తిరునెడున్దాడకమ్ 

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

అవతారిక :-

         శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపచే తిరుమంత్రముపదేశము పొందిన తిరుమంగై ఆళ్వార్ మిక్కిలి భక్తిపారవశ్యముతో  86 దివ్యదేశములను దర్శించి 1084 పాశురములతో మంగళాశాసనము చేసిరి. అదియే మొదటి ప్రబంధమైన పెరియతిరుమొழி. సంసారబంధ  విముక్తికై శ్రీ మన్నారాయణుని వేడుకొనుచు , సర్వేశ్వరుని రక్షకత్వమును, భక్తవాత్సల్యము మొదలగు కళ్యాణగుణములను రెండవ ప్రబంధమైన తిరుక్కుఱున్దాడకమ్  ద్వారా  ప్రస్తుతించిరి. తిరుమంగై ఆళ్వార్  పరమభక్తి  ప్రాప్తికై తిరుక్కుడందై దివ్యదేశములో కృపతో వేంచేసిన ఆరావముదు పెరుమాళ్ దివ్యచరణారవిందములందు తిరువెழுకూర్ట్రిరుక్కై యను మూడవప్రబంధము ద్వారా శరణాగతి చేసిరి.  తనను ఉపేక్షించుచున్న  నీలమేఘశ్యాముడైన శ్రీమన్నారాయణుని దివ్య కల్యాణగుణములందు నిరంతరము  పరవశించి ధ్యానించుచున్న తిరుమంగై ఆళ్వార్ అనన్యశేషత్వము , అనన్యశరణత్వము , అనన్యభోగత్వము గుణములచే పూర్ణత్వము కలిగిన కారణముచే  పరకాలనాయకి అను యువతి అవస్ధను పొంది, విరహమందు మిక్కిలి తపించుచు, సర్వేశ్వరుని త్వరితముగ పొందవలెనని మిక్కిలి ఆశతో   ” మడల్ ” అను ప్రక్రియ ఉపక్రమింపతలచి ఆభావనలో వెలువరించిన 115 చరణములు కలిగిన నాల్గవ ప్రబంధము  ” శిరియతిరుమడల్ “.  పరకాలనాయకి  తాను సర్వేశ్వరునినుండి   అభిలషించిన ఫలము కలుగనందున అతిశయించిన విరహమందు తపించుచు మిక్కిలి  దృఢనిశ్చయముతో ” మడల్ ప్రక్రియ ” చేయుతలంపుతో వెలువరించిన 290 చరణములతో కలిగిన ఐదవ ప్రబంధము “పెరియతిరుమడల్ “. అట్లు పరమభక్తిలో మునిగి, పరకాలనాయకి  అవస్థలో అధికమైన వ్యామోహముతో ఒక క్షణమైనను సర్వేశ్వరుని ఎడబాటు సహించలేక తిరుమంగై ఆళ్వార్ తన మనోభావములను శిరియతిరుమడల్, పెరియతిరుమడల్ అను ప్రభంధములద్వారా వెలిబుచ్చిరి. అట్టి తిరుమంగై ఆళ్వారుల స్థితిని గాంచిన సర్వేశ్వరుడు  భక్తులకై తాను నిత్యవాసము చేయుచున్న దివ్యదేశముల ప్రతిభ అంతరించనీయక, మడల్ ప్రక్రియ చేయబూనిన ఆళ్వారును నివారింపజేయుచు, తనకు అతి ప్రీతికరమైన తిరుమంగై ఆళ్వార్ ఎదుట శ్రీమన్నారాయణుడు అమిత వాత్సల్యముతో దర్శనభాగ్యము కలుగజేయగ, ఆ సర్వేశ్వరుని గాంచిన తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన మనోహరమైన ముప్పది పాశురములగల ఆరవ ప్రభంధము ఈ ” తిరునెడున్దాడకమ్”.(ఈ ప్రభంధమున ప్రతి పాశురము,  నాలుగు చరణములతోను, ప్రతి చరణము ఎనిమిది పదములతో 26 అక్షరములకు  పైన నుండు నియమముతో  యుండును.)

                          ఇట్లు అద్వితీయమైన, సాటిలేని తిరుమంగై ఆళ్వార్ సర్వేశ్వరుని యొక్క ప్రత్యక్షదర్శనమును పొంది ముకుళిత హస్తములతో పరమపదమున శ్రీ మన్నారాయణుని చెంతకు వేంచేసిరి.( దాన్డకము అనగ ఉచ్ఛమైన స్థితికి చేకొనిపోవునది… తిరుక్కుఱున్దాడకమ్ ద్వారా పరమభక్తి ప్రాప్తియు ; తిరునెడున్దాడకమ్ ద్వారా పరమపద ప్రాప్తియు కలుగజేయునట్లు తిరుమంగై ఆళ్వార్  భక్తులకు ప్రసాదించిరి.)

               మొదట పది పాసురములలో, తిరుమంగై ఆళ్వార్ , తాను సర్వేశ్వరుని దివ్య  దర్శనమున  అనుభవించిన తత్వత్రయమును (చిత్తు,అచిత్తు,ఈశ్వర స్వరూపములను)  ప్రస్తుతించిరి. 

 ** మిన్ ఉరువాయ్ మున్నురువిల్ వేదనాన్గాయ్ , 

విళక్కొళియాయ్ ముళైత్తు ఎழுన్ద తిఙ్గళ్ తానాయ్ ,

పిన్ ఉరువాయ్ మున్నురువిల్  పిణి మూప్పిల్లా ,

పిఱప్పిలియాయ్ ఇఱప్పదఱ్కే ఎణ్ణాదు , ఎణ్ణుమ్

పొన్ ఉరువాయ్ మణి ఉరువిల్ పూదమైన్దాయ్ , 

పునల్ ఉరువాయ్ అనలురువిల్ తిగழுఞ్దోది ,

తన్ ఉరువాయ్ ఎన్నురువిల్ నిన్ఱ ఎందై ,

తళిర్ పురైయుమ్ తిరువడి ఎన్ తలైమేలవే ll 2052

మున్ ఉరువిల్ = ముంగిటనున్న (కన్నులకగపడు) అచిత్తు అనెడి పదార్ధములంతటను; మిన్ ఉరు ఆయ్ = మెరుపువలె అశాశ్వతమైన స్వభావమును కనబడజేయువాడును; వేదమ్ నాన్గు ఆయ్ = నాలుగు వేదములును ఒసగి ఉపకరించినవాడును; విళక్కు ఒళి ఆయ్ = చీకటిని తొలగించు దీపమువలె అఙ్ఞానాంధకారము నిర్మూలింపజేసి తనయొక్క నిజస్వరూపమును ప్రకాశింపజేయువాడును; విళైత్తు ఎழுన్ద తిఙ్గళ్ తానాయ్ = (కొండలపై) ఉదయించి ఆకాశములో ఎదుగుచున్న చంద్రునివలె ఆహ్లాదకరమైన ఙ్ఞానమును నాకు ఒసగినవాడును; పిన్ ఉరువాయ్ = ప్రకృతి సంబంధిత ఇరువది నాలుగు తత్వముల పిదప ఇరువది ఐదవ తత్వస్వరూపమయిన జీవాత్మ; మున్ ఉరువిల్  పిణి మూప్పు ఇల్లా పిఱప్పు ఇలి ఆయ్ = ముంగిట కనిపించు ప్రకృత సంబంధిత పదార్థములవలె వ్యాధియు,ముసలితనము లేకయు, జన్మములేని వాడైన జీవాత్మకు నిర్వాహకుడును; ఇఱప్పదఱ్కే ఎణ్ణాదు = కైవల్యమనెడి మోక్షమును ఆశ్రితులకు ఒసగుటకు తలచనివాడును; ఎణ్ణుమ్ పొన్ ఉరువాయ్ = ఎల్లప్పుడును పొందుటకు ధ్యానింపబడు బంగారమువలె  దివ్య స్వరూపుడును; మణి ఉరువిల్ పూదమ్ ఐన్దు ఆయ్ = (పాంచరాత్రములో ఉదహరించిన) పరమేష్టి, పుమాన్, విశ్వమ్, నివృత్త, సర్వ,అని చెప్పబడు ఐదు తత్వములతో శోభిల్లు దివ్య మంగళవిగ్రహ స్వరూపముగలవాడును; పునల్ ఉరు ఆయ్ = జలములవలె (ఆశ్రితులందరి అనుభవమునకు) మిక్కిలి సులభమైనవాడును; అనల్ ఉరువిల్ తిగழுమ్ = (శత్రువులకు) అగ్నివలె ఏఒక్కరికిని సమీపించలేని ప్రకాశించు స్వరూపము గలవాడును; శోది తన్ ఉరువమ్ ఆయ్ = పరంజ్యోతి స్వరూపుడైనవాడును; ఎన్ ఉరువిల్ నిన్ఱ = నాయొక్క శరీరములో స్థితుడైన; ఎందై=నాకు తండ్రియైన సర్వేశ్వరునియొక్క; తళిర్ పురైయుమ్ తిరువడి = చిగురుపోలిన దివ్యచరణములు; ఎన్ తలైమేలవే = నాయొక్క శిరస్సుపై వెలసియున్నదే!(ఆహా ఏమి నా భాగ్యము)..

  కన్నులఎదుటనే ప్రత్యక్షముగ కనబడుచున్న అచిత్తు పదార్దముల స్వభావము , మెరుపువలె క్షణకాలమే ఎదుట తెలియునను ఙ్ఞానమును కలుగజేయువాడును, ఆత్మయొక్క నిజస్వభావమును తెలియజేయు నాలుగు వేదములను ఒసగి ఉపకరించిన వాడును; చీకటిని తొలగించి ఎదుటగల వస్తువులను  కనబడునట్లుజేయు దీపమువలె, ( శాస్త్రములద్వారా )అఙ్ఞానాంధకారము నిర్మూలింపజేసి  మంచి ఙ్ఞానము కలుగజేసి  తనయొక్క  నిజస్వరూపమును ప్రకాశింపజేయువాడును, అదియును గాక కొండలపై ఉదయించి ఆకాశములో ఎదుగుచున్న చంద్రుని కాంతి దీపపు కాంతి ఏ విధముగ మిక్కిలి ఆహ్లాదకరమో, అటులనే మననముచే ఉదయించి ,నిదిధ్యాసనలచే వృద్దిచెంది, సాక్షాత్కారముచే మిక్కిలి ఆహ్లాదకరమగు ఙ్ఞానమును నాకు ఒసగినవాడును, ప్రకృతి, మహత్, అహంకార, మనస్సు, పంచ ఙ్ఞానేంద్రయములు ,పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు  (స్పర్శ,రస,గంధ, శబ్ధ, రూప తన్మాత్రలు), పంచ భూతములు మొదలగు ఇరువది నాలుగు తత్వముల పిదప ఇరువది ఐదవ తత్వస్వరూపమును, ముంగిట కనిపించు ప్రకృత సంబంధిత పదార్థములవలె వ్యాధియు, ముసలితనము లేకయు, జన్మములేని వాడైన జీవాత్మకు నిర్వాహకుడును,ఆత్మ స్వరూపమునకు తగని కైవల్యము మరణ సమానమగుటచే అట్టి కైవల్య మోక్షమును తనయొక్క ఆశ్రితులకు ఒసగుటకు తలచనివాడును, ఎల్లప్పుడును పొందుటకు ధ్యానింపబడు బంగారమువలె , దివ్య స్వరూపుడవును, పాంచరాత్రములో ఉదహరించిన పరమేష్టి, పుమాన్, విశ్వమ్,నివృత్త, సర్వ,అని చెప్పబడు ఐదు తత్వములతో శోభిల్లు దివ్య మంగళవిగ్రహ స్వరూపము గలవాడును, జలములవలె ఆశ్రితులందరి అనుభవమునకు మిక్కిలి సులభమైనవాడును, (శత్రువులకు) అగ్నివలె ఏఒక్కరికిని సమీపించలేని ప్రకాశించు స్వరూపముగలవాడును, పరంజ్యోతి స్వరూపుడైనవాడును,నాయొక్క శరీరములో స్థితుడైన, నాకు తండ్రియైన సర్వేశ్వరునియొక్క చిగురుపోలిన దివ్యచరణములు నాయొక్క శిరస్సుపై వెలసియున్నదే! (ఆహా! ఏమి నా భాగ్యము.)

పారురువి నీర్ ఎరి కాల్ విశుమ్బుమాగి ,

ప్పల్ వేఱు శమయముమాయ్ పరన్దు నిన్ఱ ,

ఏరురువిల్ మూవరుమే యెననిన్ఱ ,

ఇమైయవర్ తమ్ తిరువురు వేఱు ఎణ్ణుమ్బోదు ,

ఓరురువమ్ పొన్నురువమ్ ఒన్ఱు శెమ్ తీ ,

ఒన్ఱు మాకడల్ ఉరువమొత్తునిన్ఱ ,

మూవురువుమ్ కణ్డపోదొన్ఱామ్ శోది ,

ముగిలురువుమ్ ఎమ్మడిగళ్ ఉరువన్దానే ll 2053

ఏర్ ఉరువిల్ = అందమైన శరీరములుగల; మూవరమే ఎన నిన్ఱ = ముగ్గురు దైవములే ప్రధానమని చెప్పబడుచు లోకమందు ఒప్పు; ఇమైయవర్ తమ్ తిరువురు = బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులను దేవతలయొక్క రూపములను;వేఱు ఎణ్ణుమ్ పోదు = వేరువేరుగ పరిశీలించినచో; ఓర్ ఉరువమ్ =(చతుర్ముఖ బ్రహ్మయైన)ఒక మూర్తియొక్క రూపము; పొన్ ఉరువమ్ = బంగారు వర్చస్సుకలగిన స్వరూపమై ఉండును; ఒన్ఱు = (పరమశివుడైన)ఒక మూర్తియొక్క రూపము; శెమ్ తీ = ఎఱ్ఱని అగ్ని వలె వర్చస్సుకలగి ఉండును; ఒన్ఱు = (శ్రీమన్నారాయణుడైన) ఒక మూర్తియొక్క రూపము; మాకడల్ ఉరువమ్ = మహా సముద్రము యొక్క వర్ణమువలె వర్చస్సుకలగి ఉండును;ఒత్తునిన్ఱ మూ ఉరువమ్ = అట్లు వర్చస్సులు కలగియున్న ముగ్గురు మూర్తులను; కణ్డ పోదు = (ప్రమాణములను) పరిశీలనచేసి చూచినచో; పార్ ఉరువి = కఠినమైన భూమియు, నీర్ = జలముయు; ఎరి= అగ్నియు; కాల్ = వాయువును; విశుమ్బుమ్= ఆకాశమును; ఆగి = అయిన ఈ పంచ మహాభూతములను సృష్టించియు; పల్ వేఱు శమయముమ్ ఆయ్ = ఆనేకములైన వేరువేరు మతములు కలిగిన ఈ జగత్తును సృష్టించియు; పరన్దు నిన్ఱ=ఇట్లు సృష్టించిన జగత్తులో అంతర్యామిగ వ్యాపించియున్న;ఆమ్ శోది= పరంజ్యోతి అని స్తుతింపబడు; ఒన్ఱు = అద్వితీయమై యుండు; ముగిల్ ఉరువమ్ = కాళమేఘ వర్ణమువంటి రూపము; ఎమ్మడిగళ్ ఉరువన్దానే = మనయొక్క సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుని  స్వరూపమే అగునుకదా!

ఇంద్రుడు,వరుణుడు, కుబేరుడు మొదలగు అనేక దేవతలు ఉన్నను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనబడు ముగ్గురు మూర్తులను ప్రధానముగ ఈ లోకమందు కొలువబడుట కలదు. ఆ మూర్తులలో చతుర్ముఖ బ్రహ్మ రూపము బంగారమువంటి వర్ఛస్సుతోను, పరమశివుని రూపము అగ్నివలె ఎఱ్ఱని వర్ఛస్సుతోను, శ్రీమన్నారాయణుని రూపము మహా సముద్రము యొక్క వర్ణమువంటి వర్ఛస్సుతోను ఒప్పుచుందురు. అట్టి వర్చస్సులు కలగియున్న ముగ్గురు మూర్తులను  ప్రమాణములలో పరిశీలనచేసి చూచినచో, భూమి,జలము,అగ్ని,వాయువు,ఆకాశము అనబడు పంచ మహాభూతములను సృష్టించియు, ఆనేకములైన వేరువేరు మతములు కలిగిన ఈ జగత్తును సృష్టించియు, ఇట్లు సృష్టించిన జగత్తులో అంతర్యామిగ వ్యాపించియున్న పరంజ్యోతి అని స్తుతింపబడు, కాలమేఘవర్ణమువంటి రూపము కలగిన; అద్వితీయుడైన  శ్రీమన్నారాయణుడే సృష్టికర్తయనయు, బ్రహ్మ, మహేశ్వరులు సృష్టింబడినవారనియు, శ్రీమన్నారాయణుడే శేషియనియు,బ్రహ్మ, మహేశ్వరులు  శేషభూతులనియు విశదమగును సుమా! 

తిరువడివిల్ కరునెడుమాల్ శేయనెన్ఱుమ్ ,

తిరేత్తై క్కణ్ వళైయురువాయ్ త్తిగழ்న్దానెన్ఱుమ్ ,

పెరువడివిల్ కడలముదమ్ కొణ్డ కాలమ్ ,

పెరుమానై క్కరునీల వణ్ణన్దన్నై ,

ఒరువడివత్తు ఓరురువెన్ఱు ఉణరలాగాదు ,

ఊழிదోఱూழி నిన్ఱు ఏత్తలల్లాల్ ,

కరువడివిల్ శెమ్ కణ్ణ వణ్ణన్ తన్నై ,

కట్టురైయే యారొరువర్ కాణ్గిఱ్పారే ll 2054

తిరువడివిల్ = విలక్షణమైన స్వరూపములో; కరునెడుమాల్ = కాళమేఘశ్యామమైన రూపముగల సర్వేశ్వరుడు; పెరువడివిల్ = పెద్ద కూర్మరూపముతో; కడల్ = సముద్రమునుండి; అముదమ్ కొణ్డ కాలమ్ = (దేవతలకు) అమృతము తీసి ఇచ్చిన కృతయుగములో; వళై ఉరువాయ్ త్తిగழ்న్దాన్ ఎన్ఱుమ్ = శంఖమువలె తెల్లనివర్ణముతో ప్రకాశించెననియు; శేయేన్ ఎన్ఱుమ్ తిరేత్తై కణ్=త్రేతాయుగములో ఎఱ్ఱని వర్ణముతో ప్రకాశించెననియు; (కలియుగమందు) కరునీల వణ్ణన్ ఎన్ఱుమ్ = (స్వభావసిద్దమైన) నీలివర్ణముతో ప్రకాశించెననియు; ఊழிదోఱూழி నిన్ఱు ఏత్తల్ అల్లాల్  = ఆ ఆ యుగములలో స్తుతింపబడుటయే కాని; ఒరు వడివత్తు ఓర్ ఉరువన్ ఎన్ఱు ఉణరలాగాదు = ఒక రూపము,ఒక వర్ణము కలవాడనిగ్రహింపశఖ్యముగాని, కరువడివిల్ శెమ్ కణ్ణ వణ్ణన్ తన్నై పెరుమానై = నల్లనితిరుమేనియు ఎఱ్ఱని నేత్రములుగల సర్వేశ్వరుని; యార్ ఒరువర్ = ఏ ఒక్కరైన; కాణ్గిఱ్పారే = (స్వప్రయత్నముచే) చూడగలిగిరా?; కట్టురైయే= (ఓ మనసా!) చెప్పుమా!

                       సర్వేశ్వరుడు  కృతయుగములో శంఖమువలె తెల్లనివర్ణము కలగిన స్వరూపముతో ఆ కాలమందు భక్తులకు సేవ కలిగించియు , త్రేతాయుగములో  ఎఱ్ఱని వర్ణము కలగిన స్వరూపముతో ఆ కాలమందు భక్తులకు సేవ కలిగించియు, కలియుగములో నీలివర్ణము కలిగిన స్వరూపముతో  భక్తులకు సేవ కలిగించియు, ఇట్లు తన సంకల్పముచేత గ్రహించు అనేక రూపములు, అనేక వర్ణములు కలిగిన స్వరూపములను ఆ ఆ యుగములలో తగినట్లు  భక్తులచే స్తుతింపబడుటయే కాని,ఏ ఒక్కరిచేతను ఎన్నడును సర్వేశ్వరుడు ఇట్టి రూపము, వర్ణము కలవాడని గ్రహింపశఖ్యము కాలేదు. అట్టి నల్లనితిరుమేనియు ఎఱ్ఱని నేత్రములుగల శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపచే నాకు కలిగిన దివ్యదర్శనముచే ఆ దివ్య మంగళవిగ్రహ స్వరూపమును గాంచితిని. (ఓ మనసా!) స్వప్రయత్నముచే ఏ ఒక్కరైన చూడగలిగిరా? చెప్పుమా!

ఇన్దిరఱ్కుమ్ పిరమఱ్కుమ్ ముదల్వన్ తన్నై ,

ఇరునిలమ్ కాల్ తీ నీర్ విణ్ పూదమైన్దాయ్ ,

శెన్దిరత్త తమిழோశై వడశొల్లాగి ,

తిశై నాన్గుమాయ్ త్తిఙ్గళ్ ఞాయిఱాగి ,

అన్దరత్తిల్ తేవర్కుమ్ అరియలాగా 

అన్దణనై , అన్దణర్ మాట్టు అన్దివైత్త

మన్దిరత్తై , మన్దిరత్తాల్ మఱవాదెన్ఱుమ్ ,

వాழுదియేల్ వాழలామ్ మడనెఞ్జమే ll 2055

ఇన్దిరఱ్కుమ్ = ఇంద్రునికియు; పిరమఱ్కుమ్ = బ్రహ్మకుయు; ముదల్వన్ తన్నై = కారణభూతుడై; ఇరు నిలమ్ కాల్ తీ నీర్ విణ్ పూదమ్ ఐన్దు ఆయ్ = విశాలమైన భూమి,వాయువు,అగ్ని,జలము,ఆకాశము అనబడు పంచభూతములకు నియామకుడై;శెనమ్ తిరత్త తమిழ் ఓశై = అందమైన సులభ గ్రాహ్యమైన తమిళ ప్రబంధములను ప్రకాశింప జేసినవాడైన;వడశొల్ ఆగి=సంస్కృత వేదములను ప్రకాశింపజేసిన వాడైన; తిశై నాన్గుమాయ్ = నాలుగు దిక్కులయందుగల సమస్త వస్తువులకు  అంతర్యామియై; త్తిఙ్గళ్ ఞాయిఱాగి = చంద్రునికి,సూర్యునికి నియామకుడై;అన్దరత్తిల్ = ఈ విధముగ  సకల పదార్ధములయందు వ్యాపించియుండినను;తేవర్కుమ్ అరియలాగా అన్దణనై=దేవతలకును తెలిసుకొనలేని శుద్ధస్వభావము గలవాడై;అన్దణర్ మాట్టు=బ్రాహ్మణులకు సంపదైన వేదములయొక్క; అన్దివైత్త = అంతమందు ప్రకాశించుచున్న;మన్దిరత్తై=పరమ మంత్రమైన సర్వేశ్వరుని; మన్దిరత్తాల్ = తిరుమంత్రముచే; మఱవాదు వాழுది ఏల్ = నిరంతరము విడువక అనుభవించినచో; మడనెఞ్జమే = ఓ విధేయమైన నామనసా! ;ఎన్ఱుమ్ =  శాశ్వతముగ; వాழలామ్ = (ఆ సర్వేశ్వరుని దివ్య చరణములయందు) ఉజ్జీవించుదుము.

    బ్రహ్మాదిదేవతలకు కారణభూతుడును,పంచభూతములకు నియామకుడును, తమిళ ప్రబంధములను, సంస్కృత వేదములను ప్రకాశింపజేసిన వాడును, నాలుగు దిక్కులయందు గల సమస్త వస్తువులకు  అంతర్యామియు, సూర్యచంద్రులకు  నియామకుడును, విశ్వమంతటను వ్యాపించియుండినను దేవతలు తెలిసుకొనలేని శుద్ధస్వభావముగలవాడును,వేదాంతములందు ప్రకాశించునట్టి ఆ శ్రీమన్నారాయణునిచే ఉపదేశింపబడిన తిరుమంత్రమును నిరంతరము విడువక అనుభవించినచో, ఓ! నామనసా! శాశ్వతముగ ఆ సర్వేశ్వరుని దివ్య చరణములయందు ఉజ్జీవించుదుము.

ఒణ్ మిదియిల్ పునల్ ఉరువి ఒరుకాల్ నిఱ్ప ,

ఒరుకాలుమ్ కామరుశీర్ అవుణనుళ్ళత్తు ,

ఎణ్ మదియుమ్ కడన్దు అణ్డమీదుపోగి ,

ఇరు విశుమ్బి నూడు పోయ్ ఎழுన్దు , మేలై

తణ్ మదియుమ్ కదిరవనుమ్ తవిరవోడి ,

తారకైయిన్ పుఱమ్ తడవి అప్పాల్ మిక్కు ,

మణ్ ముழுదుమ్ ఆగప్పడుత్తు నిన్ఱ ఎందై ,

మలర్ పురైయుమ్ తిరువడియే వణఙ్గినేనే ll 2056

ఒరు కాల్ = ఒక దివ్యమైన పాదము; ఒణ్ మిదియిల్ = అందముగ ఒక అడుగు వేసిన మాత్రమే;పునల్ ఉరువి నిఱ్ప=అండమును చుట్టియున్న ఆవరణ జలములపర్యంతము వ్యాపింపజేసియు; ఒరుకాలుమ్ = మఱియొక దివ్య పాదము; కామరుశీర్ అవుణన్= మంచి భాగ్యశీలుడైన మహాబలి యొక్క; ఉళ్ళత్తు ఎణ్ మదియుమ్ కడన్దు = మనస్సునగల భావనలు అధిగమించి; అణ్డమ్ మీదు పోగి ఎழுన్దు = అండభిత్తికి పైన పోవుటకు మొదలిడి; ఇరు విశుమ్బి నూడు పోయ్=విశాలమైన ఆకాశమును ఆక్రమించి పోవుచు; మేలై తణ్ మదియుమ్ కదిరవనుమ్ = పైననున్న చల్లని చంద్రమండలమును, ఆపైన సూర్యమండలమును;తవిర ఓడి = అధిగమించుచు పోయి; తారకైయిన్ పుఱమ్ తడవి = (దానికి పైన) నక్షత్రమండలమును అధిగమించి; అప్పాల్ మిక్కు = ఆపైన బ్రహ్మలోకమువరకు వ్యాపింపజేసి; మణ్ ముழுదుమ్ = భూలోకము మొదలగు పదునాలుగు లోకములను; ఆగప్పడుత్తు నిన్ఱ = తన స్వాధీనము చేసుకొన్న; ఎందై= నాయొక్క స్వామియైన సర్వేశ్వరుని; మలర్ పురైయుమ్ తిరువడియే = తామర పుష్పము వంటి దివ్య చరణములనే;వణఙ్గినేనే=సేవంచుకొని ధన్యుడైతిని గదా! (ఆహా ! ఏమి ఆ శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృప!)

    సర్వేశ్వరుడు స్వయముగ తనకు ఉపదేశించిన తిరుమంత్రమును అనుభవించిన తిరుమంగై ఆళ్వార్   శ్రీమన్నారాయణుని దివ్యచరణారవిందములందు లీనమై, వామనావతారమందు మహాబలినుండి మూడడుగుల నేలను యాచించి దానజలము తన హస్తమున పడిన మరుక్షణమే,అందముగ ఒక అడుగుతో అండమును చుట్టియున్న ఆవరణ జలములపర్యంతము వ్యాపింపజేసి, మఱియొక అడుగుతో విశాలమైన ఆకాశమును ఆక్రమించుచు పోయి, చంద్రమండలమును, సూర్యమండలమును , నక్షత్రమండలమును అధిగమించి,బ్రహ్మలోకమువరకు వ్యాపింపజేసి,భూలోకము మొదలగు పదునాలుగు లోకములను స్వాధీనము చేసుకొన్న శ్రీమన్నారాయణుని తామర పుష్పమువంటి ఆ దివ్య చరణములను సేవించుకొని ధన్యుడనైతినని మహదానందమును పొందిరి.

అలమ్ పురిన్ద నెడుమ్ తడక్కై అమరర్ వేన్దన్ ,

అఞ్జిఱైప్పుళ్ తనిప్పాగన్ అవుణర్ క్కెన్ఱుమ్ ,

శలమ్ పురిన్దు అఙ్గు అరుళిల్లా త్తన్మైయాళన్ ,

తానుగన్ద వూరెల్లామ్ తన్ తాళ్ పాడి ,

నిలమ్ పరన్దు వరుమ్ కలుழி ప్పెణ్ణైయీర్త ,   

నెడువేయ్ గళ్ పడు ముత్తమ్ ఉన్ద ఉన్ది ,

పులమ్ పరన్దు పొన్ విళైక్కుమ్ పొయ్ గై వేలి ,

ప్పూఙ్గోవలూర్ తొழுదుమ్ పోదునెఞ్జే  ll 2057 

 అలమ్ పురిన్ద=చాలు చాలని చెప్పబడునట్లు ఒసగు; నెడుమ్ తడక్క=పొడుగైన పెద్ద దివ్య హస్తములు గలవాడును; అమరర్ వేన్దన్ = నిత్యశూరులకు ప్రభువును; అమ్ శిఱై ప్పుళ్ తని పాగన్ = అందమైన రెక్కలగల గరుడాళ్వార్ ను అద్వితీయముగ నడిపించువాడును; అవుణర్ క్కు ఎన్ఱుమ్= అసురప్రవృత్తి గలవారియందు ఎల్లప్పుడును; శలమ్ పురిన్దు = కోపముకలిగి; అఙ్గు = వారియొక్క విషయమున; అరుళ్ ఇల్లా త్తన్మై ఆళన్ తాన్= దయాదాక్షణ్యములు లేని స్వభావముగల నాయొక్క స్వామి సర్వేశ్వరుడు; ఉగన్ద = మిక్కిలి అపేక్షతో నిత్యవాసము చేయుచున్న; ఊర్ ఎల్లామ్ = దివ్యదేశములందంతటను;తన్ తాళ్ పాడి = ఆ స్వామి దివ్య చరణములను స్తుతించి; నిలమ్ పరన్దు వరుమ్ కలుழி = భూమియందంతటను వ్యాపించుచు వచ్చెడి పెద్ద బురదతోనున్న వరదజలములుగల; పెణ్ణై = పెణ్ణైనది; యీర్త = కొట్టుకొనువచ్చు; నెడు వేయ్ గళ్ పడు = పెద్ద వెదుళ్ళయందు గల; ముత్తమ్ = ముత్యములను; ఉన్ద = పొలములలో నెట్టగ; ఉన్ది = (రైతులు తమ పొలమునందు యున్న ఆ ముత్యములు కలుపు మొక్కలగునని) బైటకు పారవేయబడుచుండునట్టియు; పులమ్ పరన్దు = పొలములలో వ్యాపించి;పొన్ విళైక్కుమ్=బంగారమును (ఎఱ్ఱ ధాన్యమును) మొలిపించెడి;పొయ్ గై వేలి=నీటి వసతులచే చుట్టుకొనియున్న; పూమ్ కోవలూర్ = అందమైన తిరు కోవలూర్ దివ్యదేశమును; తొழுదుమ్ = సేవించుకొందుము; నెఞ్జే పోదు = ఓ నామనసా! రమ్ము.

                  వామనావతారమందు పదునాలుగు లోకములను స్వాధీనము చేసుకొన్న అమృతతుల్యమైన శ్రీమన్నారాయణుని దివ్యచరణారవిందములను సేవించినను, తృప్తిలేక ఆ యుగమందు సర్వేశ్వరుని దివ్యస్వరూపము ఎటులుండినదో గదా! అని చింతించుచున్న తిరుమంగై ఆళ్వార్ నకు సర్వేశ్వరుడు ” ఈ కాలమందు భక్తులు ఆ వామనావతారమందలి త్రివిక్రమరూపమును అనుభవంచుటకై తిరు కోవులూర్ దివ్య దేశమున కొలువైయుంటినిగదా ! ” అని తెలియజేయగా,అమితానందభరితులైన ఆళ్వార్ తనతో కూడియున్న మనస్సుతో,  ” ఓ నామనసా! భక్తులు సంతృప్తిపొందునట్లు వారి కోరికలు తీర్చువాడును,నిత్యశూరులకు ప్రభువును,గరుడాళ్వార్ ను అద్వితీయముగ నడిపించువాడును, అసురప్రవృత్తిగలవారియందు దయలేనివాడును,అట్టి నాయొక్క స్వామి సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశములందంతటను  అమృతతుల్యమైన వాని దివ్య చరణములను స్తుతించికొనుచు, పెద్ద పెణ్ణైనది యొక్క  వరదజలములచే తమ పొలములలో చేరబడు ముత్యములు, కలుపు మొక్కలగునని భావనతో రైతులచే బైటకు పారవేయబడుచుండునట్టియు,బంగారమును (ఎఱ్ఱ ధాన్యమును) మొలిపించెడి నీటి వసతులచే చుట్టుకొనియున్నదియు, అయిన అందమైన తిరు కోవలూర్ దివ్యదేశమును సేవించుకొందుము. రమ్ము.” అనియు,

వఱ్పుడైయ వరై నెడున్దోళ్ మన్నర్ మాళ ,

వడివాయ మழுవేన్ది ఉలగమాణ్డు ,

వెఱ్పుడైయ నెడుమ్ కడలుళ్ తని వేల్ ఉయ్ త్త ,

వేళ్ ముదలా వెన్ఱానూర్ విన్దైమేయ ,

కఱ్పుడైయ మడక్కన్ని కావల్ పూణ్డ ,

కడి పొழிల్ శూழ் నెడుమఱుగిల్ కమలవేలి ,

పొఱ్పుడైయ మలై అరైయన్ పణియనిన్ఱ ,

ప్పూఙ్గోవలూర్ తొழுదుమ్ పోదు నెఞ్జే  ll 2058

వఱ్పు ఉడైయ=బలిష్ఠములైన;వరై నెడుమ్ తోళ్=పర్వతమువలె పెద్ద భుజములుగల;  మన్నర్ = (కార్తవీర్యార్జునులు మొదలగు ) మహారాజులు;మాళ=నశించునట్లు;వడివు ఆయ = సుందరమైన; మழு=గండ్రగొడ్డలి ఆయుధమును;ఏత్తు= (పరశురామావతారమందు) ధరించియు; ఉలగమ్ ఆణ్డు =(శ్రీరామావతారమందు) లోకములను తన కళ్యాణ గుణములచే పరిపాలించియు;  వెఱ్పు ఉడైయ = పర్వతములుగల; నెడుమ్ కడలుళ్= మహాసముద్ర గర్భములో; తని వేల్ ఉయ్ త్త=సాటిలేని శూలమును నడిపించిన;వేళ్ ముదలా=సుభ్రమణ్యుడు మొదలగు దేవతలను; వెన్ఱాన్ = (కృష్ణావతారమందు భాణాసురునితో సంభవించిన యుద్ధములో) వెనుదిరిగి పారిపోవునటులజేసిన సర్వేశ్వరుడు; ఊర్ = కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును; విన్దై మేయ = (తపస్సు చేయుటకొఱకు) వింద్య పర్వతముపై వసించుచున్న; మడమ్ = పట్టిన పట్టు విడువని గుణముగల; కన్ని= దుర్గాదేవిచే; కావలి పూణ్డ = కాపాడబడుచున్నదియు; కడి పొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలచే చుట్టబడినదియు; నెడుమఱుగిల్ = విశాలమైన వీధులుగలదియు;కమలమ్ వేలి = కమలములతో నిండిన తటాకములచే చుట్టుకొనియున్నదియు; పొఱ్పు ఉడైయ మలై అరైయన్ పణియ నిన్ఱ=పరాక్రమశాలులైన పర్వతవాసుల రాజులచే కొలువ బడుచున్న; పూమ్ కోవలూర్ = అందమైన తిరు కోవలూర్ దివ్యదేశమును; తొழுదుమ్ = సేవించుకొందుము; నెఞ్జే  పోదు = ఓ నామనసా! రమ్ము.

                      ( అపరిమితానందములో మునిగిన తిరుమంగై ఆళ్వార్ తనతో సమానముగ తన మనస్సు అనుభవింపజేయు క్రమములో) ” ఓ నా మనసా! పరశురామావతారమందు కార్తవీర్యార్జునులు మొదలగు మహారాజులు నశించునట్లు గండ్రగొడ్డలి ఆయుధమును ధరించినవాడును,శ్రీరామావతారమందు లోకములను తన కళ్యాణగుణములచే పరిపాలించినవాడును, కృష్ణావతారమందు భాణాసురునితో సంభవించిన యుద్ధములో సుభ్రమణ్యుడు మొదలగు దేవతలు  వెనుదిరిగి పారిపోవునటుల జేసినవాడును, అట్టి దివ్య చేష్టితములగల సర్వేశ్వరుడు  కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును, దుర్గాదేవిచే  కాపాడబడుచున్నదియు, పరిమళభరితమైన తోటలచే చుట్టబడినదియు, కమలములతో నిండిన తటాకములచే చుట్టుకొనియున్నదియు, పరాక్రమశాలులైన పర్వతవాసుల రాజులచే కొలువ బడుచున్నదియు, అట్టి తిరు కోవలూర్ దివ్యదేశమును సేవించుకొందుము.రమ్ము”. అనియు చెప్పిరి.

** నీరకత్తాయ్ నెడువరైయిన్ ఉచ్చి మేలాయ్ ,

నిలా తిఙ్గళ్ త్తుణ్డత్తాయ్ నిఱైన్దకచ్చి 

ఊరగత్తాయ్ , ఒణ్ తుఱైనీర్ వెహ్ కావుళ్ళాయ్ ,

ఉళ్ళువారుళ్ళత్తాయ్ , ఉలగమేత్తుమ్

కారగత్తాయ్ కార్వానత్తుళ్ళాయ్ కళ్వా ,

కామరుపూం కావిరియిన్ తెన్బాల్ మన్ను

పేరగత్తాయ్ , పోరాదు ఎన్నెఞ్జినుళ్ళాయ్ ,

పెరుమాన్ ఉన్ తిరువడియే పేణినేనే ll 2059

నీరగత్తాయ్ = తిరు నీరగం దివ్యదేశములోవేంచేసిన జగదీశ్వరుడా!; నెడువరైయిన్ ఉచ్చి మేలాయ్ = ఉన్నతమైన వేంకటాద్రి శిఖరముపై కృపతో వేంచేసిన సర్వేశ్వరుడా!; నిలా తిఙ్గళ్ త్తుణ్డత్తాయ్ = నిలా తిఙ్గళ్ త్తుణ్డత్తు దివ్యదేశములో వేంచేసిన స్వామీ!; నిఱైన్ద కచ్చి ఊరగత్తాయ్ = సిరిసంపదలతో తులతూగుచున్న కాంచీపురములోగల తిరు ఊరగం అను దివ్యదేశములో వేంచేసిన సర్వలోకములను కొలిచినవాడా!;ఒణ్ తుఱైనీర్ వెహ్ కా ఉళ్ళాయ్=అందమైన చెరువుఒడ్డునగల తిరు వెఃకా దివ్యదేశమున పవళించియున్న సర్వేశ్వరా!;ఉళ్ళువార్ ఉళ్ళత్తాయ్=స్మరించువారి హృదయమందు నివసించువాడా!; ఉలగమ్ ఏత్తుమ్ కారగత్తాయ్ = లోకమంతయు కొనియాడు తిరుకారగమ్  దివ్యదేశములో వేంచేసి యున్నవాడా!; కళ్వా = తిరు కళ్వనూర్ దివ్యదేశములో వేంచేసిన ఆదివరాహస్వామీ!; కామరు పూమ్ కావిరియిన్ తెన్బాల్ మన్ను పేరగత్తాయ్=అందరిచే ఆశింపబడు అందమైన కావేరినది దక్షిణతీరమున గల తిరు ప్పేర్ దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్నవాడా!; పోరాదు ఎన్ నెఞ్జిల్ ఉళ్ళాయ్= విడువక నా హృదయమందు వేంచేసి యున్నవాడా!;పెరుమాన్ = సర్వేశ్వరుడా!; ఉన్ తిరువడియే= నీయొక్క దివ్యచరణములందే; పేణినేనే=ఆశపడుచున్నాను.

      శ్రీమన్నారాయణునియందుగల అమితమైన వ్యామోహముతో,  తిరు నీరగం, తిరు వేంకటాచలము,తిరు నిలాత్తిఙ్గళ్ తుణ్డమ్, తిరు ఊరగం,తిరు వెఃకా, తిరుకారగమ్,తిరు కార్వానమ్, తిరు కళ్వనూర్, తిరుప్పేర్ మొదలగు దివ్యదేశములలో  అంతులేని కళ్యాణగుణములతో కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని తన హృదయమున గాంచి,” ఓ సర్వేశ్వరుడా! నీయొక్క దివ్యచరణములందే ఆశపడుచున్నాను. కృపజేయుమా!” అని తిరుమంగై ఆళ్వార్ విన్నవించుకొనుచున్నారు.

వఙ్గత్తాల్ మామణివన్దు ఉన్దు మున్నీర్

మల్లైయాయ్ , మదిళ్ కచ్చియూరాయ్ పేరాయ్ ,

కొఙ్గు ఆర్ వళమ్ కొన్ఱైయలఙ్గల్  మార్వన్ ,

కులవరైయన్ మడప్పావై యిడప్పాల్ కొణ్డాన్ ,

పఙ్గత్తాయ్ పాఱ్కడలాయ్ పారిన్ మేలాయ్ ,

పనివరైయిన్ ఉచ్చియాయ్ పవళవణ్ణా ,

ఎఙ్గుర్ట్రాయ్ ఎమ్బెరుమాన్ ఉన్నై నాడి ,

ఏழைయేన్ ఇఙ్గనమే ఉழிతరుగేనే ll 2060

వఙ్గత్తాల్ = ఓడలచే; మామణి = శ్లాఘ్యమైన రత్నములను;వన్దు = తీసుకొనివచ్చి; ఉన్దు = చేరవేయు; మున్నీర్ =సముద్రతీరమునగల;మల్లైయాయ్=తిరుక్కడమల్లై  దివ్యదేశములో వేంచేసినవాడా!,మదిళ్ కచ్చి ఊరాయ్ = ప్రాకరములుగల కాంచీపురములో తిరు వెఃకా దివ్యదేశములో వేంచేసినవాడా!;పేరాయ్ = తిరుప్పేర్ నగరములో వేంచేసినయున్నవాడా!; కొఙ్గు ఆర్ వళమ్ కొన్ఱై యలఙ్గల్  మార్వన్ = తేనెలతో నిండిన  అందమైన పెద్ద తురాయి పుష్పమాలచే అలంకృతమైన వక్షస్థలము కలవాడును; కులవరైయన్ మడప్పావై యిడప్పాల్ కొణ్డాన్ = పర్వతరాజుయొక్క పుత్రికయైన పార్వతిని తన ఎడమప్రక్క శరీరబాగముగ చేర్చుకొన్నవాడును,అయిన శివునిని; పఙ్గత్తాయ్ = (కుడివైపు) ఒక శరీరబాగమున కలవాడా; పాల్ కడలాయ్=పాలసముద్రమందు పవళించియున్నవాడా; పారిన్ మేలాయ్ =  (శ్రీరామునిగను, శ్రీకష్ణునిగను అవతరించి) భూమిపై సంచరించినవాడా; పనివరైయిన్ ఉచ్చియాయ్= చల్లని వేంకటాద్రి శిఖరముపై కృపతో నిత్యవాసము చేయుచున్నవాడా; పవళవణ్ణా=పవళమువలె మనోహరముగానుండు దివ్యస్వరూపముగలవాడా!; ఎఙ్గు ఉర్ట్రాయ్ = ఎక్కడకు వెడలిపోయినావు నాస్వామీ!; ఎమ్బెరుమాన్ = నాయొక్క సర్వేశ్వరుడా!; ఉన్నై నాడి = నిన్ను వెదకికొనుచు; ఏழைయేన్ = మిక్కిలి చపలచిత్తుడైన నేను;ఇఙ్గనమే = ఈ విధముగనే;ఉழிతరుగేనే = (నీయొక్క దివ్యచరణములను పొందలేక) తిరుగుచునేయుందునా? 

కనుమరుగైన సర్వేశ్వరుని  ఉద్దేశించి తిరుమంగై ఆళ్వార్ ” సిరిసంపదలతో తులతూగుచున్న తిరుక్కడమల్లై దివ్యదేశములో వేంచేసినవాడా !,తిరు వెఃకా,తిరుప్పేర్ దివ్యదేశములలో వేంచేసినవాడా!,అర్ధనారీశ్వరుడైన శివునిని కుడివైపు ఒక శరీరబాగమున కలవాడా!,పాలసముద్రమందు పవళించియున్నవాడా!, శ్రీరామునిగను,శ్రీకష్ణునిగను అవతరించి భూమిపై సంచరించినవాడా!, వేంకటాద్రి శిఖరముపై కృపతో నిత్యవాసము చేయుచున్నవాడా!,పవళమువలె మనోహరముగానుండు దివ్యస్వరూపముగలవాడా!, ఎక్కడకు వెడలిపోయినావు నాస్వామీ!,నీయొక్క దివ్యచరణములను పొందలేక నిన్ను వెదకికొనుచు చపలచిత్తుడైన నేను ఈ విధముగనే తిరుగుచుందునా!” అని దుఃఖముతో విన్నవించుకొనుచున్నారు.

పొన్నానాయ్ పొழிలేழுమ్ కావల్పూణ్డ ,

పుగழ்నాయ్ ఇగழ்వాయ తొణ్డనేన్ నాన్ ,

ఎన్ ఆనాయ్ ఎన్ ఆనాయ్ ఎన్నలల్లాల్ ,

ఎన్ అఱివన్ ఏழைయేన్ , ఉలగమేత్తుమ్

తెన్నానాయ్ వడవానాయ్ కుడపాలానాయ్ ,

కుణపాలమదయానాయిమైయోర్కెన్ఱుమ్ ,

మున్నానాయ్ , పిన్నానార్వణఙ్గుఞ్జోది ,

తిరుమూழிక్కళత్తానాయ్ ముదలానాయే , ll 2061

ఉలగమ్ఏత్తుమ్ = లోకములంతయు స్తుతింపతగిన; తెన్ ఆనాయ్ = దక్షిణదిక్కునగల తిరుమాలిరుఞ్జోలై పర్వతముపై వేంచేసిన ఏనుగువంటివాడా; వడ ఆనాయ్ = ఉత్తరమునగల వేంకటాద్రిపై వేంచేసిన ఏనుగువంటివాడా; కుడపాల్ ఆనాయ్ = పడమటి దిక్కునగల కోవెలలో పవళించుచున్న ఏనుగువంటివాడా; కుణపాల్ మద ఆనాయ్=తూర్పుదిక్కునగల తిరుక్కణ్ణపురములో వేంచేసిన మత్తగజమువంటివాడా; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును; ఇమైయోర్కు మున్నానాయ్ = నిత్యశూరులకు కనులార కాంచి అనుభవంచునట్లు ముంగిటనే వేంచేసియుండువాడా; పిన్నానార్ వణఙ్గుమ్ శోది=నీ అవతారకాలమునగాక తదుప జనించినవారిచే ఆశ్రయింపతగు పరంజ్యోతి; తిరుమూழிక్కళత్తు ఆనాయ్ = తిరుమూழிక్కళత్తు మొదలగు దివ్యదేశములలో  వేంచేసియున్నవాడా; ముదలానాయ్ = జగత్కారణభూతుడైనవాడా; పొన్ ఆనాయ్= బంగారమువంటివాడా; పొழிలేழுమ్ కావల్ పూణ్డ పుగழ் ఆనాయ్ = సప్తలోకములను సంరక్షించువాడు అని  చెప్పబడు కీర్తిగలవాడా; ఇగழ்వు ఆయ తొణ్డనేన్ ఏழைయేన్ నాన్ = అపహాస్యము చేయబడునట్లుగ నుండు భక్తుడును, చపలచిత్తుడును అయిన నేను; ఎన్ ఆనాయ్ ఎన్ ఆనాయ్ ఎన్నల్ అల్లాల్  = ” నాయొక్క ఏనుగువంటివాడా!,నాయొక్క ఏనుగువంటివాడా!” అని ఎలుగెత్తి పిలుచుటయే తప్ప; ఎన్ అఱివేన్=ఏమి నాకు తెలుసు ; 

తిరుమాలిరుఞ్జోలై పర్వతముపై వేంచేసినవాడవును,వేంకటాద్రి శిఖరముపై వేంచేసిన వాడవును, పడమటి దిక్కునగల కోవెలలో పవళించుచున్నవాడవును,తిరుక్కణ్ణపురములో వేంచేసినవాడవును, నిత్యశూరులకు కనులార కాంచి అనుభవంచునట్లు ముంగిటనే వేంచేసియుండువాడవును,పరంజ్యోతి స్వరూపడవును,తిరుమూழிక్కళత్తు మొదలగు దివ్యదేశములలో వేంచేసియున్నవాడవును, జగత్కారణభూతుడైనవాడవును, బంగారము వంటివాడవును, సప్తలోకములను సంరక్షించువాడవును,అట్టి సర్వేశ్వరుడైన నిన్ను , అపహాస్యము చేయబడునట్లుగ నుండు భక్తుడును, చపలచిత్తుడును అయిన నేను , ” నాయొక్క ఏనుగువంటివాడా!,నాయొక్క ఏనుగువంటివాడా!” అని ఎలుగెత్తి పిలుచుటయే తప్ప నాకు ఏమియును తెలియదు. ( ఇట్లు తిరుమంగై ఆళ్వార్  శ్రీమన్నారాయణుని దివ్యచరణారవిందములందు    ఒక అనిర్వచనీయమైన భక్తి పారవశ్యముతో  లీనమై నిత్యశూరులు అనుభవించునట్టి  సేవకొరకు తపించుచు సర్వేశ్వరునికి విన్నవించుకొన్నారు.) .

      ( అట్లు శ్రీమన్నారాయణుని ఎడబాటు సహించలేక తిరుమంగై ఆళ్వార్  ఒక పరకాలనాయకి స్థితిలో పరతపించుచుండ ఆ వేదనను చూచిన తల్లి చెప్పు మాటలు)

పట్టుడుక్కు మయర్తిరంగుం పావై పేణాళ్ ,

పనినెడుఙ్గణ్ణీర్ తదుమ్బప్పళ్ళి కొళ్ళాళ్ ,

ఎన్ తుణై పోదెన్ కుడఙ్గాలిరుక్కకిల్లాళ్ ,

ఎమ్బెరుమాన్ తిరువరఙ్గమెఙ్గేయెన్నుమ్ ,

మట్టువిక్కి మణివణ్డుమురలుం కూన్దల్ ,

మడమానై ఇదుశెయ్ దార్ తమ్మై ,మెయ్యే

కట్టువిచ్చి శొల్లెన్న చ్చొన్నాళ్ నఙ్గాయ్ ,

కడల్ వణ్ణరిదు శెయ్ దార్ కాప్పారారే ll 2062

పట్టు ఉడుక్కుమ్ = పట్టు చీర కట్టుకొనినదియు; అయర్ త్తు ఇరంగుమ్ = మోహింపబడి వ్యధ పొందుచున్నదియు; పావై పేణాళ్ = తన కర్రబొమ్మయందు ఇష్టము కోల్పోయినదియు; పని నెడుమ్ కణ్ణీర్ తదుమ్బ = విశాలమైన నేత్రములనుండి చల్లని కన్నీళ్ళు ముంచుకొనివచ్చుచుండగ; ప్పళ్ళి కొళ్ళాళ్ = నిదురించనదియు; ఎన్ తుణై పోదు = ఒక్క క్షణమైనను; ఎన్ కుడమ్ కాల్ ఇరుక్క కిల్లాళ్ = నాయొక్క ఒడిలో ఉండుటకు సహింపలేనిదియు; ఎమ్బెరుమాన్ = నా సర్వేశ్వరునియొక్క; తిరు అరఙ్గమ్ ఎఙ్గే యెన్నుమ్ = శ్రీరంగ క్షేత్రము ఎక్కడున్నది? అని చెప్పును; మణివణ్డు = అందమైన తేనెటీగలు; మట్టువిక్కి = తేనెను బాగుగ గ్రోలి, మురలుం కూన్దల్ = ఝంకారములుచేయు కుంతలములుగల; మడమానై = అందమైన లేడివలెయున్న ఈ చిన్నదానిని;ఇదుశెయ్ దార్ తమ్మై=ఈ విధమైన స్ధితికి తెచ్చినవారెవరో;కట్టువిచ్చి=”ఓ కొఱవ స్త్రీ”; మెయ్యుమ్ శొల్లు ఎన్న =”సత్యముగ చెప్పుమా! ” అని అడగగ;కడల్ వణ్ణర్ ఇదు శెయ్ దార్ = సముద్రమువలె వర్ణముకలిగిన స్వామి ఈ స్ధితిని కలిగించెను; (అని) శొన్నాళ్ = చెప్పెను; నఙ్గాయ్ = నా స్నేహితులారా!;(జగద్రక్షకుడైన ఆ సర్వేశ్వరుడే దీనికి కారణమైనచో)కాప్పార్ ఆరే=ఈ ఆపదను తొలగింపగల సమర్ధులు ఎవరున్నారు?

    పట్టుచీరకట్టుకొనియున్న నా కుమార్తె పరకాలనాయకి మిక్కిలి మోహింపబడి వ్యధతో, తన బొమ్మతో క్రీడించనదియు, కన్నీళ్లు కార్చుచు నిదురించకయు, ఒక క్షణమైనను నాయొక్క ఒడిలో ఉండుటకు సహింపలేక, ” నా సర్వేశ్వరునియొక్క శ్రీరంగ క్షేత్రము ఎక్కడున్నది? ” అని అడుగుచుండును. అందమైన కుంతలములుగల లేడివలెయుండు నాయొక్క కుమార్తెకు ఈ విధమైన స్ధితికి తెచ్చినవారెవరో? అని కొఱవ స్త్రీని ప్రశ్నించగ, ఆమె  ” సముద్రమువలె వర్ణముకలిగిన స్వామి ఈ స్ధితిని కలిగించెను” అని బదులు చెప్పెను. నా స్నేహితులారా!; జగద్రక్షకుడైన ఆ సర్వేశ్వరుడే దీనికి కారణమైనచో నా కుమార్తెకు కలిగిన ఆపదను తొలగింపగల సమర్ధులు ఎవరున్నారు?

నెఞ్జురుగిక్కణ్ పనిప్పనిఱ్కుం శోరుం ,

నెడిదుయిర్కు ముణ్డఱియాళుఱక్కం పేణాళ్, 

నఞ్జరవిల్తుయిలమర్ న్దనమ్బీ యెన్నుం ,

వమ్బార్ పూం వయలాలిమైన్దా ఎన్నుం ,

అఞ్జిఱైయపుట్కొడియే  ఆడుమ్ పాడుం ,

అణియరఙ్గమాడుదుమో తోழீ యెన్నుం ,

ఎన్ శిఱగిన్ కీழ் అడఙ్గా పెణ్ణై ప్పెర్ట్రేన్ ,

ఇరునిలత్తు ఓర్ పழிపడైత్తేన్ ఏ పావమే ll 2063

నెఞ్జు ఉరుగి = (ఈ నా కుమార్తె యొక్క) హృదయము ద్రవించి;క్కణ్ పనిప్ప నిఱ్కుం = కన్నీళ్లు కార్చుచు ఉండును; శోరుం = మూర్చిల్లుచుండును; నెడిదు ఉయిర్ క్కుమ్ = దీర్ఘముగ నిట్టూర్పు విడుచుచుండును; ఉణ్డు అఱియాల్ = భోజనము చేయ తెలియకుండును, ఉఱక్కమ్ పేణాళ్ = నిదురింప ఇష్టపడకుండును; నఞ్జు అరవిల్తు తుయిల్ అమర్ న్ద నమ్బీ యెన్నుం = (విరోధులపై) విషము గ్రక్కుచుండు శేషునియొక్క తల్పమున యోగనిద్రలో నుండు నా స్వామీ! అనుచుండును; వమ్బు ఆర్ పూం వయలాలి మైన్దా ఎన్నుం =పరిమళభరితమైన పుష్పములతోనిండిన తోటలతో చుట్టుకొనియున్న తిరువయలాలి దివ్యదేశములో వేంచేసినయున్న నిత్యయౌవనుడా! అని చెప్పు చుండును;అమ్ శిఱైయ పుళ్ కొడియే ఆడుమ్=అందమైన ఱెక్కలుగల ధ్వజమైన గరుడాళ్వార్ ను అనుకరించుచు ఆడుచుండును;పాడుమ్= పాడుచుండును; తోழீ అణి అరఙ్గమ్ ఆడుదుమో యెన్నుం = నా స్నేహితులారా మనము సుందరమైన శ్రీరంగమందు నాట్యము చేసెదమా? అని పలుకుచుండును; ఎన్ శిఱగిన్ కీழ் అడఙ్గా పెణ్ణై ప్పెర్ట్రేన్=నా చేతికి లొంగని కుమార్తెను పొందితిని; ఇరు నిలత్తు = విశాలమైన ఈ భూమండలమందు;ఓర్ పழி పడైత్తేన్=సాటిలేని అపవాదమును సంపాదించుకొంటిని; ఏ పావమే = అయ్యో ఏ పాపము వలనో కదా!

        ఈ నా కుమార్తెయొక్క హృదయము ద్రవించి, కన్నీళ్లు కార్చుచు ఉండును, మూర్చిల్లుచుండును,నిరాశపడుతూ దీర్ఘముగ నిట్టూర్పు విడుచుచుండును,భోజనము చేయ తెలియకుండును,నిదురింప ఇష్టపడకుండును,విరోధులపై విషము గ్రక్కుచుండు శేషునియొక్క తల్పమున యోగనిద్రలో నుండు నా స్వామీ! అనుచుండును,పరిమళ భరితమైన పుష్పములతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న తిరువయలాలి దివ్యదేశములో వేంచేసినయున్న నిత్యయౌవనుడా! అనిచెప్పుచుండును, శ్రీమన్నారాయణుడు అధిరోహించుటచే అపరిమితానందముతో తన అందమైన ఱెక్కలను కదుపుచు నడచు గరుడాళ్వార్ ను అనుకరించుచు ఆడుచుండును, పాడుచుండును, నా స్నేహితులారా! మనము సుందరమైన శ్రీరంగమందు నాట్యము చేసెదమా? అని పలుకుచుండును, ఇటువంటి నా చేతికి లొంగని కుమార్తెను పొందితిని.ఈ భూమండలమందు సాటిలేని అపవాదమును సంపాదించుకొంటిని. అయ్యో ఏ పాపము వలనో కదా!

కల్ ఎడుత్తు క్కల్ మారి కాత్తాయెన్ఱుమ్ ,

కామరు పూఙ్గచ్చి యూరగత్తాయెన్ఱుమ్ ,

విల్ ఇరుత్తు మెల్లియల్ తోళ్ తోయ్ న్దాయెన్ఱుమ్ ,

వెహ్ కావిల్ తుయిలమర్ న్ద వేన్దే యెన్నుం ,

మల్ అడర్తు మల్లరై అన్ఱు అట్టాయెన్ఱుమ్ ,

మాకీణ్డ కైతలత్తు ఎన్ మైన్దా యెన్ఱుమ్, 

శొల్ ఎడుత్తు త్తన్ కిళియై చ్చొల్లేయెన్ఱు ,

తుణై ములైమేల్ తుళిశోర చ్చోర్ గిన్ఱాళే ll 2064

కల్ మారి =(ఈ నా కుమార్తె)ఇంద్రునిచే కురుపింపబడిన రాళ్ళ వర్షమునుండి;కల్ ఎడుత్తు=ఒక పర్వతమును ఎత్తిపట్టుకొని; కాత్తాయ్ ఎన్ఱుమ్ = (గోకులమును) కాపాడినవాడా! అనియు; కామరు పూమ్ కచ్చి ఊరగత్తాయ్ ఎన్ఱుమ్ = అందరిచే ఆశింపబడు అందమైన కాంచీపురములోగల తిరు ఊరగం దివ్యదేశములో వేంచేసినవాడా! అనియు;   విల్ ఇరుత్తు మెల్లియల్ తోళ్ తోయ్ న్దాయ్ ఎన్ఱుమ్ = విల్లును విరిచి మృదువైన భుజములుగల సీతాదేవిని పరిణయమాడిన వాడా! అనియు; వెహ్ కావిల్ తుయిల్ అమర్ న్ద వేన్దే యెన్నుం = తిరు వెఃకావిల్ దివ్యదేశములో పవళించియున్న ప్రభువా! అనియు;  అన్ఱు = ఒకానొక కాలమందు; మల్ అడర్తు మల్లరై అట్టాయ్ ఎన్ఱుమ్ =బలమును నశింపజేసి మల్లులను వధించినవాడా! అనియు;మా కీణ్డ = అశ్వరూపములో వచ్చిన కేశియను అశురుని చీల్చినటువంటి; కైతలత్తు = దివ్యమైన హస్తములుగల; ఎన్ మైన్దా యెన్ఱుమ్ = నా స్వామీ!అనియు; తన్ కిళియై = తనయొక్క చిలకనుచూచి; శొల్ ఎడుత్తు = తిరునామములోని మొదటి పదములను అందింపజేసి; శొల్లే యెన్ఱు=తరువాత వచ్చుపదములు నీవు చెప్పవే అని చెప్పి; (ఆ చిలుక చెప్పుచుండగ) తుణై ములైమేల్ = తనరెండు స్తనములపైనుండి; తుళిశోర = కన్నీళ్లుదారదారలుగ ప్రవహించునట్లు; శోర్ గిన్ఱాళే =మిక్కిలి బాధపడుచున్నది (అయ్యో!)

   ఈ నా కుమార్తె, ఇంద్రునిచే కురుపింపబడిన రాళ్ళ వర్షమునుండి గోవర్ధన  పర్వతమును ఎత్తిపట్టుకొని గోకులమును కాపాడినవాడా! అనియు, కాంచీపురములోగల తిరు ఊరగం దివ్యదేశములో వేంచేసినవాడా!అనియు, శివధనస్సును విరిచి సీతాదేవిని పరిణయమాడిన వాడా! అనియు,తిరు వెఃకావిల్ దివ్యదేశములో పవళించియున్న ప్రభువా! అనియు,చాణూరముష్టికులనబడు మల్లులను వధించినవాడా! అనియు,అశ్వరూపములో వచ్చిన కేశియను అశురుని చీల్చినటువంటి దివ్యమైన హస్తములుగల నా స్వామీ! అనియు, చెప్చుచు , తనయొక్కచిలకనుచూచి దానికి తిరునామములోని మొదటి పదములను అందింపజేసి తరువాత వచ్చుపదములు నీవు చెప్పవే అని చెప్పి,ఆ చిలుక చెప్పుచుండగ మిక్కిలి ఆనందముతోను,  సర్వేశ్వరుని ఎడబాటును తలచుకొనుచు, తనరెండు స్తనములపైనుండి కన్నీళ్లు దారదారలుగ ప్రవహించునట్లు మిక్కిలి బాధపడుచున్నది. 

ముళైక్కదిరై క్కుఱుఙ్గుడియుళ్ ముగిలై , మూవా

మూవులగుమ్ కడన్దు అప్పాల్ ముదలాయ్ నిన్ఱ ,

అళప్పరియ ఆరముదై అరఙ్గమేయ

అన్దణనై , అన్దణర్ తమ్ శిన్దయానై ,

విళక్కొళియై మరతకత్తై తిరుత్తణ్ కావిల్ ,

వెహ్ కావిల్ తిరుమాలై ప్పాడకేట్టు ,

వళర్తదనాల్ పయన్ పెర్ట్రేన్ వరుగ ఎన్ఱు ,

మడక్కిళియై క్కైకూప్పి వణఙ్గినాళే ll 2065

ముళై క్కదిరై=బాల సూర్యునివలె నుండువాడును;క్కుఱుఙ్గుడియుళ్ ముగిలై = తిరు కుఱుంగుడి దివ్యదేశములో కాళమేఘమువలె ప్రకాశించువాడును; మూవా మూ ఉలగుమ్ కడన్దు = నిత్యమైన మూడు లోకములను అతిక్రమించి; అప్పాల్ = పరమపదమందు; ముదలాయ్ నిన్ఱ = (లీలావిభూతికిని, నిత్యవిభూతికిని) మూల కారణముగ నుండువాడును;అళప్పు అరియ=లెక్కింపశఖ్యముకాని స్వరూపగుణములు కలవాడును; ఆర్ అముదై = భోగ్యమైన తేనె వంటివాడును; అరఙ్గమేయ అన్దణనై = తిరువరంగములో నిత్యవాసము చేయుచున్న పరమశుద్ధుడును; అన్దణర్ తమ్ శిన్దయానై= వేదోత్తముల హృదయమందు వసించువాడును; తిరుత్తణ్ కావిల్ విళక్కు ఒళియై = తిరుత్తణ్ కావిల్ దివ్యదేశములో  ‘విళక్కుఒళి పెరుమాళ్’ గ దర్శనమిచ్చు వాడును; మరదకత్తై = మరకతమణివలె మనోహరమైన స్వరూపము గలవాడును; వెహ్ కావిల్ తిరుమాలై = తిరు వెఃకావిల్ దివ్యదేశములో పవళించియున్న శ్రీమన్నారాయణుని; పాడ కేట్టు=(చిలుక)పాడగ (ఆ పాశురములను)విని;మడ కిళియై = అందమైన ఆ చిలుకను చూచి;వళర్తదనాల్ పయన్ పెర్ట్రేన్ వరుగ ఎన్ఱు = ” నిన్నుపెంచినందులకు ప్రయోజనమును నేను పొందితిని, నా వద్దకు రా ” అని పిలిచి; క్కై కూప్పి వణఙ్గినాళే =  దానికి చేతులు జోడించి నమస్కరించుచున్నది.

                       ఈ నా కుమార్తె ,పరమపదమందు లీలావిభూతికిని, నిత్యవిభూతికిని మూల కారణమైనవాడును, అంతులేని కల్యాణగుణములు గలవాడును,భోగ్యమైన తేనె వంటివాడును, తిరువరంగములో నిత్యవాసము చేయుచున్న పరమశుద్ధుడును, వేదోత్తముల హృదయమందు వసించువాడును,తిరుత్తణ్ కావిల్ దివ్యదేశములో  ‘విళక్కుఒళి పెరుమాళ్’ గ దర్శనమిచ్చు వాడును, మరకతమణివలె మనోహరమైన స్వరూపము గలవాడును,తిరు వెఃకావిల్ దివ్యదేశములో పవళించియున్న శ్రీమన్నారాయణుని, మనోహరమైన పాశురములచే స్తుతించిచున్న అందమైన ఆ చిలుకను చూచి, మిక్కిలి పరవశించి, “నిన్ను పెంచినందులకు వెలలేని ప్రయోజనమును నేను పొందితిని, నా వద్దకు రా ” అని పిలిచి, దానికి చేతులు జోడించి నమస్కరించుచుండును.

కల్ ఉయర్ న్ద నెడుమదిళ్ శూழ் కచ్చి మేయ

కళిఱెన్ఱుమ్ , కడల్ కిడన్ద కనియే యెన్ఱుమ్ ,

అల్లియమ్బూ మలర్ ప్పొయ్ గై ప్పழన వేలి ,

అణియழ்న్దూర్ నిన్ఱుగన్ద అమ్మానెన్ఱుమ్ ,

శొల్లుయర్ న్ద నెడువీణై ములైమేల్ తాఙ్గి ,

తూముఱువల్ నకై యిఱయే తోన్ఱనక్కు ,

మెల్ విరల్ గళ్ శివప్పెయ్ దత్తడవియాఙ్గే ,

మెన్ కిళిపోల్ మిగమిழర్ట్రుమ్ ఎన్ పేదైయే ll 2066

కల్ ఉయర్ న్ద నెడుమదిళ్ శూழ் = రాతితో కట్టబడిన ఎత్తైనపెద్ద ప్రాకరములచే చుట్టబడిన; కచ్చి మేయ = కాంచీపురములో నిత్యవాసము చేయుచున్న  ; కళిఱు ఎన్ఱుమ్ = మత్తగజమనియు;కడల్ కిడన్ద కనియే యెన్ఱుమ్=పాలసముద్రమున పవళించుచున్న పండువలె భోగ్యమైనవాడనియు; అల్లి అమ్ పూమలర్ ప్పొయ్ గై = పుప్పొడి రేణువులతో అందమైన పరిమళభరితమైన పుష్పములతోనిండిన తటాకములును; పழనమ్ = పొలములను; వేలి = కంచెలవలె చుట్టుకొనియున్న; అణి అழுన్దూర్ = అందమైన తిరుఅழுన్దూర్ దివ్యదేశములో; నిన్ఱు ఉగన్ద అమ్మాన్ ఎన్ఱుమ్ = మిక్కిలి ఆనందముతో వేంచేసియున్న స్వామీ! అనియు;(చెప్పుచు) శొల్ ఉయర్ న్ద = హెచ్చు స్థాయిలో; నెడు=ఇంపైన సప్తస్వరములతోకూడిన;వీణై = వీణను; ములై మేల్ = తనయొక్క వక్షోజములకు; తాఙ్గి = చేర్చి; తూ మఱువల్=పరిశుద్దమైన మందహాసముతో;  నగై= పళ్ళ వరుసలు; ఇఱైయే తోన్ఱ = కొంచెము కొంచెముగ కనబడునట్లు, నక్కు = నవ్వి; మెల్ విరల్ గళ్ = తనయొక్క మృదువైన చేతి వేళ్లు; శివప్పు ఎయ్ ద = ఎఱ్ఱబడునట్లు; తడవి = వీణ తీగలను మీటుచూ; ఆఙ్గే=అటుపిమ్మట;ఎన్ పేదై=నా కుమార్తె; మెన్ కిళిపోల్=చిన్న చిలుకవలె; మిగ మిழర్ట్రుమ్=అనేక విధములుగ పాడుచూనుండును.

రాతితో కట్టబడిన ఎత్తైనపెద్ద ప్రాకరములచే చుట్టబడిన కాంచీపురములో నిత్యవాసము చేయుచున్నమత్తగజమనియు, పాలసముద్రమున పవళించుచున్న పండువలె భోగ్యమైనవాడనియు, పుప్పొడి రేణువులతో అందమైన పరిమళభరితమైన పుష్పములతో నిండిన తటాకములును పొలములను, కంచెలవలె చుట్టుకొనియున్నఅందమైన తిరుఅழுన్దూర్ దివ్యదేశములో మిక్కిలి ఆనందముతో వేంచేసియున్న స్వామీ! అనియు (చెప్పుచు) హెచ్చు స్థాయిలో ఇంపైన సప్తస్వరములతోకూడిన వీణను, తనయొక్క వక్షోజములకు చేర్చిపరిశుద్దమైన మందహాసముతో పళ్ళ వరుసలు కొంచెము కొంచెముగ కనబడునట్లు, నవ్వి తనయొక్క మృదువైన చేతి వేళ్లు ఎఱ్ఱబడునట్లు వీణ తీగలను మీటుచూ అటుపిమ్మట నా కుమార్తె చిన్న చిలుకవలె అనేక విధములుగ పాడుచూనుండును.

** కన్ఱుమేయ్ త్తు ఇనిదు ఉగన్ద కాళాయ్ ఎన్ఱుమ్ ,

కడి పొழிల్ శూழ் కణపురత్తు ఎన్ కనియే యెన్ఱుమ్ ,

మన్ఱు అమర కూత్తాడి మగిழ் న్దాయ్ ఎన్ఱుమ్ ,

వడతిరువేఙ్గడమ్మేయ  మైన్దాయెన్ఱుమ్ ,

వెన్ఱు అశురర్ కులమ్ కళైన్ద వేన్దేయెన్ఱుమ్ ,

విరి పొழிల్ శూழ்  తిరునఱై యూర్  నిన్ఱాయెన్ఱుమ్ ,

తున్ఱు కుழల్ కరునిఱత్తు ఎన్ తుణైయే యెన్ఱుమ్ ,

తుణైములైమేల్ తుళిశోర చ్చోర్ కిన్ఱాళే ll 2067

కన్ఱుమేయ్ త్తు=ఆవులను రక్షించి; ఇనిదు ఉగన్ద కాళాయ్ ఎన్ఱుమ్ = మిక్కిలి సంతోషించిన యౌవనుడా!అనియు; కడి పొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన; కణపురత్తు = తిరుక్కణ్ణపురములో; ఎన్ కనియే ఎన్ఱుమ్ = నాయొక్క పండే!అనియు; మన్ఱు అమర కూత్తాడి మగిழ் న్దాయ్ ఎన్ఱుమ్ = వీధులనడుమ కుండలతో నృత్యముచేసి సంతోషించినవాడా! అనియు;వడ తిరువేఙ్గడమ్ మేయ  మైన్దా యెన్ఱుమ్= దక్షిణదిక్కున గల తిరు వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న స్వామీ! అనియు; అశురర్ కులమ్ = అశురుల కులములను; వెన్ఱు = జయించి; కళైన్ద=నిర్మూలించిన; వేన్దే యెన్ఱుమ్ = ప్రభువా!అనియు;విరి పొழிల్ శూழ்  తిరునఱై యూర్  నిన్ఱాయ్ ఎన్ఱుమ్ = వ్యాప్తిచెందుచున్న తోటలతో చుట్టబడిన తిరునఱై యూర్ దివ్య దేశములో వేంచేసినవాడా! అనియు;తున్ఱు కుழల్ కరునిఱత్తు ఎన్ తుణైయే యెన్ఱుమ్=దట్టమైన కేశముల జడలును, నల్లని తిరుమేనియును కలిగిన వాడా, నాకుసహాయకుడా!అనియు, (చెప్పుచు) తుణై ములైమేల్ =  తనరెండు స్తనములపైనుండి; తుళిశోర = కన్నీళ్లు దారదారలుగ ప్రవహించునట్లు;శోర్ గిన్ఱాళే=మిక్కిలి బాధపడుచున్నది.(అయ్యో!)

ఆవులను రక్షించి మిక్కిలి సంతోషించిన యౌవనుడా!అనియు, పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుక్కణ్ణపురములో నాయొక్క పండే!అనియు, వీధులనడుమ కుండలతో నృత్యముచేసి సంతోషించినవాడా! అనియు, దక్షిణదిక్కున గల తిరు వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న స్వామీ! అనియు, అశురుల కులములను జయించి నిర్మూలించిన ప్రభువా! అనియు, వ్యాప్తిచెందుచున్న తోటలతో చుట్టబడిన తిరునఱై యూర్ దివ్య దేశములో వేంచేసినవాడా! అనియు, దట్టమైన కేశముల జడలును, నల్లని తిరుమేనియును కలిగిన వాడా, నాకుసహాయకుడా!అనియు, (చెప్పుచు)   తనరెండు స్తనములపైనుండి కన్నీళ్లు దారదారలుగ ప్రవహించునట్లు మిక్కిలి బాధపడుచున్నది.(అయ్యో!)

పొఙ్గార్ మెన్ ఇళంకొఙ్గై పొన్నే పూప్ప ,

పొరుకయల్కణ్ణీరరుమ్బ ప్పోన్దు నిన్ఱు ,

శెఙ్గాల మడప్పుఱవమ్ పెడైక్కు ప్పేశుమ్ ,

శిఱుకురలుక్కు ఉడలురుకిచ్చిన్దిత్తు , ఆఙ్గే

తఙ్గాలుమ్ తణ్ కుడన్దై నగరమ్ పాడి ,

త్తణ్ కోవలూర్ పాడియాడ క్కేట్టు ,

నఙ్గాయ్ నంకుడిక్కిదువోనన్మైయెన్న ,

నఱై యూరుం పాడువాళ్ నవిల్కిన్ఱాళే ll 2068

పొఙ్గు ఆర్ మెన్ ఇళం కొఙ్గై = వృద్ది పొందుచున్నదియు, మృదువైనదియు, యౌవనమైనదియు అయిన వక్షోజములు; పొన్నే పూప్ప = వివర్ణమవగా; పొరు కయల్ కణ్ = ఒకదానితొ ఒకటి పోరుసలిపెడి రెండు మీనములు వలెనున్న నేత్రములు;నీర్ అరుమ్బ = కన్నీళ్లు కార్చగ; శెమ్ కాల మడమ్ ప్పుఱవమ్ పెడైక్కు ప్పేశుమ్ శిఱుకురలుక్కు = ఎఱ్ఱని కాళ్ళుగల యౌవనమైన మొగ పావురములు తమ ఆడ పావురములతో చిన్న స్వరములో సంభాషించు విధమునకు;ఉడల్ ఉరుగి = శరీరము కరిగి; శిన్దిత్తు = (అతను సంభాషించిన తీరును) తలచి; ఆఙ్గే = ఆసమయములో; తణ్ కాలుమ్ = తిరు తణ్ కాల్ దివ్యదేశమును; తణ్ కుడన్దై నగరమ్ = చల్లని తిరు క్కుడందై దివ్య దేశమును; పాడి = నోరార గానముచేసి; తణ్ కోవలూర్= చల్లని తిరు కోవలూర్ దివ్యదేశమును; పాడియాడ = గానము చేసి నృత్యము చేయగ; కేట్టు = ఆ శబ్దములను నేను విని; నఙ్గాయ్ = ‘ నా చిట్టితల్లీ! ‘ ; నమ్ కుడిక్కు = మనయొక్క వంశమునకు; ఇదు నన్మయో ఎన్న = నోరు తెరిచి బిగ్గరగ  పిలుచుట మొదలగు కృత్యములు శ్రేయమా?  అని నేను చెప్పగ; నఱై యూరుం = తిరునఱైయూర్ దివ్యదేశమును; పాడువాళ్ నవిల్ కిన్ఱాళే = గానముచేయ మొదలిడెను.

వృద్ది పొందుచున్నదియు, మృదువైనదియు, యౌవనమైనదియు అయిన వక్షోజములు వివర్ణమవగా ఒకదానితొ ఒకటి పోరు సలిపెడి రెండు మీనములు వలెనున్న నేత్రములు కన్నీళ్లు కార్చగ, ఎఱ్ఱని కాళ్ళుగల యౌవనమైన మొగ పావురములు తమ ఆడ పావురములతో చిన్న స్వరములో సంభాషించు విధమునకు శరీరము కరిగి (అతను సంభాషించిన తీరును ) తలచి; ఆసమయములో తిరు తణ్ కాల్ దివ్యదేశమును, చల్లని తిరు క్కుడందై దివ్య దేశమును నోరార గానముచేసి, చల్లని తిరు కోవలూర్ దివ్యదేశమును గానము చేసి నృత్యము చేయగ ఆ శబ్దములను నేను విని, ‘ నా చిట్టితల్లీ! ‘ మనయొక్క వంశమునకు నోరు తెరిచి బిగ్గరగ  పిలుచుట మొదలగు కృత్యములు శ్రేయమా?  అని నేను చెప్పగ తిరునఱైయూర్ దివ్యదేశమును గానముచేయ మొదలిడెను.

కార్ వణ్ణం తిరుమేని కణ్ణుం వాయుమ్ ,

కైత్తలముమ్ అడియిణైయుమ్ కమలవణ్ణమ్ ,

పార్ వణ్ణమడమఙ్గైపత్తర్ , పిత్తర్ 

పనిమలర్ మేల్ పావైక్కు ప్పావం శెయ్ దేన్ ,

ఏర్ వణ్ణ ఎన్ పేదై ఎన్ శొల్ కేళాళ్ ,

ఎమ్బెరుమాన్ తిరువరఙ్గమెఙ్గేయెన్నుమ్ ,

నీర్ వణ్ణన్ నీర్ మలైక్కేపోవేనెన్నుమ్ ,

ఇదువన్ఱో నిఱైవழிన్దార్ నిఱ్కుమాఱే ll 2069

పావమ్ శెయ్ దేన్ ఎన్ = పాపియైన నాయొక్క; ఏర్ వణ్ణ పేదై = మిక్కిలి అందమైన రూపముగల కుమార్తె; ఎన్ శొల్ కేళాళ్ = నాయొక్క మాటలు వినిపించికొనదు; తిరుమేని కార్ వణ్ణమ్ ఎన్నుమ్ = (సర్వేశ్వరునియొక్క) తిరుమేని కాలమేఘవర్ణమువంటిదని చెప్పుచుండును; కణ్ణుం వాయుమ్ కైత్తలముమ్ అడియిణైయుమ్ = (ఆ సర్వేశ్వరుని) నేత్రములు,అదరములు,హస్తములు, పాదద్వందములు; కమల వణ్ణమ్ ఎన్నుమ్ = తామర పుష్పమువంటి వర్ణము కలిగియుండునని చెప్పుచుండును; పార్ వణ్ణమ్ మడ మఙ్గై పత్తర్ ఎన్నుమ్ = (ఆ స్వామి) భూదేవి అధీనమైయుండునని చెప్పుచుండును;పనిమలర్ మేల్ పావైక్కు పిత్తర్ ఎన్నుమ్ = చల్లని ఎఱ్ఱ తామరపుష్పమందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మి యెడల అమిత వ్యామోహము కలిగియుండునని చెప్పుచుండును;ఎమ్ పెరుమాన్ తిరువరఙ్గమ్ ఎఙ్గే యెన్నుమ్ =నన్ను వశపరుచుకొనిన సర్వేశ్వరుని శ్రీరంగం ఎక్కడున్నదో? అని చెప్పుచుండును; నీర్ వణ్ణన్ నీర్ మలైక్కే పోవేన్ ఎన్నుమ్=నీటివంటి స్వభావముగల  సర్వేశ్వరుడు  కృపతో వేంచేసిన తిరు నీర్ మలై దివ్యదేశమునకు పోవుదునని చెప్పుచుండును; నిఱైవు అழிన్దార్ నిఱ్కుమాఱు ఇదువన్ఱో = నియంత్రణ తప్పినవారి స్వభావము ఈవిధముగనే ఉండునుగదా!

పాపియైన నాయొక్క మిక్కిలి అందమైన రూపముగల కుమార్తె నాయొక్క మాటలు వినిపించికొనదు (సర్వేశ్వరునియొక్క) తిరుమేని కాలమేఘవర్ణమువంటిదని చెప్పుచుండును,(ఆ సర్వేశ్వరుని) నేత్రములు,అదరములు,హస్తములు,పాదద్వందములు తామర పుష్పమువంటి వర్ణము కలిగియుండునని చెప్పుచుండును, (ఆ స్వామి) భూదేవి అధీనమైయుండునని చెప్పుచుండును, చల్లని ఎఱ్ఱ తామరపుష్పమందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మి యెడల అమిత వ్యామోహము కలిగియుండునని చెప్పుచుండును, నన్ను వశపరుచుకొనిన సర్వేశ్వరుని శ్రీరంగం ఎక్కడున్నదో? అని చెప్పుచుండును, నీటివంటి స్వభావముగల సర్వేశ్వరుడు  కృపతో వేంచేసిన తిరు నీర్ మలై దివ్యదేశమునకు పోవుదునని చెప్పుచుండును, నియంత్రణ తప్పినవారి స్వభావము ఈవిధముగనే ఉండునుగదా!

మూర్ట్రారావనములైయాల్ పావై , మాయన్

మొయ్య కలత్తుళ్ళిరుప్పాళహ్ తుఙ్గణ్డు 

ఆర్ట్రాళ్ , తన్నిఱై యழிన్దాళావిక్కిన్ఱాళ్ ,

అణియరఙ్గ  మాడుదుమో తోழீయెన్నుమ్ ,

పెర్ట్రేన్ వాయ్ చ్చొల్లిఱైయుం పేశక్కేళాళ్ ,

పేర్పాడి త్తణ్ కుడన్దైనగరుమ్బాడి ,

పొర్ట్రామరైక్కయం నీరాడప్పోనాళ్ ,

పొరువర్ట్రాళెన్మగుళున్ పొన్నుం అహ్ దే ll 2070

పొరువు అర్ట్రాళ్ ఎన్ మగళ్ = తనకు ఎవ్వరు సాటిలేని నా కుమార్తె; ముర్ట్రు ఆరా వనమ్ ములైయాళ్ = సంపూర్ణముగ పెరగని అందమైన వక్షోజములుగల; పావై = శ్రీమహాలక్ష్మి; మాయన్ = అద్భుతమైన సర్వేశ్వరునియొక్క;మొయ్ అగలత్తుళ్ ఇరుప్పాళ్ అఃదు కణ్డు = సుందరమైన వక్షస్థలమందు నిత్యవాసము చేయుచున్నదియు,వారిరువరి నడమగల అనిర్వచనీయమైన ప్రేమానురాగములను చూచియు; ఆర్ట్రాళ్ = ఆ సర్వేశ్వరునినే తాను పొందగోరెను; తన్ నిఱైవు అழிన్దాళ్ = తాను ఒక స్త్రీ అను భావము  (తాను ఆ సర్వేశ్వరుడు స్వయముగ వచ్చి చేరువరుకు వేచియుండుట) విడిచిపెట్టెను; ఆవిక్కిన్ఱాళ్=దీర్ఘముగ నిట్టూర్పు విడుచుచుండును;తోழீ అణి అరఙ్గమ్  ఆడుదుమో ఎన్నుమ్ =” ఓ స్నేహితురాలా! శ్రీరంగం దివ్యదేశములో మనము కలసి ఆడుదుమా! ” అని చెప్పును; పెర్ట్రేన్ = కనిన తల్లియైన నేను; వాయ్ శొల్ పేశ = హితమైన కొన్ని మాటలు చెప్పినను; ఇఱైయుం=కొంచెమైనను; కేళాళ్=వినిపించికొనదు; పేర్ పాడి = తిరుప్పేర్ నగరమును స్తుతించి; తణ్ కుడన్దై నగరుమ్ పాడి = చల్లని తిరు క్కుడందై దివ్య దేశమును స్తుతించియు; పొన్ తామరై కయమ్ = బంగారు తామరపూలతో నిండిన కొలనులో; నీర్ ఆడ = స్నానమాచరించుటకు; పోనాళ్ = చనుదెంచెను; ఉమ్ పొన్నుమ్ అఃదే = మీయొక్క కుమార్తె స్వభావముకూడ ఈ విధముగనే ఉండునా!.

తనకు ఎవ్వరు సాటిలేని నా కుమార్తె సంపూర్ణముగ పెరగని అందమైన వక్షోజములుగల శ్రీమహాలక్ష్మి అద్భుతమైన సర్వేశ్వరునియొక్క సుందరమైన వక్షస్థలమందు నిత్యవాసము చేయుచున్నదియు,వారిరువరి నడమగల అనిర్వచనీయమైన ప్రేమానురాగములను చూచియు ఆ సర్వేశ్వరునినే తాను పొందగోరెను తాను ఒక స్త్రీ అను భావము  (తాను ఆ సర్వేశ్వరుడు స్వయముగ వచ్చి చేరువరుకు వేచియుండుట) విడిచిపెట్టెను, దీర్ఘముగ నిట్టూర్పు విడుచుచుండును,” ఓ స్నేహితురాలా! శ్రీరంగం దివ్యదేశములో మనము కలసి ఆడుదుమా! ” అని చెప్పును; కనిన తల్లియైన నేను హితమైన కొన్ని మాటలు చెప్పినను కొంచెమైనను వినిపించికొనదు; తిరుప్పేర్ నగరమును స్తుతించి, చల్లని తిరు క్కుడందై దివ్య దేశమును స్తుతించియు , బంగారు తామరపూలతో నిండిన కొలనులో స్నానమాచరించుటకు చనుదెంచెను. మీయొక్క కుమార్తె స్వభావముకూడ ఈ విధముగనే ఉండునా!.

తేరాళుమ్ వాళ్ అరక్కన్ మాళ శెల్వమ్ మాళ ,

తెన్నిలఙ్గైమున్ మలఙ్గచ్చెన్దీయొల్ గి ,

పోరాళనాయిరన్దోళ్ వాణన్ మాళ ,

ప్పొరుకడలై అరణ్ కడన్దు పుక్కుమిక్క 

పారాళన్ , పార్ ఇడన్దు పారై యుణ్డు 

పారుమిழுన్దు పారళన్దు , పారై ఆణ్డ

పేరాళన్ , పేరోతుమ్ పెణ్ణై మణ్ మేల్ ,

పెరుమ్ తవత్తళెన్ఱల్లాల్ పేశలామే ll 2071

మున్= పూర్వము ఒకానొకప్పుడు;తేరాళుమ్ వాళ్ అరక్కన్=రథయుద్దసామర్ధ్యుడును, కత్తియుద్దములో  ఆరితేరినవాడును అయిన రావణాసురునియొక్క; శెల్వమ్ మాళ = ఐశ్వర్యమంతయు నశింపజేసియు; తెన్ ఇలఙ్గై మలఙ్గ = అతని అందమైన లంకాపురిని  ధ్వంసముచేసియు;శెమ్ తీ ఒల్గి=(హనుమంతుని పంపి)ఎఱ్ఱని అగ్నిచే కాల్చియు; (మరియు)పోర్ ఆళన్=యుద్దమును చేయుటయే స్వభావముగాగల; వాణన్= భాణాసురుని యొక్క;ఆయిరమ్ తోళ్ మాళ = సహస్రభుజములను నశింపజేయుటకు; పొరు కడల్ అరణై కడన్దు = అలలు కొట్టుచున్న సముద్రమను కోటను దాటి;పుక్కు= భాణాపురమును ప్రవేశించి; మిక్క= వీరలక్ష్మిని కలిగినవాడును; పారాళన్ = భూమికి నిర్వాహకుడును;పార్ ఇడన్దు (వరాహరూపముదాల్చి) భూమిని అండభిత్తినుండి పైకెత్తినవాడును;పార్ యుణ్డు = ( ప్రళయకాలమున )భూమిని తన ఉదరమున నుంచుకొన్నవాడును;పార్ ఉమిழுన్దు=(సృష్ఠికాలమున)ఆ భూమిని బైటకు వెలిపరచినవాడును; పారళన్దు= త్రివిక్రమావతారమందు ఆ భూమిని తన పాదముచే కొలిచినవాడును; పారై ఆణ్డ =ఈ లోకములంతను రక్షించువాడైన; పేర్ ఆళన్ = గొప్ప కీర్తిగల సర్వేశ్వరునియొక్క; పేర్ = దివ్య నామములను; ఓదుమ్=ఎల్లప్పుడును చెప్పుచున్న;పెణ్ణై=ఈ నా కుమార్తె;మణ్ మేల్= ఈ భూమండలమందు; పెరుమ్ తవత్తళ్ ఎన్ఱు అల్లాల్ పేశలామే = మహా భాగ్యవంతురాలు అని చెప్పవచ్చునా లేక  వేరొక విధముగా చెప్పవచ్చునా?

పూర్వము ఒకానొకప్పుడు రథయుద్దసామర్ధ్యుడును, కత్తియుద్దములో  ఆరితేరినవాడును అయిన రావణాసురునియొక్క ఐశ్వర్యమంతయు నశింపజేసియు, అతని అందమైన లంకాపురిని  ధ్వంసముచేసియు,(హనుమంతుని పంపి)ఎఱ్ఱని అగ్నిచే కాల్చియు, (మరియు) యుద్దమును చేయుటయే స్వభావముగాగల భాణాసురుని యొక్క సహస్రభుజములను నశింపజేయుటకు అలలు కొట్టుచున్న సముద్రమను కోటను దాటి భాణాపురమును ప్రవేశించి వీరలక్ష్మిని కలిగినవాడును భూమికి నిర్వాహకుడును, (వరాహరూపముదాల్చి) భూమిని అండభిత్తినుండి పైకెత్తినవాడును,( ప్రళయకాలమున ) భూమిని తన ఉదరమున నుంచుకొన్నవాడును,(సృష్ఠికాలమున) ఆ భూమిని బైటకు వెలిపరచినవాడును, (త్రివిక్రమావతారమందు) ఆ భూమిని తన పాదముచే కొలిచిన వాడును,ఈ లోకములంతను రక్షించువాడైన గొప్ప కీర్తిగల సర్వేశ్వరునియొక్క దివ్య నామములను ఎల్లప్పుడును చెప్పుచున్నఈ నా కుమార్తె ఈ భూమండలమందు మహా భాగ్యవంతురాలు అని చెప్పవచ్చునా లేక  వేరొక విధముగా చెప్పవచ్చునా?

** మైవణ్ణ నఱుఙ్గుఞ్జి కుழల్ పిన్ తాழ ,

మకరమ్ శేర్ కుழை యిరుపాడు ఇలఙ్గియాడ ,

ఎయ్ వణ్ణ వెఞ్డిలైయే తుణైయా , ఇఙ్గే

ఇరువరాయ్ వన్దార్ ఎన్ మున్నే నిన్ఱార్ ,

కైవణ్ణం తామరై వాయ్ కమలం పోలుమ్ ,

కణ్ణిణైయుం అరవిన్దమడియుమఃదే ,

అవణ్ణత్తర్ నిలమై కణ్డుమ్ తోழி ,

అవరై నామ్ తేవరెన్ఱఞ్జినోమే ll 2072

మై వణ్ణమ్ నఱు కుఞ్జి కుழల్ పిన్ తాழ=కాటుకవలె నల్లని పరిమళభరితమైన గిరిజములు గల కేశజాలములు వెనుక కదులచుండగ; ఇరు పాడు=రెండు వైపుల; మకరమ్ శేర్ కుழை = చెవులయందున్న మకరకుణ్డలములు; ఇలఙ్గి ఆడ=ధగధగ ప్రకాశించుచు ఆడుచుండగ; ఎయ్ వణ్ణమ్ వెమ్ శిలైయే తుణైయా = (బాణములను)  ప్రయోగించుటయే స్వభావముగల భయంకరమైన విల్లునే సహాయముగ గైకొని;ఇఙ్గే =ఈ తిరుమణమ్ కొల్లై ప్రదేశములో; ఇరువర్ ఆయ్ నిన్ఱార్=(తానును,లక్ష్మణస్వామియును) ఇద్దరును నా ఎదుటనే నిలిచిరి; (అతనియొక్క) కై=హస్తములు; తామరై వణ్ణమ్ = ఎఱ్ఱ తామరపూవువంటి అందముతోను; వాయ్=అదరములు;కమలమ్ పోలుమ్=కమలము వలెను; కణ్ ఇణైయుమ్ = నేత్రములు; అరవిందమ్ = అరవిందమువలెను;అడియుమ్ = పాదద్వందములు; అఃదే =ఆ తామర  పుష్పమువంటి వర్ణముతోనే మిక్కిలి అందముగ ఉన్నవి; అవ్వణ్ణత్తవర్ = అటువంటి సుందరమైన ఆ స్వామి యొక్క; నిలమై = స్వరూపమును; కణ్డుమ్= చూచినపిదప; తోழீ =  ఓ!నాయొక్క స్నేహితురాలా!; అవరై = అతని విషయమై; నామ్ = నేను; తేవర్ ఎన్ఱు అఞ్జినోమే = పరదేవతయని భావనచే భయపడితినే!.

కాటుకవలె నల్లని పరిమళభరితమైన గిరిజములు గల కేశజాలములు వెనుక కదులచుండగ రెండు వైపుల చెవులయందున్న మకరకుణ్డలములు ధగధగ ప్రకాశించుచు ఆడుచుండగ (బాణములను)  ప్రయోగించుటయే స్వభావముగల భయంకరమైన విల్లునే సహాయముగ గైకొని ఈ తిరుమణమ్ కొల్లై ప్రదేశములో(తానును,లక్ష్మణస్వామియును) ఇద్దరును నా ఎదుటనే నిలిచిరి (అతనియొక్క) హస్తములు,ఎఱ్ఱ తామరపూవువంటి అందముతోను,అదరములు కమలము వలెను, నేత్రములు అరవిందమువలెను, పాదద్వందములు ఆ తామర  పుష్పమువంటి వర్ణముతోనే మిక్కిలి అందముగ ఉన్నవి. అటువంటి సుందరమైన ఆ స్వామి యొక్క స్వరూపమును చూచినపిదప   ఓ!నాయొక్క స్నేహితురాలా! అతని విషయమై నేను పరదేవతయని భావనచే భయపడితినే!.

నైవళమొన్ఱారాయా నమ్మై నోక్కా ,

నాణినార్పోల్ ఇఱైయే నయఙ్గల్ పిన్నుమ్ ,

శెయ్ వళవిలెన్మనముమ్ కణ్ణుం ఓడి ,

ఎమ్బెరుమాన్తిరువడిక్కీழ் అణైయ , ఇప్పాల్

కైవళైయుం మేగలైయుం కాణేన్ , కణ్డేన్

కనమకరక్కుழைయిరణ్డుమ్ నాన్గుతోళుమ్ ,

ఎవ్వళవుణ్డు ఎమ్బెరుమాన్ కోయిల్ ఎన్ఱేఱ్కు ,

ఇతువన్ఱో ఎழிలాలియెన్ఱార్ తామే ll 2073

ఒన్ఱు = ఒక విశిష్టమైన;నైవళమ్ =నైవళమనెడి సుందర రాగమును; ఆరాయా=   విపులముగ ఆలాపనజేసి;నమ్మై నోక్కా = నన్ను చూచి; ఇఱైయే నాణిణార్ పోల్=కొంచెము బిడియ పడుచున్న వానివలె నా దగ్గరగ నిలిచి; పిన్నుమ్ = తరువాత ; నయఙ్గల్ శెయ్ వళవిల్ = మంచి పదములుచేర్చి ఆ రాగమందు పాడినప్పుడు ; ఎన్ మనమ్ కణ్ణుమ్=నాయొక్క హృదయము, కన్నులు;ఓడి=నన్ను విడిచి పరుగెట్టి;ఎమ్బెరుమాన్ తిరువడి క్కీழ் అణైయ = ఆ సర్వేశ్వరుని దివ్య చరణములయందు చేరియుండగ; ఇప్పాల్=అటుపిమ్మట;కై వళైయుమ్=నా చేతి గాజులును; మేకలైయుమ్=నా నడుముపై గల వస్త్రమును;కాణేన్= పోగొట్టుకొంటిని; కనమ్ మకర కుழை ఇరణ్డుమ్=ఘనమైన మకరకుణ్డలములు రెండును; నాన్గు తోళుమ్ = నాలుగు భుజములను; కణ్డేన్ = చూచితిని; (అటు పిమ్మట) ఎమ్బెరుమాన్ కోయిల్ ఎవ్వళవు ఉణ్డు ఎన్ఱేఱ్కు= (ఇచ్చటినుండి)”సర్వేశ్వరుడు వేంచేసియుండు ప్రదేశము ఎంత దూరములో నుండును” అని అడిగిన నాకు; ఎழிల్ ఆలి ఇతువన్ఱో యెన్ఱార్ =అందమైన తిరువాలి దివ్యదేశము ఇదుగో చూడు అని వేలుతో చూపెట్టినారు.

ఒక విశిష్టమైన నైవళమనెడి సుందర రాగమును విపులముగ ఆలాపనజేసి నన్ను చూచి కొంచెము బిడియ పడుచున్న వానివలె నా దగ్గరగ నిలిచి తరువాత మంచి పదములుచేర్చి ఆ రాగమందు పాడినప్పుడు నాయొక్క హృదయము, కన్నులు నన్ను విడిచి పరుగెట్టి ఆ సర్వేశ్వరుని దివ్య చరణములయందు  చేరియుండగ అటుపిమ్మట నా చేతి గాజులును నా నడుముపైగల వస్త్రమును పోగొట్టుకొంటిని ,ఘనమైన మకర కుణ్డలములు రెండును నాలుగు భుజములను చూచితిని(అటు పిమ్మట) (ఇచ్చటినుండి) “సర్వేశ్వరుడు వేంచేసియుండు ప్రదేశము ఎంత దూరములో నుండును” అని అడిగిన నాకు అందమైన తిరువాలి దివ్యదేశము ఇదుగో చూడు అని వేలుతో చూపెట్టినారు.

ఉళ్ ఊరుం శిన్దైనోయ్ ఎనక్కే తన్దు , ఎన్

ఒళివళైయుం మానిఱముం కొణ్డారిఙ్గే ,

తెళ్ ఊరుంఇళమ్ తెఙ్గిన్ తేఱల్ మాన్ది ,

శేల్ ఉకళుమ్ తిరువరఙ్గమ్ నమ్మూరెన్న ,

కళ్ ఊరుంపైన్దుழாయ్ మాలై యానై ,

కనవిడత్తిల్ యాన్కాణ్బన్ కణ్డపోదు ,

పుళ్ళూరుం కళ్వా నీ పోగేల్ ఎన్బన్ ,

ఎన్ఱాలుమ్ ఇదునమక్కు ఓర్ పులవిదానే ll 2074

ఉళ్ ఊరుం=లోలోపలే పెరుగుచున్న;శిన్దైనోయ్=మనోవ్యాధి;ఎనక్కే తన్దు=నాకేఉండునట్లు చేసి; ఎన్ ఒళి వళైయుమ్ = నాయొక్క అందమైన గాజులును; మా నిఱముమ్=శ్లాఘ్యమైన శరీర వర్ణమును;ఇఙ్గే=ఈ తిరుమణం కొల్లై యందే; కొణ్డార్=అతను దోచుకొని పోయినాడు;(ఆ విధముగ  అతను  పోవునపుడు)శేలై = మీనములు; తెళ్ ఊరుం ఇళమ్ తెఙ్గిన్ తేఱల్ మాన్ది = కారుచున్న ,స్వచ్చమైన,  లేత కొబ్బరినీటిని పానముచేసి; ఉగళుమ్ =ఆనందముతో ఎగురుచు కదులుచుండెడి ; తిరు అరఙ్గమ్ = శ్రీ రంగం; నమ్ ఊర్ ఎన్న = నేను ఉండెడి ప్రదేశమని చెప్పి పోగా; కళ్ ఊరుం పైన్దుழாయ్ మాలై యానై=తేన లొలుకు పచ్చని తులసీమాల ధరించిన ఆ సర్వేశ్వరుని; కనవు ఇడత్తిల్ యాన్ కాణ్బన్ = స్వప్నములో నేను గాంచితిని; కణ్డపోదు = అట్లు చూచినప్పుడు; పుళ్ళూరుం కళ్వా = గరుడాళ్వార్ పై అధిరోహించి సంచరించు వంచకుడా!;నీ పోగేల్ ఎన్బన్=ఇక నన్ను విడిచి పోవలదు అని చెప్పితిని;ఎన్ఱాలుమ్=ఈ విధముగ నేను చెప్పినను; ఇదు = ఆ సర్వేశ్వరునితోడ సంభోగమనునది; ఓర్ పులవి దానే నమక్కు = మనకు ఒక విరహవేదనగా మిగలిపోవునుగదా!

లోలోపలే పెరుగుచున్న మనోవ్యాధి నాకేఉండునట్లు చేసి నాయొక్క అందమైన గాజులును, శ్లాఘ్యమైన శరీర వర్ణమును ఈ తిరుమణం కొల్లై యందే అతను దోచుకొని పోయినాడు(ఆ విధముగ  అతను  పోవునపుడు) మీనములు కారుచున్న , స్వచ్చమైన,  లేత కొబ్బరినీటిని పానముచేసి ఆనందముతో ఎగురుచు కదులుచుండెడి = శ్రీ రంగం నేను ఉండెడి ప్రదేశమని చెప్పి పోగా తేన లొలుకు పచ్చని తులసీమాల ధరించిన ఆ సర్వేశ్వరుని స్వప్నములో నేను గాంచితిని. అట్లు చూచినప్పుడు గరుడాళ్వార్ పై అధిరోహించి సంచరించు వంచకుడా! ఇక నన్ను విడిచి పోవలదు అని చెప్పితిని, ఈ విధముగ నేను చెప్పినను ఆ సర్వేశ్వరునితోడ సంభోగమనునది మనకు ఒక విరహ వేదనగా మిగలిపోవునుగదా!

ఇరుకైయిల్ శఙ్గవై నిల్లా ఎల్లేపావమ్ ,

ఇలఙ్గొలినీర్ ప్పెరుమ్ పౌవం మణ్డియుణ్డ ,

పెరువయిర్ట్ర కరుముగిలే యొప్పర్ వణ్ణమ్ ,

పెరుం తవత్తవర్ అరుంతవత్తు మునివర్ శూழ் ,

ఒరుకైయిల్ శఙ్గు ఒరుకై మర్ట్రు ఆழி యేన్ది ,

ఉలగుణ్డ పెరువాయర్ ఇఙ్గేవన్దు ,ఎన్

పొరుకయల్ కణ్ణీరరుమ్బ ప్పులవితన్దు ,

పునల్ అరఙ్గం ఊర్ ఎన్ఱు పోయినారే ll 2075

ఉలగుణ్డ పెరువాయర్ = (ప్రళయకాలమున) లోకములంతను ఆస్వాదించిన పెద్ద నోరు గలవాడు; ఇఙ్గేవన్దు = ఇచ్చటికే వచ్చి; పొరు కయల్ = ఒకటితోమరొకటి పోరు సలుపు మీనములవలె; ఎన్ కణ్ = నాయొక్క కన్నులనుండి; నీర్ అరుమ్బ = కన్నీళ్లు దారదారలుగ కారునట్లు; పులవి తన్దు = విరహవేదనను కలిగించి; ఇలఙ్గు ఒలి నీర్ పెరుమ్ పౌవం మణ్డి యుణ్డ పెరు వయిర్ట్ర కరుముగిలే యొప్పర్ వణ్ణమ్ = ప్రకాశించు,  ఘోషించు, నీటితో నిండిన పెద్ద సముద్రము లోనికిజొచ్చి జలమంతయు తాగిన పెద్ద ఉదరముగల కాలమేఘవర్ణమువంటి రూపము కలగిన సర్వేశ్వరుని; పెరుం తవత్తవర్ అరుం తవత్తు మునివర్ శూழ் = పరమభక్తులైన శ్రీవైష్ణవులును, మహాతపస్వులైన ఋషులును చుట్టియుండగ; ఒరు కైయిల్ = ఒక హస్తమున; శఙ్గు = దివ్య శంఖమును; మర్ట్రొరు కై = మరియొక హస్తములో; ఆழி = దివ్య చక్రాయుధమును; ఏన్ది =ధరించి; పునల్ అరఙ్గమ్ ఊర్ ఎన్ఱు = జలసమృద్దిచే అలరారు శ్రీరంగం తన దేశమని చెప్పి; పోయిన్ఱార్ = వెడలి పోయెను; (ఆ కారణముచే) ఇరు కైయిల్=నాయొక్క రెండు చేతులనుండి;శఙ్గు ఇవై నిల్లా = ఈ శఙ్గు కంకణములు జారిపోయినవి; ఎల్లే పావమ్=ఏ మహాపాపమో!

(ప్రళయకాలమున) లోకములంతను ఆస్వాదించిన పెద్ద నోరు గలవాడు ఇచ్చటికే వచ్చి ఒకటితోమరొకటి పోరు సలుపు మీనములవలె నాయొక్క కన్నులనుండి కన్నీళ్లు దారదారలుగ కారునట్లు విరహవేదనను కలిగించి , ప్రకాశించు,  ఘోషించు, నీటితో నిండిన పెద్ద సముద్రము లోనికిజొచ్చి జలమంతయు తాగిన పెద్ద ఉదరముగల కాలమేఘవర్ణమువంటి రూపము కలగిన సర్వేశ్వరుని పరమభక్తులైన శ్రీవైష్ణవులును, మహాతపస్వులైన ఋషులును చుట్టియుండగ ఒక హస్తమున దివ్య శంఖమును,మరియొక హస్తములో దివ్య చక్రాయుధమును ధరించి జలసమృద్దిచే అలరారు శ్రీరంగం తన దేశమని చెప్పి వెడలి పోయెను (ఆ కారణముచే) నాయొక్క రెండు చేతులనుండి ఈ శఙ్గు కంకణములు జారిపోయినవి. ఏ మహాపాపమో!

మిన్నిలఙ్గు తిరువురువుం పెరియతోళుమ్ ,

కరిమునిన్దకైత్తలముం కణ్ణుం వాయుమ్ ,

తన్నలరన్ద నఱున్దుழாయ్ మలరిన్ కీழே ,

తాழ்న్దిలఙ్గుమకరం శేర్ కుழைయుమ్ ఙ్గాట్టి ,

ఎన్నలనుం ఎన్నిఱైవుం ఎన్ శిన్దైయుమ్ ,

ఎన్ వళైయుఙ్గొణ్డు ఎన్నై యాళుఙ్గొణ్డు ,

పొన్నలర్ న్ద నఱుమ్ శెరున్ది ప్పొழிలినూడే ,

పునలరఙ్గమ్ ఊరెన్ఱు పోయినారే ll 2076

మిన్ ఇలఙ్గు తిరువురువుం = మెరుపువలె ధగ ధగ ప్రకాశించు దివ్యరూపమును; పెరియ తోళుమ్ =  పెద్ద భుజములును; కరి మునిన్ద కైత్తలముం = కువలయాపీడమను ఏనుగును కోపగించి చంపిన హస్తములును; కణ్ణుమ్=దివ్య నేత్రములును; వాయుమ్=పగడము పోలిన ఎఱ్ఱని అదరములును; తన్ అలర్ న్ద నఱుమ్ తుழாయ్ మలరిన్ కీழே =  తాను వృద్దిపొందు స్థానముకంటె శ్లాఘ్యమైన పచ్చదనముతో, పరమళభరితమై వర్ధిల్లుచునున్న తులసీమాల పర్యంతము; తాழ்న్దు ఇలఙ్గు= ప్రకాశించుచు వేలాడుచున్న;మకరమ్ శేర్ కుழைయుమ్ = మకరకుండలములును మొదలగు ఇవన్నియు; కాట్టి=చూపి; ఎన్ నలనుం = నాయొక్క అందమును;ఎన్ నిఱైవుం= నాయొక్క వినయమును;  ఎన్ శిన్దైయుమ్ = నాయొక్క హృదయమును;ఎన్ వళైయుమ్= నాయొక్క గాజులును;కొణ్డు = అపహరించియు; ఎన్నై యాళుమ్ కొణ్డు = నన్ను పాదదాసిగ చేసుకొని; పొన్అలర్ న్ద = బంగారమువలె వికసించిన; నఱు = పరిమళభరితమైన; శెరున్ది ప్పొழிలిన్ ఊడే = శెరున్ది తోటలనుండి; పునల్ అరఙ్గమ్ ఊర్ ఎన్ఱు పోయినారే = జలసమృద్దిచే అలరారు శ్రీరంగం తన దేశమని చెప్పి వెడలి పోయెను.

మెరుపువలె ధగ ధగ ప్రకాశించు దివ్యరూపమును,  పెద్ద భుజములును, కువలయాపీడమను ఏనుగును కోపగించి చంపిన హస్తములును, దివ్య నేత్రములును, పగడము పోలిన ఎఱ్ఱని అదరములును, తాను వృద్దిపొందు స్థానముకంటె శ్లాఘ్యమైన పచ్చదనముతో,పరమళభరితమై వర్ధిల్లుచునున్న తులసీమాల పర్యంతము ప్రకాశించుచు వేలాడుచున్నమకరకుండలములును మొదలగు ఇవన్నియు చూపి నాయొక్క అందమును, నాయొక్క వినయమును, నాయొక్క హృదయమును, నాయొక్క గాజులును, అపహరించియు, నన్ను పాదదాసిగ చేసుకొని బంగారమువలె వికసించిన పరిమళ భరితమైన శెరున్ది తోటలనుండి జలసమృద్దిచే అలరారు శ్రీరంగం తన దేశమని చెప్పి వెడలి పోయెను.

తేమరువు పొழிలిడత్తు మలర్ న్ద పోదై ,

తేనదనై వాయ్ మడత్తున్ పెడైయుమ్ నీయుమ్ ,

పూమరువి యినితమర్ న్దు పొఱియిలార్ న్ద ,

అఱుకాలశిఱువణ్డే తొழுదేన్ ఉన్నై ,

ఆమరువి నిరై మేయ్ త్త అమరర్ కోమాన్ ,

అణియழுన్దూర్ నిన్ఱానుక్కిన్ఱేశెన్ఱు ,

నీమరువి అఞ్జాదే నిన్ఱు ఓర్ మాదు ,

నిన్ నయన్దాళెన్ఱు ఇఱైయే ఇయమ్బిక్కాణే ll 2077

 తేన్ మరువు = తేనె వరదలతో నిండియున్న; పొழிల్ ఇడత్తు = తోటలయందు; మలర్ న్ద పోదు = వికసించిన పుష్పములందుగల; తేన్ అదనై = ఆ తేనెను; వాయ్ మడుత్తు = పానముజేసి; ఉన్ పెడైయుమ్ నీయుమ్ = నీయొక్క భార్యయు నీవును; పూ మరువి = పుష్పములో ఉండి; ఇనుదు అమర్ న్దు = ఆనందముతో సంభోగించినట్టి; పొఱియిల్ ఆర్ న్ద = శరీరముపై చిహ్నములతో నిండిన; అఱుకాల శిఱువణ్డే=ఆరు కాళ్ళుగల  చిన్న తేనెటీగా!;ఉన్నై తొழுదేన్=నిన్ను నమస్కరించి యాచించుచున్నాను; ఆ నిరై = పశువుల మందను; మరువి మేయ్ త్త = ఆశపడి మేయించినవాడును; అమరర్ కోమాన్ = నిత్యశూరులకు ప్రభువును;అణి అழுన్దూర్ నిన్ఱానుక్కు =అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశములో వేంచేసిన సర్వేశ్వరుని చెంతకు; ఇన్ఱే నీ శెన్ఱు = ఇప్పుడే నీవు వెడలి; అఞ్జాదే = భయపడక; మరువి నిన్ఱు = స్థిరముగ నిలబడి;ఓర్ మాదు=’ఒక కన్య’; నిన్ నయన్దాళ్ ఎన్ఱు = ” నీపై ఆశకల్గియున్నది ” అని; ఇఱైయే = చిన్న మాటను; ఇయమ్బిక్కాణే = చెప్పి చూడుమా!

  తేనె వరదలతో నిండియున్న తోటలయందు వికసించిన పుష్పములందుగల ఆ తేనెను పానముజేసి నీయొక్క భార్యయు నీవును పుష్పములో ఉండి ఆనందముతో సంభోగించినట్టి శరీరముపై చిహ్నములతో నిండిన ఆరు కాళ్ళుగల  చిన్న తేనెటీగా! నిన్ను నమస్కరించి యాచించుచున్నాను. పశువుల మందను ఆశపడి మేయించినవాడును నిత్యశూరులకు ప్రభువును అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశములో వేంచేసిన సర్వేశ్వరుని చెంతకు ఇప్పుడే నీవు వెడలి భయపడక స్థిరముగ నిలబడి ‘ఒక కన్య’ ” నీపై ఆశకల్గియున్నది ” అని చిన్న మాటను చెప్పి చూడుమా!

** శెఙ్గాలమడనారాయ్ ఇన్ఱేశెన్ఱు ,

తిరుక్కణ్ణపురం పుక్కు ఎన్ శెఙ్గణ్ మాలుక్కు ,

ఎఙ్గాదల్ ఎన్తుణైవర్కు ఉరైత్తియాగిల్ ,

ఇతువొప్పదెమక్కు ఇన్బమిల్లై , నాళుమ్

పైఙ్గానమీదెల్లామ్ ఉనదేయాగ ,

ప్పழన మీన్ కవర్ న్దు ఉణ్ణతరువన్ , తన్దాల్

ఇంగేవన్దు ఇనితిరున్దున్ పేడైయుం నీయుమ్ ,

ఇరునిలత్తిలినితిన్బం ఎయ్ దలామే ll 2078

శెమ్ కాల=ఎఱ్ఱని కాళ్ళుగల; మడ నారాయ్=అందమైన నారపక్షీ!; ఇన్ఱే శెన్ఱు = ఈ దినమునే బయలుదేరి; తిరు కణ్ణపురమ్ పుక్కు=తిరు కణ్ణపురమ్ దివ్య దేశమందు ప్రవేశించి; ఎన్ శెఙ్గణ్ మాలుక్కు=నాయొక్క ఎఱ్ఱ తామరపూవువంటి నేత్రములు కలిగినవాడును,నాపై అమిత వ్యామోహము గలవాడును; ఎన్ తుణైవర్కు = నాయొక్క ఉపకారకుడైన శౌరి పెరుమాళ్ సర్వేశ్వరునకు; ఎనదు కాదల్ = నాయొక్క అతనిపైగల ఆశను;ఉరైత్తి ఆగిల్ =చెప్పినయెడల;ఎమక్కు =(అతని విరహమందు బాధపడుచున్న) నాకు; ఇదు ఒప్పదు ఇన్బమ్ ఇల్లై = ఇటువంటిదానితో సమానమైన సంతోషము మరియొకటి ఉండదు; నాళుమ్ = నీ జీవితాంతము; ఈదు=ఈ; పైమ్ కానమ్ ఎల్లామ్ = విశాలమైన తోటలంతయును; ఉనక్కే ఆగ = నీకే చెందునట్లును; పయనమ్ = నీటి ప్రదేశములందంతటనుగల; మీన్ = చేపలను; కవర్ న్దు ఉణ్ణ = నీవు పట్టుకొని తినునట్లు; తరువన్=ఒసగెదను;తన్దాల్=ఈ విధముగ నేనొసగినచో; ఉన్ పేడైయుమ్ నీయుమ్ = నీయొక్క భార్యయు నీవును; ఇఙ్గే వన్దు=ఇచ్చటికే వచ్చి;ఇనిదు ఇరున్దు = సంతోషముగానుండి; ఇరు నిలత్తిల్=విశాలమైన ఈ భూమండలమందు;ఇనిదు ఇన్బమ్ ఎయ్ దలామ్ = మహదానందము పొంది జీవించవచ్చును.

ఎఱ్ఱని కాళ్ళుగల అందమైన నారపక్షీ! ఈ దినమునే బయలుదేరి తిరు కణ్ణపురమ్ దివ్య దేశమందు ప్రవేశించి నాయొక్క ఎఱ్ఱ తామరపూవువంటి నేత్రములు కలిగినవాడును,నాపై అమిత వ్యామోహము గలవాడును, నాయొక్క ఉపకారకుడైన శౌరి పెరుమాళ్ సర్వేశ్వరునకు నాయొక్క అతనిపైగల ఆశను చెప్పినయెడల (అతని విరహమందు బాధపడుచున్న) నాకు ఇటువంటిదానితో సమానమైన సంతోషము మరియొకటి ఉండదు . నీ జీవితాంతము ఈ విశాలమైన తోటలంతయును నీకే చెందునట్లును, నీటి ప్రదేశములందంతటనుగల చేపలను నీవు పట్టుకొని తినునట్లు ఒసగెదను. ఈ విధముగ నేనొసగినచో నీయొక్క భార్యయు నీవును ఇచ్చటికే వచ్చి సంతోషముగానుండి విశాలమైన ఈ భూమండలమందు మహదానందము పొంది జీవించవచ్చును.

తెన్నిలఙ్గైయరణ్ శిదఱి అవుణన్ మాళ ,

శెన్ఱులగమూన్ఱినైయుం తిరిన్దోర్ తేరాల్ ,

మన్నిలఙ్గు పారదత్తై మాళ వూర్ న్ద ,

వరైయురువిన్ మాగళిర్ట్రైత్తోழீ ,ఎన్ దన్

పొన్నిలఙ్గు ములై కువట్టిల్ పూట్టిక్కొణ్డు ,

పోగామేవల్లేనాయ్ ప్పులవియెయ్ ది ,

ఎన్నిలఙ్గమెల్లాం వన్దిమ్బమెయ్ ద ,

ఎప్పొழுదుమ్ నినైన్దురుగి యిరుప్పన్ నానే ll 2079

తోழீ = ఓ! నా స్నేహితురాలా!;తెన్ ఇలఙ్గై=అందమైన లంకాపురియందుగల; అరణ్= కోటలను; శిదరి = నాశనముచేసి;అవుణన్ మాళ = రావణాసురుడు నశించునట్లు; శెన్ఱు = అచటకు వేంచేసియు;ఉలగమ్ మూన్ఱినైయుమ్ తిరిన్దు= త్రివిక్రమావతారమందు  మూడు లోకములకు తన దివ్య పాదారవిందములను వ్యాపింపజేసినవాడును; మన్ ఇలఙ్గు= ప్రకాశించుచున్న సేనలను;పారదత్తై మాళ=మహాభారత యుద్ధమందు సమస్త రాజులు నశించునట్లు;ఓర్ తేరాల్ ఊర్ న్ద=ఒక రథమును నడిపిన;వరై ఉరువిన్ మా కళిర్ట్రై= పర్వతమువలె రూపము కలిగిన పెద్ద ఏనుగువంటి సర్వేశ్వరుని; ఎన్ దన్=నాయొక్క; పొన్ ఇలఙ్గు ములై కువట్టిల్ = బంగారమువలె మెరయు వక్షోజములనెడి స్తంభములందు; పూట్టిక్కొణ్డు = బంధించికొని; పోగామై వల్లేన్ ఆయ్ = విడిచి బైటకు పోవ శఖ్యముకానట్లుగ చేసి; పులవి ఎయ్ ది = అతని విరహమందుపడిన వ్యధలన్నియు అతని ఎదుటనే అనుభవంచి; ఎన్నిల్ అఙ్గమ్ ఎల్లామ్ వన్దు ఇన్బమ్ ఎయ్ ద = నాయొక్క అన్ని అవయవములు వచ్చి  ఆనందము పొందునట్లు; ఎప్పొழுదుమ్ = ఎల్లవేళల; నాన్ = నేను; నినైన్దు = ఆ సర్వేశ్వరునినే స్మరించుచు; ఉరుగి ఇరుప్పన్ = మరణించెదను.

ఓ! నా స్నేహితురాలా! అందమైన లంకాపురియందుగల కోటలను నాశనముచేసి రావణాసురుడు నశించునట్లు అచటకు వేంచేసియు, త్రివిక్రమావతారమందు  మూడు లోకములకు తన దివ్య పాదారవిందములను వ్యాపింప జేసినవాడును, ప్రకాశించుచున్న సేనలను మహాభారతయుద్ధమందు సమస్త రాజులు నశించునట్లు ఒక రథమును నడిపిన పర్వతమువలె రూపము కలిగిన పెద్ద ఏనుగువంటి సర్వేశ్వరుని నాయొక్క బంగారమువలె మెరయు వక్షోజములనెడి స్తంభములందు బంధించికొని విడిచి బైటకు పోవ శఖ్యముకానట్లుగ చేసి అతని విరహమందుపడిన వ్యధలన్నియు అతని ఎదుటనే అనుభవంచి, నాయొక్క అన్ని అవయవములు వచ్చి  ఆనందము పొందునట్లు ఎల్లవేళల నేను ఆ సర్వేశ్వరునినే స్మరించుచు మరణించెదను.

** అన్ఱాయర్ కుళమగళుక్కరైయన్ తన్నై ,

అలైకడలైక్కడైన్దడైత్త అమ్మాన్దన్నై ,

కున్ఱాదవలియరక్కర్ కోనై మాళ ,

క్కొడుం శిలైవాయ్ చ్చరన్దురన్దుకులఙ్గళైన్దు

వెన్ఱానై , కున్ఱెడుత్త తోళినానై ,

విరితిరైనీర్ విణ్ణగరమ్ మరువి నాళుమ్

నిన్ఱానై , తణ్ కుడన్దై క్కిడన్ద మాలై  ,

నెడియానై అడినాయేన్ నినైన్దిట్టేనే ll 2080

అన్ఱు = పూర్వము ఒకప్పుడు; ఆయర్ కులమ్ మగళుక్కు=గొల్లల కులములో ఉద్భవించిన మిక్కిలి శ్లాఘింపబడు నీళాదేవికి; అరైయన్ తన్నై = నాయకుడును; అలై కడలై కడైన్దు = అలలుకొట్టుచున్న సముద్రమును చిలికియు;  (మరియు)అడైత్త అమ్మాన్ తన్నై = (ఆ సముద్రములో) సేతువు కట్టిన స్వామియును; కున్ఱాద వలి = మచ్చలేని బలముకలిగిన; అరక్కర్ కోనై మాళ = అసురుల ప్రభువైన రావణాసురుని నశించునట్లు; కొడుమ్ శిలై వాయ్ = భయంకరమైన విల్లు నుండి; శరమ్ తురన్దు = బాణములను ప్రయోగించి;కులమ్ కళైన్దు వెన్ఱానై=రాక్షస కులమును నిర్మూలముచేసి జయము పొందినవాడును; కున్ఱు ఎడుత్త= గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తిన; తోళినానై = భుజములు గలవాడును; విరి తిరై నీర్ విణ్ణగరమ్ మరువి = వ్యాపించు అలలుగల నీటి చెరువులతో నిండిన తిరువిణ్ణగరమును అభిలషించి;నాళుమ్ నిన్ఱానై= ఎల్లప్పుడును వసించువాడును; తణ్ కుడన్దై = చల్లని తిరుక్కుడందై దివ్యదేశములో; కిడన్ద మాలై = పవళించియున్న ఆశ్రితవత్సలుడును; నెడియానై = సర్వోత్తముడైన స్వామిని; నాయ్ అడియేన్ = శునకము వలె నీచుడైన దాసుడగు నేను; నినైన్దిట్టేనే=స్మరించుచుంటినిగదా!

పూర్వము ఒకప్పుడు గొల్లల కులములో ఉద్భవించిన మిక్కిలి శ్లాఘింపబడు నీళాదేవికి నాయకుడును, అలలుకొట్టుచున్న సముద్రమును చిలికియు,  (మరియు) (ఆ సముద్రములో) సేతువు కట్టిన స్వామియును,మచ్చలేని బలముకలిగిన అసురుల ప్రభువైన రావణాసురుని నశించునట్లు భయంకరమైన విల్లు నుండి బాణములను ప్రయోగించి రాక్షస కులమును నిర్మూలముచేసి జయము పొందినవాడును, గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తిన భుజములు గలవాడును వ్యాపించు అలలుగల నీటి చెరువులతో నిండిన తిరువిణ్ణగరమును అభిలషించి ఎల్లప్పుడును వసించువాడును, చల్లని తిరుక్కుడందై దివ్యదేశములో పవళించియున్న ఆశ్రితవత్సలుడును, సర్వోత్తముడైన స్వామిని శునకము వలె నీచుడైన దాసుడగు నేను స్మరించుచుంటినిగదా!

** మిన్ను మామழைతవழுమ్ మేగవణ్ణా ,

విణ్ణవర్ దమ్ పెరుమానే అరుళాయెన్ఱు ,

అన్న మాయ్ మునివరోడమరరేత్త ,

అరుమఱైయై వెళిప్పడుత్త అమ్మాన్దన్నై ,

మన్ను మామణిమాడ మంగై వేన్దన్ ,

మానవేల్ పరకాలన్ కలియన్ శొన్న ,

పన్నియనూల్ తమిழ்మాలై వల్లార్ , తొల్లై

ప్పழవినైయై ముదలరియవల్లార్తామే ll 2081

మునివరోడు అమరర్ ఏత్త = మునులును,దేవతలును స్తుతించు;అన్నమ్ ఆయ్= హంసరూపమున అవతరించి; అరు మఱైయై = దుర్లభమైన వేదములను; వెళిప్పడుత్త= ప్రకాశింపజేసిన; అమ్మాన్ తన్నై = సర్వేశ్వరుని విషయమై; మన్ను మామణిమాడమ్ మంగై వేన్దన్ = శాశ్వతమైన ప్రసిద్ధి చెందిన అందమైన భవంతులుగల తిరుమంగై దేశమునకు ప్రభువైన; మానమ్ వేల్ = కీర్తిగల శూలము ఆయుధముగ కలవాడును; పరకాలన్ = పర మతస్థులకు యముడువంటివాడును; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; మిన్నుమ్ మా మழை తవழுమ్ మేగమ్ వణ్ణా = మెరుపులతో కూడియు, మిక్కిలి చల్లదనముతో సంచరించుచుండు మేఘమువంటి స్వరూపముగలవాడా!; అరుళాయ్ = కృపజేయుమా!; ఎన్ఱు శొన్న = అని ప్రార్ధించి ప్రసాదించిన;పన్నియ=మిక్కిలి విస్తారమైన; తమిழ் నూల్ మాలై = తమిళ సూక్తుల మాలికను; వల్లార్ తామ్ = అనుసంధించువారు; తొల్లై = అనాదియైన; పழ వినైయై = వెనుకటి కర్మలు; ముదల్ = సంపూర్ణముగ; అరియ వల్లార్ = నశింపజేసుకొను సమర్ధులగుదురు.

మునులును,దేవతలును స్తుతించు హంసరూపమున అవతరించి దుర్లభమైన వేదములను ప్రకాశింపజేసిన సర్వేశ్వరుని విషయమై శాశ్వతమైన ప్రసిద్ధి చెందిన అందమైన భవంతులుగల తిరుమంగై దేశమునకు ప్రభువైన కీర్తిగల శూలము ఆయుధముగ కలవాడును పర మతస్థులకు యముడువంటివాడును తిరుమంగై ఆళ్వార్ మెరుపులతో కూడియు, మిక్కిలి చల్లదనముతో సంచరించుచుండు మేఘమువంటి స్వరూపముగలవాడా! కృపజేయుమా! అని ప్రార్ధించి ప్రసాదించిన మిక్కిలి విస్తారమైన తమిళ సూక్తుల మాలికను అనుసంధించువారు అనాదియైన వెనుకటి కర్మలుసంపూర్ణముగ నశింపజేసుకొను సమర్ధులగుదురు.

తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం

******************

వ్యాఖ్యానించండి