శ్రీః
8 . మున్దుఱ
తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్మని తమయొక్క మనస్సునకు తిరుమంగై ఆళ్వార్ ప్రబోధించుచున్నారు.
** మున్దుఱవురైక్కేన్ విరైక్కుழల్ మడవార్, కలవియైవిడు తడుమాఱల్,
అన్దరమేழு మలై కడలేழுమాయ, ఎమ్మడిగళ్ తమ్ కోయిల్,
శన్దొడు మణియుమ్ అణిమయిల్ తழைయుమ్, తழுవివన్దు అరువిగళ్ నిరన్దు,
వన్దిழி శారల్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1818
మడనెఞ్జే= విధేయమైన మనసా!; మున్దుఱ ఉరైక్కేన్ = నీకు ముఖ్యమైన విషయము చెప్పుచున్నాను; విరై క్కుழల్ మడవార్ కలవియై=పరిమళభరితమైన కుంతలములుగల యువతుల సంశ్లేషమునకు; తడుమాఱల్=కలవరపాటుపడుటను;విడు=విడిచిపెట్టుము; అన్దరమ్ ఏழுమ్ =సప్త ద్వీపములగను; అలై కడల్ ఏழுమ్ ఆయ = అలలుకొట్టుచున్న సప్త సముద్రములగను వ్యాపించియున్న; ఎమ్మడిగళ్ తమ్ కోయిల్=మన స్వామియొక్క నివాసస్థలమైన; అరువిగళ్ = సెలయేర్లు; శన్దొడు=చందనపు చెట్లతో; మణియుమ్ = రత్నములను; అణి మయిల్ తழைయుమ్ = అందమైన నెమళ్ళయొక్క ఈకలను; తழுవివన్దు=సేకరించికొనివచ్చి; నిరన్దు=మిక్కుటముగ; వన్దు ఇழி= ప్రవహించుచున్న; శారల్ = ఏటవాలు ప్రదేశములుగల; మాలిరుఞ్జోలై=తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును; వణఙ్గుదుమ్ వా = సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా!,నీకు ముఖ్యమైన విషయము చెప్పుచున్నాను. (వినుము). పరిమళభరితమైన కుంతలములుగల యువతుల సంశ్లేషమునకు కలవరపాటుపడుటను విడిచిపెట్టుము.సప్త ద్వీపములగను,అలలుకొట్టుచున్న సప్త సముద్రములగను వ్యాపించియున్న మన స్వామియొక్క నివాసస్థలమైన, సెలయేర్లు చందనపు చెట్లతో,రత్నములను,అందమైన నెమళ్ళయొక్కఈకలను సేకరించికొనివచ్చి మిక్కుటముగ ప్రవహించుచున్న ఏటవాలు ప్రదేశములుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
ఇణ్డైయుమ్ పునలుమ్ కొణ్డు ఇడైయిన్ఱి, ఎழுమినో తొழுదుమెన్ఱు, ఇమైయోర్
అణ్డరుమ్ పరవ అరవణై త్తుయిన్ఱ, శుడర్ముడి క్కడవుళ్ తమ్ కోయిల్
విణ్డలర్ తూళి వేయ్ వళర్ పుఱవిల్, విరైమలర్ క్కుఱిఞ్జియిన్నఱున్దేన్,
వణ్డమర్ శారల్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1819
మడనెఞ్జే = విధేయమైన మనసా!; ఇణ్డైయుమ్ = పూలమాలలును; పునలుమ్ = తీర్థములను; కొణ్డు = తీసుకొని; ఇడై ఇన్ఱి = నిరంతరము; తొழுదుమ్ =సేవించెదము; ఎழுమినో ఎన్ఱు = లేచిరండుయని చెప్పుకొనుచు; ఇమైయోర్ అణ్డరుమ్ = నిత్యశూరులును, దేవతలును; పరవ = ఆశ్రయింపగ; అరవు అణై త్తుయిన్ఱ = శేషుని తల్పముపై యోగనిద్రలో పవళించియున్నవాడును; శుడర్ ముడి కడవుళ్ తమ్ = మిక్కిలి తేజస్సుగల కిరీటమును ధరించిన ఆ స్వామియొక్క;కోయిల్ = నివాసస్థలమైన; విణ్డు అలర్ = గాలి వ్యాపించి యున్నదియు; తూళి = పుప్పొడి రేణువులు కలిగిన; వేయ్ = వెదురుచెట్లు; వళర్ = పెరుగుచున్న; పుఱవిల్ = బాహ్యప్రదేశములుగలదియు; విరై = పరిమళభరితమైన; కుఱిఞ్జి మలరిన్ = కుఱిఞ్జి పుష్పములయొక్క;నఱు తేన్ = శ్లాఘ్యమైన తేనెలో; అమర్ = మునిగియుండు; వణ్డు = భ్రమరములు కలిగిన; శారల్ = ఏటవాలు ప్రదేశములుగల; మాలిరుఞ్జోలై=తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును; వణఙ్గుదుమ్ వా = సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా!, పూలమాలలును,తీర్థములను తీసుకొని, నిరంతరము సేవించెదము, లేచిరండని చెప్పుకొనుచు నిత్యశూరులును,దేవతలును ఆశ్రయింపగ, శేషుని తల్పముపై యోగనిద్రలో పవళించి యున్నవాడును, మిక్కిలి తేజస్సుగల కిరీటమును ధరించిన ఆ స్వామియొక్క నివాసస్థలమైన, గాలి వ్యాపించి యున్నదియు, పుప్పొడి రేణువులు కలిగిన వెదురుచెట్లు పెరుగుచున్న బాహ్య ప్రదేశములు గలదియు, పరిమళభరితమైన, కుఱిఞ్జి పుష్పములయొక్క,శ్లాఘ్యమైన తేనెలో మునిగియుండు భ్రమరములు కలిగిన,ఏటవాలు ప్రదేశములుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
పిణి వళర్ ఆక్కై నీఙ్గ నిన్ఱేత్త, పెరునిలమ్ అరుళిల్ మున్నరుళి,
అణివళర్ కుఱళాయ్ అగలిడముழுదుమ్, అళన్ద ఎమ్మడిగళ్ తమ్ కోయిల్,
కణివళర్ వేఙ్గై నెడునిలమదనుళ్, కుఱవర్ తమ్ కవణిడై త్తురన్ద,
మణివళర్ శారల్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1820
మడనెఞ్జే = విధేయమైన మనసా!; పిణి వళర్ = వ్యాదులు పెరుగుచుండెడి; ఆక్కై = శరీరము; నీఙ్గ = తొలగిపోవునట్లు; నిన్ఱు ఏత్త=అమరికతో స్తుతించునట్లు; పెరునిలమ్= విశాలమైన భూమిని; అరుళిల్ = కృపతో; మున్ అరుళి = మొదటనే ఒసగి కరుణించిన వాడును; అణి వళర్ కుఱళ్ ఆయ్ = మిక్కిలి సుందరమైన వామనమూర్తిగ అవతరించి; అగల్ ఇడమ్ ముழுదుమ్ = విశాలమైన ఈ లోకమునంతను; అళన్ద = తన దివ్య పాదముచే కొలిచి స్వీకరించిన;ఎమ్మడిగళ్ తమ్ కోయిల్ = మన స్వామియొక్క నివాసస్థలమైన; కణి వళర్ వేఙ్గై = ‘గణి’ అను జ్యోతిష్కుడు చెప్పునట్లు మూడు కాలములను తెలియునట్లు పెరిగెడి వెదురుచెట్లు కలిగిన; నెడు నిలమ్ అదనుళ్ = విశాలమైన భూమియందు; కుఱవర్ = గిరిజనులు; తమ్ = తమయొక్క; కవణి ఇడై తురన్ద=రాళ్ళను విసిరే ఆయుధమునగల సాగెడుతాడుయందు (కాటాపుల్టు) పెట్టి విసిరెడి; మణి = మణుల యొక్క కాంతి; వళర్ = ఎక్కువగ కనబడుచుండెడి; శారల్ = చుట్టుప్రక్కలుగల; మాలిరుఞ్జోలై=తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును; వణఙ్గుదుమ్ వా= సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా!, వ్యాదులు పెరుగుచుండెడి శరీరము తొలగిపోవునట్లు అమరికతో స్తుతించునట్లు విశాలమైన భూమిని కృపతో మొదటనే ఒసగి కరుణించిన వాడును మిక్కిలి సుందరమైన వామనమూర్తిగ అవతరించి విశాలమైన ఈ లోకమునంతను తన దివ్య పాదముచే కొలిచి స్వీకరించిన మన స్వామియొక్క నివాసస్థలమైన, ‘గణి’ అను జ్యోతిష్కుడు చెప్పునట్లు మూడు కాలములను తెలియునట్లు పెరిగెడి వెదురుచెట్లు కలిగిన,విశాలమైన భూమియందు గిరిజనులు తమయొక్క రాళ్ళను విసిరే ఆయుధమున గల సాగెడు తాడుయందు (కాటాపుల్టు) పెట్టి విసిరెడి మణుల యొక్క కాంతి ఎక్కువగ కనబడుచుండెడి చుట్టుప్రక్కలుగల, తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
శూర్మైయిలాయ పేయ్ ములై శువైత్తు, చ్చుడుశరమ్ అడుశిలై త్తురన్దు,
నీర్మైయిలాద తాడకైమాళ, నినైన్దవర్ మనఙ్గొణ్డ కోయిల్,
కార్మలి వేఙ్గై కోఙ్గలర్ పుఱవిల్, కడిమలర్ క్కుఱిఞ్జి యిన్నఱున్దేన్,
వార్ పునల్ శూழ் తణ్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1821
మడనెఞ్జే = విధేయమైన మనసా!; శూర్మైయిల్ ఆయ = కపటము కలిగిన; పేయ్ = రక్కసి పూతనయొక్క; ములై =(విషము రాసుకొనిన) స్తనములను;శువైత్తు=(ఆమె మరణించునట్లు) ఆస్వాదించినవాడును; శుడు శరమ్ = తీవ్రమైన బాణములను; అడు శిలై తురన్దు = శత్రువులను అంతమొందించు విల్లునుండి ప్రయోగించి; నీర్మై ఇలాద తాడకై మాళ = దయాగుణములేని తాటకి మరణించునట్లు; నినైన్దవర్ = సంకల్పించిన సర్వేశ్వరుడు; మనమ్ కొణ్డ కోయిల్ = తన మనసున కోరుకొనిన నివాసస్థలమైన; కార్ మలి = మేఘమండల పర్యంతము ఉన్నతముగ పెరిగిన;వేఙ్గై = వెదురుచెట్లును;కోఙ్గు=కోంగు చెట్లును; అలర్ పుఱవిల్ = వ్యాపించియున్న బాహ్యప్రదేశములలో; కడి = పరిమళ భరితమైన;కుఱిఞ్జి మలరిన్=కుఱిఞ్జి పుష్పములయొక్క;నఱు తేన్=శ్లాఘ్యమైన తేనెల; వార్ పునల్ శూழ் = ప్రవాహములతో చుట్టుకొనియున్న; తణ్ = చల్లని; మాలిరుఞ్జోలై= తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును;వణఙ్గుదుమ్ వా= సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా! కపటము కలిగిన రక్కసి పూతనయొక్క (విషము రాసుకొనిన) స్తనములను (ఆమె మరణించునట్లు) ఆస్వాదించినవాడును, తీవ్రమైన బాణములను శత్రువులను అంతమొందించు విల్లునుండి ప్రయోగించి, దయాగుణము లేని తాటకి మరణించునట్లు సంకల్పించిన సర్వేశ్వరుడు, తన మనసున కోరుకొనిన నివాసస్థలమైన, మేఘమండల పర్యంతము ఉన్నతముగ పెరిగిన వెదురుచెట్లును, కోంగు చెట్లును,వ్యాపించియున్న బాహ్యప్రదేశములలో, పరిమళభరితమైన కుఱిఞ్జి పుష్పములయొక్క శ్లాఘ్యమైన తేనెల ప్రవాహములతో చుట్టుకొనియున్న చల్లని తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
వణఙ్గల్ ఇల్ అరక్కన్ శెరుక్కళత్తు అవియ, మణిముడి యొరుపదు మ్పురళ,
అణఙ్గెழுన్దు అవన్దన్ కవన్దమ్ నిన్ఱాడ, అమర్ శెయ్ ద అడిగళ్ తమ్ కోయిల్,
పిణఙ్గలిల్ నెడు వేయ్ నుదిముగమ్ కిழிప్ప, ప్పిరశమ్ వన్దిழிతర, పెరున్దేన్
మణఙ్గమழ் శారల్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1822
మడనెఞ్జే = విధేయమైన మనసా!;వణఙ్గల్ ఇల్ అరక్కన్ = ఏఒక్కరిని సేవింపని అసురుడు రావణాసురుడు; శెరు కళత్తు = యుద్ధ భూమియందు; అవియ = అంతమగునట్లు; మణి ముడి ఒరుపదుమ్ పురళ =(అతనియొక్క)మణులతోఒప్పు కిరీటములు పదియును ధరణిపై దొర్లునట్లును; అవన్దన్ కవన్దమ్=అతనియొక్క మొండెము, అణఙ్గు ఎழுన్దు = దెయ్యము ఆవేశించినట్లు; నిన్ఱు ఆడ = నిలిచి ఆడునట్లును; అమర్ శెయ్ ద = యుద్ధము చేసిన; అడిగళ్ తమ్ కోయిల్ = మన స్వామియొక్క నివాసస్థలమైన; పిణఙ్గలిల్ = ఒకటితో మరియొకటి చిక్కుపడి; నెడు వేయ్ నుది=ఉన్నతముగ ఎదిగిన వెదురుచెట్లయొక్క కొనలు; ముగమ్ కిழிప్ప = (కొండశిఖరమున గల తేనె పట్టుల) ఉపరితలమును చీల్చగ; పిరశమ్ వన్దు ఇழிతర = అందలి తేనెటీగలు చెల్లాచెదురుకాగ; పెరుమ్ తేన్ = కారిన అధికమైన తేనెయొక్క; మణమ్ కమழ் = పరిమళము వెదజల్లుబడుచుండెడి; శారల్ = ఏటవాలు ప్రదేశములుగల; మాలిరుఞ్జోలై = తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును; వణఙ్గుదుమ్ వా = సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా! ఏఒక్కరిని సేవింపని అసురుడు రావణాసురుడు, యుద్ధ భూమియందు అంతమగునట్లు (అతనియొక్క) మణులతో ఒప్పు కిరీటములు పదియును ధరణిపై దొర్లునట్లును,అతనియొక్క మొండెము, దెయ్యము ఆవేశించినట్లు నిలిచి ఆడునట్లును, యుద్ధము చేసిన మన స్వామియొక్క నివాసస్థలమైన, ఒకటితో మరియొకటి చిక్కుపడి ఉన్నతముగ ఎదిగిన వెదురుచెట్లయొక్క కొనలు (కొండశిఖరమున గల తేనె పట్టుల) ఉపరితలమును చీల్చగ, అందలి తేనెటీగలు చెల్లాచెదురుకాగ, కారిన అధికమైన తేనెయొక్క పరిమళము వెదజల్లుబడుచుండెడి, ఏటవాలు ప్రదేశములుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
విడఙ్గలన్దు అమర్ న్ద అరవణై త్తుయిన్ఱు, విళఙ్గనిక్కు ఇళఙ్గన్ఱు విశిఱి,
కుడఙ్గలన్దాడి కురవై మున్కోత్త, కూత్త ఎమ్మడిగళ్ తమ్ కోయిల్,
తడఙ్గడల్ ముగన్దు విశుమ్బిడై ప్పిళిఱ, త్తడవరై క్కళిఱెన్ఱు మునిన్దు,
మడఙ్గల్ నిన్ఱు అదిరుమ్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1823
మడనెఞ్జే = విధేయమైన మనసా!; విడమ్ కలన్దు = (విరోధులపై కక్కుటకై) విషముతో కూడి; అమర్ న్ద = అమరియున్న; అరవు అణై = ఆదిశేషుని తల్పముపై; తుయిన్ఱు = పవళించియుండి; మున్ = మునుపొకకాలమున (శేష తల్పము విడిచి గోకులమున అవతరించి కృపతో ఒకసమయమున);విళఙ్గు కనిక్కు= (కపిత్దాసురుడు ఆవేశించిన) వెలగు పండుపై;ఇళమ్ కన్ఱు=(వత్సాసురుడు ఆవేశించిన) లేగదూడను దూడను; విశిఱి=వేసి అసురలిద్దరిని చంపినవాడును; కుడమ్ కలన్దు ఆడి = పలు కుండలు చేర్చి పైకెగిరి వేయుచు ఆడినవాడును;కురవై కోత్త=రాసక్రీడ సలిపినవాడును; కూత్త = ఇటువంటి ఆశ్చర్య చేష్టితములుగల; ఎమ్మడిగళ్ తమ్ కోయిల్ = మన స్వామియొక్క నివాసస్థలమైన; తడమ్ కడల్ = అగాధమైన సముద్రమందు; ముగన్దు = మునిగి నీటిని గ్రహించి పైకెగిసి; విశుమ్బు ఇడై=ఆకాశములో; పిళిఱ=గర్జించగ;మడఙ్గల్=సింహములు; తడవరై కళిఱు ఎన్ఱు= పెద్ద పర్వతమున గల గజమని; మునిన్దు = కోపముతో; నిన్ఱు అదిరుమ్ = లేచి నిలిచి గాండ్రించు చుండెడి;మాలిరుఞ్జోలై = తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును;వణఙ్గుదుమ్ వా = సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా!, (విరోధులపై కక్కుటకై) విషముతో కూడి, అమరియున్న ఆదిశేషుని తల్పముపై పవళించియుండి, మునుపొకకాలమున (శేష తల్పము విడిచి గోకులమున అవతరించి కృపతో ఒకసమయమున), (కపిత్దాసురుడు ఆవేశించిన) వెలగు పండుపై,(వత్సాసురుడు ఆవేశించిన) లేగదూడను దూడను వేసి అసురలిద్దరిని చంపినవాడును, పలు కుండలు చేర్చి పైకెగిరివేయుచు ఆడినవాడును, రాసక్రీడ సలిపినవాడును,ఇటువంటి ఆశ్చర్య చేష్టితములుగల మన స్వామియొక్క నివాసస్థలమైన, అగాధమైన సముద్రమందు మునిగి నీటిని గ్రహించి పైకెగిసి, ఆకాశములో గర్జించగ, సింహములు, పెద్ద పర్వతమునగల గజమని కోపముతో, లేచి నిలిచి గాండ్రించుచుండెడి, తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
తేనుగన్ ఆవిపోయుగ అఙ్గోర్, శెழுన్దిరళ్ పనఙ్గనియుదిర,
తానుగన్దెఱిన్ద తడఙ్గడల్ వణ్ణర్, ఎణ్ణిమున్ ఇడఙ్గొణ్డ కోయిల్,
వానగచ్చోలై మరతగచ్చాయల్, మామణిక్కల్ అదర్ నిఱైన్దు,
మా నుగర్ శారల్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1824
మడనెఞ్జే=విధేయమైన మనసా!; తేనుగన్ =(గాడిద రూపములో నున్న)ధేనుకాసురుని యొక్క; ఆవి = ప్రాణము; పోయ్ ఉగ = తొలగిపోవునట్లు;అఙ్గు=అచట;ఓర్ శెழு తిరళ్ పనఙ్గని ఉదిర=అందముగ గుత్తు గుత్తులగ తాటిపండ్లు రాలునట్లు; తాన్ ఎఱిన్దు ఉగన్ద = తాను ఆ గాడిదను విసిరి ఆనందించిన; తడమ్ కడల్ వణ్ణర్ = పెద్ద సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుడు; మున్ = మునుపే ; ఎణ్ణి = ఎంచుకొని, ఇడమ్ కొణ్డ కోయిల్ = నివాసస్థలముగ స్వీకరించిన దివ్యదేశము; మాన్ = లేండ్లు; మరతగ చాయల్ = మరకతమణులవంటి కాంతి కలిగి;వానగమ్=ఆకాశపర్యంతము ఎదిగియున్న;శోలై=తోటలలోగల; మా మణి కల్ అదర్ = నీల మిట్టలనడుమ మార్గములందు (ప్రవేశించి); నిఱైన్దు=ఎక్కువగ చేరి;నుగర్=తేనెను పానముచేయుచుండెడి; శారల్ = చుట్టుప్రక్కలుగల;మాలిరుఞ్జోలై = ఆ తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును; వణఙ్గుదుమ్ వా = సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా!,గాడిద రూపములో నున్న) ధేనుకాసురుని యొక్క ప్రాణము తొలగిపోవునట్లు,అచట,అందముగ గుత్తు గుత్తులగ తాటిపండ్లు రాలునట్లు తాను ఆ గాడిదను తాటిచెట్టుపై విసిరి ఆనందించిన, పెద్ద సముద్రమువంటి వర్ణముగల సర్వేశ్వరుడు మునుపు ఎంచుకొని నివాసస్థలముగ స్వీకరించిన దివ్యదేశమును; లేండ్లు, మరకతమణులవంటి కాంతి కలిగి, ఆకాశ పర్యంతము ఎదిగియున్న తోటలలోగల నీల మిట్టలనడుమ మార్గములందు (ప్రవేశించి) ఎక్కువగ చేరి తేనెను పానము చేయుచుండెడి చుట్టుప్రక్కలుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
పుదమిగు విశుమ్బిల్ పుణరి శెన్ఱు అణవ, ప్పొరు కడల్ అరవణై త్తుయిన్ఱు,
పదమిగు పరియిన్ మిగు శినమ్ తవిర్త, పనిముగిల్ వణ్ణర్ తమ్ కోయిల్,
కదమిగు శినత్త కడతడ క్కళిర్ట్రిన్, కవుళ్వழி క్కళివణ్డు పరుగ,
మదమిగు శారల్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1825
మడనెఞ్జే=విధేయమైన మనసా!; పుణరి = (పాలసముద్రమున)అలలు;పుదమ్ మిగు విశుమ్బిల్ శెన్ఱు అణవ పొరు = మేఘములతో నిండిన ఆకాశములో పోయి ఏకమై గర్జించుచుచుండెడి; కడల్ అరవు అణై తుయిన్ఱు = పాలసముద్రమున శేష తల్పముపై యోగనిద్రలో పవళించియున్నవాడు( అది విడిచి గోకులమున కృపతో అవతరించి) పదమ్ మిగు పరియిన్=మిక్కిలి అహంకారముగల(కేశియను) అశ్వరూపములో నున్నఅసురినియొక్క; మిగు శినమ్ తవిర్త=తీవ్రమైన కోపమును నశింపజేసిన వాడును; పని ముగిల్ వణ్ణర్ తమ్ కోయిల్ = చల్లని మేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరుని నివాసస్థలమైన; కదమ్ మిగు శినత్త =మిక్కిలి కోపము,ద్వేషము కలిగిన; కడమ్ = మదించిన; తడ = పెద్ద; కళిర్ట్రిన్=ఏనుగుయొక్క;కవుళ్ వழி= కపోలముల వెంబడి కారుచున్న; కళి = మదజలమును; వణ్డు పరుగ = భ్రమరములు పానముచేసినను; మద మిగు శారల్ = మదజలములు మిక్కిలి కారి ప్రవహించుచున్న చుట్టుప్రక్కలుగల; మాలిరుఞ్జోలై= తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును;వణఙ్గుదుమ్ వా= సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా! (పాలసముద్రమున) అలలు,మేఘములతో నిండిన ఆకాశములో పోయి ఏకమై గర్జించుచుచుండెడి, అట్టి పాలసముద్రమున శేష తల్పముపై యోగనిద్రలో పవళించియున్నవాడు (అది విడిచి గోకులమున కృపతో అవతరించి) మిక్కిలి అహంకారముగల(కేశియను)అశ్వరూపములో నున్న అసురినియొక్క తీవ్రమైన కోపమును నశింపజేసిన వాడును,చల్లని మేఘమువంటి వర్ణముగల సర్వేశ్వరుని నివాసస్థలమైన, మిక్కిలి కోపము,ద్వేషము కలిగిన, మదించిన పెద్ద ఏనుగుయొక్క కపోలముల వెంబడి కారుచున్న మదజలమును భ్రమరములు పానముచేసినను మదజలములు, మిక్కిలి కారి ప్రవహించుచున్న చుట్టుప్రక్కలుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
పున్దియిల్ శమణర్ పుత్తర్ ఎన్ఱివర్ గళ్, ఒత్తన పేశవుమ్ ఉకన్దిట్టు,
ఎన్దై పెమ్మానార్ ఇమైయవర్ తలైవర్, ఎణ్ణిమున్ ఇడఙ్గొణ్డ కోయిల్,
శన్దన ప్పొழிలిన్ తాழ்శినైనీழల్, తాழ்వరై మగళిర్ గళ్ నాళుమ్,
మన్దిరత్తు ఇఱైఞ్జుమ్ మాలిరుఞ్జోలై, వణఙ్గుదుమ్ వా మడనెఞ్జే ll 1826
మడనెఞ్జే=విధేయమైన మనసా!;పున్ది ఇల్=ఙ్ఞానము లేని;శమణర్ పుత్తర్ ఎన్ఱివర్ గళ్= జైనులు,బౌద్ధులు అనబడువీరు; ఒత్తన = తమయొక్క దుర్బుద్ధికి తగినట్లు; పేశవుమ్ = మాటలాడినను; (వాటికి లోబడక); ఉకన్దిట్టు=మిక్కిలి సంతోషముతో; ఎన్దై పెమ్మానార్= నాయొక్క తండ్రి,తాతలు మొదలగువారికి నాధుడును; ఇమైయవర్ తలైవర్ = నిత్యశూరులయొక్క ప్రభువైన సర్వేశ్వరుడు;మున్=మునుపే;ఎణ్ణి = ఎంచుకొని, ఇడమ్ కొణ్డ కోయిల్ = నివాసస్థలముగ స్వీకరించిన దివ్యదేశము; వరై మగళిర్ గళ్ = కొండ ప్రాంతమందలి యవతులు; శన్దన పొழிలిన్ = చందనపు తోటలలో; తాழ் శినై నీழల్ = వేలాడుచున్న కొమ్మల నీడలక్రింద; తాழ் = చేరి;నాళుమ్=ప్రతిదినము; మన్దిరత్తు=దివ్య మంత్రములతో; ఇఱైఞ్జుమ్ = స్తుతించుచుండెడి; మాలిరుఞ్జోలై = ఆ తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును;వణఙ్గుదుమ్ వా= సేవించుకొందము రమ్ము!
విధేయమైన మనసా!, ఙ్ఞానము లేని జైనులు,బౌద్ధులు అనబడువీరు, తమయొక్క దుర్బుద్ధికి తగినట్లు,మాటలాడినను; (వాటికి లోబడక), మిక్కిలి సంతోషముతో,నాయొక్క తండ్రి,తాతలు మొదలగు వారికి నాధుడును, నిత్యశూరుల యొక్క ప్రభువైన సర్వేశ్వరుడు మునుపే ఎంచుకొని నివాసస్థలముగ స్వీకరించిన దివ్యదేశము, కొండప్రాంతమందలి యవతులు చందనపు తోటలలో,వేలాడుచున్న కొమ్మల నీడలక్రింద చేరి, ప్రతిదినము,దివ్య మంత్రములతో స్తుతించుచుండెడి, ఆ తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును సేవించుకొందము రమ్ము!
** వణ్డమర్ శారల్ మాలిరుఞ్జోలై, మామణివణ్ణరై వణఙ్గుమ్,
తొణ్డరై ప్పరవుమ్ శుడరొళి నెడువేల్, శూழ் వయలాలినన్నాడన్,
కణ్డల్ నల్వేలి మఙ్గైయర్ తలైవన్, కలియన్ వాయొలి శెయ్ ద పనువల్,
కొణ్డివై పాడుమ్ తవముడైయార్ గళ్, ఆళ్వర్ ఇక్కురై కడలులగే ll 1827
వణ్డు అమర్ = భ్రమరములు వ్యాపించియున్న; శారల్ మాలిరుఞ్జోలై = ఏటవాలు ప్రదేశములుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున వేంచేసియున్న; మా మణివణ్ణరై = శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముగల అழగర్ పెరుమాళ్ ను; వణఙ్గుమ్ తొణ్డరై = సేవించెడి భాగవతులను;పరవుమ్= స్తుతించువారును; శుడర్ ఒళి నెడువేల్ =మిక్కిలి ప్రకాశించుచున్న పెద్ద శూలాయుధము కలవారును; శూழ் వయల్ ఆలి నల్ నాడన్ = చుట్టుకొనియున్న తోటలుగల మంచి తిరువాలి దేశమునకు ప్రభువును; కణ్డల్ నల్ వేలి మఙ్గైయర్ తలైవన్ = మొగలి పొదలతో అందమైన కంచెలుగల తిరుమంగై దేశవాసులకు నాయకుడును; కలియన్=తిరుమంగై ఆళ్వార్; వాయ్ ఒలి శెయ్ ద = ముఖపద్మము నుండి అనుగ్రహించిన; పనువల్ ఇవై కొణ్డు = ఈ పదిపాసురములను గ్రహించి; పాడుమ్ తవముడైయార్ గళ్ = పాడగల భాగ్యముకలవారు; కురై కడల్ ఇవ్వులగు =ఘోషించు చున్న సముద్రముచే చుట్టుకొనియున్న ఈ లోకమును; ఆళ్వర్=పాలించుదురు!
భ్రమరములు వ్యాపించియున్న, ఏటవాలు ప్రదేశములుగల తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున వేంచేసియున్న శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముగల అழగర్ పెరుమాళ్ ను సేవించెడి భాగవతులను స్తుతించువారును, మిక్కిలి ప్రకాశించుచున్న పెద్ద శూలాయుధము కలవారును, చుట్టుకొనియున్న తోటలుగల మంచి తిరువాలి దేశమునకు ప్రభువును, మొగలి పొదలతో అందమైన కంచెలుగల తిరుమంగై దేశవాసులకు నాయకుడును,తిరుమంగై ఆళ్వార్, ముఖపద్మము నుండి అనుగ్రహించిన ఈ పదిపాసురములను గ్రహించి, పాడగల భాగ్యముకలవారు, ఘోషించుచున్న సముద్రముచే చుట్టుకొనియున్న ఈ లోకమును పాలించుదురు!.
***********