శ్రీః
9 . మూవరిల్
తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున వేంచేసియున్న అழగర్ పెరుమాళ్ ను దర్శించిన తిరుమంగై ఆళ్వార్ ఆ స్వామి సౌందర్యమున లీనమై పరకాలనాయకి అవస్థ పొందియండగ,ఆమెయొక్క స్థితిని చూచిన తల్లి మనోభావములను తిరుమంగై ఆళ్వార్ చెప్పుచున్నారు.
** మూవరిల్ మున్ముదల్వన్, ముழఙ్గార్ కడలుళ్ కిడన్దు,
పూవలర్ ఉన్దితన్నుళ్, పువనమ్బడైత్తు ఉణ్డు ఉమిழ் న్ద,
తేవర్ గళ్ నాయగనై, తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
కోవలర్ కోవిన్దనై, కొడియేర్ ఇడై కూడుఙ్గొలో ll 1828
మూవరిల్ = త్రిమూర్తులలో; మున్ ముదలన్ = ముఖ్యమైనవాడును; ముழఙ్గు ఆర్= ఘోషచే ఒప్పు; కడలుళ్ = పాలసముద్రమున; కిడన్దు = పవళించి; ఉన్ది అలర్ = నాభియందు వికసించిన; పూ తన్నుళ్ = తామర పుష్పములో; పువనమ్ = లోకములను; పడైత్తు= సృష్ఠించి; ఉణ్డు=(ప్రళయకాలమున)ఆరగించి; ఉమిழ் న్ద=పిదప(సృష్టికాలమున) వెలిబుచ్చినవాడును; తేవర్ గళ్ నాయగనై = నిత్యశూరులకు నాధుడును; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ = తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న; కోవలర్ కోవిన్దనై = గోపాలకృష్ణుడైన ఆ సర్వేశ్వరుని; కొడి ఏర్ ఇడై = తీగవంటి సున్నితమైన నడుముగల నాయొక్క కుమార్తె; కూడుమ్ కొలో = చేరగలుగునా?
త్రిమూర్తులలో ముఖ్యమైనవాడును, ఘోషచే ఒప్పు పాల సముద్రమున పవళించి, నాభియందు వికసించిన తామర పుష్పములో,లోకములను సృష్ఠించి (ప్రళయకాలమున)ఆరగించి, పిదప(సృష్టికాలమున) వెలిబుచ్చినవాడును, నిత్యశూరులకు నాధుడును, తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న, గోపాలకృష్ణుడైన ఆ సర్వేశ్వరుని,తీగవంటి సున్నితమైన నడుముగల నాయొక్క కుమార్తె చేరగలుగునా?
** పునైవళర్ పూమ్బొழிలార్, పొన్ని శూழ் అరఙ్గనగరుళ్
మునైవనై, మూవులగుమ్బడైత్త, ముదల్ మూర్తితన్నై,
శినైవళర్ పూమ్బొழிల్ శూழ், తిరుమాలిరుఞ్జోలై నిన్ఱాన్,
కనై కழల్ కాణుఙ్గొలో, కయల్ కణ్ణియెమ్ కారిగైయే ll 1829
పునై వళర్ = పున్నై చెట్లు మిక్కిలి పెరిగియున్న; పూ పొழிల్ ఆర్ = పూల తోటలతో నిండియున్నదియు; పొన్ని శూழ் = కావేరినదిచే చుట్టుకొనియున్న; అరఙ్గనగరుళ్= శ్రీ రంగం దివ్యదేశమున పవళించియున్న; మునైవనై = ప్రధానమైనవాడును; మూవులగుమ్ పడైత్త = ముల్లోకములు సృష్టించిన;ముదల్ మూర్తి తన్నై = ఆదికారణభూతుడైన స్వామియును; శినైవళర్ పూ పొழிల్ శూழ்=మిక్కుటముగ కొమ్మలు పెరిగియున్న పూల తోటలతో చుట్టుకొనియున్న; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱాన్=తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న ఆ సర్వేశ్వరుని యొక్క; కనై కழల్ = వీరకంకణములు ధ్వనించెడి దివ్యపాదములను; కయల్ కణ్ణి = కయల్ మత్స్యములవంటి నేత్రములుగల; ఎమ్ కారిగై = నాయొక్క అందమైన కుమార్తె; కాణుమ్ కొలో = సేవింపగలుగునా?
పున్నై చెట్లు మిక్కిలి పెరిగియున్న,పూల తోటలతో నిండియున్నదియు, కావేరి నదిచే చుట్టుకొనియున్న, శ్రీ రంగం దివ్యదేశమున పవళించియున్న , ప్రధానమైన వాడును, ముల్లోకములు సృష్టించిన,ఆదికారణభూతుడైన స్వామియును,మిక్కుటముగ కొమ్మలు పెరిగియున్న పూల తోటలతో చుట్టుకొనియున్న తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న ఆ సర్వేశ్వరునియొక్క ధ్వనించెడి వీర కంకణములు గల దివ్యమైన పాదములను,కయల్ మత్స్యములవంటి నేత్రములు గల, నాయొక్క అందమైన కుమార్తె, సేవింపగలుగునా?
ఉణ్డు ఉలగేழிనైయుమ్, ఒరు పాలగన్ ఆలిలైమేల్,
కణ్డుయిల్ కొణ్డు ఉగన్ద, కరుమాణిక్క మామలైయై,
తిణ్డిరల్ మాకరిశేర్, తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
అణ్డర్ తమ్ కోవినై యిన్ఱు, అణుగుఙ్గొల్ ఎన్ ఆయ్ ఇழைయేll 1830
ఉలగు ఏழிనైయుమ్ = సప్తలోకములను;ఉణ్డు=( ప్రళయకాలమున )తన ఉదరమున ఉంచుకుని; ఒరు పాలగన్ = ఒక బాలునిగ; ఆల్ ఇలైమేల్ = చిన్న వటదళముపై; కణ్ తుయిల్ కొణ్డు = కనులు మూసుకొని యోగనిద్రలో పవళించి; ఉగన్ద = ఆనందించిన; కరు మాణిక్కమ్ మా మలైయై = పెద్ద నీలమణి పర్వతమువంటి స్వరూపము కలిగిన సర్వేశ్వరుడును; తిణ్ తిఱల్ మా కరిశేర్ = మిక్కిలి శక్తివంతమైన మదగజములు చేరియున్న; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ = తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న;అణ్డర్ తమ్ కోవినై = ఆ దేవాదిదేవుని; ఎన్ ఆయ్ ఇழை = శుద్దమైన ఆభరణములచే అలంకృతమైన నాయొక్క కుమార్తె;ఇన్ఱు అణుగుమ్ కొల్=ఇపుడు సమీపించగలుగనా?
సప్తలోకములను( ప్రళయకాలమున )తన ఉదరమున ఉంచుకుని, ఒక బాలునిగ, చిన్న వటదళముపై కనులు మూసుకొని యోగనిద్రలో పవళించి ఆనందించిన పెద్ద నీలమణి పర్వతమువంటి స్వరూపము కలిగిన సర్వేశ్వరుడును, మిక్కిలి శక్తివంతమైన మదగజములు చేరియున్న తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న ఆ దేవాదిదేవుని, శుద్దమైన ఆభరణములచే అలంకృతమైన నాయొక్క కుమార్తె ,ఇపుడు సమీపించగలుగనా?
శిఙ్గమదాయ్ అవుణన్, తిఱలాగమ్ మున్ కీణ్డు ఉగన్ద,
పఙ్గయ మామలర్ క్కణ్, పరనై యెమ్పరఞ్జుడరై,
తిఙ్గళ్ నన్మాముగిల్ శేర్, తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
నఙ్గళ్ పిరానై యిన్ఱు, నణుగుఙ్గొల్ ఎన్ నన్నుదలే ll 1831
మున్=మునుపొకకాలమున;శిఙ్గమ్ అదు ఆయ్ = అద్వితీయమైన నరసింహమూర్తిగ అవతరించి; అవుణన్=అసురుడు హిరణ్యాసురుని యొక్క;తిఱల్ ఆగమ్= బలిష్టమైన వక్షస్థలమును; కీణ్డు = చీల్చి; ఉగన్ద = ఆనందించిన;మా=పెద్ద;పఙ్గయ మలర్ = తామర పుష్పమువంటి; కణ్ = నేత్రములుగల; పరనై = పరమపురుషుడైన; ఎమ్ = మనయొక్క నాధుడును; పరమ్ శుడరై = పరంజ్యోతి స్వరూపుడును; తిఙ్గళ్ = చంద్రమండలమును; మా ముగిల్=పెద్ద మేఘమండలమును;శేర్=తాకుచున్న శిఖరముగల; నల్=విలక్షణమైన; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ=తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న;నఙ్గళ్ పిరానై=మన స్వామిని; ఎన్ నల్ నుదల్ = అందమైన ముఖమండలముగల నాయొక్క కుమార్తె; ఇన్ఱు నణుగుమ్ కొల్ = ఇపుడు పోయి చేరియుండునో?.
మునుపొకకాలమున అద్వితీయమైన నరసింహమూర్తిగ అవతరించి అసురుడు హిరణ్యాసురుని యొక్క బలిష్టమైన వక్షస్థలమును చీల్చి ఆనందించిన,పెద్ద తామర పుష్పమువంటి నేత్రములుగల పరమపురుషుడైన మనయొక్క నాధుడును, పరంజ్యోతి స్వరూపుడును, చంద్రమండలమును;పెద్ద మేఘమండలమును తాకుచున్న శిఖరముగల విలక్షణమైన తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న మనయొక్క స్వామిని, అందమైన ముఖమండలము గల నాయొక్క కుమార్తె ఇపుడు పోయి చేరియుండునో?
తానవన్ వేళ్వితన్నిల్, తనియే కుఱళాయ్ నిమిర్ న్దు,
వానముమ్ మణ్ణగముమ్, అళన్ద తిరివిక్కరమన్,
తేనమర్ పూమ్బొழிల్ శూழ், తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
వానవర్ కోనైయిన్ఱు, వణఙ్గితొழ వల్లళ్ కొలో ll 1832
తానవన్ = అసురుడైన మహబలియొక్క; వేళ్వి తన్నిల్ = యాగమునందు;తనియే= అద్వితీయుడైన; కుఱళ్ ఆయ్ = వామనమూర్తియై వెడలి; నిమిర్ న్దు =(దానజలమును స్వీకరించిన వెంటనే) ఆకాశమువఱకు పెరిగి; వానముమ్ = ఊర్ధ్వలోకములను; మణ్ అగముమ్ = క్రింది లోకములను; అళన్ద = కొలిచి స్వీకరించిన; తిరివిక్కరమన్ = త్రివిక్రమమూర్తియును;తేన్ అమర్ పూ పొழிల్ శూழ்=తేనెలతో నిండిన పూల తోటలతో చుట్టుకొనియున్న; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ = తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న; వానవర్ కోనై = దేవాదిదేవుని; (నాయొక్క కుమార్తె) ఇన్ఱు = ఇపుడు వణఙ్గితొழ వల్లళ్ కొలో = సేవింపగలగినదో?
అసురుడైన మహబలియొక్క యాగమునందు అద్వితీయుడైన వామనమూర్తియై వెడలి,(దానజలమును స్వీకరించిన వెంటనే) ఆకాశమువఱకు పెరిగి, ఊర్ధ్వలోకములను, క్రింది లోకములను కొలిచి స్వీకరించిన, త్రివిక్రమమూర్తియును, తేనెలతోనిండిన పూల తోటలతో చుట్టుకొనియున్న తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న ఆ దేవాదిదేవునిని నాయొక్క కుమార్తె ఇపుడు సేవింపగలగినదో?
** నేశమిలాదవర్కుమ్, నినైయాదవర్కుమరియాన్,
వాశమలర్ ప్పొழிల్ శూழ், వడమామదురై పిఱన్దాన్,
తేశమెల్లామ్ వణఙ్గుమ్, తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
కేశవనమ్బితన్నై, క్కెణ్డైయొణ్ కణ్ణి కాణుఙ్గొలో ll 1833
నేశమ్ ఇలాదవర్కుమ్ = భగవద్భక్తిలేనివారికిని;నినైయాదవర్కుమ్ = (ఈశ్వరుడు లేడనెడి నాస్తికులు మొదలగు) తమయొక్క మనసున తలచనివారికిని; అరియాన్ = తెలియబడని వాడును; వాశమ్ మలర్ ప్పొழிల్ శూழ் = పరిమళభరితమైన పూల తోటలతో చుట్టుకొనియున్న; వడ మామదురై = ఖ్యాతిగలఉత్తరమధురలో;పిఱన్దాన్= అవతరించిన వాడును; తేశమెల్లామ్ వణఙ్గుమ్ = సమస్త దేశవాసులచే సేవింపబడు; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ = తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న; కేశవన్ నమ్బి తన్నై =శ్లాఘ్యమైన కేశములుగల ఆసర్వేశ్వరుని;కెణ్డై ఒణ్ కణ్ణి = కెణ్డై మత్స్యములవంటి ప్రకాశించు నేత్రములు గల నాయొక్క కుమార్తె; కాణుమ్ కొలో = సేవింపగలుగునా?
భగవద్భక్తిలేనివారికిని, (ఈశ్వరుడు లేడనెడి నాస్తికులు మొదలగు వారు) తమయొక్క మనసున తలచనివారికిని, తెలియబడనివాడును, పరిమళభరితమైన పూల తోటలతో చుట్టుకొనియున్న ఖ్యాతిగల ఉత్తరమధురలో అవతరించిన వాడును, సమస్త దేశవాసులచే సేవింపబడు, తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న, శ్లాఘ్యమైన కేశములుగల ఆసర్వేశ్వరుని కెణ్డై మత్స్యములవంటి ప్రకాశించు నేత్రములు గల నాయొక్క కుమార్తె సేవింపగలుగునా?
పుళ్ళినై వాయ్ పిళన్దు, పొరు మాకరి కొమ్బొశిత్తు,
కళ్ళ చ్చకడుదైత్త, కరుమాణిక్క మా మలైయై,
తెళ్ అరువి కొழுక్కుమ్, తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
వళ్ళలై వాణుదలాళ్, వణఙ్గి త్తొழవల్లళ్ కొలో ll 1834
పుళ్ళినై వాయ్ పిళన్దు = బకాసురునియొక్క నోటిని చీల్చి సంహరించినవాడును; పొరు మా కరి కొమ్బు ఒశిత్తు =పోరు సలుపుటకై ఉపక్రమించిన ( కువలయాపీడమను ) మద గజముయొక్క దంతమును పెరికి వధించినవాడును;కళ్ళమ్ శకడు ఉదైత్త = దొంగ శకట రూపములోనున్న అసురిని తన పాదముచే తన్ని చంపినవాడును; కరు మాణిక్కమ్ మా మలైయై = పెద్ద నీలమణి పర్వతమువంటి స్వరూపము కలిగిన సర్వేశ్వరుడును; తెళ్ అరువి కొழுక్కుమ్ = స్వచ్ఛమైన సేలయేర్లు ప్రవహించుచున్న; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ=తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న;వళ్ళలై=ఉదారస్వభావుడైన స్వామిని; వాళ్ నుదలాళ్ = కాంతివంతమైన ముఖమండలముగల నాయొక్క కుమార్తె; వణఙ్గి తొழవల్లళ్ కొలో = సేవింపగలుగునా?
బకాసురునియొక్క నోటిని చీల్చి సంహరించినవాడును,పోరు సలుపుటకై ఉపక్రమించిన (కువలయాపీడమను) మద గజముయొక్క దంతమును పెరికి వధించినవాడును, దొంగ శకట రూపములోనున్న అసురిని తన పాదముచే తన్ని చంపినవాడును,పెద్ద నీలమణి పర్వతమువంటి స్వరూపము కలిగిన సర్వేశ్వరుడును, స్వచ్ఛమైన సేలయేర్లు ప్రవహించుచున్న తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న ఉదారస్వభావుడైన స్వామిని కాంతివంతమైన ముఖమండలముగల నాయొక్క కుమార్తె సేవింపగలుగునా?
** పార్తనుక్కన్ఱరుళి, ప్పారతత్తొరు తేర్ మున్నిన్ఱు,
కాత్తవన్దన్నై, విణ్ణోర్ కరుమాణిక్క మామలైయై,
తీర్తనై పూమ్బొழிల్ శూழ், తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
మూర్తియై క్కైతొழுవుమ్, ముడియుఙ్గొల్ ఎన్మొయ్ కుழఱ్కె ll 1835
అన్ఱు = మునుపొకకాలమున; పార్తనుక్కు= పార్థునిపై; అరుళి = కృపజేసి;పారతత్తు= మహాభారత యుద్దమున; ఒరు తేర్ మున్ నిన్ఱు = సాటిలేని రథముపై సారధిగ ముంగిట నిలిచి; కాత్తవన్ తన్నై = రక్షించినవాడును; విణ్ణోర్ = నిత్యశూరులు సేవించునట్లు; కరు మాణిక్కమ్ మా మలైయై = పెద్ద నీలమణి పర్వతమువంటి స్వరూపము కలిగిన సర్వేశ్వరుడును; తీర్తనై=పరమ పవిత్రుడును; పూ పొழிల్ శూழ் = పూల తోటలతో చుట్టుకొనియున్న; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ = తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న; మూర్తియై = స్వామిని; కైతొழுవుమ్ ఎన్ మొయ్ కుழఱ్కు ముడియుమ్ కొల్ = సేవించుటకు దట్టమైన కుంతలములు గల నాయొక్క కుమార్తెకు సాధ్యమగునా?
మునుపొకకాలమున పార్థునిపై కృపజేసి మహాభారతయుద్దమున సాటిలేని రథముపై సారధిగ ముంగిట నిలిచి రక్షించినవాడును, నిత్యశూరులు సేవించునట్లు పెద్ద నీలమణి పర్వతమువంటి స్వరూపము కలిగిన సర్వేశ్వరుడును, పరమ పవిత్రుడును,పూల తోటలతో చుట్టుకొనియున్న తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న స్వామిని సేవించుటకు దట్టమైన కుంతలములు గల నాయొక్క కుమార్తెకు సాధ్యమగునా?
** వలమ్బురి యాழிయనై, వరైయార్ తిఱల్ తోళన్దన్నై,
పులమ్ పురినూలవనై, ప్పొழிల్ వేఙ్గడ వేదియనై,
శిలమ్బియల్ ఆఱుడైయ, తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
నలమ్ తిగழ் నారణనై, నణుగుఙ్గొల్ ఎన్ నన్నుదలే ll 1836
వలమ్బురి ఆழிయనై = శంఖమును,చక్రమును కలిగినవాడును; వరై ఆర్ తిఱల్ తోళన్ తన్నై = పర్వతమువలె మిక్కిలి దృఢమైన భుజములుగలవాడును; పులమ్ పురి నూలవనై = మనోహరమైన యఙ్ఞోపవీతము కలవాడును,పొழிల్ వేఙ్గడమ్ = తోటలతో చుట్టుకొనియున్న తిరు వేంకటాచలమున వేంచేసియున్నవాడును; వేదియనై = వేద ప్రతిపాద్యుడును;శిలమ్బు ఇయల్ ఆఱు ఉడైయ= “శిలమ్బ” అని చెప్పబడు నూపురగంగ గల; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ = తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న; నలమ్ తిగழ் నారణనై = కల్యాణగుణములతో ప్రకాశించు శ్రీమన్నారాయణుని; ఎన్ నల్ నుదల్ = అందమైన ముఖమండలముగల నాయొక్క కుమార్తె; నణుగుమ్ కొల్=పోయి చేరియుండునా?.
శంఖమును,చక్రమును కలిగినవాడును, పర్వతమువలె మిక్కిలి దృఢమైన భుజములు గలవాడును, మనోహరమైన యఙ్ఞోపవీతము కలవాడును, తోటలతో చుట్టుకొనియున్న తిరు వేంకటాచలమున వేంచేసియున్నవాడును, వేద ప్రతిపాద్యుడును,”శిలమ్బు”అని చెప్పబడు నూపురగంగ గల,తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిలిచియున్న కల్యాణగుణములతో ప్రకాశించు శ్రీమన్నారాయణుని, అందమైన ముఖమండలముగల నాయొక్క కుమార్తె పోయి చేరియుండునా?.
** తేడఱ్కు అరియవనై, తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ,
ఆడల్ పఱవైయనై, అణి ఆయ్ ఇழைకాణుమెన్ఱు,
మాడ క్కొడి మదిళ్ శూழ், మఙ్గైయార్ కలికన్ఱి శొన్న,
పాడల్ పనువల్ పత్తుమ్, పయిల్వార్కిల్లై పావఙ్గళే ll 1837
తేడఱ్కు అరియవనై = ఏఒక్కరికిని స్వయంకృషిచే శోధించి తెలుసుకొనుటకు శక్యము కానివాడును; తిరుమాలిరుఞ్జోలై నిన్ఱ=తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు వేంచేసి యున్నవాడును;ఆడల్ పఱవై యనై =మహావీరుడు,జయశీలుడైన గరుడాళ్వార్ ను వాహనముగ గల సుందరబాహు పెరుమాళ్ ను; అణి ఆయ్ ఇழை కాణుమ్ ఎన్ఱు = అందమైన ఆభరణములు కలిగిన నాయొక్క కుమార్తె దర్శించు భాగ్యము పొందునని; మాడమ్ కొడి మదిళ్ శూழ் మఙ్గైయార్ కలికన్ఱి శొన్న = ధ్వజములు కలగిన భవనములును, చుట్టుకొనియున్న ప్రాకారములుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన;పాడల్ = పాటరూపములోనున్న;పనువల్ పత్తుమ్= ఈ పదిపాసురములను; పయిల్ వార్కు = అభ్యసించి పాడువారికి; పావఙ్గళ్ ఇల్లై = పాపములుండవు!
ఏఒక్కరికిని స్వయంకృషిచే శోధించి తెలుసుకొనుటకు శక్యముకాని వాడును, తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు వేంచేసి యున్నవాడును,మహావీరుడు , జయశీలుడైన గరుడాళ్వార్ ను వాహనముగ గల సుందరబాహు పెరుమాళ్ ను, అందమైన ఆభరణములు కలిగిన నాయొక్క కుమార్తె దర్శించు భాగ్యము పొందునని ధ్వజములు కలగిన భవనములును, చుట్టుకొనియున్న ప్రాకారములుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన పాటరూపములోనున్నఈ పదిపాసురములను అభ్యసించి పాడువారికి పాపములుండవు!
******