూడియుండెడి వారు నివసించుచుండెడి తిరు వల్లవాழ் దివ్యదేశమును నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
నోయెలామ్ పెయ్ దదోరాక్కైయై, మెయ్యెనక్కొణ్డు, వాళా
పేయర్ తామ్ పేశుమప్పేచ్చై, నీ పిழைయెన క్కరుదినాయేల్,
తీయులా వెఙ్గదిర్ త్తిఙ్గళాయ్, మఙ్గుల్ వానాగినిన్ఱ,
మాయనార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1814
నెఞ్జే=ఓ! నామనసా!; నోయ్ ఎలామ్=అన్ని బాధలకు;పెయ్ దదు=స్థానముగ చేసిన; ఓర్ ఆక్కైయై = అట్టి శరీరమును; మెయ్యెన కొణ్డు = నిజముగ స్థిరమని తలచి;పేయర్ తామ్ = అవివేకులు; వాళా = వ్యర్థముగ; పేశుమ్ అప్పేచ్చై = మాటలాడుచుండెడి ఆ మాటలను; పిழை ఎన నీ కరుదినాయేల్ = తప్పులని నీవు తలచగలిగినయెడల; తీ ఉలామ్ వెమ్ కదిర్ = జ్వాలలతో కూడిన తీవ్రమైన కిరణములుగల సూర్యునిగను; తిఙ్గళ్ ఆయ్ = చంద్రునిగను; మఙ్గుల్ వాన్ ఆగి నిన్ఱ=మేఘములు సంచరించుచుండెడి ఆకాశముగను వ్యాపించియున్న; మాయనార్ =ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరునియొక్క; వల్లవాழ் = తిరు వల్లవాழ் దివ్యదేశమును; శొల్లుమ్ ఆ = నోరార పలుకుటయందు; వల్లై ఆయ్ మరువు = దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
ఓ! నామనసా!అన్ని బాధలకు స్థానముగ చేసిన,అట్టి శరీరమును నిజముగ స్థిరమని తలచి అవివేకులు వ్యర్థముగ మాటలాడుచుండెడి ఆ మాటలను తప్పులని నీవు తలచగలిగినయెడల, జ్వాలలతో కూడిన తీవ్రమైన కిరణములుగల సూర్యునిగను, చంద్రునిగను,మేఘములు సంచరించుచుండెడి ఆకాశముగను, వ్యాపించియున్న ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరునియొక్క తిరు వల్లవాழ் దివ్యదేశమును నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
మఞ్జుశేర్ వానెరి, నీర్ నిలమ్ కాల్ ఇవై మయఙ్గినిన్ఱ,
అఞ్జుశేర్ ఆక్కైయై, అరణమన్ఱెన్ఱు, ఉయ్యక్కరుదినాయేల్,
శన్దు శేర్ మెన్ములై, ప్పొన్ మలర్ ప్పావైయున్దాముమ్, నాళుమ్
వన్దుశేర్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1815
నెఞ్జే=ఓ! నామనసా!; మఞ్జుశేర్ వాన్ = మేఘములు ఆవరించుయుండు ఆకాశము; ఎరి=అగ్ని; నీర్=జలము;నిలమ్=భూమి;కాల్=వాయువు మొదలగు;ఇవై = ఈ పంచ భూతములతో; మయఙ్గి నిన్ఱ = కూడియున్నట్టి;అఞ్జు శేర్ ఆక్కైయై=పంచ భౌతికమైన శరీరము; అరణమ్ అన్ఱు ఎన్ఱు = రక్షకము కాదని గ్రహించి; ఉయ్య కరుదినాయేల్ = ఉజ్జీవింపబడుటకు తలచినయెడల; శన్దు శేర్ = చందనము చేరియున్న;మెన్ ములై = మృదువైన వక్షోజములుగల; పొన్ మలర్ పావైయుమ్ తాముమ్ = అందమైన కమలవాసిని శ్రీమహాలక్ష్మియు,సర్వేశ్వరుడును; నాళుమ్ వన్దుశేర్ = ఎల్లప్పుడునుకూడి నిత్యవాసము చేయుచున్న; వల్లవాழ் = తిరు వల్లవాழ் దివ్యదేశమును; శొల్లుమ్ ఆ = నోరార పలుకుట యందు;వల్లై ఆయ్ మరువు=దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
ఓ! నామనసా! మేఘములు ఆవరించుయుండు ఆకాశము,అగ్ని, జలము,భూమి,వాయువు మొదలగు ఈ పంచ భూతములతో కూడియున్నట్టి, పంచ భౌతికమైన శరీరము రక్షకము కాదని గ్రహించి, ఉజ్జీవింపబడుటకు తలచినయెడల, చందనము చేరియున్న మృదువైన వక్షోజములుగల అందమైన కమలవాసిని శ్రీమహాలక్ష్మియు,సర్వేశ్వరుడును ఎల్లప్పుడునుకూడి నిత్యవాసము చేయుచున్నతిరు వల్లవాழ் దివ్యదేశమును నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
వెళ్ళియార్ పిణ్డియార్ పోదియార్, ఎన్ఱు ఇవరోదుగిన్ఱ,
కళ్ళనూల్ తన్నైయుమ్, కరుమమన్ఱెన్ఱు ఉయ్యక్కరుదినాయేల్,
తెళ్ళియార్ కై తొழுమ్ తేవనార్, మామునీర్ అముదుతన్ద,
వళ్ళలార్ వల్లవాழ், శొల్లుమా వల్లైయాయ్ మరువు నెఞ్జే ll 1816
నెఞ్జే=ఓ! నామనసా!;వెళ్ళియార్=శైవులు; పిణ్డియార్ = జైనులు;పోదియార్=బౌద్ధులు; ఎన్ఱు ఇవర్ = అనబడు బాహ్య మతస్థులు; ఓదుగిన్ఱ=తిరుగుతూ చెప్పెడి; కళ్ళ నూల్ తన్నైయుమ్ = అసత్యములైన శాస్త్రములను; కరుమమ్ అన్ఱు ఎన్ఱు = ” ఇవి మనకు ఉపకరింపవని” గ్రహించి; ఉయ్య కరుదినాయేల్ = ఉజ్జీవింపబడుటకు తలచినయెడల; తెళ్ళియార్ = ఙ్ఞానులు; కై తొழுమ్ = సేవించుచుండు; తేవనార్ = స్వామియును; మా మునీర్ = పెద్ద సముద్రమునుండి; అముదు = అమృతమును; తన్ద = తీసి ఒసగిన; వళ్ళలార్ = మిక్కిలి ఉదారస్వభావుడైన సర్వేశ్వరునియొక్క; వల్లవాழ் = తిరు వల్లవాழ் దివ్యదేశమును; శొల్లుమ్ ఆ = నోరార పలుకుటయందు;వల్లై ఆయ్ మరువు=దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
ఓ! నామనసా! శైవులు,జైనులు,బౌద్ధులు,అనబడు బాహ్య మతస్థులు తిరుగుతూ చెప్పెడి అసత్యములైన శాస్త్రములను “ఇవి మనకు ఉపకరింపవని” గ్రహించి ఉజ్జీవింపబడుటకు తలచిన యెడల, ఙ్ఞానులు సేవించుచుండు స్వామియును, పెద్ద సముద్రమునుండి అమృతమును తీసి ఒసగిన మిక్కిలి ఉదారస్వభావుడైన సర్వేశ్వరునియొక్క తిరు వల్లవాழ் దివ్యదేశమును నోరార పలుకుటయందు దృఢమైన నిశ్చయము కలిగియుండుము.
** మఱైవలార్ కుఱైవిలార్ ఉఱైయుమూర్, వల్లవాழ் అడిగళ్ తమ్మై,
శిఱైకులా వణ్డు అఱై శోలై శూழ், కోల నీళ్ ఆలినాడన్,
కఱైయులా వేల్ వల్ల, కలియన్ వాయొలియివై కర్ట్రువల్లార్,
ఇఱైవరాయ్ ఇరునిలమ్ కావల్ పూణ్డు, ఇన్బ నఙ్గు ఎయ్ దువారే ll 1817
మఱై వలార్ = వేదములు స్తుతించువారును; కుఱైవు ఇలార్ = ఎటువంటి కొరత లేనివారును; ఉఱైయుమ్ ఊర్ = నిత్యవాసము చేయుచుండెడి స్థలమగు;వల్లవాழ்= తిరు వల్లవాழ் దివ్యదేశమున వేంచేసియున్న; అడిగళ్ తమ్మై=సర్వేశ్వరుని విషయమై; శిఱై కులా వణ్డు అఱై శోలై శూழ் = కొండాడబడు రెక్కలుగల భ్రమరములు ఝంకారము చేయుచుండెడి తోటలతో చుట్టుకొనియున్న; కోల =అందమైన; నీళ్ = పెద్ద; ఆలినాడన్=తిరువాలి దేశమునకు ప్రభువును; కఱై ఉలామ్ = రక్తపుకరలు తొలగని; వేల్ వల్ల = శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; వాయ్ ఒలి = ముఖపద్మమునుండి వెలువడిన; ఇవై = ఈ పది పాసురములను; కర్ట్రువల్లార్ = పఠించి గ్రహింపగలసమర్ధులు; ఇఱైవరాయ్ = రాజులై;ఇరునిలమ్ = విశాలమైన ఈ భూమండలమును; కావల్ పూణ్డు = పరిపాలన చేసి; నఙ్గు ఇన్బమ్ ఎయ్ దువార్ = పరమానందమును పొందుదురు!.
వేదములు స్తుతించువారును, ఎటువంటి కొరత లేనివారును, నిత్యవాసము చేయుచుండెడి స్థలమగు, తిరు వల్లవాழ் దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై కొండాడబడు రెక్కలుగల భ్రమరములు ఝంకారము చేయుచుండెడి తోటలతో చుట్టుకొనియున్న,అందమైన, పెద్ద తిరువాలి దేశమునకు ప్రభువును, రక్తపుకరలు తొలగని శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల తిరుమంగై ఆళ్వార్ ముఖపద్మమునుండి వెలువడిన ఈ పది పాసురములను పఠించి గ్రహింపగల సమర్ధులు, రాజులై, విశాలమైన ఈ భూమండలమును, పరిపాలన చేసి పరమానందమును పొందుదురు!.
*********