శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
అవతారిక :-
శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపచే తిరుమంత్రముపదేశము పొందిన తిరుమంగై ఆళ్వార్ మిక్కిలి భక్తిపారవశ్యముతో 86 దివ్యదేశములను దర్శించి 1084 పాశురములతో మంగళాశాసనము చేసిరి. అదియే మొదటి ప్రబంధమైన పెరియతిరుమొழி. సంసారబంధ విముక్తికై శ్రీ మన్నారాయణుని వేడుకొనుచు , సర్వేశ్వరుని రక్షకత్వమును, భక్తవాత్సల్యము మొదలగు కళ్యాణగుణములను రెండవ ప్రబంధమైన తిరుక్కుఱున్దాడకమ్ ద్వారా ప్రస్తుతించిరి. తిరుమంగై ఆళ్వార్ పరమభక్తి ప్రాప్తికై తిరుక్కుడందై దివ్యదేశములో కృపతో వేంచేసిన ఆరావముదు పెరుమాళ్ దివ్యచరణారవిందములందు తిరువెழுకూర్ట్రిరుక్కై యను మూడవప్రబంధము ద్వారా శరణాగతి చేసిరి. తనను ఉపేక్షించుచున్న నీలమేఘశ్యాముడైన శ్రీమన్నారాయణుని దివ్య కల్యాణగుణములందు నిరంతరము పరవశించి ధ్యానించుచున్న తిరుమంగై ఆళ్వార్ అనన్యశేషత్వము , అనన్యశరణత్వము , అనన్యభోగత్వము గుణములచే పూర్ణత్వము కలిగిన కారణముచే పరకాలనాయకి అను యువతి అవస్ధను పొంది,విరహమందు మిక్కిలి తపించుచు, సర్వేశ్వరుని త్వరితముగ పొందవలెనని మిక్కిలి ఆశతో ” మడల్ ” అను ప్రక్రియ ఉపక్రమింపతలచి ఆభావనలో వెలువరించిన 115 చరణములు కలిగిన నాల్గవ ప్రభంధము ” శిరియతిరుమడల్ “. పరకాలనాయకి తాను సర్వేశ్వరునినుండి అభిలషించిన ఫలము కలుగనందున అతిశయించిన విరహమందు తపించుచు మిక్కిలి దృఢనిశ్చయముతో ” మడల్ ప్రక్రియ ” చేయుతలంపుతో వెలువరించిన 290 చరణములతో కలిగిన ఐదవ ప్రభంధము ఈ “పెరియతిరుమడల్ “.
(తమిళ భాషలో ” మడల్ ” అనగా తాటాకుకాండము. ఒక యువకుడు తను గాఢముగ ప్రేమించిన స్త్రీచే ఉపేక్షింపబడి ఆ విరహమును భరించలేక ఆమెను పొందుటకై తన శరీరమంతను బూడిద రాసుకొని, ఆమె చిత్రమును తీసుకొని, తాటాకులతోను, దాని కాండములతోను ఒక అశ్వమును చేసి, దానిపై ఎక్కి, వీదులలో మిత్రులు, బంధువులు ఎదుట ఆమె పేరును అరుచుకొనుచు, నిందించుచు, అపహాస్యము చేయుచు, కించపరచుచు, తనను బాదుకొనుచు, ఆమె దక్కనిచో మరణించెదననియు ఇట్లు అనేక విధములుగ ప్రయత్నములు చేసి ఎట్టకేలకు బంధువుల ద్వారా ఆమెను ఒప్పించి వివాహమాడుటను మడల్ ప్రక్రియ అందురు.)
తనియన్
పిళ్ళై తిరునఱైయూరరయర్ అనుగ్రహించినది
( తిరుమంగై ఆళ్వార్ మనోభావాలు వెలువరించు తనియన్ )
పొన్నులగిల్ వానవర్ l పూమగళుమ్ పోర్ట్రిశెయ్యుమ్ l ,
నన్నుదలీర్ l నమ్బినఱైయూరర్ l , మన్నులగిల్
ఎన్నిలమైకణ్డుమ్ l ఇరఙ్గారేయామాగిల్ l ,
మన్ను మడల్ ఊర్వన్ వన్దు ll.
నన్నుదలీర్ = అందమైన ముఖములుగల వనితలారా! ; పొన్నులగిల్ వానవరుమ్ = పరమపదమందుగల నిత్యశూరులును;పూమగళుమ్=తామర పుష్పమందుపుట్టిన శ్రీమహాలక్ష్మి యును; పోర్ట్రిశెయ్యుమ్ = స్తుతించుచున్న ;నఱైయూరర్ = తిరు నఱైయూర్ దివ్యదేశములో కృపతో వేంచేసిన; నమ్బి = కల్యాణగుణములగల సర్వేశ్వరుడు ; మన్నులగిల్= నిత్యమైన ఈ భూమండలమందు ; ఎన్ నిలమైకణ్డుమ్ = నా అవస్ధను చూచియు; ఇరఙ్గార్ ఆమ్ ఆగిల్ = కృపచేయనిచో ;వన్దు = ఆ శ్రీమన్నారాయణుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశములకు వెడలి ; మన్ను మడల్ ఊర్వన్ = (నన్ను చేరువరుకు ) లోకములోగల మడల్ ప్రక్రియ చేపట్టియుండెదను.
నాయొక్క అందమైన ప్రియసఖులారా! నిత్యశూరులును, శ్రీమహాలక్ష్మియును ఎల్లప్పుడును స్తుతించుచున్న తిరునఱైయూర్ దివ్యదేశములో కృపతో వేంచేసిన సకల కల్యాణగుణములగల ఆ సర్వేశ్వరుడు ఇచట నా అవస్ధను చూచియు కృపచేయనిచో, నా స్వామి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశములకు వెడలి నన్ను చేరువరుకు మడల్ ప్రక్రియ చేబడుచునుండెదను.
******
మన్నియ పల్ పొఱిశేర్ ఆయిరవాయ్ వాళ్ అరవిన్ ,
శెన్ని మణిక్కుడుమి త్తెయ్ వ చ్చుడర్ నడువుళ్ , 2750
మన్నియ నాగత్తణైమేల్ ఓర్ మామలైపోల్ ,
మిన్ను మణి మకరకుణ్డలఙ్గల్ విల్ వీశ , 2751
తున్నియ తారకైయిన్ పేరొళి శేర్ ఆకాశమ్ ,
ఎన్నుమ్ విదానత్తిన్ కీழாల్ , ఇరు శుడరై 2752
మన్నుమ్ విళక్కాగ ఏర్ట్రి , మఱి కడలుమ్
పన్ను తిరైక్క వరివీశ, నిలమఙ్గై 2753
తన్నై ముననాళ్ అళవిట్ట తామరైపోల్ ,
మన్నియ శేవడియై వాన్ ఇయఙ్గు తారగై మీన్ , 2754
ఎన్నుమ్ మలర్ ప్పిణైయల్ ఏయ్ న్ద , మழை క్కూన్దల్
తెన్నన్ ఉయర్ పొరుప్పుమ్ తెయ్ వ వడమలైయుమ్ , 2755
ఎన్నుమివైయే ములైయా వడివమైన్ద ,
అన్ననడైయ అణఙ్గే అడియిణైయై 2756
తన్నుడైయ అఙ్గైగళాల్ తాన్ తడవత్తాన్ కిడన్దు, ఓర్
ఉన్నియయోగత్తు ఉఱక్కుమ్ తలైకొణ్డ 2757
పిన్నై, తన్నాబి వలయత్తు ప్పేరొళిశేర్
మన్నియ తామరై మామలర్ పూత్తు , అమ్మలర్మేల్ 2758
మున్నమ్ తిశైముగనై త్తాన్ పడైక్క , మర్ట్రవనుమ్
మున్నమ్ పడైత్తనన్ నాన్మఱైగళ్ , అమ్మఱైదాన్ 2759
మన్నుమ్ అఱమ్ పొరుళ్ ఇన్బమ్ వీడెన్ఱులగిల్ ,
నన్నెఱి మేమ్బట్టన నాన్గన్ఱే , నాన్గినిలుమ్ 2760
పిన్నైయదు పిన్నై ప్పెయర్ తరుమెన్బదు ఓర్ ,
తొల్ నెఱియై వేణ్డువార్ వీழ்కనియుమ్ ఊழீలైయుమ్ , 2761
ఎన్నుమివైయే నుగర్ న్దు ఉడలమ్ తామ్ వరున్ది ,
తున్నుమ్ ఇలైక్కురమ్బై త్తుఞ్జియుమ్ , వెఞ్జుడరోన్ 2762
మన్నుమ్ అழల్ నుకర్ న్దుమ్ వణ్ తడత్తునుళ్ కిడన్దుమ్ ,
ఇన్నదోర్ తన్మైయరాయ్ ఈఙ్గు ఉడలమ్ విట్టు ఎழுన్దు , 2763
తొన్నెఱిక్కణ్ శెన్ఱార్ ఎనప్పడుమ్ శొల్లల్లాల్ ,
ఇన్నదోర్ కాలత్తు ఇనైయార్ ఇదుపెర్ట్రార్ , 2764
ఎన్నవుమ్ కేట్టఱివదిల్లై , ఉళదెన్నిల్
మన్నుమ్ కడుఙ్కదిరోన్ మణ్డలత్తిన్ నన్నడువుళ్ , 2765
అన్నదోర్ ఇల్లియిన్ ఊడుపోయ్ , వీడెన్నుమ్
తొన్నెఱిక్కణ్ శెన్ఱారై చ్చొల్లుమిన్గల్ శొల్లాదే , 2766
అన్నదే పేశుమ్ అఱివిల్ శిఱుమనత్తు , ఆఙ్గు
అన్నవరై క్కఱ్పిప్పోమ్ యామే , అదునిఱ్క 2767
మున్నమ్ నాన్ శొన్న అఱత్తిన్ వழி ముయన్ఱ ,
అన్నవర్ తాఙ్గణ్డీర్ గళ్ ఆయిరక్కణ్ వానవర్ కోన్ , 2768
పొన్నగరమ్ పుక్కు అమరర్ పోర్ట్రి శెప్ప , పొఙ్గొళిశేర్
కొన్నవిలుమ్ కోళరిమాల్ తాన్ శుమన్ద కోలమ్ శేర్ , 2769
మన్నియ శిఙ్గాశనత్తిన్మేల్ , వాళ్ నెడుఙ్గణ్
కన్నియరాల్ ఇట్ట కవరి పొతియవిழ்న్దు , ఆఙ్గు 2770
ఇన్నిళమ్ పూన్తెన్ఱల్ ఇయఙ్గ , మరుఙ్గిరున్ద
మిన్ననైయ నుణ్ మరుఙ్గుల్ మెల్లియలార్ వెణ్ మఱువల్ , 2771
మున్నమ్ ముకిழ்త్త ముకిழ் నిలా వన్దు అరుమ్బ
అన్నవర్ తమ్ మాన్ నోక్కమ్ ఉణ్డు ఆఙ్గు అణిమలర్ శేర్ , 2772
పొన్నియల్ కఱ్పగత్తిన్ కాడు ఉడుత్త మాడెల్లామ్ ,
మన్నియ మన్దారమ్ పూత్త మదు త్తివలై , 2773
ఇన్నిశై వణ్డమరుమ్ శోలైవాయ్ మాలైశేర్ ,
మన్నియ మామయిల్ పోల్ కూన్దల్ , మழைత్తడఙ్గణ్ 2774
మిన్నిడైయారోడుమ్ విళైయాడి వేణ్డిడత్తు ,
మన్ను మణిత్తలత్తు మాణిక్కమఞ్జరియిన్ , 2775
మిన్నిన్ ఒళిశేర్ పళిఙ్గు విళిమ్బడుత్త
మన్నుమ్ పవళక్కాల్ శెమ్బొన్ శెయ్ మణ్డపత్తుల్ , 2776
అన్ననడైయ అరమ్బైయర్ తమ్ కైవళర్ త్త ,
ఇన్నిశై యాழ் పాడల్ కేట్టు ఇన్బుర్ట్రు , ఇరువిశుమ్బిల్ 2777
మన్ను మழை తవழுమ్ వాణిలా నీణ్మతి తోయ్
మిన్నినొళిశేర్ విశుమ్బూరుమ్ మాళిగైమేల్, 2778
మన్ను మణివిళక్కై మాట్టి , మழைక్కణ్ణార్
పన్ను విశిత్తిరిమా ప్పా ప్పడత్త పళ్ళిమేల్ , 2779
తున్నియ శాలేకమ్ శూழ் కతవమ్ తాళ్ తిఱప్ప ,
అన్నమ్ ఉழక్క నెరిన్దు ఉక్క వాళ్ నీల , 2780
చ్చిన్న నఱుమ్ దాదు శూడి , ఓర్ మన్దారమ్
తున్ను నఱు మలరాల్ తోళ్ కొట్టి , కఱ్పగత్తిన్ 2781
మన్ను మలర్ వాయ్ మణివణ్డు పిన్ తొడర ,
ఇన్నిళమ్ పూన్తెన్ఱల్ పుగున్దు ఈఙ్గు ఇళములైమేల్ , 2782
నన్నఱుమ్ శన్దనచ్చేఱు పులర్త , తాఙ్గు అరుమ్ శీర్
మిన్నిడమేల్ కైవైత్తు ఇరున్దు ఏన్దు ఇళములైమేల్ , 2783
పొన్నరుమ్బు ఆరమ్ పులమ్బ , అగఙ్గుழைన్దు ఆఙ్గు
ఇన్నవురువిన్ ఇమైయా త్తడఙ్గణ్ణార్ , 2784
అన్నవర్ తమ్ మాన్ నోక్కమ్ ఉణ్డు ఆఙ్గు అణిముఱువల్ ,
ఇన్నముదమ్ మాన్దిఇరుప్పర్ , ఇదువన్ఱే 2785
అన్న అఱత్తిన్ పయనావదు , ఒణ్పొరుళుమ్
అన్న తిఱత్తదే యాదలాల్ , కామత్తిన్ 2786
మన్నుమ్ వழி ముఱైయే నిర్ట్రుమ్ నామ్ , మానోక్కిల్
అన్ననడైయార్ అలర్ ఏశ ఆడవర్ మేల్ , 2787
మన్ను మడల్ ఊరార్ ఎన్బదోర్ వాశకముమ్
తెన్ ఉరైయిల్ కేట్టఱివదుణ్డు , అదనై యామ్ తెళియోమ్ 2788
మన్నుమ్ వడనెఱియే వేణ్డినోమ్ , వేణ్డాదార్
తెన్నన్ పొదియిల్ శెழுమ్ శన్దనక్కుழమ్బిన్ , 2789
అన్నదోర్ తన్మై అఱియాదార్ , ఆయన్ వేయ్
ఇన్నిశైయోశైక్కు ఇరఙ్గాదార్ , మాల్ విడైయిన్ 2790
మన్ను మణి పులమ్బ వాడాదార్ , పెణ్ణైమేల్
పిన్నుమ్ అవ్వన్ఱిల్ పేడైవాయ్ చ్చిరుకురలుక్కు , 2791
ఉన్ని ఉడల్ ఉరుగి నైయాతార్ , ఉమ్బరవాయ్
తున్ను మది ఉకుత్త తూ నిలా నీళ్ నెరుప్పిల్ 2792
తమ్ముడలమ్ వేవ త్తళరాదార్ , కామవేళ్
మన్నుమ్ శిలైవాయ్ మలర్ వాళికోత్తు ఎయ్య , 2793
పొన్ నెడువీతి పుకాదార్ , తమ్ పూ అణైమేల్
శిన్నమలర్ క్కుழలుమ్ అల్గులుమ్ మెన్ ములైయుమ్ , 2794
ఇన్ ఇళవాడై తడవ తామ్ కణ్ తుయిలుమ్ ,
పొన్ అనైయార్ పిన్నుమ్ తిరు ఉఱుక , పోర్ వేన్దన్ 2795
తన్నుడైయ తాదై పణియాలరశు ఒழிన్దు ,
పొన్నగరం పిన్నే పులమ్బ వలఙ్గొణ్డు , 2796
మన్నుమ్ వళనాడు కైవిట్టు , మాతిరఙ్గళ్
మిన్ ఉరువిల్ విణ్తేర్ తిరిన్దు వెళిప్పట్టు , 2797
కల్ నిరైన్దు తీయ్ న్దు కழை ఉడైన్దు కాల్ శుழన్ఱు ,
పిన్నుమ్ తిరైవయిర్ట్రు ప్పేయే తిరిన్దుఉలవా , 2798
కొల్ నవిలుమ్ వెమ్ కానత్తూడు , కొడుమ్ కదిరోన్
తున్ను వెయిల్ వఱుత్త వెమ్ పరల్ మేల్ పఞ్జు అడియాళ్ , 2799
మన్నన్ ఇరామన్ పిన్ వైతేవియెన్ఱు ఉరైక్కుమ్ ,
అన్ననడైయ అణఙ్గు నడన్దిలళే , 2800
పిన్నుమ్ కరు నెడుఙ్గణ్ శెవ్వాయ్ ప్పిణై నోక్కిన్
మిన్ననైయ నుణ్ మరుఙ్గుల్ వేకవతియెన్ఱుఱైక్కుమ్ 2801
కన్ని , తన్ ఇన్ ఉయిరామ్ కాదలనై క్కాణాదు ,
తన్నుడైయ మున్ తోన్ఱల్ కొణ్డుఏక త్తాన్ శెన్ఱు, అఙ్గు 2802
అన్నవనై నోక్కాదు అழிత్తు ఉరప్పి , వాళ్ అమరుళ్
కన్నవిల్ తోళ్ కాళైయై క్కైపిడిత్తు మీణ్డుమ్ పోయ్ , 2803
పొన్నవిలుమ్ ఆగమ్ పుణర్ న్దిలళే , పూమ్ గఙ్గై
మున్నమ్ పునల్ పరక్కుమ్ నన్నాడన్ మిన్నాడుమ్ , 2804
కొన్నవిలుమ్ నీళ్ వేల్ కురుక్కళ్ కులమదలై ,
తన్నికరొన్ఱిల్లాద వెన్ఱిత్తనఞ్జయనై , 2805
పన్నాకరాయన్ మడప్పావై , పావై తన్
మన్నియ నాణ్ అచ్చమ్ మడమ్ ఎన్ఱివై యకల , 2806
తన్నుడైయ కొఙ్గై ముకమ్ నెరియ , తాన్ అవన్దన్
పొన్ వరై యాకమ్ తழீఇక్కొణ్డుపోయ్ , తనదు 2807
నన్నకరమ్ పుక్కు నయన్దు ఇనిదు వాழ்న్దదువుమ్ ,
మున్ ఉరైయిల్ కేట్టఱివతిల్లైయే , శూழ் కడలుళ్ 2808
పొన్నకరమ్ శెర్ట్ర పురన్దరనోడు ఏర్ ఒక్కుమ్ ,
మన్నవన్ వాణన్ అవుణర్కు వాళ్ వేన్దన్ , 2809
తన్నుడైయ పావై ఉలగత్తు త్తన్నొక్కుమ్ ,
కన్నియర్ యిల్లాద కాట్చియాన్ , తన్నుడైయ 2810
ఇన్నుయిర్ త్తోழீయాల్ ఎమ్బెరుమాన్ ఈన్ తుழாయ్ ,
మన్ను మణివరైతోళ్ మాయవన్ , పావియేన్ 2811
ఎన్నై యిదు విళైత్త ఈరిరణ్డు మాల్వరైత్తోళ్
మన్నవన్ తన్ కాదలనై మాయత్తాల్ కొణ్డుపోయ్ , 2812
కన్ని తన్బాల్ వైక్క మర్ట్రవనోడు ఎత్తనైయో ,
మన్నియ పేరిన్బమ్ ఎయ్ దినాళ్ , మర్ట్రివైతాన్ 2813
ఎన్నాలే కేట్టీరే ఎழைకాల్ ఎన్నురైక్కేన్ ,
మన్ను మలైయరైయన్ పొఱ్పావై , వాళ్ నిలా 2814
మిన్ను మణి ముఱువల్ శెవ్వాయ్ ఉమైయెన్నుమ్ ,
అన్ననడైయ అణఙ్గు నుడఙ్గు ఇడైశేర్ , 2815
పొన్నుడమ్బు వాడ పులనైన్దుమ్ నొన్దకల
తన్నుడైయ కూழை చ్చడాపారమ్ తాన్ తరిత్తు ,అఙ్గు 2816
అన్న అరుమ్ తవత్తిన్ ఊడుపోయ్ , అయిరన్దోళ్
మన్ను కరతలఙ్గల్ మట్టిత్తు , మాతిరఙ్గళ్ 2817
మిన్నియెరివీశ మేలెడుత్త శూழ் కழల్ కాల్ ,
పొన్నులకమేழுమ్ కడన్దు ఉమ్బర్ మేల్ శిలుమ్బ , 2818
మన్ను కులవరైయుమ్ మారుదముమ్ తారకైయుమ్
తన్నినుడనే శుழలచ్చుழన్ఱాడుమ్ , 2819
కొన్నవిలుమ్ మూఇలై వేల్ కూత్తన్ పొడియాడి
అన్నవన్ తన్ పొన్నకలమ్ శెన్ఱాఙ్గు అణైన్దిలళే , 2820
పన్ని యురైక్కుఙ్గాల్ పారతమామ్ , పావియేఱ్కు
ఎన్నుఱునోయ్ యానురైప్ప క్కేణ్మిన్ ,ఇరుమ్బొழீల్ శూழ் 2821
మన్ను మఱైయోర్ తిరునఱైయూర్ మామలైఢపోల్ ,
పొన్నియలుమాడ క్కవాడమ్ కడన్దు పుక్కు, 2822
ఎన్నుడైయ కణ్ కళిప్ప నోక్కినేన్ , నోక్కుతలుమ్
మన్నన్ తిరుమార్బుం వాయుం అడియిణైయుం , 2823
పన్ను కరతలముమ్ కణ్గళుమ్ , పఙ్గయత్తిన్
పొన్నియల్ కాడు ఓర్ మణివరైమేల్ పూత్తదుపోల్ , 2824
మిన్ని యొళి పడైప్ప వీழ் నాణుమ్ తోళ్ వళైయుమ్ ,
మన్నియ కుణ్డలముమ్ ఆరముమ్ నీణ్ముడియుమ్ , 2825
తున్ను వెయిల్ విరిత్త శూడామణి యిమైప్ప ,
మన్ను మరతక క్కున్ఱిన్ మరుఙ్గే , ఓర్ 2826
ఇన్ ఇళ వఞ్జి క్కొడి ఒన్ఱు నిన్ఱదుదాన్ ,
అన్నమాయ్ మానాయ్ అణిమయిలాయ్ ఆఙ్గిడైయే , 2827
మిన్నాయ్ ఇళవేయిరణ్డాయ్ ఇణైచ్చెప్పాయ్
మున్నాయ తొణ్డైయాయ్ క్కెణ్డైక్కులమిరణ్డాయ్ , 2828
అన్న తిరువురువం నిన్ఱదఱియాదే ,
ఎన్నుడైయ నెఞ్జుం అఱివుం ఇనవళైయుమ్ , 2829
పొన్ ఇయలుమ్ మేకలైయుమ్ ఆఙ్గొழிయప్పోన్దేఱ్కు ,
మన్ను మఱికడలుమ్ ఆర్ క్కుమ్ , మతి ఉకుత్త 2830
ఇన్ నిలా విన్ కతిరుమ్ ఎన్ తనక్కే వెయ్ తాకుమ్
తన్నుడైయ తన్మై తవిరిత్తాన్ ఎన్గొలో , 2831
తెన్నన్ పొతియిల్ శెழுమ్ శన్దిన్ తాతళైన్దు ,
మన్ను ఇవ్వులగై మనమ్ కళిప్ప వన్దు ఇయఙ్గుమ్ , 2832
ఇన్ ఇళమ్ పూమ్ తెన్ఱలుమ్ వీశుమ్ ఎరి ఎనక్కే ,
మున్నియ పెణ్ణైమేల్ ముళ్ ముళిరికూట్టకత్తు , 2833
పిన్నుమ్ అవ్వన్ఱిల్ పేడైవాయ్ చ్చిఱు కురలుమ్ ,
ఎన్నుడైయ నెఞ్జుక్కు ఓర్ ఈర్ వాళామ్ ఎన్ శెయ్ గేన్ , 2834
కన్నవిల్ తోళ్ కామన్ కరుప్పు చ్చిలై వళైయ ,
కొన్నవిలుమ్ పూఙ్గణైకళ్ కోత్తు ప్పొదవణైన్దు , 2835
తన్నుడైయ తోళ్ కழிయవాఙ్గి , తమియేన్ మేల్
ఎన్నుడైయ నెఞ్జే యిలక్కాక ఎయ్ కిన్ఱాన్ , 2836
పిన్నితనై క్కాప్పీర్ తానిల్లయే , పేదైయేన్
కన్న విలుమ్ కాట్టకత్తు ఓర్ వల్లిక్కడి మలరిన్ , 2837
నన్నఱువాశమ్ మర్ట్రు ఆరానుమ్ ఎయ్ తామే ,
మన్నుమ్ వఱు నిలత్తు వాళాఙ్గుకుత్తతుపోల్ , 2838
ఎన్నుడైయ పెణ్మైయుమ్ ఎన్నలనుమ్ ఎన్ములైయుమ్ ,
మన్ను మలర్ మఙ్గై మైన్దన్ , కణపురత్తు 2839
పొన్మలైపోల్ నిన్ఱ వన్దన్ పొన్నకలమ్ తోయావేల్ ,
ఎన్నివైతాన్ వాళా ఎనక్కే పొఱైయాగి , 2840
మున్నిరున్దు మూక్కిన్ఱు మూవామై కాప్పదోర్ ,
మన్ను మరున్దు అఱివీర్ ఇల్లైయే , మాల్ విడైయిన్ 2841
తున్ను పిడర్ ఎరుత్తు త్తూక్కుణ్డు , వన్ తొడరాల్
కన్నియర్ కణ్ మిళిర క్కట్టుణ్డు , మాలైవాయ్ 2842
తన్నుడైయ నా ఒழிయాదు ఆడుమ్ తని మణియిన్ ,
ఇన్నిశైయోశైయుమ్ వన్దు ఎన్ శెవిదనక్కే , 2843
కొల్ నవిలుమ్ ఎహ్ కిన్ కొడిదాయ్ నెడిదాగుమ్,
ఎన్ ఇదనై కాక్కుమా శొల్లీర్ , ఇదు విళైత్త 2844
మన్నన్ నఱున్దుழாయ్ వాழ் మార్బన్ మామతికోళ్ ,
మున్నమ్ విడుత్త ముగిల్ వణ్ణన్, కాయావిన్ 2845
శిన్ననఱుమ్ పూమ్ తిగழ் వణ్ణన్ , వణ్ణమ్బోల్
అన్న కడలై మలై యిట్టణైకట్టి , 2846
మన్ననిరావణనై మామణ్డు వెఞ్జమత్తు ,
పొన్ముడిగళ్ పత్తుం పురుళచ్చరన్దురన్దు , 2847
తెన్నులగమ్ ఏర్ట్రువిత్త శేవకనై , ఆయిరక్కణ్
మన్నవన్ వానముమ్ వానవర్ తమ్ పొన్నులగమ్ , 2848
తన్నుడైయ తోళ్ వలియాల్ కైక్కొణ్డ దానవనై ,
పిన్నోరరియురువమాగి యెరివిழீత్తు , 2849
కొల్ నవిలుమ్ వెఞ్జమత్తుకొల్లాదే , వల్లాళన్
మన్ను మణిక్కుఞ్జిపర్ట్రి వర ఈర్ త్తు , 2850
తన్నుడైయ తాళ్ మేల్ కిడాత్తి , అవనుడైయ
పొన్నకలమ్ వళ్ళుగిరాల్ పోழ்న్దు పుగழ் పడైత్త , 2851
మిన్నిలఙ్గుమ్ ఆழி పడై తడక్కై వీరనై ,
మన్నివ్వకలిడత్తై మామతునీర్ తాన్ విழுఙ్గ , 2852
పిన్నుమోరేనమాయ్ పుక్కు వళై మరుప్పిల్ ,
కొల్ నవిలుమ్ కూర్ నుతిమేల్ వైత్తు ఎడుత్త కూత్తనై , 2853
మన్నుమ్ వడమలయై మత్తాక మాశుణత్తాల్ ,
మిన్నుమ్ ఇరుశుడరుమ్ విణ్ణుమ్ పిఱఙ్గు ఒలియుమ్ , 2854
తన్నినుడనే శుழల మలై తిరిత్తు , ఆఙ్గు
ఇన్నముదమ్ వానవరైయూట్టి , అవరుడైయ 2855
మన్నుమ్ తుయర్ కడిన్ద వళ్ళలై , మర్ట్రన్ఱియుమ్
తన్నురువమ్ ఆరుమఱియామల్ తాన్ అఙ్గు ఓర్ , 2856
మన్నుమ్ కుఱళురువిన్ మానియాయ్ , మావలితన్
పొన్నియలుమ్ వేళ్విక్కణ్ పుక్కిరున్దు , పోర్ వేన్దర్ 2857
మన్నై మనఙ్గొళ్ళ వఞ్జిత్తు నెఞ్జురుక్కి ,
ఎన్నుడైయ పాదత్తాల్ యాన్ అళప్ప మూవడిమణ్ , 2858
మన్నా తరుక ఎన్ఱు వాయ్ తిఱప్ప , మర్ట్రవనుమ్
ఎన్నాల్ తరప్పట్టదు ఎన్ఱలుమే , అత్తుణైకణ్ 2859
మిన్నార్ మణిముడిపోయ్ విణ్ తడవ , మేలెడుత్త
పొన్నార్ కనై కழఱ్కాల్ ఏழுలగుమ్ పోయ్ క్కడన్దు , అఙ్గు 2860
ఒన్ఱా అశురర్ తుళఙ్గ చ్చిలై నీట్టి ,
మన్ ఇవ్వకలిడత్తై మావలియై వఞ్జిత్తు , 2861
తన్నులకమ్ ఆక్కువిత్త తాళానై , తామరైమేల్
మిన్నిడైయాళ్ నాయకనై విణ్ణకరుళ్ పొన్ మలైయై , 2862
పొన్ని మణి కొழிక్కుమ్ పూఙ్గుడన్దై ప్పోర్విడయై ,
తెన్నన్ కుఱుఙ్గుడియుళ్ శెమ్బవళకున్ఱినై , 2863
మన్నియ తణ్ శెఱై వళ్ళలై , మామలర్ మేల్
అన్నమ్ తుయిలుమ్ అణి నీర్ వయలాలి , 2864
ఎన్నుడైయ ఇన్నముదై ఎవ్వుళ్ పెరుమలైయై ,
కన్ని మదిళ్ శూழ் కణమఙ్గై కఱ్పగత్తై , 2865
మిన్నై యిరుశుడరై వెళ్ళఱైయుళ్ కల్ అఱైమేల్
పొన్నై , మరదగత్త్కై పుట్కుழிయెమ్బోరేర్ట్రై , 2866
మన్నుమ్ అరఙ్గత్తు ఎమ్మామణియై , వల్లవాழ்
పిన్నై మణాళనై ప్పేరిల్ పిఱప్పిలియై , 2867
తొన్నీర్కడల్ కిడన్ద తోళామణిచ్చుడరై ,
ఎన్మనత్తు మాలై ఇడవెన్దై ఈశనై , 2868
మన్నుమ్ కడల్ మల్లై మాయవనై , వానవర్ తమ్
శెన్ని మణిచ్చుడరై త్తణ్ కాల్ తిఱల్ వలియై , 2869
తన్నైప్పిఱరఱియా త్తత్తువత్తై ముత్తినై ,
అన్నత్తై మీనై అరియై అరుమఱైయై , 2870
మున్నివులగుణ్డ మూర్తియై , కోవలర్
మన్నుమ్ ఇడైకழி యెమ్ మాయవనై , పేయ్ అలఱ 2871
పిన్నుమ్ ములైయుణ్డ పిళ్ళైయై ,అళ్ళల్ వాయ్
అన్నమ్ ఇఱైతేర్ అழுన్దూర్ , ఎழுమ్ శుడర్ 2872
తెన్ తిల్లై చ్చిత్తరకూడత్తు ఎన్ శెల్వనై ,
మిన్ని మழைతవழுమ్ వేఙ్గడత్తు ఎమ్ విత్తకనై , 2873
మన్ననై మాలిరుఞ్జోలై మణాళనై ,
కొన్న విలుమాழிపడైయానై , కోట్టియూర్ 2874
అన్నవురువినరియై , తిరుమెయ్యత్తు
ఇన్న ముతువెళ్ళత్తై ఇన్దళూర్ అన్దణనై , 2875
మన్ను మదిళ్ కచ్చి వేళుక్కై ఆళరియై ,
మన్నియ పాడగత్తు ఎమ్మైన్దనై , వెహ్ కావిల్ 2876
ఉన్నియ యోగత్తుఱక్కత్తై , ఊరకత్తుళ్
అన్నవనై అట్టపుయకరుత్తు ఎమ్మానేర్ట్రై , 2877
ఎన్నై మనఙ్గవర్ న్ద ఈశనై , వానవర్ తమ్
మున్నవనై మూழிక్కళత్తు విళక్కినై , 2878
అన్నవనై ఆదనూర్ ఆణ్డు అళక్కుమ్ ఐయనై ,
నెన్నలై యిన్ఱి నైనాళైయై , నీర్మలై మేల్ 2879
మన్ను మఱై నాన్గుమ్ ఆనానై , పుల్లాణి
తెన్నన్ తమిழை వడమొழிయై , నాఙ్గూరిల్ 2880
మన్ను మణిమాడక్కోయిల్ మణాళనై ,
నల్ నీర్ త్తలైచ్చఙ్గ నాణ్మదియై , నాన్ వణఙ్గుమ్ 2881
కణ్ణనై క్కణ్ణపురత్తానై , తెన్నఱైయూర్
మన్ను మణిమాడక్కోయిల్మణాళనై , 2882
కల్ నవిల్ తోళ్ కాళైయై కణ్డు ఆఙ్గు క్కైతొழுదు ,
ఎన్నిలైమై యెల్లామ్ అఱివిత్తాల్ ఎమ్బెరుమాన్ , 2883
తన్ అరుళుమ్ ఆకముమ్ తారావేల్ , తన్నై నాన్
మిన్ ఇడైయార్ శేరియిలుమ్ వేదియర్ గళ్ వాழ் విడత్తుమ్ , 2884
తన్నడియార్ మున్బుమ్ తరణి ముழுతాళుమ్ ,
కొల్ నవిలుమ్ వేల్ వేన్దర్ కూట్టత్తుమ్ నాట్టకత్తుమ్ , 2885
తన్నిలైమై యెల్లామ్ అఱివిప్పన్ , తాన్ ముననాళ్
మిన్నిడై యాయ్ చ్చియర్ తమ్ శేరి క్కళవిన్ కణ్ , 2886
తున్ను పడల్ తిఱన్దు పుక్కు , తయిర్ వెణ్ణెయ్
తన్ వయిఱార విழுఙ్గ , కొழுఙ్గయర్కణ్ 2887
మన్ను మడవోర్ గళ్ పర్ట్రి ఓర్ వాన్ కయిర్ట్రాల్ ,
పిన్నుమ్ ఉరలోడు కట్టుణ్డ పెర్ట్రిమైయుమ్ , 2888
అన్నదు ఓర్ బూతమాయ్ ఆయర్ విழవిన్ కణ్ ,
తున్ను శకడత్తాల్ పుక్క పెరుఞ్జోర్ట్రై , 2889
మున్నిరున్దు ముర్ట్రత్తాన్ తుర్ట్రియ తెర్ట్రెనవుమ్ ,
మన్నర్ పెరుమ్ శవైయుళ్ వాழ்వేన్దర్ తూదనాయ్ , 2890
తన్ను యిగழ்న్దు ఉరైప్ప త్తాన్ ముననాళ్ శెన్ఱదువుమ్ ,
మన్ను పఱై కరఙ్గ మఙ్గైయర్ తమ్ కణ్ కళిప్ప , 2891
కొల్ నవిలుమ్ కూత్తనాయ్ ప్పెయర్తుమ్ కుడమాడి ,
ఎన్ ఇవన్ ఎన్నప్పడుకిన్ఱ ఈడఱవుమ్ , 2892
తెన్నిలఙ్గైయాట్టి యరక్కర్ కులప్పావై ,
మన్ననిరావణన్ తన్ నల్ తఙ్గై , వాళెయుర్ట్రు 2893
తున్ను శుడు శినత్తు చ్చూర్పణకా చ్చోర్వెయిది ,
పొన్నిఱఙ్గొణ్డు పులర్ న్దెழுన్ద కామత్తాల్ , 2894
తన్నై నయన్దాళై l త్తాన్ మునిన్దు మూక్కరిన్దు l ,
మన్నియ తిణ్ణెనవుమ్ l వాయ్ త్త మలై పోలుమ్ l , 2895
తన్ నిగరొన్ఱిల్లాద l తాడకైయై l , మామునిక్కా
**తెన్నులగమేర్ట్రువిత్త l తిణ్డిఱలుమ్ l , మర్ట్రివైదాన్ 2896
ఉన్నియులవా l వులగఱియ వూర్వన్ నాన్ l ,
మున్నిముళైత్తు ఎழுన్దు l ఓఙ్గి యొళిపరన్ద l , 2897
మన్నియ పూమ్ పెణ్ణై మడల్ ll 2897 ½
(కంబరు కవిగారు రచించిన పాశురమును ఈ ప్రభంధమునకు చేర్చి భక్తులుపాడుదురు)
ఎన్నిలైమైయెల్లామ్ l అఱివిత్తాల్ ఎమ్బెరుమాన్ l ,
తన్నరుళుమ్ ఆకముమ్ తారానేల్ l , పిన్నైపోయ్
ఒణ్డురై నీర్వేలై l యులగఱియ వూర్వన్ నాన్ l,
వణ్ణరై పూమ్ పెణ్ణై l మడల్ ll
***********
( గమనిక: ఈ పాశురమును చిన్న చిన్న భాగములుగ విడదీసి ప్రతిపదార్ధములు ఒనరించినను, వానిని సమీకరించి ,అఖండమైన పాశురము యొక్క భావమును మనస్సునందు అనుభవింపవలయును.)
(శ్రీమన్నారాయణుని బడయుటకు స్వచ్ఛంద కామపుషార్ధముమే కారణమగునని ధృడవిశ్వాశము గల తిరుమంగై ఆళ్వార్, ఆ కామపుషార్ధము, వేదములచే నుడువబడిన నాలుగు పురుషార్ధములలో ఒకటనియు, ఆ వేదములు చతుర్ముఖ బ్రహ్మనుండి వెలువడినదనియు , ఆ చతుర్ముఖ బ్రహ్మ సర్వేశ్వరుని నాభి కమలమందు ఉద్భవించెననియు , ఆ నాభి కమలము సర్వేశ్వరుడు యోగనిద్రయందు జగద్రక్షణార్ధమై సంకల్పించగ పుష్పించినదియు, అట్టి సర్వేశ్వరుని వైభవమును స్తుతించుచున్నారు.)
మన్నియ పల్ పొఱిశేర్ ఆయిరవాయ్ వాళ్ అరవిన్ ,
శెన్ని మణిక్కుడుమి త్తెయ్ వ చ్చుడర్ నడువుళ్ , 2750
మన్నియ నాగత్తణైమేల్ ఓర్ మామలైపోల్ ,
మిన్ను మణి మకరకుణ్డలఙ్గల్ విల్ వీశ , 2751
తున్నియ తారకైయిన్ పేరొళి శేర్ ఆకాశమ్ ,
ఎన్నుమ్ విదానత్తిన్ కీழாల్ , ఇరు శుడరై 2752
మన్నుమ్ విళక్కాగ ఏర్ట్రి , మఱి కడలుమ్
పన్ను తిరై క్కవరివీశ నిలమఙ్గై 2753
తన్నై ముననాళ్ అళవిట్ట తామరైపోల్ ,
మన్నియ శేవడియై వాన్ ఇయఙ్గు తారగై మీన్ , 2754
ఎన్నుమ్ మలర్ ప్పిణైయల్ ఏయ్ న్ద , మழை క్కూన్దల్
తెన్నన్ ఉయర్ పొరుప్పుమ్ తెయ్ వ వడమలైయుమ్ , 2755
ఎన్నుమివైయే ములైయా వడివమైన్ద ,
అన్ననడైయ అణఙ్గే అడియిణైయై 2756
తన్నుడైయ అఙ్గైగళాల్ తాన్ తడవ త్తాన్ కిడన్దు, ఓర్
ఉన్నియయోగత్తు ఉఱక్కుమ్ తలైకొణ్డ 2757
పిన్నై తన్నాబి వలయత్తు ప్పేరొళిశేర్
మన్నియ తామరై మామలర్ పూత్తు , అమ్మలర్మేల్ 2758
మున్నమ్ తిశైముగనై త్తాన్ పడైక్క , మర్ట్రవనుమ్
మున్నమ్ పడైత్తనన్ నాన్మఱైగళ్ , ………….. 2759
మన్నియ = వర్ధిల్లుగాక!(ఇది ప్రబంధారంభమున చేయబడు మంగళాశాసనము) ; తాన్ = సర్వేశ్వరుడు; పల్ పొఱిశేర్ ఆయిరవాయ్ వాళ్ అరవిన్ = అనేక చిహ్నములతోను, పడగల తోను, ప్రకాశించుచున్న శేషునియొక్క ;శెన్ని మణిక్కుడుమి = పడగలయందుగల మణుల నుండి వెదజల్లబడు ; తెయ్ వమ్ శుడర్ నడువుళ్ మన్ని = దివ్యమైన తేజస్సుగల కాంతుల నడుమ వెలయుచు; అ నాగత్తు అణైమేల్ = ఆ శేషునియొక్క తల్పమున ; తున్నియ తారకైయిన్ పేరొళి శేర్ ఆకాశమ్ ఎన్నుమ్ వితానత్తిన్ కీழாల్ = దట్టమైన నక్షత్రముల సమూహములచే గొప్ప ప్రకాశముతోనిండిన ఆకాశమనెడి పందిరి(చాందిని) క్రింద; మిన్ను మణి మకరకుణ్డలఙ్గల్ విల్ వీశ = ప్రకాశించు రత్నములతొకూడిన మకరకుండలములు ధగ ధగ మెరయుచుండగ ;ఇరు శుడరై మన్నుమ్ విళక్కాగ ఏర్ట్రి = రెండు తేజస్సుగల శంఖు, చక్రములను నిత్యముగవెలుగు దీపములవలె ధరించి; మఱి కడలుమ్ = సముద్రరాజు ; ముననాళ్ = పూర్వము ఒకప్పుడు ; నిలమఙ్గై తన్నై అలవిట్ట =(త్రివిక్రమావతారమందు) భూదేవిని కొలిచిన, తామరైపోల్ మన్నియ శేవడియై = ఎఱ్ఱని పాద పద్మములపై ; పన్ను తిరై కవరి వీశ = ఇటు అటు కదిలెడి అలలచే వింజామరము వీచుచుండగ ; వాన్ ఇయఙ్గు తారగై మీన్ ఎన్నుమ్ మలర్ ప్పిణైయల్ ఏయ్ న్ద = ఆకాశమునందు గల నక్షత్రములనెడి పుష్పగుచ్ఛములచే అలంకరింబడియు; మழை క్కూన్దల్ = నల్లని దట్టమైన మేఘములు కుంతలములుగను ; తెన్నన్ ఉయర్ పొరుప్పుమ్ తెయ్ వ వడమలైయుమ్ = దక్షిణమునగల ఎత్తైన తిరుమాలిరుఞ్జోలై పర్వతమును, ఉత్తరమునగల దివ్యమైన తిరుమల పర్వతమును;ఎన్నుమ్ ఇవైయే ములైయా వడివు అమైన్ద = అనబడెడి ఈ రెండును స్తనములుగ అమరిన సుందరమైన రూపముకలిగి, అన్నమ్ నడైయ = హంసవలె గమనము కలిగిన; అణఙ్గే తాన్ = దివ్య రమణి ఆ భూదేవి; తన్నుడైయ అమ్ కైగళాల్ = తనయొక్క అందమైన హస్తములతో ; అడియిణైయై తడవ = పాదద్వందములను మృదువుగ ఒత్తుచుండగ ;(అట్టి విభవములతో కూడి),ఓర్ మామలై పోల్ కిడన్దు =విలక్షణమైన ఒక గొప్ప పర్వతమువలె పవళించి ; ఓర్ ఉన్నియయోగత్తు ఉఱక్కుమ్ తలైకొణ్డ పిన్నై = విలక్షణమైన జగద్రక్షణ విషయమై యోగనిద్రను వహించి; తన్ నాబి వలయత్తు=తనయొక్కనాభిమండలమందు పేర్ ఒళి శేర్ మన్నియ తామరై మామలర్ పూత్తు=గొప్ప ప్రకాశముతోనిండిన ,నిత్యమైన, విశాలమైన పద్మమును పుష్పింపజేసి ; అ మలర్ మేల్ = ఆ పద్మము పైన ; మున్నమ్ తిశైముగనై తాన్ పడైక్క= మొట్టమొదటిగ చతుర్ముఖ బ్రహ్మను సర్వేశ్వరుడు సృష్టించిగ ; మర్ట్రవనుమ్ = ఆ చతుర్ముఖ బ్రహ్మకూడ ; మున్నమ్ నాన్మఱైగళ్ పడైత్తనన్ = మొట్టమొదటిగ నాలుగు వేదములను (సర్వేశ్వరుని కృపచే) వెలువరించెను.
దట్టమైన నక్షత్రముల సమూహములచే గొప్ప ప్రకాశముతోనిండిన ఆకాశమనెడి పందిరి(చాందిని) క్రింద, ఆదిశేషుని వేయి పడగలయందుగల మణులనుండి వెదజల్లబడు దివ్యమైన తేజస్సుగలకాంతుల నడుమ వెలయుచు, ఆ శేషునియొక్క తల్పమున , ప్రకాశించు రత్నములతొ కూడిన మకరకుండలములు ధగ ధగ మెరయుచుండగ, తేజస్సుగల శంఖు, చక్రములను ధరించి, సముద్రరాజు ఇటు అటు కదిలెడి అలలచే వింజామరము వీచుచుండగ, ఆకాశమునందు గల నక్షత్రములనెడి పుష్పగుచ్ఛములచే అలంకరింబడినదియు,నల్లని దట్టమైన మేఘములు కుంతలములుగ కలదియు, తిరుమాలిరుఞ్జోలై మఱియు తిరుమల పర్వతములు వక్షోజములుగ అమరి అతిసుందరమైన రూపముకలిగినదియు,హంస గమనము కలదియు, అయిన దివ్య రమణి ఆ భూదేవి తనయొక్క అందమైన హస్తములతో తన పాదద్వందములను మృదువుగ ఒత్తుచుండగ , విలక్షణమైన ఒక గొప్ప పర్వతమువలె పవళించి , జగద్రక్షణార్ధమై యోగనిద్రను వహించి, సంకల్పమాత్రముచే తనయొక్క నాభిమండలమందు గొప్ప ప్రకాశముతోనిండిన పద్మమును పుష్పింపజేసి , ఆ పద్మము పైన చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి, ఆ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా నాలుగువేదములు వెలువరించెను.
( ఆ వేదములు నుడివిన ప్రశస్తమైన నాలుగు పురుషార్ధములలో మోక్షమను పురుషార్ధము విషయమై పరకాలనాయకి (తిరుమంగై ఆళ్వార్ ) మొదట వివరించి తృణీకరించుచున్నారు. )
…….. ……… …. అమ్మఱైదాన్
మన్నుమ్ అఱమ్ పొరుళ్ ఇన్బమ్ వీడెన్ఱులగిల్ ,
నన్నెఱి మేమ్బట్టన నాన్గన్ఱే , నాన్గినిలుమ్ 2760
పిన్నైయదు పిన్నై ప్పెయర్ తరుమెన్బదు ఓర్ ,
తొల్ నెఱియై వేణ్డువార్ వీழ்కనియుమ్ ఊழீలైయుమ్ , 2761
ఎన్నుమివైయే నుగర్ న్దు ఉడలమ్ తామ్ వరున్దినేన్ ,
తున్నుమ్ ఇలైక్కురమ్బై త్తుఞ్జియుమ్ , వెఞ్జుడరోన్ 2762
మన్నుమ్ అழల్ నుకర్ న్దుమ్ వణ్ తడత్తునుళ్ కిడన్దుమ్ ,
ఇన్నదోర్ తన్మైయరాయ్ ఈఙ్గు ఉడలమ్ విట్టు ఎழுన్దు , 2763
తొన్నెఱిక్కణ్ శెన్ఱార్ ఎనప్పడుమ్ శొల్లల్లాల్ ,
ఇన్నదోర్ కాలత్తు ఇనైయార్ ఇదుపెర్ట్రార్ , 2764
ఎన్నవుమ్ కేట్టఱివదిల్లై, …… …………..,
అమ్మఱైదాన్ = ఆ వేదములే ; మన్నుమ్ అఱమ్ పొరుళ్ ఇన్బమ్ వీడెన్ఱు = స్ధిరమైన, ధర్మము,అర్థము, కామము, మోక్షము అనబడెడిది ; ఉలగిల్ నల్ నెఱి మేమ్ బట్టన నాన్గు అన్ఱే = ఈ లోకములోని జనులకు సద్గతి పొందజేయునని కొనియాడబడుచు చెప్పబడుచున్నవి , ఆ నాలుగు పురుషార్ధములే కదా!; నాన్గినిలుమ్ = ఆ నాలుగు పురుషార్ధములలో; పిన్నైయదు = చివరగ చెప్పబడుచున్న మోక్షమను పురుషార్ధము; పిన్నై ప్పెయర్ తరుమ్ ఎన్బదు=ఈ శరీరము విడిచిన పిదప కలుగునని (శాస్త్రములచే) చెప్పబడుచున్నది; ఓర్ తొల్ నెఱియై = విలక్షణమైన అనాదియైన పరమపదము (అర్చిరాదిమార్గమును) ; వేణ్డువార్ తామ్ = పొందగోరువారు ; వీழ்కనియుమ్ ఊழ் ఇలైయుమ్ ఎన్నుమ్ ఇవైయే నుగర్ న్దు = చెట్టుమీదనే పండి క్రిందపడిన పండ్లను, ఎండిన ఆకులను ఇవియే తినుచు ; ఉడలమ్ వరున్ది = శరరమును కృశింపజేసుకొని; తున్నుమ్ ఇలై క్కురమ్బై తుఞ్జియుమ్ = దగ్గరగా చేరియున్న పర్ణశాలలయందు పరుండియు; వెమ్ శుడరోన్ = క్రూరమైన కిరణములతో ప్రకాశించు సూర్యునియొక్క; మన్నుమ్ అழల్ నుకర్ న్దుమ్ = ఎల్లప్పుడును నిప్పులుగ్రక్కు ఆ కిరణములను ఆస్వాదించుచును ; వణ్ తడత్తునుళ్ కిడన్దుమ్ = అందమైన తటాకములలో మునుగుచును ; ఇన్నదోర్ తన్మైయరాయ్ = ఇట్లు ఈవిధమైన స్వభావముగలవారై; ఈఙ్గు ఉడలమ్ విట్టు ఎழுన్దు = ఈ లోకమందు శరీరమును విడిచిపెట్టి పైకి లేచి ; తొల్ నెఱిక్కణ్ శెన్ఱార్ ఎనప్పడుమ్ శొల్ అల్లాల్ = అనాదియైన తిరిగివచ్చుటలేని వేఱొక దివ్య ప్రదేశమునకు వెడలుదురు అని చెప్పబడుటయే కాని ; ఇన్నదోర్ కాలత్తు ఇనైయార్ ఇదు పెర్ట్రార్ = ఒకానొక దినమున ఒకానొక మనుజుడు ఈ దివ్యమైన పరమపదమును పొందెనని; ఎన్నవుమ్ కేట్ట అఱివదు ఇల్లై = (నిజముగ) అట్టి వార్తలను ఏ ఒక్కరైనను చెప్పగ వినియుండలేదే !
ఆ వేదములందు ధర్మము,అర్థము, కామము, మోక్షము అను నాలుగు పురుషార్ధములు చెప్పబడినది . ఈ లోకములోని మనజులకు సద్గతి పొందజేయునని , ఆ నాలుగు పురుషార్ధములే మిక్కిలి కొనియాడబడినవి. ఆ నాలుగు పురుషార్ధములలో చివరగ చెప్పబడుచున్న మోక్షమను పురుషార్ధము మనుజుడు ఈ శరీరము విడిచిన పిదప కలుగునని శాస్త్రములచే చెప్పబడుచున్నది. అటువంటి పరమపదమును (అర్చిరాదిమార్గమును) పొందగోరువారు,చెట్టుమీదనే పండి క్రిందపడిన పండ్లను, మఱియు ఎండిన ఆకులను ఇవియే తినుచు, శరరమును కృశింపజేసుకొని, పర్ణశాలలయందు పరుండియు ,ఎల్లప్పుడును నిప్పులుగ్రక్కు సూర్య కిరణములను ఆస్వాదించుచు, తటాకములలో మునుగుచు, ఈ లోకమందు శరీరమును విడిచిపెట్టి పైకి లేచి అనాదియైన తిరిగివచ్చుటలేని వేఱొక దివ్య ప్రదేశమునకు వెడలుదురు అని చెప్పబడుటయే కాని ఇచట ,ఒకానొక దినమున ఒకానొక మనుజుడు ఈ దివ్యమైన పరమపదమును పొందెనని ఏ ఒక్కరైనను చెప్పగ వినియుండలేదు కదా!
………. …….. ….. , ఉళదెన్నిల్
మన్నుమ్ కడుఙ్కదిరోన్ మణ్డలత్తిన్ నన్నడువుళ్ , 2765
అన్నదోర్ ఇల్లియిన్ ఊడుపోయ్ , వీడెన్నుమ్
తొన్నెఱిక్కణ్ శెన్ఱారై చ్చొల్లుమిన్గల్ శొల్లాదే , 2766
అన్నదే పేశుమ్ అఱివిల్ శిఱుమనత్తు , ఆఙ్గు
అన్నవరై క్కఱ్పిప్పోమ్ యామే , అదునిఱ్క 2767
ఉళదు ఎన్నిల్ = ‘అట్టి పరమపదము గలదు’ అనినచో ; మన్నుమ్ కడుమ్ కదిరోన్ మణ్డలత్తిన్ నల్ నడుధింవుళ్ = నిత్యమైనదియు మిక్కిలి తీక్షణమైన కిరణములుగల సూర్యమండలముయొక్క నట్టనడుమ; అన్నదు ఓర్ ఇల్లియిన్ ఊడు పోయ్ = మాటలచే చెప్పలేనటువంటి సూక్ష్మమైన రంద్రముద్వారా వెడలి; వీడు ఎన్నుమ్ తొల్ నెఱిక్కణ్ శెన్ఱారై చ్చొల్లుమిన్గల్ = మోక్షమనెడి మీరు చెప్పుచున్న ఒక దివ్య స్థానమునకు పోయి తిరిగివచ్చిన వారిని చూపుడు ; శొల్లాదే = అటువంటి వారిని చూపకనే ;అన్నదే పేశుమ్=మోక్షము కలదని శాస్త్రములు చెప్పుచున్నదని పాత పాట పాడుచున్నటువంటి; అఱివిల్ శిఱుమనత్తు అన్నవరై = అవివేకముతోనున్న అల్పమనస్సుగలవారికి; ఆఙ్గు కఱ్పిప్పోమ్ యామే = అట్టి అవివేకులకు మనచే బోధింప శఖ్యమా! ; అదునిఱ్క = ఆ మోక్షసంబందమైన విషయములను అటులనే ఉంచి ;
‘పరమపదము గలదు’ అనినచో అట్టి పరమపదమును , నిత్యమైనదియు మిక్కిలి తీక్షణమైన కిరణములుగల సూర్యమండలముయొక్క నట్టనడుమ సూక్ష్మమైన రంద్రము ద్వారా వెడలి తిరిగివచ్చిన వారిని చూపుడు. అటువంటి వారిని చూపకనే “మోక్షము కలదని శాస్త్రములు చెప్పుచున్నదని ” పలికెడి అవివేకముతోనున్న అల్పమనస్సు గలవారికి బోధింప శఖ్యమా!. ఆ మోక్షసంబందమైన విషయములను అటులనే ఉంచి….
( తాము అభిలషించి ,ధర్మార్ధ పురుషార్ధములు అనుష్టించువారలు పొందు స్వర్గలోకభోగముల విషయమై తెలుపుచు ,అవి అనిత్యములనియు, నిజముగ ధర్మార్ధమోక్ష పురుషార్ధములు మూడును భగవంతునియందు స్వచ్ఛందకామ పుషార్ధమునకే ఏర్పడెననియు, అదియే నిత్యమైన పరమానందము కలుగజేయుననియు తిరుమంగై ఆళ్వార్ విశదీకరించుచున్నారు.)
మున్నమ్ నాన్ శొన్న అఱత్తిన్ వழி ముయన్ఱ ,
అన్నవర్ తాఙ్గణ్డీర్ గళ్ ఆయిరక్కణ్ వానవర్ కోన్ , 2768
పొన్నగరమ్ పుక్కు అమరర్ పోర్ట్రిశెయ్యుమ్ శెప్ప ,పొఙ్గొళిశేర్
కొన్నవిలుమ్ కోళరిమా త్తాన్ శుమన్ద కోలమ్ శేర్ , 2769
మన్నియ శిఙ్గాశనత్తిన్మేల్ , వాళ్ నెడుఙ్గణ్
కన్నియరాల్ ఇట్ట కవరి పొతియవిழ்న్దు , ఆఙ్గు 2770
ఇన్నిళమ్ పూన్తెన్ఱల్ ఇయఙ్గ , మరుఙ్గిరున్ద
మిన్ననైయ నుణ్ మరుఙ్గుల్ మెల్లియలాల్ వెణ్ ముఱువల్ , 2771
మున్నమ్ ముకిழ்త్త ముకిழ் నిలా వన్దు అరుమ్బ
అన్నవర్ తమ్ మాన్ నోక్కమ్ ఉణ్డు ఆఙ్గు అణిమలర్ శేర్ , 2772
పొన్నియల్ కఱ్పగత్తిన్ కాడు ఉడుత్త మాడెల్లామ్ ,
మన్నియ మన్దారమ్ పూత్త మదు త్తివలై , 2773
ఇన్నిశై వణ్డమరుమ్ శోలైవాయ్ మాలైశేర్ ,
మన్నియ మామయిల్ పోల్ కూన్దల్ ,మழைత్తడఙ్గణ్ 2774
మిన్నిడైయారోడుమ్ విళైయాడి వేణ్డిడత్తు ,
మన్ను మణిత్తలత్తు మాణిక్కమఞ్జరియన్ , 2775
మిన్నిన్ ఒళిశేర్ పళిఙ్గు విళిమ్బడుత్త
మన్నుమ్ పవళక్కాల్ శెమ్బొన్ శెయ్ మణ్డపత్తుల్ , 2776
అన్ననడైయ అరమ్బైయర్ తమ్ కైవళర్ త్త ,
ఇన్నిశై యాழ் పాడల్ కేట్టు ఇన్బుర్ట్రు , ఇరువిశుమ్బిల్ 2777
మన్ను మழை తవழுమ్ వాణిలా నీణ్మతి తోయ్
మిన్నినొళిశేర్ విశుమ్బూరుమ్ మాళిగైమేల్, 2778
మన్ను మణివిళక్కై మాట్టి , మழைక్కణ్ణార్
పన్ను విశిత్తిరిమా ప్పా ప్పడత్త పళ్ళిమేల్ , 2779
తున్నియ శాలేకమ్ శూழ் కతవమ్ తాళ్ తిఱప్ప ,
అన్నమ్ ఉழక్క నెరిన్దు ఉక్క వాళ్ నీల , 2780
చ్చిన్న నఱుమ్ దాదు శూడి , ఓర్ మన్దారమ్
తున్ను నఱు మలరాల్ తోళ్ కొట్టి , కఱ్పగత్తిన్ 2781
మన్ను మలర్ వాయ్ మణివణ్డు పిన్ తొడర ,
ఇన్నిళమ్ పూన్తెన్ఱల్ పుగున్దు ఈఙ్గు ఇళములైమేల్ , 2782
నన్నఱుమ్ శన్దనచ్చేఱు పులర్త , తాఙ్గు అరుమ్ శీర్
మిన్నిడమేల్ కైవైత్తు ఇరున్దు ఏన్దు ఇళములైమేల్ , 2783
పొన్నరుమ్బు ఆరమ్ పులమ్బ , అగఙ్గుழைన్దు ఆఙ్గు
ఇన్నవురువిన్ ఇమైయా త్తడఙ్గణ్ణార్ , 2784
అన్నవర్ తమ్ మాన్ నోక్కమ్ ఉణ్డు ఆఙ్గు అణిముఱువల్ ,
ఇన్నముదమ్ మాన్దిఇరుప్పర్ , ఇదువన్ఱే 2785
అన్న అఱత్తిన్ పయనావదు , ఒణ్పొరుళుమ్
అన్న తిఱత్తదే యాదలాల్ , కామత్తిన్ 2786
మన్నుమ్ వழி ముఱైయే నిర్ట్రుమ్ నామ్ , ……..
మున్నమ్ నాన్ శొన్న అఱత్తిన్ వழி ముయన్ఱ అన్నవర్ తామ్ = (పురుషార్ధములలో) మొదటిగ నేను చెప్పిన ధర్మమార్గములో అనుష్టించినవారు ; ఆయిరక్కణ్ వానవర్ కోన్ పొన్ నగరమ్ పుక్కు = వేయి కన్నులుగల దేవతల ప్రభువైన ఇంద్రునియొక్క అందమైన లోకమున ప్రవేశించి ; అమరర్ పోర్ట్రిశెయ్యుమ్ శెప్ప = దేవతలు మంగళాశాసన వచనములు చెప్పుచుండగ ; పొఙ్గు ఒళిశేర్ కొన్నవిలుమ్ కోళ్ అరి మా తాన్ శుమన్ద కోలమ్ శేర్ మన్నియ శిఙ్గాశనత్తిన్ మేల్ = అధికమగు ప్రకాశముతో నిండినదియు , లంఘించి సంహారము చేసెడి బలిష్టమైన సింహములచే (చెక్కబడిన విగ్రహములచే) కూడినదియు,అందమైనదియు, స్థిరమైన సింహాసనముపై (అధిష్టించి) ; వాళ్ నెడుమ్ కణ్ కన్నియరాల్ ఇట్ట = కత్తివలె వాడియైన కన్నులుగల కన్యలచే వీచబడుచుండు,కవరి పొతి అవిழ்న్దు = చామరముల పరిమళభరితమైన రేణువులు తాకుచుండగ; ఆఙ్గు ఇన్ ఇళమ్ పూమ్ తెన్ఱల్ ఇయఙ్గ = అచట ఆహ్లాదము కలిగించు పరిమళమభరితమైన మందమారుతము దక్షిణదిక్కునుండి వీచుచుండగ ; మరుఙ్గు ఇరున్దు మిన్ అనైయ తుణ్ మరుఙ్గుల్ మెల్ ఇయలార్ = సమీపమందు మెరుపువలె సూక్ష్మమైన నడుముగల సుకుమారమైన కాంతామణుల ;వెణ్ ముఱువల్= (తమయొక్క) తెల్లని దంతముల చిరునవ్వుతో ;మున్నమ్ ముకిழ்త్త = అభిప్రాయమును సూచించు ; ముకిழ் నిలా వన్దు అరుమ్బ = ఉదయించు చంద్రుని వెన్నెల వచ్చి పైన ప్రసరించగ ;అన్నవర్ తమ్ = అటువంటి కాంతలయొక్క ; మాన్ నోక్కమ్ ఉణ్డు = లేడి చూపులవలెనున్న వారి నేత్ర సౌందర్యము అనుభవించి ; ఆఙ్గు = అటువంటి సమయమున ; అణి మలర్ శేర్ = సుందరమైన వికసించిన పుష్పములతో నిండిన ; పొన్ ఇయల్ కఱ్పగత్తిన్ కాడు ఉడుత్త మాడు ఎల్లామ్ = బంగారు మయమయిన కల్పవృక్ష అడవులతో నిండిన ప్రదేశములందంతటను ; మన్నియ మన్దారమ్ పూత్త మదు త్తివలై = ఎల్లప్పుడును వెలయుచుండు పారిజాతచెట్ల పుష్పముల నుండి మకరంద బిందువులయందు ; ఇన్ ఇశై వణ్డు అమరుమ్ శోలై వాయ్ = మధురమైన రాగములతో పాడు తుమ్మెదలతో కూడియున్న తోటలయందు ; మాలై శేర్ మన్నియ మామయిల్ పోల్ కూన్దల్ = పుష్పములతో అలంకరింపబడియు నెమలిపింఛము వలె కుంతలములు గలవారును ; మழை తడమ్ కణ్ = చల్లని విశాలమైన కన్నులు గలవారును; మిన్ ఇడైయారోడుమ్ = మెరుపువలె సన్నని నడుముగల అప్సరసలతో; వేణ్డిడత్తు విళైయాడి = అభీష్టమైన ప్రదేశములందు రమించి ; మన్నుమ్ మణితలత్తు = శ్లాఘ్యమైన రత్నములతో అమరిన స్థలములలో ; మాణిక్కమ్ మఞ్జరియన్ = మాణిక్యమయమయిన పూలగొత్తులతో ఒప్పుచుండునదియు ; మిన్నిన్ ఒళిశేర్ పళిఙ్గు విళిమ్బు అడుత్త = మెరుపువలె ధగ ధగ ప్రకాశించుచున్న స్పటికరాళ్ళచే అరుగులు కట్టబడియు ; మన్నుమ్ పవళ కాల్ = శ్లాఘ్యమైన పగడ స్తంబములు కలదియు ; శెమ్ పొన్ శెయ్ మణ్డపత్తుల్ = మేలిమి బంగారముతో చేయబడ్డ మండపములలో ; అన్నమ్ నడైయ అరమ్బైయర్ తమ్ కైవళర్ త్త = హంసవలెగమనము కలిగిన అప్సరసలయొక్క కరములయొక్క సొగసైన వేళ్ళచే సలుపు;ఇన్ ఇశై యాழ் పాడల్=ఇంపైనరాగములుగల వీణా గానము ; కేట్టు ఇన్బుర్ట్రు = విని ఆనందించియు ; ఇరు విశుమ్బిల్ మన్ను మழை తవழுమ్ = విశాలమైన ఆకాశమున ఎల్లప్పుడును మేఘములచే ఆవరింపబడి యుండునదియు ; వాళ్ నిలా నీళ్ మతి తోయ్ = అందమైన వెన్నెలతోకూడిన పెద్ద చంద్రుడు చేరి యుండబడునదియు ; మిన్నిన్ ఒళి శేర్ = మెరుపుయొక్క ప్రకాశమువలె కాంతి కలిగినదియు ;విశుమ్బు ఊరుమ్ మాళిగైమేల్ = ఆకాశమునందు సంచరించు విమానముపై ; మழை క్కణ్ణార్ = చల్లని కన్నులుగల కన్యలు ; మన్ను మణివిళక్కై మాట్టి = ఎల్లప్పుడును వెలిగెడి మణిదీపములను వేలాడగట్టి ; విశిత్తిరిమా పా ప్పడత్త = ఆశ్చర్యముగా విస్తారముగ పరచిన;పన్ను పళ్ళిమేల్=కొన్డాడబడు తల్పముపై ;తున్నియ శాలేకమ్ శూழ் కతవమ్ తాళ్ తిఱప్ప=దగ్గరగా చేరియున్న గవాక్షములనుచుట్టియుండు తలుపులు తెరిచియుంచగ ; ఇన్ ఇళ పూ తెన్ఱల్ = పరమభోగ్యమయిన మందమారుతము; అన్నమ్ ఉழక్క నెరిన్దు ఉక్క వాళ్ నీల నఱుమ్ చిన్న తాదు శూడి=హంసలచే త్రొక్కుబడుటచే నలిగిపోయిన అందమైన నీలోత్పములయొక్క పరిమళమభరితమైన సూక్ష్మమైన పరాగ రేణువులు ధరించి ;ఓర్ మన్దారమ్ తున్ను నఱు మలరాల్ తోళ్ కొట్టి = శ్లాఘ్యమైన పారిజాతచెట్ల మిక్కిలి పరమళముతో నిండిన పుష్పములచే భుజములను అలంకరించుకొని, కఱ్పగత్తిల్ మన్ను మలర్ వాయ్ మణివణ్డు పిన్ తొడర = కల్పవృక్షమునందుగల పుష్పములలోని తేనెను గ్రోలుచునుండు అందమైన తుమ్మెదలు వెనుక వెంబడించుచుండగ ; ఈఙ్గు పుగున్దు = వీరియొక్క రమించు ప్రదేశములో ప్రవేశించి ; ఇళ ములైమేల్ నల్ నఱుమ్ శన్దనచ్చేఱు పులర్త = యౌవనమైన వక్షోజములపై రాసుకొన్న మంచి పరిమళ చందన ద్రవ్యము ఎండగ ; తాఙ్గు అరుమ్ శీర్ మిన్ ఇడైమేల్ కైవైత్తు ఇరున్దు = మిక్కిలి నాజూకైన అందమైన, మెరుపువలె నున్న సన్నని నడుముపై ,చేతులుంచుకొని; ఏన్దు ఇళములైమేల్ పొన్ అరుమ్బు ఆరమ్ పులమ్బ=ఉన్నతమైన యౌవన వక్షోజములపై బంగారుకాసుల మాలలు శబ్దించుచుండగ; ఆఙ్గు = అట్టి ప్రియసన్నివేశము గాంచి; అగమ్ కుழைన్దు = మనస్సు కరిగిపోయి ; ఇన్న ఉరువిన్ ఇమైయా తడమ్ కణ్ణార్ అన్నవర్ తమ్ = అటువంటి విలక్షణమైన శరీరము కలిగిన ,రెప రెపలాడు విశాల నేత్రములుగల దేవతాస్త్రీలయొక్క; మాన్ నోక్కమ్ ఉణ్డు= లేడి చూపులవలెనున్న చూపులను అనుభవించుచు ; ఆఙ్గు=అచట ; అణి ముఱువల్ ఇన్ అముదమ్ మాన్ది ఇరుప్పర్ = అందమైన చిరునవ్వుల భోగ్యమైన అమృతమును ఆస్వాదించుచుందురు ; అన్న అఱత్తిన్ పయన్ ఆవదు ఇదు అన్ఱే = ముందు చెప్పిన ధర్మ పురుషార్ధమునకు కలగు ప్రయోజనము ఇదియే కదా ! ; ఒణ్ పొరుళుమ్ అన్న తిఱత్తదే = శ్లాఘ్యమైన అర్ధ పురుషార్ధము యొక్క ఫలము కూడా ధర్మ పురుషార్ధము యొక్క ఫలము వలనే అల్పమైనట్టియు ,తాత్కాలికమైనట్టియు స్వభావము కలిగియుండును ; ఆదలాల్ = ఈ విధముగ ధర్మార్ధ మను రెండు పురుషార్ధములకు కామమే ఫలము కారణమగుటచే ; కామత్తిన్ = ఆ కామపుషార్ధము యొక్క ; మన్నుమ్ వழி ముఱైయే = స్థిరమైన మార్గమగు భగవతునియెడల కామమార్గమందే ; నామ్ నిర్ట్రుమ్ = మేము దృఢముగ నిలిచియుండెదము ;
(పురుషార్ధములలో) మొదటిగ నేను చెప్పిన ధర్మమార్గములో అనుష్టించువారు వేయి కన్నులుగల దేవతల ప్రభువైన ఇంద్రునియొక్క అందమైన లోకమున ప్రవేశించి దేవతలు మంగళాశాసన వచనములు చెప్పుచుండగ అధికమగు ప్రకాశముతో నిండినదియు , లంఘించి సంహారము చేసెడి బలిష్టమైన సింహములచే (చెక్కబడిన విగ్రహములచే) కూడినదియు,అందమైనదియు, స్థిరమైన సింహాసనముపై (అధిష్టించి) కత్తివలె వాడియైన కన్నులుగల కన్యలచే వీచబడుచుండు, చామరముల పరిమళ భరితమైన రేణువులు తాకుచుండగ అచట ఆహ్లాదము కలిగించు పరిమళమభరితమైన మందమారుతము దక్షిణదిక్కునుండి వీచుచుండగ సమీపమందు మెరుపువలె సూక్ష్మమైన నడుముగల సుకుమారమైన కాంతామణుల ( తమయొక్క ) తెల్లని దంతములచే (చిరునవ్వుతో) అభిప్రాయమును సూచించు ఉదయించు చంద్రుని వెన్నెల వచ్చి పైన ప్రసరించగ అటువంటి కాంతలయొక్క లేడి చూపులవలెనున్న వారి నేత్ర సౌందర్యము అనుభవించి ,అటువంటి సమయమున సుందరమైన వికసించిన పుష్పములతో నిండిన బంగారు మయమయిన కల్పవృక్ష అడవులతో నిండిన ప్రదేశములందంతటను ఎల్లప్పుడును వెలయుచుండు పారిజాతచెట్ల పుష్పముల నుండి మకరంద బిందువులయందు మధురమైన రాగములతో పాడు తుమ్మెదలతో కూడియున్న తోటలయందు పుష్పములతో అలంకరింపబడియు, నెమలిపింఛము వలె కుంతలములు గలవారును చల్లని విశాలమైన కన్నులు గలవారును మెరుపువలె సన్నని నడుముగల అప్సరసలతో అభీష్టమైన ప్రదేశములందు రమించి, శ్లాఘ్యమైన రత్నములతో అమరిన స్థలములలో మాణిక్యమయమయిన పూలగొత్తులతో ఒప్పుచుండునదియు మెరుపువలె ధగ ధగ ప్రకాశించుచున్న స్పటికరాళ్ళచే అరుగులు కట్టబడియు శ్లాఘ్యమైన పగడ స్తంబములు కలదియు మేలిమి బంగారముతో చేయబడ్డ మండపములలో హంసవలె గమనము కలిగిన అప్సరసలయొక్క కరములయొక్క సొగసైన వేళ్ళచే సలుపు ఇంపైన రాగములుగల వీణా గానము విని ఆనందించియు విశాలమైన ఆకాశమున ఎల్లప్పుడును మేఘములచే ఆవరింపబడి యుండునదియు అందమైన వెన్నెలతోకూడిన పెద్ద చంద్రుడు చేరి యుండబడునదియు మెరుపుయొక్క ప్రకాశమువలె కాంతి కలిగినదియు ఆకాశమునందు సంచరించు విమానముపై చల్లని కన్నులుగల కన్యలు ఎల్లప్పుడును వెలిగెడి మణిదీపములను వేలాడగట్టి ఆశ్చర్యముగా విస్తారముగ పరచిన కొన్డాడబడు తల్పముపై దగ్గరగా చేరియున్న గవాక్షములనుచుట్టియుండు తలుపులు తెరిచియుంచగ, పరమభోగ్యమయిన మందమారుతము, హంసలచే త్రొక్కుబడుటచే నలిగిపోయిన అందమైన నీలోత్పములయొక్క పరిమళమభరితమైన సూక్ష్మమైన పరాగ రేణువులు ధరించి, శ్లాఘ్యమైన పారిజాతచెట్ల మిక్కిలి పరమళముతో నిండిన పుష్పములచే భుజములను అలంకరించుకొని, కల్పవృక్షమునందుగల పుష్పములలోని తేనెను గ్రోలుచునుండు అందమైన తుమ్మెదలు వెనుక వెంబడించుచుండగ, వీరియొక్క రమించు ప్రదేశములో ప్రవేశించి యౌవనమైన వక్షోజములపై రాసుకొన్న మంచి పరిమళ చందన ద్రవ్యము ఎండగ మిక్కిలి నాజూకైన అందమైన, మెరుపువలె నున్న సన్నని నడుముపై , చేతులుంచుకొని ఉన్నతమైన యౌవన వక్షోజములపై బంగారుకాసుల మాలలు శబ్దించుచుండగ అట్టి ప్రియసన్నివేశము గాంచి మనస్సు కరిగిపోయి అటువంటి విలక్షణమైన శరీరము కలిగిన ,రెప రెపలాడు విశాల నేత్రములుగల దేవతా స్త్రీలయొక్క లేడి చూపులవలెనున్న చూపులను అనుభవించుచు అచట అందమైన చిరునవ్వుల భోగ్యమైన అమృతమును ఆస్వాదించుచుందురు. ముందు చెప్పిన ధర్మ పురుషార్ధమునకు కలగు ప్రయోజనము ఇదియే కదా ! శ్లాఘ్యమైన అర్ధ పురుషార్ధము యొక్క ఫలము కూడా ధర్మ పురుషార్ధము యొక్క ఫలము వలనే అల్పమైనట్టియు ,తాత్కాలిక మైనట్టియు స్వభావము కలిగియుండును .ఈ విధముగ ధర్మార్ధ మను రెండు పురుషార్ధములకు కామమే ఫలము కారణమగుటచే, ఆ కామపుషార్ధము యొక్క స్థిరమైన మార్గమగు భగవతునియెడల కామమార్గమందే మేము ధృడముగ నిలిచియుండెదము ;
…… ……… …., మా నోక్కిన్
అన్న నడైయార్ అలర్ఏశ ఆడవర్ మేల్ , 2787
మన్ను మడల్ ఊరార్ ఎన్బదోర్ వాశకముమ్ ,
తెన్ ఉరైయల్ కేట్టఱివదుణ్డు , అదనై యామ్ తెళియోమ్ , 2788
మన్నుమ్ వడనెఱియే వేణ్డినోమ్ , ……… …..
మాన్ నోక్కిన్ అన్నమ్ నడైయార్=లేడి వంటి చూపులును హంసవలె గమనమును గల యువతులు ; అలర్ ఏశ = (లోకులు) నిందించునట్లు ; ఆడవర్ మేల్ = పురుషులపై ; మన్ను మడల్ ఊరార్ ఎన్బదోర్ వాశకముమ్ = లోకమందుండెడి మడల్ ప్రక్రియ చేపట్టకూడదు అనెడి ఒక సిద్దాంతము ; తెన్ ఉరైయల్ కేట్టు అఱివదుణ్డు = తమిళ భాషలో విని ఎఱుంగుదుము ; యామ్ అదనై తెళియోమ్ = మేము ఆ సిద్దాంతమును ఙ్ఞానముతోకూడినదని తలంచము ; మన్నుమ్ వడనెఱియే వేణ్డినోమ్ = శ్లాఘ్యమైన సంస్కృత శాస్త్రములందు చెప్పబడు మార్గములనే స్వీకరించెదము ;
లేడి వంటి చూపులును హంసవలె గమనమును గల యువతులు (లోకులు) నిందించునట్లు పురుషులపై లోకమందుండెడి మడల్ ప్రక్రియ చేపట్టకూడదు అనెడి ఒక సిద్దాంతము తమిళ భాషలో విని ఎఱుంగుదుము, మేము ఆ సిద్దాంతమును ఙ్ఞానముతో కూడినదని తలంచము, శ్లాఘ్యమైన సంస్కృత శాస్త్రములందు చెప్పబడు మార్గములనే స్వీకరించెదము ;
……. …….. ………. , వేణ్డాదార్
తెన్నన్ పొదియిల్ శెழுమ్ శన్దనక్కుழమ్బిన్ , 2789
అన్నదోర్ తన్మై అఱియాదార్ , ఆయన్ వేయ్
ఇన్నిశైయోశైక్కు ఇరఙ్గాదార్ , మాల్ విడైయిన్ 2790
మన్ను మణి పులమ్బ వాడాదార్ , పెణ్ణైమేల్
పిన్నుమ్ అవ్వన్ఱిల్ పేడైవాయ్ చ్చిరుకురలుక్కు , 2791
ఉన్ని ఉడల్ ఉరుగి నైయాతార్ , ఉమ్బరవాయ్
తున్ను మది ఉకుత్త తూ నిలా నీళ్ నెరుప్పిల్ , 2792
తమ్ముడలమ్ వేవ త్తళరాదార్ , కామవేళ్
మన్నుమ్ శిలైవాయ్ మలర్ వాళికోత్తు ఎయ్య , 2793
పొన్ నెడువీతి పుకాదార్ , ….. ……..
వేణ్డాదార్ =(అట్లు సంస్కృత రచనలలో చెప్పబడు ప్రేమాతిశయముచే చేయు ప్రక్రియలు) సమ్మతించని వారు ( ఎటువంటి వారనగ ) ; తెన్నన్ పొదియిల్ శెழுమ్ శన్దన క్కుழమ్బిన్ అన్నదోర్ తన్మై అఱియాదార్ =పాండ్యదేశమున పొదిగై పర్వతములపై పుష్కలముగ పెరిగెడి చందనవృక్షములయొక్క చల్లని,సువాసన కలిగిన చందనముద్దల (విరహమందు దహింపజేయు ) గుణమును తెలియనివారు ; ఆయన్ వేయ్ ఇన్ని ఇశై ఓశైక్కు ఇరఙ్గాదార్ = గొల్లవాడు ఊదుచుండెడి వేణువుయొక్క ఇంపైన గాన ధ్వనిని విని మనస్సున స్వల్పమైనను చలింపనివారు ; మాల్ విడైయిన్ మన్ను మణి పులమ్బ వాడాదార్ = ( పశువుపై) వ్యామోహముచెంది వచ్చెడి ఎద్దు మెడలో నుండెడి గంటలు శబ్దించగ అది వినియు చలింపనివారు; పెణ్ణై మేల్ పిన్నుమ్ అవ్వన్ఱిల్ పేడైవాయ్ శిరు కురలుక్కు = తాటిచెట్టుపై తన మొగపక్షియొక్క ముక్కుతో తన ముక్కును చేర్చిన అన్ఱిల్ ఆడ పక్షియొక్క నోటినుండి వెలువడు కిచ కిచ శబ్దములు విని ; ఉన్ని = తమ నాయకుని విరహమును తలచి;ఉడల్ ఉరుగి నైయాతార్= శరీరము కరిగి శిధిలముకానివారును;ఉమ్బరవాయ్ = ఆకాశమునందు; తున్ను మది ఉకుత్త = దట్టమైన కిరణములతో ప్రకాశించు చంద్రునిచే వెదజల్లబడు ; తూ నిలా నీళ్ నెరుప్పిల్ = నిర్మలమైన వెన్నెలనెడి గొప్ప అగ్నిలో;తమ్ ఉడలమ్ వేవ త్తళరాదార్=తమ శరీరము మండి శిధిలము కానివారు(ఇటువంటి మహారాణులు ఎవరనగ) ; కామవేళ్ మన్నుమ్ శిలైవాయ్ మలర్ వాళికోత్తు ఎయ్య పొన్ నెడువీతి పుకాదార్ = కామదేవతయైన మన్మధుని తన విల్లునుండి పుష్పబాణము సంధించి ప్రయోగించినను ( ఇక మడల్ ప్రక్రియయే పరమ పురుషార్ధముమని తలచి)అందమైన పెద్ద వీధులలో ప్రవేశింపక నుండుదురో వారు;
(అట్లు సంస్కృత రచనలలో చెప్పబడు ప్రేమాతిశయముచే చేయు ప్రక్రియలు) సమ్మతించని వారు (ఎటువంటి వారనగ ) పాండ్యదేశమున పొదిగై పర్వతములపై పుష్కలముగ పెరిగెడి చందన వృక్షముల యొక్క చల్లని,సువాసన కలిగిన చందనముద్దల (విరహమందు దహింపజేయు ) గుణమును తెలియనివారు, గొల్లవాడు ఊదుచుండెడి వేణువుయొక్క ఇంపైన గాన ధ్వనిని విని మనస్సున స్వల్పమైనను చలింపనివారు, (పశువుపై) వ్యామోహముచెంది వచ్చెడి ఎద్దు మెడలో నుండెడి గంటలు శబ్దించగ అది వినియు చలింపనివారు ,తాటిచెట్టుపై తన మొగపక్షియొక్క ముక్కుతో తన ముక్కును చేర్చిన అన్ఱిల్ ఆడ పక్షియొక్క నోటినుండి వెలువడు కిచ కిచ శబ్దములు విని తమ నాయకుని విరహమును తలచి శరీరము కరిగి శిధిలముకానివారును, ఆకాశమునందు దట్టమైన కిరణములతో ప్రకాశించు చంద్రునిచే వెదజల్లబడు నిర్మలమైన వెన్నెలనెడి గొప్ప అగ్నిలో తమ శరీరము మండి శిధిలము కానివారు, (ఇటువంటి మహారాణులు ఎవరనగ) కామదేవతయైన మన్మధుని తన విల్లునుండి పుష్పబాణము సంధించి ప్రయోగించినను ( ఇక మడల్ ప్రక్రియయే పరమ పురుషార్ధముమని తలచి) అందమైన పెద్ద వీధులలో ప్రవేశింపక నుండుదురో వారు;
……. ……. ……., తమ్పూ అణైమేల్
శిన్నమలర్ క్కుழలుమ్ అల్గులుమ్ మెన్ ములైయుమ్ , 2794
ఇన్ ఇళవాడై తడవ తామ్ కణ్ తుయిలుమ్
పొన్ అనైయార్ పిన్నుమ్ తిరు ఉఱుక , …… … 2795
తమ్ పూ అణైమేల్ = తమయొక్క పుష్పముల శయ్యపై ;శిన్నమ్ మలర్ క్కుழలుమ్= అప్పుడే వికసించిన అందమైన పుష్పములుగల కుంతలములును ; అల్గులుమ్ = నితంబ ప్రదేశమును ; మెన్ ములైయుమ్ = మృదువైన వక్షోజములును ; ఇన్ ఇళవాడై తడవ=ఆహ్లాదమైన మందమారుతము శోకగ ; కణ్ తుయిలుమ్ = గాఢ నిదురలో నిదురించు;పొన్ అనైయార్ తామ్ = మేలిమి బంగారమువలె మెరయు స్త్రీల ; పిన్నుమ్ తిరు ఉఱుక = మరింత ఆ మేని సౌభాగ్యము ఇనుమడించుగాక !
(పలు కాంతలు తమ ప్రేమికుని ఎడబాసినను ) తమయొక్క పుష్పముల శయ్యపై (ఎటువంటి తాపము లేక పవళించి), అందముగ పుష్పాలంకృతమైన కుంతలములును (కొంచెమైనను చింతనలేక అలంకృతులును) , నితంబ ప్రదేశమును ,మృదువైన వక్షోజములును , ఆహ్లాదమైన మందమారుతము శోకగ (ఎటువంటి క్షతిపొందక ) గాఢ నిదురలో నిదురించు మేలిమి బంగారమువలె మెరయు స్త్రీల (విరహ తాపము లేని) ఆ మేని సౌభాగ్యము ఇనుమడించుగాక !
( పరకాలనాయకి తమకుగల ప్రేమాతిశయముచే నాయకుని ఎడబాటుచే కలిగెడి విరహవేదన , లోపించిన స్త్రీల విషయమై పైన వివరించినారు .)
……. ………. … పోర్ వేన్దన్
తన్నుడైయ తాదై పణియాలరశు ఒழிన్దు ,
పొన్నగరం పిన్నే పులమ్బ వలఙ్గొణ్డు , 2796
మన్నుమ్ వళనాడు కైవిట్టు , మాతిరఙ్గళ్
మిన్ ఉరువిల్ విణ్తేర్ తిరిన్దు వెళిప్పట్టు , 2797
కల్ నిరైన్దు తీయ్ న్దు కழை ఉడైన్దు కాల్ శుழన్ఱు ,
పిన్నుమ్ తిరైవయిర్ట్రు ప్పేయే తిరిన్దుఉలవా , 2798
కొల్ నవిలుమ్ వెమ్ కానత్తూడు , కొడుమ్ కదిరోన్
తున్ను వెయిల్ వఱుత్త వెమ్ పరల్ మేల్ పఞ్జు అడియాళ్, 2799
మన్నన్ ఇరామన్ పిన్ వైతేవియెన్ఱు ఉరైక్కుమ్ ,
అన్ననడైయ అణఙ్గు నడన్దిలళే , 2800
పోర్ వేన్దన్ =రణశూరుడైన శ్రీరాముడు; తన్నుడైయ తాదై పణియాల్ = తనయొక్క తండ్రియైన ధశరధునియొక్క పలుకుల కారణముగ; అరశు = రాజ్యాధిపత్యమును ; ఒழிన్దు = త్యజించి (అడవులకు పోవు సమయమున); పొన్ నగరమ్ = అందమైన అయోధ్యానగరవాసులు ; పిన్నే పులమ్బ = ( “నీవు అడవులకు పోవద్దు”) తన వెనుక రోధించుచు వచ్చుచున్నను ;వలమ్ కొణ్డు=తను తీసుకున్న నిశ్చయమునే పాలించుచు; మన్నుమ్ వళమ్ నాడు కై విట్టు = ఎల్లప్పుడును సిరిసంపదలతో తులతూగుచున్న కోసలరాజ్యమును విడిచిపెట్టి; మాతిరఙ్గళ్ మిన్ ఉరువిన్ విణ్ తేర్ తిరిన్దు = అన్నిదిక్కులలోను మెరుపు వలె ఎండమావులచే వ్యాపించియుండునదియు; వెళిప్పట్టు = నిర్జలమైన,గడ్డిపోచైనా మొలవని సారవిహీనమైన ప్రదేశములతో నిండియున్నదియు ; కల్ నిరైన్దు తీయ్ న్దు కழை ఉడైన్దు కాల్ శుழన్ఱు = రాళ్ళతో నిండియున్నదియు, కాలిన గడ్డితోను , ఎండలకు పగిలిపోయిన వెదుళ్ళుతోను నిండియున్నదియు, సుడిగాలులు ఎల్లప్పుడును వీచబడు చుండునదియు; పిన్నుమ్ = వీటికిపైన; తిరై వయిర్ట్రు ప్పేయే తిరిన్దు ఉలవా = ఆహారలేమిచే అలమటించు కడుపులుగల పిశాచములచే సంచరింపబడుచున్నదియు ; కొల్ నవిలుమ్ = ఎల్లవేళల సంహరింపబడెడి శబ్దములతో నిండియున్నదియు; వెమ్ కానత్తూడు = అట్టి (భయంకరమైన) క్రూరమైన అడవిలో; కొడుమ్ కదిరోన్ తున్ను వెయిల్ వఱుత్త వెమ్ పరల్ మేల్ = తీక్షణమైన కిరణములుగల సూర్యునియొక్క ప్రచండమైన ఎండలలో అధికముగ వేగిన తీవ్రమైన గులకరాళ్ల పైన; వైదేవి యెన్ఱు ఉరైక్కుమ్ = వైదేహి నామధేయముతో చెప్పబడు;అన్ననడైయ అణఙ్గు = హంస గమనము కలిగిన సీతాదేవి; మన్నన్ ఇరామన్ పిన్ = ఆ మహారాజైన శ్రీరాముని వెనుక ; పఞ్జు అడియాళ్ = దూదివలె మృదువైన పాదములుగల ఆమె ; నడన్దిలళే = (వారింపబడినను ,ఎడబాటును సహించలేక ) చనుదెంచలేదా!
రణశూరుడైన శ్రీరాముడు తనయొక్క తండ్రియైన ధశరధునియొక్క పలుకుల కారణముగ రాజ్యాధిపత్యమును త్యజించి (అడవులకు పోవు సమయమున) అందమైన అయోధ్యానగరవాసులు (“నీవు అడవులకు పోవద్దు”) తన వెనుక రోధించుచు వచ్చుచున్నను తను తీసుకున్న నిశ్చయమునే పాలించుచు ఎల్లప్పుడును సిరిసంపదలతో తులతూగుచున్న కోసలరాజ్యమును విడిచిపెట్టి అన్నిదిక్కులలోను మెరుపు వలె ఎండమావులచే వ్యాపించియుండునదియు నిర్జలమైన, గడ్డిపోచైనా మొలవని సారవిహీనమైన ప్రదేశములతో నిండియున్నదియు రాళ్ళతో నిండియున్నదియు, కాలిన గడ్డితోను , ఎండలకు పగిలిపోయిన వెదుళ్ళుతోను నిండియున్నదియు, సుడిగాలులు ఎల్లప్పుడును వీచబడుచుండునదియు వీటికిపైన ఆహారలేమిచే అలమటించు కడుపులు గల పిశాచములచే సంచరింపబడుచున్నదియు ఎల్లవేళల సంహరింపబడెడి శబ్దములతో నిండియున్నదియు అట్టి (భయంకరమైన) క్రూరమైన అడవిలో తీక్షణమైన కిరణములుగల సూర్యునియొక్క ప్రచండమైన ఎండలలో అధికముగ వేగిన తీవ్రమైన గులకరాళ్ల పైన వైదేహి నామధేయముతో చెప్పబడు హంస గమనము కలిగిన సీతాదేవి ఆ మహారాజైన శ్రీరాముని వెనుక దూదివలె మృదువైన పాదములుగల ఆమె (వారింపబడినను , ఎడబాటును సహించలేక ) చనుదెంచలేదా!
పిన్నుమ్ కరు నెడుఙ్గణ్ శెవ్వాయ్ పిణై నోక్కిన్ ,
మిన్ననైయ నుణ్ మరుఙ్గుల్ వేకవతియెన్ఱుఱైక్కుమ్ , 2801
కన్ని, తన్ ఇన్ ఉయిరామ్ కాదలనై క్కాణాదు ,
తన్నుడైయ మున్ తోన్ఱల్ కొణ్డుఏక త్తాన్ శెన్ఱు , అఙ్గు 2802
అన్నవనై నోక్కాదు అழிత్తు ఉరప్పి , వాళ్ అమరుళ్
కన్నవిల్ తోళ్ కాళైయై క్కైపిడిత్తు మీణ్డుమ్ పోయ్ , 2803
పొన్నవిలుమ్ ఆగమ్ పుణర్ న్దిలళే ,…….. ….
పిన్నుమ్ = అదియేగాక ; కరు నెడుమ్ కణ్ శెవ్వాయ్ పిణై నోక్కిన్ మిన్ అనైయ నుణ్ మరుఙ్గుల్=నల్లని విశాల నేత్రములును, ఎఱ్ఱని అదరములును, లేడి చూపులవలెనున్న చూపులను , మెరుపువలె సన్నని నడుమును గల ; వేకవతి యెన్ఱు ఉఱైక్కుమ్ కన్ని = వేగవతి అని చెప్పబడు యువతి;తన్ ఇన్ ఉయిర్ ఆమ్ కాదలనై క్కాణాదు=తనయొక్క ప్రాణ సమానమైన ప్రేమికుని తాను చూడనీయక; తన్నుడైయ మున్ తోన్ఱల్ కొణ్డుఏక = తనయొక్క అన్న తనను ప్రేమికుని దరిచేరకుండనటుల కొనిపోవుచుండ ; ఆఙ్గు = అట్టి అవస్థయందు; అన్నవనై = ఆ అన్నను;నోక్కాదు= గౌరవ భావము లేక; అழிత్తు ఉరప్పి= నిందనీయమైన మాటలచే దూషించి ; తాన్ శెన్ఱు = తాను బలవంతముగ వెడలి ; వాళ్ అమరుళ్ =మహా యుద్దమందు ; కల్ నవిల్ తోళ్ కాళైయై క్కైపిడిత్తు=పర్వతము పోలిన భుజములు మఱియు వృషభమువలె బలిష్టుడైనవాడును అయిన తన ప్రేమికుని; కై పిడిత్తు = పాణిగ్రహణము చేసి; మీణ్డుమ్ పోయ్ = అచటినుండి స్వస్థానమునకు చేరి ;పొన్ నవిలుమ్ ఆగమ్ =(ఆ ప్రేమికుని యొక్క)బంగారమువంటి వక్షస్థలమును; పుణర్ న్దిలళే = కౌగిలించుకొని యుండలేదా !
అదియేగాక నల్లని విశాల నేత్రములును, ఎఱ్ఱని అదరములును, లేడి చూపులవలెనున్న చూపులను , మెరుపువలె సన్నని నడుమును గల వేగవతి అని చెప్పబడు యువతి తనయొక్క ప్రాణ సమానమైన ప్రేమికుని తాను చూడనీయక తనయొక్క అన్న తనను ప్రేమికుని దరిచేరకుండనటుల కొనిపోవుచుండ అట్టి అవస్థయందు ఆ అన్నను గౌరవ భావము లేక నిందనీయమైన మాటలచే దూషించి తాను బలవంతముగ వెడలి మహా యుద్దమందు పర్వతము పోలిన భుజములు మఱియు వృషభమువలె బలిష్టుడైనవాడును అయిన తన ప్రేమికుని పాణిగ్రహణము చేసి అచటినుండి స్వస్థానమునకు చేరి (ఆ ప్రేమికుని యొక్క) బంగారమువంటి వక్షస్థలమును కౌగిలించుకొని యుండలేదా !
……. …… ……. …….. , పూమ్ గఙ్గై
మున్నమ్ పునల్ పరక్కుమ్ నన్నాడన్ మిన్నాడుమ్ . 2804
కొల్ నవిలుమ్ నీళ్ వేల్ కురుక్కళ్ కులమదలై ,
తన్నికరొన్ఱిల్లాద వెన్ఱి త్తనఞ్జయనై , 2805
పన్నాకరాయన్ మడప్పావై , పావై తన్
మన్నియ నాణ్ అచ్చమ్ మడమ్ ఎన్ఱివై యకల , 2806
తన్నుడైయ కొఙ్గై ముకమ్ నెరియ , తాన్ అవన్దన్
పొన్ వరై యాకమ్ తழீఇక్కొణ్డుపోయ్ , తనదు 2807
నన్నకరమ్ పుక్కు నయన్దు ఇనిదు వాழ்న్దదువుమ్ ,
మున్ ఉరైయిల్ కేట్టఱివతిల్లైయే ,…….. 2808
పూ గఙ్గై పునల్ మున్నమ్ పరక్కుమ్ నల్ నాడన్ = అందమైన గంగానది జలములు ముందుగ ప్రవహించుచుండు ఖ్యాతిగల దేశమునకు ప్రభువును ; మిన్ ఆడుమ్ కొల్ నవిలుమ్ నీళ్ వేల్ = ప్రకాశము కలిగినదియు , సంహరించెడి క్రియలుసలుపగల పొడుగైన ఈటెను తన హస్తమున కలవాడును ; కురుక్కళ్ కులమదలై = కురురాజ వంశమున జన్మించినవాడును ; తన్ నికర్ ఒన్ఱు ఇల్లాద వెన్ఱి = తనకు సాటిలేక అనేక విజయపరంపరలు కలిగిన; ధనంజయనై = అర్జునుని ;పన నాకరాయన్ మడమ్ ప్పావై = గౌరవ్య అను నాగరాజు యొక్క విధేయురాలైన ఉలూపి యను రాజకన్య; పావై తన్ మన్నియ నాణ్ అచ్చమ్ మడమ్ ఎన్ఱు ఇవై అగల = స్త్రీల తత్వమునకు ఉండెడి లజ్జ , భయము , విధేయత , మొదలగు గుణములు వీడి; తన్నుడైయ కొఙ్గై ముకమ్ నెరియ = తనయొక్క వక్షోజముల మొగము గట్టిపడగ;తాన్ =(తన లజ్జను వీడి)తానే; నయన్దు = మిక్కిలి ఆశపడి; అవన్ తన్ = ఆ అర్జునుని యొక్క; పొన్ వరై ఆగమ్ = అందమైన పర్వతముపోలిన వక్షస్థలమును ; తழீఇ క్కొణ్డు = ఆలింగనము చేసుకొని; తనదు నల్ నకరమ్ పోయ్ పుక్కు = తనయొక్క అందమైన స్థానమునకు (నాగలోకమునకు) వానిని తీసుకొని చేరి; ఇనిదు వాழ்న్దదువుమ్ = మహదానందముతో జీవించెననెడి విషయమును; మున్ ఉరైయిల్ కేట్టఱివతిల్లైయే = మునుపు మహాభారతమందు చెప్పబడినది మీరు విని తెలుసుకొనలేదా ఏమి!
అందమైన గంగానది జలములు ముందుగ ప్రవహించుచుండు ఖ్యాతిగల దేశమునకు ప్రభువును ప్రకాశము కలిగినదియు , సంహరించెడి క్రియలు సలుపగల పొడుగైన ఈటెను తన హస్తమున కలవాడును, కురురాజ వంశమున జన్మించినవాడును , తనకు సాటిలేక అనేక విజయపరంపరలు కలిగిన అర్జునుని గౌరవ్య అను నాగరాజు యొక్క విధేయురాలైన ఉలూపి యను రాజకన్య స్త్రీల తత్వమునకు ఉండెడి లజ్జ , భయము , విధేయత , మొదలగు గుణములు వీడి తనయొక్క వక్షోజముల మొగము గట్టిపడగ (తన లజ్జను వీడి) తానే మిక్కిలి ఆశపడి ఆ అర్జునుని యొక్క అందమైన పర్వతముపోలిన వక్షస్థలమును ఆలింగనము చేసుకొని తనయొక్క అందమైన స్థానమునకు (నాగలోకమునకు) వానిని తీసుకొని చేరి మహదానందముతో జీవించెననెడి విషయమును మునుపు మహాభారతమందు చెప్పబడినది మీరు విని తెలుసుకొనలేదా ఏమి!
…….. ……… …….. , శూழ் కడలుళ్
పొన్నకరమ్ శెర్ట్ర పురన్దరనోడు ఏర్ ఒక్కుమ్ ,
మన్నవన్ వాణన్ అవుణర్కు వాళ్ వేన్దన్ , 2809
తన్నుడైయ పావై ఉలగత్తు త్తన్నొక్కుమ్ ,
కన్నియర్ యిల్లాద కాట్చియాళ్ , తన్నుడైయ 2810
ఇన్నుయిర్ త్తోழீయాల్ ఎమ్బెరుమాన్ ఈన్ తుழாయ్ ,
మన్ను మణివరైతోళ్ మాయవన్ , పావియేన్ 2811
ఎన్నై యిదు విళైత్త ఈరిరణ్డు మాల్వరైత్తోళ్ ,
మన్నవన్ తన్ కాదలనై మాయత్తాల్ కొణ్డుపోయ్ , 2812
కన్ని తన్బాల్ వైక్క మర్ట్రవనోడు ఎత్తనైయో ,
మన్నియ పేరిన్బమ్ ఎయ్ దినాళ్ ; ………. 2813
శూழ் కడలుళ్ = వ్యాపించియున్న సముద్రములో; పొన్ నగరమ్ శెర్ట్ర = హిరణ్యాసురుని యొక్క నగరములను ధ్వంసముచేసిన; పురన్దరనోడు ఏర్ ఒక్కుమ్ = దేవేంద్రుని గొప్పతనమునకు సమానమైన;మన్నవన్ = రాజాధిరాజును; అవుణర్కు వాళ్ వేన్దన్ = అసురులకు ప్రసిద్ధమైన నాయకుడును; వాణన్ తన్నుడైయ పావై = భాణాసురునియొక్క కుమార్తె;ఉలగత్తు త్తన్నొక్కుమ్ కన్నియర్ యిల్లాద కాట్చియాళ్= లోకమందు తనతో సమానమైన కన్యలు లేరనుబడునట్లు అందాలరాసి ఉష అనబడు కన్య; తన్నుడైయ ఇన్నుయిర్ త్తోழீయాల్ = తనయొక్క ప్రాణసఖియైన చంద్రలేఖచే ; ఈన్ తుழாయ్ మన్ను మణివరైతోళ్ మాయవన్ = భోగ్యమైన తులసీమాలచే అలంకృతమైన రత్నపర్వతమువలె భుజములుగల ఆశ్చర్యభూతుడైన;పావియేన్ ఎన్నై యిదు విళైత్త ఈరిరణ్డు మాల్వరైత్తోళ్ మన్నవన్= పాపభూయిష్టమైన నన్ను (పరకాలనాయికి) మిక్కిలి వేదించుచున్న పెద్ద పర్వతమువలె నాలుగు భుజములుగల రాజాధిరాజు ;ఎమ్బెరుమాన్ తన్ =శ్రీకృష్ణుని యొక్క; కాదలనై = అతిప్రేమపాత్రుడైన మనవడైన అనిరుధ్ధునుని; మాయత్తాల్ కొణ్డుపోయ్ కన్ని తన్బాల్ వైక్క=(యోగవిద్యచే) మాయచే తీసుకొని చంద్రలేఖ తనచేరువ చేర్చగ; మర్ట్రవనోడు=ఉష ఆ అనిరుద్ధునితో; ఎత్తనైయో ఓర్ మన్నియ పేరిన్బమ్ ఎయ్ దినాళ్ = అనేకవిధములైన సాటిలేక యుండెడి గొప్ప సుఖములను పొందెను;
వ్యాపించియున్న సముద్రములో హిరణ్యాసురుని యొక్క నగరములను ధ్వంసముచేసిన దేవేంద్రుని గొప్పతనమునకు సమానమైన రాజాధిరాజును అసురులకు ప్రసిద్ధమైన నాయకుడును భాణాసురునియొక్క కుమార్తె లోకమందు తనతో సమానమైన కన్యలు లేరనుబడునట్లు అందాలరాసి ఉష అనబడు కన్య తనయొక్క ప్రాణసఖియైన చంద్రలేఖచే భోగ్యమైన తులసీమాలచే అలంకృతమైన రత్నపర్వతము వలె భుజములుగల ఆశ్చర్యభూతుడైన, పాపభూయిష్టమైన నన్ను (పరకాలనాయికి) మిక్కిలి వేదించుచున్న పెద్ద పర్వతమువలె నాలుగు భుజములుగల రాజాధిరాజు శ్రీకృష్ణుని యొక్క అతిప్రేమపాత్రుడైన మనవడైన అనిరుధ్ధునుని (యోగవిద్యచే) మాయచే తీసుకొని చంద్రలేఖ తనచేరువ చేర్చగ ఉష ఆ అనిరుద్ధునితో అనేక విధములైన సాటిలేక యుండెడి గొప్ప సుఖములను పొందెను;
…… ……….. ……, మర్ట్రు ఇవై దాన్
ఎన్నాలే కేట్టీరే ఎழைగాళ్ ఎన్నురైక్కేన్ ,
మన్ను మలైయరైయన్ పొఱ్పావై , వాళ్ నిలా 2814
మిన్ను మణి ముఱువల్ శెవ్వాయ్ ఉమైయెన్నుమ్ ,
అన్ననడైయ అణఙ్గు నుడఙ్గు ఇడైశేర్ , 2815
పొన్నుడమ్బు వాడ పులనైన్దమ్ నొన్దకల ,
తన్నుడైయ కూழை చ్చడాపారమ్ తాన్ తరిత్తు , అఙ్గు 2816
అన్న అరుమ్ తవత్తిన్ ఊడుపోయ్ , అయిరన్దోళ్
మన్ను కరతలఙ్గల్ మట్టిత్తు , మాతిరఙ్గళ్ 2817
మిన్నియెరివీశ మెలెడుత్త శూழ் కழల్ కాల్ ,
పొన్నులకమేழுమ్ కడన్దు ఉమ్బర్ మేల్ శిలుమ్బ , 2818
మన్ను కులవరైయుమ్ మారుదముమ్ తారకైయుమ్ ,
తన్నినుడనే శుழల చ్చుழన్ఱాడుమ్ , 2819
కొన్నవిలుమ్ మూఇలై వేల్ కూత్తన్ పొడియాడి
అన్నవన్ తన్ పొన్నకలమ్ శెన్ఱాఙ్గు అణైన్దిలళే , 2820
పన్ని యురైక్కుఙ్గాల్ పారతమామ్ , ………
ఎழைగాళ్ = ఓ తెలివితక్కువ యువతులారా!; మర్ట్రు ఇవై దాన్ ఎన్నాలే కేట్టీరే = ఇంకను ఇటువంటి ఉదాహరణలు నా ద్వారా విన కుతూహలము కలిగియున్నారా!; ఎన్ ఉరైక్కేన్= మీకు ఎన్ని చెప్పను?(సరే.ఇంకొక ఉదాహరణము చెప్పుదును వినుడు); మన్ను మలై అరైయన్ పొన్ పావై=చలింపజాలని స్థిరమైన పర్వత రాజైన హిమవంతుని అందమైన కుమార్తె; వాళ్ నిలా మిన్ను మణి ముఱువల్ శెవ్వాయ్ = ప్రకాశించు వెన్నెలవలె మెరయు అందమైన నగవుగల ఎఱ్ఱని అధరములతో ఒప్పు; ఉమైయెన్నుమ్=”ఉమ” యను నామధేయముగల; అన్ననడైయ అణఙ్గు = హంస గమనముగల దేవకన్య (పార్వతి); నుడఙ్గు ఇడైశేర్ పొన్ ఉడమ్బు వాడ = అతిసున్నితమైన నడుముగల అందమైన శరీరము వాడునట్లు; పులన్ ఐన్దమ్ నొన్దు అగల = తన పంచేంద్రియములు మిక్కిలి బాధపడి వీడునట్లు;తన్నుడైయ కూழை = తనయొక్క కుంతలములను;చడాపారమ్ తాన్ దరిత్తు ఆఙ్గు=జటలుగ(శ్రీరాముని వలె)తాను ధరించి అచట;అన్న అరుమ్ తవత్తిన్ ఊడుపోయ్ = కనివిని ఎరుగని కఠినమైన తపస్సును పూర్తిచేసి,(ఏమి ఫలమును పొందెననగ) ; అయిరమ్ తోళ్ మన్ను కరతలఙ్గల్ మట్టిత్తు = (శివుడుతనయొక్క) వేయి భుజములతో కూడియున్న హస్తములను (అన్నిదిక్కులయందును)వ్యాపింపజేసి; మాతిరఙ్గళ్ మిన్ని యెరి వీశ = దిక్కులు మెరుపులు, అగ్ని రవ్వలు వెదజల్లునటుల; మేల్ ఎడుత్త = పైకి ఎత్తిన; కழల్ శూழ் కాల్ = వీరకంకణముగల ఒకపాదమును;పొన్ ఉలగమ్ ఏழுమ్ కడన్దు = అందమైన పైలోకములన్నియు అధిగమించి; ఉమ్బర్ మేల్ శిలుమ్బ = పైపైకి (ఆ ఒక్క కాలును) పెంచగ ; మన్ను కులవరైయుమ్ మారుదముమ్ తారకైయుమ్ తన్నినుడనే శుழల = స్థిరముగా నిలిచియున్న కులపర్వతములును ,మారుతమును, నక్షత్రములును తనతో కూడి తిరుగుచుండ;శుழన్ఱు ఆడుమ్ = తాను తిరుగుతూ నృత్యముచేయువానిని; కొల్ నవిలుమ్ మూఇలై వేల్ = సంహరించు స్వభావముగల త్రిశూలమును కలవాడును; కూత్తన్ = “నటరాజు”అనిప్రసిద్దుడును ;పొడియాడి = భస్మధారి అని ప్రసిద్దుడును; అన్నవన్ తన్ =అటువంటి శివుని యొక్క; పొన్ అగలమ్ శెన్ఱు ఆఙ్గు అణైన్దిలళే = అందమైన వక్షస్థలమును అతనిని సమీపించి ఆలింగనము చేసుకొనియుండలేదా?; పన్ని ఉరైక్కుమ్ కాల్=( ఇటువంటి ఉదాహరణలు ఇంకను ) విస్తరించి చెప్పినచో;పారతమామ్= ఒక మహాభారత గ్రంథముగ ముగియును;
ఓ తెలివితక్కువ యువతులారా! ఇంకను ఇటువంటి ఉదాహరణలు నా ద్వారా విన కుతూహలము కలిగియున్నారా! మీకు ఎన్ని చెప్పను? (సరే.ఇంకొక ఉదాహరణము చెప్పుదును వినుడు) చలింపజాలని స్థిరమైన పర్వత రాజైన హిమవంతుని అందమైన కుమార్తె ప్రకాశించు వెన్నెలవలె మెరయు అందమైన నగవుగల ఎఱ్ఱని అధరములతో ఒప్పు “ఉమ” యను నామధేయముగల హంస గమనముగల దేవకన్య (పార్వతి) అతి సున్నితమైన నడుముగల అందమైన శరీరము వాడునట్లు తన పంచేంద్రియములు మిక్కిలి బాధపడి వీడునట్లు తనయొక్క కుంతలములను జటలుగ (శ్రీరాముని వలె) తాను ధరించి అచట కనివిని ఎరుగని కఠినమైన తపస్సును పూర్తిచేసి, (ఏమి ఫలమును పొందెననగ) (శివుడుతనయొక్క) వేయి భుజములతో కూడియున్న హస్తములను (అన్నిదిక్కులయందును) వ్యాపింపజేసి దిక్కులు మెరుపులు, అగ్ని రవ్వలు వెదజల్లు నటుల పైకి ఎత్తిన వీరకంకణముగల ఒకపాదమును అందమైన పైలోకములన్నియు అధిగమించి పైపైకి (ఆ ఒక్క కాలును) పెంచగ స్థిరముగా నిలిచియున్న కులపర్వతములును, మారుతమును, నక్షత్రములును తనతో కూడి తిరుగుచుండ తాను తిరుగుతూ నృత్యముచేయువానిని, సంహరించు స్వభావముగల త్రిశూలమును కలవాడును, “నటరాజు”అని ప్రసిద్దుడును, భస్మధారి అని ప్రసిద్దుడును, అటువంటి శివుని యొక్క అందమైన వక్షస్థలమును అతనిని సమీపించి ఆలింగనము చేసుకొని యుండలేదా? (ఇటువంటి ఉదాహరణలు ఇంకను) విస్తరించి చెప్పినచో ఒక మహాభారత గ్రంథముగ ముగియును.
…….. ………. ………. , పావియేఱ్కు
ఎన్నుఱునోయ్ యానురైప్ప క్కేణ్మిన్ , ఇరుమ్బొழீల్ శూழ் 2821
మన్ను మఱైయోర్ తిరునఱైయూర్ మామలైపోల్ ,
పొన్నియలుమాడ క్కవాడమ్ కడన్దు పుక్కు , 2822
ఎన్నుడైయ కణ్ కళిప్ప నోక్కినేన్ , నోక్కుతలుమ్
మన్నన్ తిరుమార్బుం వాయుం అడియిణైయుం, 2823
పన్ను కరతలముమ్ కణ్గళుమ్ , పఙ్గయత్తిన్
పొన్నియల్ కాడు ఓర్ మణివరైమేల్ పూత్తదుపోల్ , 2824
మిన్ని యొళి పడైప్ప వీழ் నాణుమ్ తోళ్ వళైయుమ్ ,
మన్నియ కుణ్డలముమ్ ఆరముమ్ నీణ్ముడియుమ్ , 2825
తున్ను వెయిల్ విరిత్త శూడామణి యిమైప్ప ,
మన్ను మరతక క్కున్ఱిన్ మరుఙ్గే , ఓర్ 2826
ఇన్ ఇళ వఞ్జి క్కొడి ఒన్ఱు నిన్ఱదుదాన్ ,
అన్నమాయ్ మానాయ్ అణిమయిలాయ్ ఆఙ్గిడైయే , 2827
మిన్నాయ్ ఇళవేయిరణ్డాయ్ ఇణైచ్చెప్పాయ్
మున్నాయ తొణ్డైయాయ్ క్కెణ్డైక్కులమిరణ్డాయ్ , 2828
అన్న తిరువురువం నిన్ఱదఱియాదే ,
ఎన్నుడైయ నెఞ్జుం అఱివుం ఇనవళైయుమ్ , 2829
పొన్ ఇయలుమ్ మేకలైయుమ్ ఆఙ్గొழீయప్పోన్దేఱ్కు ,
మన్ను మఱికడలుమ్ ఆర్ క్కుమ్ , మతి ఉకుత్త 2830
ఇన్ నిలా విన్ కతిరుమ్ ఎన్ తనక్కే వెయ్ తాకుమ్
తన్నుడైయ తన్మై తవిర త్తాన్ ఎన్గొలో , 2831
పావియేఱ్కు ఎన్ ఉఱునోయ్=పాపియైన నేను పొందిన వ్యధ; యాన్ ఉరైప్ప కేణ్మిన్=నేనే చెప్పుచున్నాను వినండి; (ఏమిటనగ) ఇరు పొழிల్ శూழ் = విశాలమైన తోటలతో చుట్టబడినదియు; మఱైయోర్ మన్నుమ్ = వేదోత్తములు నివసించుచున్న; తిరునఱైయూర్=తిరునఱైయూర్ దివ్యదేశములో;మామలైపోల్ పొన్ ఇయలుమ్ మాడ కవాడమ్ కడన్దు పుక్కు = పెద్ద పర్వతము పోలిన స్వర్ణమయమైన సన్నిధియొక్క ద్వారమును దాటి ప్రవేశించి ; ఎన్నుడైయ కణ్ కళిప్ప నోక్కినేన్ = నాయొక్క కన్నులు సంతోషముతో తృప్తిపొందునట్లు కాంచితిని;నోక్కుదలుమ్=అట్లుచూచు సందర్బములో; మన్నన్= (అచట వేంచేసిన) సర్వేశ్వరుని యొక్క; తిరుమార్బుమ్ = కమలవాసిని నిత్యవాసము చేయు వక్షస్థలమును; వాయుమ్ = చిరునవ్వుతో నున్న అధరములను; అడి ఇణైయుమ్ = పాదద్వందములను;పన్ను కరతలముమ్ = కొనియాడబడు హస్తములును; కణ్గళుమ్ = సుందరమైన నేత్రములును ; ఓర్ మణివరైమేల్ పొన్నియల్ పఙ్గయత్తిన్ కాడు పూత్తదుపోల్ మిన్ని యొళి పడైప్ప = ఒక నీలరత్న పర్వతముపై మిక్కిలి అందమైన తామరపూల అడవి పుష్పించినదా అనునట్లు మెరుపువలె తళ తళ ప్రకాశము ప్రసరించగ; వీழ் నాణుమ్ = ఆశింపదగిన మొలతాడును; తోళ్ వళైయుమ్ = భుజకంకణములును; మన్నియ కుణ్డలముమ్=సుందరముగ నుండు కుండలములును; ఆరముమ్ = (వక్షస్థలములో) హారమును; నీళ్ ముడియుమ్ = పెద్ద కిరీటమును;తున్ను వెయిల్ విరిత్త శూళామణి ఇమైప్ప=మిక్కిలి తేజస్సు వెదజల్లు కిరీటములో పొదగబడిన రత్నములు ప్రకాశింప; మన్ను మరతక క్కున్ఱిన్ మరుఙ్గే = అందరికి ఆశ్రయింపతగు మరకత పర్వతమువలె సర్వేశ్వరుని చెంతనే; ఓర్ ఇన్ ఇళ వఞ్జి క్కొడి ఒన్ఱు నిన్ఱదు=విలక్షణమైన భోగ్యమైన లేతదనము కలిగిన ఒక అల్లుకొను తీగ అనబడు దివ్య మహిషీమణి శ్రీదేవి నిలిచియుండెను; అన్నమాయ్ = (గమనములో)హంసవలెను; మాన్ ఆయ్ =(చూపులలో) లేడివలెను; అణి మయిల్ ఆయ్=(కుంతలములు) అందమైన నెమలివలెను; ఇడై మిన్ని ఆయ్=నడుముయొక్క అందము మెరుపువలెను; ఇళ ఇరణ్డు వేయ్ ఆయ్ =(భుజములు) లేతనైన రెండు వెదురురెమ్మల వలెను; ఇణై శెప్పు ఆయ్ = (వక్షోజములు) రెండు కలశములవలెను; మున్ ఆయ తొణ్డై ఆయ్ = ముంగిట కనిపించు (అధరములు) దొండపండువలెను; కులమ్ కెణ్డై ఇరణ్డు ఆయ్ = (నేత్రములు) శ్లాఘ్యమైన రెండు కెణ్డై మీనములవలెను; అన్న = ఆ విధముగనున్నటువంటి; తిరు ఉరువమ్ = దివ్య మంగళవిగ్రహము( శ్రీదేవి ); నిన్ఱదు అఱియాదు = (సర్వేశ్వరుని సమీపమున) నిలబడియున్న సంగతి తెలియక (సర్వేశ్వరుడు మాత్రమే ఉండెనని తలచి లోపల ప్రవేశింప); ఎన్నుడైయ నెఞ్జుం = నాయొక్క హృదయము; అఱివుం = (నా హృదయమందలి) ఙ్ఞానమును; ఇనమ్ వళైయుమ్ = శ్లాఘ్యమైన చేతి గాజులును;పొన్ ఇయలుమ్ మేకలైయుమ్ = స్వర్ణమయమైన మొలతాడును;ఒழிయ పోదేర్కు=(ఇవన్నియు)పోగొట్టుకొనిన నాకు; (దీనికి పైన మఱింత దుఃఖకరమగు) మన్ను మఱికడలుమ్ ఆర్ క్కుమ్ = చలించని అలలుకొట్టుచున్న సముద్రము ఘోషించుచు హింసించుచున్నది;మది ఉకుత్త ఇన్ నిలావిన్ కతిరుమ్ = చంద్రుడు ప్రసరింపజేయు మనోహరమైన వెన్నెల యొక్క కాంతి కిరణములు; ఎన్ తనక్కే = నాకు మాత్రమే; వెయ్ దు ఆగుమ్=తీక్షణమైన ఎండగ అగుచున్నది; తన్నుడైయ తన్మై తవిర తాన్ ఎన్గొలో = వెన్నెలయొక్క స్వభావమైన చల్లదనమును పోగొట్టి ఈవిధముగా భరింపరాని వెచ్చగా నుండుటకు నాప్రియ సర్వేశ్వరుడు ఏదైనా చేసియున్నాడో?
పాపియైన నేను పొందిన వ్యధ నేనే చెప్పుచున్నాను వినండి; (ఏమిటనగ) విశాలమైన తోటలతో చుట్టబడినదియు వేదోత్తములు నివసించుచున్న తిరునఱైయూర్ దివ్యదేశములో పెద్ద పర్వతము పోలిన స్వర్ణమయమైన సన్నిధియొక్క ద్వారమును దాటి ప్రవేశించి నాయొక్క కన్నులు సంతోషముతో తృప్తిపొందునట్లు కాంచితిని అట్లుచూచు సందర్బములో (అచట వేంచేసిన) సర్వేశ్వరుని యొక్క కమలవాసిని నిత్యవాసము చేయు వక్షస్థలమును చిరునవ్వుతో నున్న అధరములను పాదద్వందములను కొనియాడబడు హస్తములును సుందరమైన నేత్రములును ఒక నీలరత్న పర్వతముపై మిక్కిలి అందమైన తామరపూల అడవి పుష్పించినదా అనునట్లు మెరుపువలె తళ తళ ప్రకాశము ప్రసరించగ ఆశింపదగిన మొలతాడును భుజకంకణములును సుందరముగ నుండు కుండలములును (వక్షస్థలములో) హారమును పెద్ద కిరీటమును మిక్కిలి తేజస్సు వెదజల్లు కిరీటములో పొదగబడిన రత్నములు ప్రకాశింప అందరికి ఆశ్రయింప తగు మరకత పర్వతమువలె సర్వేశ్వరుని చెంతనే విలక్షణమైన భోగ్యమైన లేతదనము కలిగిన ఒక అల్లుకొను తీగ అనబడు దివ్య మహిషీమణి శ్రీదేవి నిలిచియుండెను .(గమనములో) హంసవలెను (చూపులలో) లేడివలెను (కుంతలములు) అందమైన నెమలివలెను నడుముయొక్క అందము మెరుపువలెను (భుజములు) లేతనైన రెండు వెదురురెమ్మల వలెను (వక్షోజములు) రెండు కలశములవలెను ముంగిట కనిపించు (అధరములు) దొండపండువలెను, (నేత్రములు) శ్లాఘ్యమైన రెండు కెణ్డై మీనములవలెను ఆ విధముగ నున్నటువంటి దివ్య మంగళవిగ్రహము( శ్రీదేవి ) ( సర్వేశ్వరుని సమీపమున) నిలబడియున్న సంగతి తెలియక (సర్వేశ్వరుడు మాత్రమే ఉండెనని తలచి లోపల ప్రవేశింప) నాయొక్క హృదయము (నా హృదయమందలి) ఙ్ఞానమును, శ్లాఘ్యమైన చేతి గాజులును, స్వర్ణమయమైన మొలతాడును, (ఇవన్నియు) పోగొట్టుకొనిన నాకు (దీనికి పైన మఱింత దుఃఖకరమగు) చలించని, అలలుకొట్టుచున్న సముద్రము ఘోషించుచు హింసించుచున్నది, చంద్రుడు ప్రసరింపజేయు మనోహరమైన వెన్నెల యొక్క కాంతి కిరణములు నాకు మాత్రమే తీక్షణమైన ఎండగ అగుచున్నది . వెన్నెలయొక్క స్వభావమైన చల్లదనమును పోగొట్టి ఈవిధముగా భరింపరాని వెచ్చగా నుండుటకు నాప్రియ సర్వేశ్వరుడు ఏదైనా చేసియున్నాడో?
తెన్నన్ పొదియిల్ శెழுమ్ శన్దిన్ తాతళైన్దు ,
మన్ను ఇవ్వులగై మనమ్ కళిప్ప వన్దు ఇయఙ్గుమ్ , 2832
ఇన్ ఇళమ్ పూమ్ తెన్ఱలుమ్ వీశుమ్ ఎరి ఎనక్కే ,
మున్నియ పెణ్ణైమేల్ ముళ్ ముళరికూట్టకత్తు , 2833
పిన్నుమ్ అవ్వన్ఱిల్ పేడై వాయ్ చ్చిరు కురలుమ్ ,
ఎన్నుడైయ నెఞ్జుక్కు ఓర్ ఈర్ వాళామ్ ఎన్ శెయ్ గేన్ , 2834
తెన్నన్ పొదియిల్ = దక్షిణదిక్కునకు ప్రభువైన పాండ్యదేశ రాజుయొక్క మలయ పర్వతములయందు గల; శెழுమ్ శన్దిన్ తాదు అళైన్దు = అందమైన చందన వృక్షములయొక్క పుష్పరేణువులను ధరించి; మన్ను ఇవ్వులగై మనమ్ కళిప్ప వన్దు ఇయఙ్గుమ్ = నిత్యమైన ఈలోకమందుగల జనుల మనస్సు ఆనందించునట్లు తిరుగుచున్న; ఇన్ ఇళమ్ పూమ్ తెన్ఱలుమ్ = భోగ్యమగు అందమైన మందముగ వీచు దక్షిణగాలి; ఎరి ఎనక్కే వీశుమ్ = నాకు మాత్రము అగ్నియే వీచుచున్నది; పిన్నుమ్= మఱియు; మున్నియ పెణ్ణైమేల్ = ముంగిటనున్న తాటిచెట్టుపై; ముళ్ ముళరి కూడు అగత్తు=ముల్లులు గల తామరతూళ్ళచే కట్టుకున్న గూటియందు; అవ్వన్ఱిల్ పేడై వాయ్ చ్చిరు కురలుమ్ = తన మొగపక్షి యొక్క ముక్కుతో తన ముక్కును చేర్చిన అన్ఱిల్ ఆడ పక్షియొక్క నోటినుండి వెలువడు కిచ కిచ శబ్దములు ఒక్కొక్కటి; ఎన్నుడైయ నెఞ్జుక్కు ఓర్ ఈర్ వాళామ్ = నాయొక్క హృదయమును కోయుచుండు ఒక వాడియైన కత్తి వలెయున్నది; ఎన్ శెయ్ గేన్ = (ఈ అవస్థలో) నేను ఏమిచేయగలను?
దక్షిణ దిక్కునకు ప్రభువైన పాండ్యదేశ రాజుయొక్క మలయ పర్వతములయందుగల అందమైన చందన వృక్షములయొక్క పుష్పరేణువులను ధరించి నిత్యమైన ఈలోకమందు గల జనుల మనస్సు ఆనందించునట్లు తిరుగుచున్నభోగ్యమగు అందమైన మందముగ వీచు దక్షిణగాలి నాకు మాత్రము అగ్నియే వీచుచున్నది . మఱియు ముంగిటనున్న తాటిచెట్టుపై ముల్లులు గల తామరతూళ్ళచే కట్టుకున్న గూటియందు తన మొగపక్షి యొక్క ముక్కుతో తన ముక్కును చేర్చిన అన్ఱిల్ ఆడ పక్షియొక్క నోటినుండి వెలువడు కిచ కిచ శబ్దములు ఒక్కొక్కటి నాయొక్క హృదయమును కోయుచుండు ఒక వాడియైన కత్తి వలెయున్నది (ఈ అవస్థలో) నేను ఏమిచేయగలను?
కన్నవిల్ తోళ్ కామన్ కరుప్పు చ్చిలై వళైయ ,
కొన్నవిలుమ్ పూఙ్గణైకళ్ కోత్తు ప్పొదవణైన్దు , 2835
తన్నుడైయ తోళ్ కழிయవాఙ్గి , తమియేన్ మేల్
ఎన్నుడైయ నెఞ్జే యిలక్కాక ఎయ్ కిన్ఱాన్ , 2836
పిన్నితనై క్కాప్పీర్ తానిల్లయే , …… ….
కల్ నవిల్ తోళ్ కాళైయై = పర్వతము పోలిన దృఢమైన భుజములుగల మన్మధుడు; కరుప్పు చ్చిలై వళైయ = తనయొక్క చెఱుకు విల్లును వంచి;కొల్ నవిలుమ్ పూఙ్గణైకళ్ కోత్తు = (కామగ్నిచే) మరణింపజేయగల పుష్పబాణములు సంధించి; పొద అణైన్దు = (ఆ బాణములు లక్ష్యమును చొచ్చుకొని పోవునట్లు) దగ్గరగ నిలబడి;తన్నుడైయ తోళ్ కழிయ వాఙ్గి = తనయొక్క భుజములను దాటునట్లు వింటినారిని లాగి; తమియేన్ మేల్ = అసహాయరాలైన నాపై;ఎన్నుడైయ నెఞ్జే యిలక్కాక ఎయ్ కిన్ఱాన్= నాయొక్క హృదయమును గురిచేసి (ఆ బాణములను) ప్రయోగించినాడు; పిన్ఇతనై క్కాప్పీర్ తాన్ ఇల్లయే = ఇప్పుడు ఇట్టి ఆపదనుండి నన్ను తప్పించు సమర్థులెవ్వరులేరే;
పర్వతము పోలిన దృఢమైన భుజములుగల మన్మధుడు తనయొక్క చెఱుకు విల్లును వంచి (కామగ్నిచే) మరణింపజేయగల పుష్పబాణములు సంధించి (ఆ బాణములు లక్ష్యమును చొచ్చుకొని పోవునట్లు) దగ్గరగ నిలబడి తనయొక్క భుజములను దాటునట్లు వింటినారిని లాగి అసహాయరాలైన నాపై నాయొక్క హృదయమును గురిచేసి (ఆ బాణములను)ప్రయోగించినాడు. ఇప్పుడు ఇట్టి ఆపదనుండి నన్ను తప్పించు సమర్థులెవ్వరులేరే;
…….. ……. ……. ,పేదైయేన్
కన్న విలుమ్ కాట్టకత్తు ఓర్ వల్లిక్కడి మలరిన్ , 2837
నన్నఱువాశమ్ మర్ట్రు ఆరానుమ్ ఎయ్ తామే ,
మన్నుమ్ వఱు నిలత్తు వాళాఙ్గుకుత్తతుపోల్ , 2838
ఎన్నుడైయ పెణ్మైయుమ్ ఎన్నలనుమ్ ఎన్ములైయుమ్ ,
మన్ను మలర్ మఙ్గై మైన్దన్ , కణపురత్తు 2839
పొన్మలైపోల్ నిన్ఱవన్దన్ , పొన్నకలమ్ తోయావేల్ ,
ఎన్నివైతాన్ వాళా ఎనక్కే పొఱైయాగి , 2840
మున్నిరున్దు మూక్కిన్ఱు మూవామై కాప్పదోర్ ,
మన్ను మరున్దు అఱివీర్ ఇల్లైయే , ……… 2841
కల్ నవిలుమ్ కాట్టు అకత్తు=రాళ్ళ మయమయిన అడవిలోపల;ఓర్ వల్లి=ఒక తీగయందు ( పుష్పించు); కడి మలరిన్ = తేనెలొలుకు పుష్పముయొక్క; నల్ నఱు వాశమ్= మంచి పరిమళము; మర్ట్రు ఆరానుమ్ ఎయ్ దామే=ఏ ఒక్కరికిచేతను ఉపయోగింపబడకనే; మన్నుమ్ వఱు నిలత్తు వాళా ఆఙ్గు ఉకుత్తదుపోల్= ఎల్లప్పుడును ఉండు శూన్యప్రదేశమున వ్యర్ధముగ అచటనే నశించునట్లు; పేదైయేన్ ఎన్నుడైయ పెణ్మైయుమ్ = అఙ్ఞానురాలైన నాయొక్క స్త్రీతత్వమును;ఎన్ నలనుమ్ = నాయొక్క గుణములును; ఎన్ ములైయుమ్ = నాయొక్క వక్షోజములును; మలర్ మఙ్గై మన్నుమ్ మైన్దన్= కమలవాసినితో ఎల్లప్పుడును కూడియున్న పరమపురుషుడైన; కణపురత్తు పొన్ మలైపోల్ నిన్ఱవన్ తన్ = తిరు కణ్ణపురములో బంగారు కొండవలె నిలిచియున్న సర్వేశ్వరునియొక్క; పొన్ అగలమ్ తోయావేల్ = అందమైన వక్షస్థలమును పొందని; వాళా ఇవైదాన్ ఎన్=వ్యర్థమైన ఇవన్నియు దేనికి?;ఇవై =(సర్వేశ్వరుని అనుభవమునకై నాకుగల) ఈ వక్షోజములు; ఎనక్కే పొఱైయాగి = నాకే భారమై; మున్నిరున్దు = నా కనులముందే; మూక్కిన్ఱు = క్షీణించుచున్నవి; మూవామై కాప్పదు ఓర్ = అటుల క్షీణింపనీయక కాపాడగల ఒక అద్వితీయమైన; మన్ను మరున్దు అఱివీర్ ఇల్లైయే = ఔషధము తెలిసినవారు (భేషజమ్, భిషక్ అని కొలవబడు ఆ సర్వేశ్వరుడే తప్ప) ఇచట ఎవ్వరూ లేరే!
రాళ్ళ మయమయిన అడవిలోపల ఒక తీగయందు ( పుష్పించు) తేనెలొలుకు పుష్పముయొక్క మంచి పరిమళము ఏ ఒక్కరికిచేతను ఉపయోగింపబడకనే ఎల్లప్పుడును ఉండు శూన్యప్రదేశమున వ్యర్ధముగ అచటనే నశించునట్లు అఙ్ఞానురాలైన నాయొక్క స్త్రీతత్వమును నాయొక్క గుణములును నాయొక్క వక్షోజములును కమలవాసినితో ఎల్లప్పుడును కూడియున్న పరమపురుషుడైన తిరు కణ్ణపురములో బంగారు కొండవలె నిలిచియున్న సర్వేశ్వరునియొక్క అందమైన వక్షస్థలమును పొందని వ్యర్థమైన ఇవన్నియు దేనికి? (సర్వేశ్వరుని అనుభవమునకై నాకుగల) ఈ వక్షోజములు నాకే భారమై నా కనులముందే క్షీణించుచున్నవి అటుల క్షీణింపనీయక కాపాడగల ఒక అద్వితీయమైన ఔషధము తెలిసినవారు (భేషజమ్, భిషక్ అని కొలవబడు ఆ సర్వేశ్వరుడే తప్ప) ఇచట ఎవ్వరూ లేరే!
…… …….. ……….. …. , మాల్ విడైయిన్
తున్ను పిడర్ ఎరుత్తు త్తూక్కుణ్డు , వన్ తొడరాల్
కన్నియర్ కణ్ మిళిర క్కట్టుణ్డు , మాలైవాయ్ 2842
తన్నుడైయ నా ఒழிయాదు ఆడుమ్ తని మణియిన్ ,
ఇన్నిశైయోశైయుమ్ వన్దు ఎన్ శెవిదనక్కే , 2843
కొల్ నవిలుమ్ ఎహ్ గిల్ కొడిదాయ్ నెడిదాగుమ్ ,
ఎన్ ఇదనై కాక్కుమా శొల్లీర్ ; ….. … 2844
మాల్ విడైయిన్ = ( ధేనువుయందు) వ్యామోహముచెందిన వృషభము యొక్క ; తున్ను పిడర్ ఎరుత్తు త్తూక్కుణ్డు = పెద్ద మూపురముగల మెడనుండి వేలాడునట్లు;వన్ తొడరాల్ = బలిష్టమైన గొలుసులచే ; కన్నియర్ కణ్ మిళిర = కన్నెల కన్నులు చూచి ప్రకాశించునట్లు; క్కట్టుణ్డు = కట్టబడియున్నది; మాలైవాయ్ = సాయంకాల సమయమున (ఆ వృషభము అరుచుకొనుచు ధేనువువెంట పరుగెత్తుచుండగ) తమయొక్క నాలుకలు విరామములేక మోగుచుండు సాటిలేని గంటల యొక్క (ఇతరులకు) ఇంపైన రాగములవలె నుండు శబ్దములు వచ్చి; ఎన్ శెవిదనక్కే=నాయొక్క చెవులకు మాత్రమే; కొల్ నవిలుమ్ ఎహ్ గిల్ కొడిదాయ్ నెడిదాగుమ్ = సంహరించు స్వభావముగల శూలముకంటె అతిక్రూరముగ చాల సమయమువరకు బాధ కలిగించుచున్నది; ఇదనై కాక్కుమా ఎన్ శొల్లీర్ = ఇట్టి భయంకరమైన బాధనుండి కాపాడుబడు విధానము ఏమిటో దయచేసి చెప్పుడు;
( ధేనువుయందు) వ్యామోహముచెందిన వృషభము యొక్క పెద్ద మూపురముగల మెడనుండి వేలాడునట్లు బలిష్టమైన గొలుసులచే కన్నెల కన్నులు చూచి ప్రకాశించునట్లు కట్టబడియున్నది సాయంకాల సమయమున (ఆ వృషభము అరుచుకొనుచు ధేనువువెంట పరుగెత్తుచుండగ) తమయొక్క నాలుకలు విరామములేక మోగుచుండు సాటిలేని గంటల యొక్క (ఇతరులకు) ఇంపైన రాగములవలెనుండు శబ్దములు వచ్చి నాయొక్క చెవులకు మాత్రమే సంహరించు స్వభావముగల శూలముకంటె అతిక్రూరముగ చాల సమయము వరకు బాధ కలిగించుచున్నది ఇట్టి భయంకరమైన బాధనుండి కాపాడుబడు విధానము ఏమిటో దయచేసి చెప్పుడు;
………. …….. ……., ఇదు విళైత్త
మన్నన్ నఱున్దుழாయ్ వాழ் మార్బన్ , మామతికోళ్
మున్నమ్ విడుత్త ముగిల్ వణ్ణన్ , కాయావిన్ 2845
శిన్ననఱుమ్ పూమ్ తిగழ் వణ్ణన్ , వణ్ణమ్బోల్
అన్న కడలై మలై యిట్టణైకట్టి , 2846
మన్ననిరావణనై మామణ్డు వెఞ్జమత్తు ,
పొన్ముడిగళ్ పత్తుం పురుళచ్చరన్దురన్దు , 2847
తెన్నులగమ్ ఏర్ట్రువిత్త శేవకనై ,
ఇదు విళైత్త = ఈ స్థితిని కలిగించిన; మన్నన్ = చక్రవర్తియు; నఱుమ్ తుழாయ్ వాழ் మార్బన్ = పరిమళభరితమైన తులసీమాలచే అలంకృతమైన వక్షస్థలము కలవాడును; మున్నమ్ మా మది కోళ్ విడుత్త ముగిల్ వణ్ణన్ = మునుపు అందమైన చంద్రునియొక్క దుంఖమును తీర్చిన కాళమేఘమువంటి వర్ణము కలవాడును; కాయావిన్ శిన్న నఱుమ్ పూమ్ తిగழ் వణ్ణన్ = చిన్న పరిమళభరితమైన అల్లి పువ్వువలె ప్రకాశించు వర్ణము కలవాడును; వణ్ణమ్ పోల్ అన్న కడలై = తనయొక్క వర్ణము పోలిన వర్ణము కలిగిన సముద్రములో; మలై ఇట్టు = పర్వతములను వేసి; అణై కట్టి = సేతువును కట్టి (లంకాపురి ప్రవేశించి);మా మణ్డు వెమ్ శమత్తు=గొప్ప చతురంగ బలగములతో నిండిన క్రూరమైన యుద్దమందు; మన్నన్ ఇరావణనై = రాక్షస రాజైన రావణాసురునియొక్క పొన్ ముడిగళ్ పత్తుం పురుళ = అందమైన పదితలలు భూమిపై పడి దొర్లునట్లు; శరమ్ తురన్దు = బాణములను ప్రయోగించి; తెన్ ఉలగమ్ ఏర్ట్రువిత్త శేవకనై = (ఆ రావణుని) యమలోకమునకు చేరవేసిన మహాశూరుడును;
ఈ స్థితిని కలిగించిన చక్రవర్తియు, పరిమళభరితమైన తులసీమాలచే అలంకృతమైన వక్షస్థలము కలవాడును, మునుపు అందమైన చంద్రునియొక్క దుంఖమును తీర్చిన కాళమేఘమువంటి వర్ణము కలవాడును, చిన్న పరిమళభరితమైన అల్లి పువ్వువలె ప్రకాశించు వర్ణము కలవాడును, తనయొక్క వర్ణము పోలిన వర్ణము కలిగిన సముద్రములో పర్వతములను వేసి సేతువును కట్టి (లంకాపురి ప్రవేశించి) గొప్ప చతురంగ బలగములతో నిండిన క్రూరమైన యుద్దమందు రాక్షస రాజైన రావణాసురుని యొక్క అందమైన పదితలలు భూమిపై పడి దొర్లునట్లు బాణములను ప్రయోగించి (ఆ రావణుని) యమలోకమునకు చేరవేసిన మహాశూరుడును;
……….. ….. ….., ఆయిరక్కణ్
మన్నవన్ వానముమ్ వానవర్ తమ్ పొన్నులగమ్ , 2848
తన్నుడైయ తోళ్ వలియాల్ కైక్కొణ్డ దానవనై ,
పిన్నోరరియురువమాగి యెరివిழிత్తు , 2849
కొల్ నవిలుమ్ వెఞ్జమత్తుకొల్లాదే , వల్లాళన్
మన్ను మణిక్కుఞ్జిపర్ట్రి వర ఈర్ త్తు , 2850
తన్నుడైయ తాళ్ మేల్ కిడాత్తి , అవనుడైయ
పొన్నకలమ్ వళ్ళుగిరాల్ పోழ்న్దు పుగழ் పడైత్త , 2851
మిన్నిలఙ్గుమ్ ఆழி పడై తడక్కై వీరనై ,
ఆయిరమ్ కణ్ మన్నవన్ వానముమ్ = వెయ్యి కన్నులుగల దేవేంద్రుని స్వర్గలోకమును; వానవర్ తమ్ పొన్నులగమ్ = దేవతలయొక్క ఇతరములైన దివ్య లోకములును; తన్నుడైయ తోళ్ వలియాల్ కైక్కొణ్డ దానవనై = తనయొక్క భుజబలముచే తనవశము గావించుకొన్న హిరణ్యాసురునిని; పిన్ = కొంతకాలము సహించి;ఓర్ అరి ఉరువమ్ ఆగి= ఒక అద్వితీయమైన నరసింహమూర్తిగ అవతరించి; యెరివిழிత్తు = అగ్నిజ్వాలలు కురియు కన్నులతో గాంచుచు, కొల్ నవిలుమ్ వెమ్ శమత్తుకొల్లాదే = సహజముగ శత్రువులు సంహరింపబడెడి క్రూరమైన యుద్దమందు సంహరింపక; వల్లాళన్ = మహాబలశాలియైన ఆ అసురుని యొక్క; మణి మన్ను క్కుఞ్జిపర్ట్రి వర ఈర్ త్తు = మణులతోనిండిన కిరీటము కలిగిఉండెడి అతని జుట్టును పట్టుకొని దగ్గరకు ఈడ్చి; తన్నుడైయ తాళ్ మేల్ కిడాత్తి = ( ఆ హిరణ్యాసురుని ) తనయొక్క తొడలపై పడవేసుకొని; అవనుడైయ పొన్ అగలమ్ = అతనియొక్క అందమైన వక్షస్థలమును; వళ్ ఉగిరాల్ పోழ்న్దు = బలిష్టమైన వాడియైన నఖములచే చీల్చి; పుగழ் పడైత్త = (ఆశ్రితుడైన ప్రహ్లాదుని రక్షంచెననెడి) కీర్తిగల; మిన్ ఇలఙ్గుమ్ ఆழி పడై తడక్కై వీరనై = మెరుపువలె ప్రకాశించుచున్న చక్రాయుధమును విశాలమైన హస్తమునగల మహావీరుడును;
వెయ్యి కన్నులుగల దేవేంద్రుని స్వర్గలోకమును దేవతలయొక్క ఇతరములైన దివ్య లోకములును తనయొక్క భుజబలముచే తనవశము గావించుకొన్న హిరణ్యాసురునిని కొంతకాలము సహించి ఒక అద్వితీయమైన నరసింహమూర్తిగ అవతరించి అగ్నిజ్వాలలు కురియు కన్నులతో కాంచుచు సహజముగ శత్రువులు సంహరింపబడెడి క్రూరమైన యుద్దమందు సంహరింపక మహాబలశాలియైన ఆ అసురుని యొక్క మణులతోనిండిన కిరీటము కలిగిఉండెడి అతని జుట్టును పట్టుకొని దగ్గరకు ఈడ్చి (ఆ హిరణ్యాసురుని ) తనయొక్క తొడలపై పడవేసుకొని అతనియొక్క అందమైన వక్షస్థలమును బలిష్టమైన వాడియైన నఖములచే చీల్చి (ఆశ్రితుడైన ప్రహ్లాదుని రక్షంచెననెడి) కీర్తిగల మెరుపువలె ప్రకాశించుచున్న చక్రాయుధమును విశాలమైన హస్తమునగల మహావీరుడును;
…… ……. …….. ………,
మన్ని వకలిడత్తై మాముదునీర్ తాన్ విழுఙ్గ , 2852
పిన్నుమోరేనమాయ్ పుక్కు వళై మరుప్పిల్ ,
కొల్ నవిలుమ్ కూర్ నుతిమేల్ వైత్తు ఎడుత్త కూత్తనై , 2853
మన్ను ఇవ్వులగై అగల్ ఇడత్తై=సకల జీవరాశులు నివసించెడి ఈ విశాలమైన భూమిని; మాముదునీర్ తాన్ విழுఙ్గ = మహా ప్రళయజలములు మింగగ; పిన్నుమ్ = పిదప; ఓర్ ఏనమాయ్ పుక్కు=ఒక అద్వితీయమైన దివ్య వరాహరూపముదాల్చి (ఆ మహా సముద్రమందు) ప్రవేశించి; వళై మరుప్పిన్ = వంగియున్న తన దంతములయొక్క; కొల్ నవిలుమ్ కూర్ నుదిమేల్ = శత్రువులను సంహరింపగల వాడియైన కొనలలో; వైత్తు ఎడుత్త కూత్తనై = ఉంచుకొని పైకెత్తి కాపాడిన సుందరమైన చేష్టితములు కలవాడును ;
సకల జీవరాశులు నివసించెడి ఈ విశాలమైన భూమిని, మహా ప్రళయజలములు మింగగ, పిదప ఒక అద్వితీయమైన దివ్య వరాహరూపముదాల్చి (ఆ మహా సముద్రమందు) ప్రవేశించి వంగియున్న తన దంతములయొక్క శత్రువులను సంహరింపగల వాడియైన కొనలలో ఉంచుకొని పైకెత్తి కాపాడిన సుందరమైన చేష్టితములు కలవాడును,
మన్నుమ్ వడమలయై మత్తాక మాశుణత్తాల్ ,
మిన్నుమ్ ఇరుశుడరుమ్ విణ్ణుమ్ పిఱఙ్గు ఒలియుమ్ , 2854
తన్నినుడనే శుழల మలై తిరిత్తు ,ఆఙ్గు
ఇన్నముదమ్ వానవరైయూట్టి , అవరుడైయ 2855
మన్నుమ్ తుయర్ కడిన్ద వళ్ళలై , ……….
మన్నుమ్ వడమలయై = స్థిరమైన మందరపర్వతమును; మత్తాక = కవ్వముగా చేసుకొని ; మాశుణత్తాల్ = (వాసుకియను) మహాసర్పమును (ఆకవ్వమునకు తాడుగ చుట్టి; మిన్నుమ్ ఇరుశుడరుమ్ విణ్ణుమ్ పిఱఙ్గు ఒలియుమ్ తన్నినుడనే శుழల మలై తిరిత్తు = ప్రకాశించు సూర్యచంద్రులును,ఆకాశమును, ప్రకాశించు అనేక తేజస్సుగల వస్తువులును,దానితో తిరగునట్లు, అ పర్వతమును త్రిప్పి (సముద్రమును చిలికి ); వానవరై ఇన్ అముదమ్ యూట్టి = దేవతలకు మధురమైన అమృతమును ఆస్వాదింపజేసి; అవరుడైయ= వారియొక్క;మన్నుమ్ తుయర్ కడిన్ద=చిరకాలమునుండి అనుభవించెడి దుఃఖమును తీర్చిన; వళ్ళలై = పరమ ఔదార్యము కలవాడును;
స్థిరమైన మందరపర్వతమును కవ్వముగా చేసుకొని (వాసుకియను) మహాసర్పమును (ఆకవ్వమునకు తాడుగ చుట్టి, ప్రకాశించు సూర్యచంద్రులును,ఆకాశమును, ప్రకాశించు అనేక తేజస్సు గల వస్తువులును,దానితో తిరగునట్లు, అ పర్వతమును త్రిప్పి (సముద్రమును చిలికి ) దేవతలకు మధురమైన అమృతమును ఆస్వాదింపజేసి వారియొక్కచిరకాలమునుండి అనుభవించెడి దుఃఖమును తీర్చిన పరమ ఔదార్యము కలవాడును,
…….. ………. … , మర్ట్రన్ఱియుమ్
తన్నురువమ్ ఆరుమఱియామల్ తాన్ అఙ్గు ఓర్ , 2856
మన్నుమ్ కుఱళురువిన్ మానియాయ్ , మావలితన్
పొన్నియలుమ్ వేళ్విక్కణ్ పుక్కిరున్దు , పోర్ వేన్దర్ 2857
మన్నై మనఙ్గొళ్ళ వఞ్జిత్తు నెఞ్జురుక్కి ,
ఎన్నుడైయ పాదత్తాల్ యాన్ అళప్ప మూవడిమణ్ , 2858
మన్నా తరుక ఎన్ఱు వాయ్ తిఱప్ప , మర్ట్రవనుమ్
ఎన్నాల్ తరప్పట్టదు ఎన్ఱలుమే ,అత్తుణైకణ్ 2859
మిన్నార్ మణిముడిపోయ్ విణ్ తడవ ,మేలెడుత్త
పొన్నార్ కనై కழఱ్కాల్ ఏழுలగుమ్ పోయ్ క్కడన్దు ,అఙ్గు 2860
ఒన్ఱా అశురర్ తుళఙ్గ చ్చెలనీట్టి ,
మన్నివ్వకలిడత్తై మావలియై వఞ్జిత్తు , 2861
తన్నులకమ్ ఆక్కువిత్త తాళానై , …….
మర్ట్రు అన్ఱియుమ్=మఱియు ఇదియునుగాక;తన్ ఉరువమ్ ఆరుమ్ అఱియామల్ = తన స్వరూపము ఎవరిచేతను తెలియబడకుండునట్లు; తాన్ ఓర్ మన్నుమ్ కుఱళ్ ఉరువిన్ మానియాయ్ = పరమపురుషుడైన సర్వేశ్వరుడు ఒక దివ్యమైన వామనరూపముతో బ్రహ్మచారిగ అవతరించి; మావలితన్ = మహాబలి యొక్క; పొన్ ఇయలుమ్ వేళ్వి కణ్ పుక్కిరున్దు = స్వర్ణ దానము చేయబడు యాగభూమియందు వేంచేసి; పోర్ వేన్దర్ మన్నై=పోరు సలుపుటలో సమర్ధులైన అసురులయొక్క ప్రభువైన ఆ మహాబలిని;మనమ్ కొళ్ళ వఞ్జిత్తు=(ఈ బహ్మచారి యాచించుటకై వచ్చియున్నాడని) మనస్సునందు నమ్మునట్లు మోహింపజేసి; నెఞ్జు ఉరుక్కి = (తనయొక్క చిరునవ్వు, మృధువైన వాక్కులు,అవయవ సౌందర్యము, మొదలగువానిచే మహాబలి యొక్క ) హృదయమును ద్రవింపజేసి; మన్నా = ” మహా ప్రభువా! “;ఎన్నుడైయ పాదత్తాల్ యాన్ అళప్ప = ” నాయొక్క పాదమలచే నేను కొలుచు “; మూవడిమణ్ తరుక ఎన్ఱు = మూడడుగుల నేలను ఒసగుమా! అని “; వాయ్ తిఱప్ప = నోరు తెరిచి అడుగగ; అవనుమ్ = (ఆ మృధుపలుకులు వినిన) మహాబలి;ఎన్నాల్ తరప్పట్టదు ఎన్ఱలుమే = ” అటులనే నాచే మూడడుగుల నేలను ఇవ్వబడినది ” అని చెప్పగనే; అత్తుణైకణ్ = ఆ క్షణమందే; మిన్నార్ మణిముడిపోయ్ విణ్ తడవ = ప్రకాశముతో నిండిన మణి మకుటము ఆకాశమును తాకునట్లు పెరిగి; మేల్ ఎడుత్త = పైకి ఎత్తిన; పొన్ ఆర్ కనై కழల్ కాల్ = బంగారుమయమయిన , శబ్దించుచుండు , వీర కంకణములుగల దివ్య పాదమును; ఏழுలగుమ్ పోయ్ క్కడన్దు = సప్తలోకములను దాటి;అఙ్గు ఒన్ఱా అశురర్ తుళఙ్గ = ఆ యాగభూమియందు వ్యతిరేకించిన నముచి మొదలగు అశురులు వ్యధపొందునట్లు; చెల నీట్టి = పైకి పోయి వ్యాపింపజేసి; మావలియై వఞ్జిత్తు = ఈ విధముగా మహాబలిని వంచనచేసి; మన్ను ఇ అగల్ ఇడత్తై = నిత్యమైన ఈ విశాలమైన భూమండలమంతయు; తన్ ఉలగమ్ ఆక్కువిత్త తాళానై = తనయొక్క లోకములగునట్లు చేసుకొన్న దివ్య చరణములు కలవాడును;
మఱియు ఇదియునుగాక తన స్వరూపము ఎవరిచేతను తెలియబడకుండునట్లు పరమపురుషుడైన సర్వేశ్వరుడు ఒక దివ్యమైన వామనరూపముతో బ్రహ్మచారిగ అవతరించి మహాబలి యొక్క స్వర్ణ దానము చేయబడు యాగభూమియందు వేంచేసి పోరు సలుపుటలో సమర్ధులైన అసురులయొక్క ప్రభువైన ఆ మహాబలిని (ఈ బహ్మచారి యాచించుటకై వచ్చియున్నాడని) మనస్సునందు నమ్మునట్లు మోహింపజేసి; (తనయొక్క చిరునవ్వు, మృధువైన వాక్కులు,అవయవ సౌందర్యము, మొదలగువానిచే మహాబలి యొక్క ) హృదయమును ద్రవింపజేసి ” మహా ప్రభువా! ” ” నాయొక్క పాదమలచే నేను కొలుచు ” మూడడుగుల నేలను ఒసగుమా! అని నోరు తెరిచి అడుగగ (ఆ మృధుపలుకులు వినిన) మహాబలి ” అటులనే నాచే మూడడుగుల నేలను ఇవ్వబడినది ” అని చెప్పగనే ఆ క్షణమందే ప్రకాశముతో నిండిన మణి మకుటము ఆకాశమును తాకునట్లు పెరిగి పైకి ఎత్తిన బంగారుమయమయిన శబ్దించుచుండు , వీర కంకణములుగల దివ్య పాదమును సప్తలోకములను దాటి ఆ యాగభూమియందు వ్యతిరేకించిన నముచి మొదలగు అశురులు వ్యధపొందునట్లు పైకి పోయి వ్యాపింపజేసి ఈ విధముగా మహాబలిని వంచనచేసి నిత్యమైన ఈ విశాలమైన భూమండలమంతయు తనయొక్క లోకములగునట్లు చేసుకొన్న దివ్య చరణములు కలవాడును;
……. ………. …. , తామరైమేల్
మిన్నిడైయాళ్ నాయకనై , విణ్ణగరుళ్ పొన్ మలయై , 2862
పొన్ని మణి కొழிక్కుమ్ పూఙ్గుడన్దై ప్పోర్విడయై ,
తెన్నన్ కుఱుఙ్గుడియుళ్ శెమ్బవళకున్ఱినై , 2863
మన్నియ తణ్ శెఱై వళ్ళలై ,మామలర్ మేల్
అన్నమ్ తుయిలుమ్ అణి నీర్ వయలాలి , 2864
ఎన్నుడైయ ఇన్నముదై ఎవ్వుళ్ పెరుమలైయై ,
కన్ని మదిళ్ శూழ் కణమఙ్గై కఱ్పగత్తై , 2865
మిన్నై యిరుశుడరై వెళ్ళఱైయుళ్ కల్ అఱైమేల్
పొన్నై , మరదగత్తై పుట్కుழிయెమ్బోరేర్ట్రై , 2866
మన్నుమ్ అరఙ్గత్తు ఎమ్మామణియై ,…….
తామరైమేల్ మిన్ ఇడైయాళ్ నాయగనై=తామరపుష్పమందు ఉద్భవించిన , మెరుపు వలె సన్నని నడుముగల శ్రీదేవికి నాయకుడును; విణ్ణగరుళ్ పొన్ మలయై = తిరు విణ్ణగరములో బంగారుకొండవలె ప్రకాశించుచున్నవాడును; పొన్ని మణి కొழிక్కుమ్ పూమ్ కుడన్దై ప్పోర్విడయై = కావేరినదిచే రత్నములు చేర్చబడుచుండు అందమైన తిరు కుడందై దివ్య దేశములో వేంచేసిన యుద్దమునకు సన్నిద్ధమైన వృషభమువలె బలిష్టుడైనవాడును; తెన్నన్ కుఱుఙ్గుడియుళ్ శెమ్ పవళ కున్ఱినై = దక్షిణదిక్కునగల విలక్షణమైన తిరుక్కురుంగుడి దివ్యదేశములో ఎఱ్ఱని పగడాలకొండవలె ప్రకాశించుచున్నవాడును; తణ్ శెఱై మన్నియ వళ్ళలై = చల్లని తిరు శేఱై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న పరమ ఉదారమైనవాడును; మా మలర్ మేల్ అన్నమ్ తుయిలుమ్ అణి నీర్ వయలాలి ఎన్నుడైయ ఇన్ అముదై=శ్లాఘ్యమైన తామర పుష్పములపై హంసలు శయనించుచుండు అందమైన జలరాసులుగల పొలములతో ఒప్పు తిరు వాలి దివ్య దేశములో నాయొక్క భోగ్యమైన అమృతము వంటివాడును; ఎవ్వుళ్ పెరుమలైయై = తిరువెవ్వుళూర్ దివ్యదేశములో ఒక పెద్ద కొండవలె నిలిచియున్నవాడును; కన్ని మదిళ్ శూழ் కణమఙ్గై కఱ్పగత్తై = శాశ్వతమైన ప్రాకరములచే చుట్టబడిన తిరు కణమఙ్గై దివ్యదేశములో కల్పవృక్షమువలె వేంచేసియున్నవాడును; మిన్నై=మెరుపువలె ప్రకాశించు శ్రీదేవితోడను; యిరుశుడరై=సూర్యచంద్రుల వలెనున్న శంఖుచక్రముల తోడను; వెళ్ళఱైయుళ్= తిరువెళ్ళఱై దివ్య దేశములో; కల్ అఱైమేల్ = నల్లని రాళ్ళతోనున్న సన్నిధిలో; పొన్నై = మేలిమి బంగారమువలె మెరయుచున్న వాడును; మరదగత్తై=మరకతమువంటి స్వరూపుడును; పుట్కుழி యెమ్ పోర్ ఏర్ట్రై = తిరు పుట్కుழி దివ్యదేశములో వేంచేసిన నాయొక్క సమర పుంగవుడును; అరఙ్గత్తు మన్నుమ్ ఎమ్ మా మణియై=శ్రీరంగం దివ్యదేశములో కృపతో నిత్యవాసము చేయుచున్న మనయొక్క శ్లాఘ్యమైన నీలమణి కాంతితో ప్రకాశించు విగ్రహస్వరూపుడును;
తామరపుష్పమందు ఉద్భవించిన , మెరుపు వలె సన్నని నడుముగల శ్రీదేవికి నాయకుడును, తిరు విణ్ణగరములో బంగారుకొండవలె ప్రకాశించుచున్నవాడును, కావేరి నదిచే రత్నములు చేర్చబడుచుండు అందమైన తిరు కుడందై దివ్య దేశములో వేంచేసిన యుద్దమునకు సన్నిద్ధమైన వృషభమువలె బలిష్టుడైనవాడును, దక్షిణదిక్కున గల విలక్షణమైన తిరుక్కురుంగుడి దివ్యదేశములో ఎఱ్ఱని పగడాల కొండవలె ప్రకాశించు చున్నవాడును, చల్లని తిరు శేఱై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న పరమ ఉదారమైనవాడును, శ్లాఘ్యమైన తామర పుష్పములపై హంసలు శయనించుచుండు అందమైన జలరాసులుగల పొలములతో ఒప్పు తిరు వాలి దివ్య దేశములో నాయొక్క భోగ్యమైన అమృతము వంటివాడును, తిరువెవ్వుళూర్ దివ్యదేశములో ఒక పెద్ద కొండవలె నిలిచియున్నవాడును, శాశ్వతమైన ప్రాకరములచే చుట్టబడిన తిరు కణమఙ్గై దివ్య దేశములో కల్పవృక్షమువలె వేంచేసియున్నవాడును, మెరుపువలె ప్రకాశించు శ్రీదేవి తోడను, సూర్యచంద్రుల వలెనున్న శంఖుచక్రముల తోడను, తిరువెళ్ళఱై దివ్య దేశములో నల్లని రాళ్ళతోనున్న సన్నిధిలో మేలిమి బంగారమువలె మెరయుచున్న వాడును, మరకతమువంటి స్వరూపుడును తిరు పుట్కుழி దివ్యదేశములో వేంచేసిన నాయొక్క సమర పుంగవుడును, శ్రీరంగం దివ్యదేశములో కృపతో నిత్యవాసము చేయుచున్న మనయొక్క శ్లాఘ్యమైన నీలమణి కాంతితో ప్రకాశించు విగ్రహస్వరూపుడును,
…….. ………. …….. ….., వల్లవాழ்
పిన్నై మణాళనై ప్పేరిల్ పిఱప్పిలియై , 2867
తొన్నీర్కడల్ కిడన్ద తోళామణిచ్చుడరై ,
ఎన్మనత్తు మాలై ఇడవెన్దై ఈశనై , 2868
మన్నుమ్ కడల్ మల్లై మాయవనై , వానవర్ తమ్
శెన్ని మణిచ్చుడరై త్తణ్ కాల్ తిఱల్ వలియై , 2869
తన్నైప్పిఱరఱియా త్తత్తువత్తై ముత్తినై ,
అన్నత్తై మీనై అరియై అరుమఱైయై , 2870
మున్నివులగుణ్డ మూర్తియై , కోవలూర్
మన్నుమ్ ఇడైకழி యెమ్ మాయవనై , పేయ్ అలఱ 2871
పిన్నుమ్ ములైయుణ్డ పిళ్ళైయై , అళ్ళల్ వాయ్
అన్నమ్ ఇఱైతేర్ అழுన్దూర్ ఎழுమ్ శుడరై , 2872
తెన్ తిల్లై చ్చిత్తరకూడత్తు ఎన్ శెల్వనై ,
మిన్ని మழைతవழுమ్ వేఙ్గడత్తు ఎమ్ విత్తకనై , 2873
వల్లవాழ் = తిరు వల్లవాழ் దివ్యదేశములో వేంచేసిన;పిన్నై మణాళనై=నీళాదేవి యొక్క నాయకుడును; ప్పేరిల్ పిఱప్పు ఇలియై = తిరుప్పేర్ నగరములో వేంచేసిన నిత్యసిద్ధుడును; తొల్ నీర్ కడల్ కిడన్ద = ఎల్లప్పుడును జలసమృద్దిచేనుండు సముద్రములో పవళించియున్నవాడును; తోళా మణి శుడరై = ఛిద్రం గావించని రత్నమువలె ప్రకాశించువాడును; ఎన్ మనత్తు మాలై = నాపై వ్యామోహముతో నాయొక్క మనస్సును వీడనివాడును;ఇడవెన్దై ఈశనై = తిరువిడవెన్దై దివ్యదేశములో వేంచేసిన సర్వేశ్వరుడును;కడల్ మల్లై మన్నుమ్ మాయవనై = తిరు కడల్ మల్లై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న ఆశ్చర్యచేష్టితములుగల స్వామియును; వానవర్ తమ్ శెన్ని మణిచ్చుడరై = నిత్యశూరులకు శిరోభూషణముగ ప్రకాశించువాడును; త్తణ్ కాల్ తిఱల్ వలియై=తిరు తణ్ కాల్ దివ్యదేశములో వేంచేసిన మహాబలశాలియును; తన్నై ప్పిఱర్ అఱియా త్తత్తువత్తై = తన కృపలేని అభక్తులు తెలుసుకొనలేని స్వరూపముగలవాడును; ముత్తినై = మంచి ముత్యమువంటివాడును; అన్నత్తై = హంసావతారము ఎత్తినవాడును; మీనై = మత్స్యావతారము ఎత్తినవాడును; అరియై = నరసింహునిగను,హయగ్రీవునిగను అవతరించినవాడును; అరు మఱైయై = సకల విద్యాస్వరూపుడును; మున్ ఇ ఉలగుణ్డ మూర్తియై = పూర్వము ఒకప్పుడు ఈ లోకములన్నింటిని మ్రింగి తన ఉదరమున నుంచుకొని రక్షించిన సర్వేశ్వరుడును; కోవలూర్ ఇడైకழி మన్నుమ్ ఎమ్ మాయవనై = తిరుకోవలూరిడైకழிలో నిత్యవాసము చేయుచున్న మాయొక్క ఆశ్చర్యచేష్టితములుగల స్వామియును; పిన్నుమ్ = మఱియు; పేయ్ అలఱ ములై యుణ్డ పిళ్ళైయై=రక్కసి పూతన బిగ్గరగ రోదించునట్లు ఆమెయొక్క స్తన్యములను ఆస్వాదించిన బాలుడును; అళ్ళల్ వాయ్ అన్నమ్ ఇఱైతేర్ అழுన్దూర్ ఎழுమ్ శుడరై = బురద ప్రదేశములందు హంసలచే ఆహారము వెదకబడుచుండు తిరు అழுన్దూర్ దివ్యదేశములో వేంచేసిన ప్రజ్వలించు జ్యోతిస్వరూపుడును; తెన్ తిల్లై చ్చిత్తరకూడత్తు ఎన్ శెల్వనై = దక్షిణదిక్కునగల తిరు తిల్లై చ్చిత్తరకూడత్తులో వేంచేసిన నాయొక్క ఐశ్వర్యవంతుడును; మిన్ని మழைతవழுమ్ వేఙ్గడత్తు ఎమ్ విత్తకనై = ధగధగ ప్రకాశించు మెరుపులతో , మేఘములు , శిఖరములపై సంచరింపబడు తిరు వేంకటాద్రిపై కృపతో వేంచేసిన మాయొక్క ఆశ్చర్యచేష్టితములు గల స్వామియును;
తిరు వల్లవాழ் దివ్యదేశములో వేంచేసిన నీళాదేవి యొక్క నాయకుడును తిరుప్పేర్ నగరములో వేంచేసిన నిత్యసిద్ధుడును ఎల్లప్పుడును జలసమృద్దిచేనుండు సముద్రములో పవళించియున్న వాడును, ఛిద్రం గావించని రత్నమువలె ప్రకాశించు వాడును, నాపై వ్యామోహముతో నాయొక్క మనస్సును వీడనివాడును, తిరువిడవెన్దై దివ్యదేశములో వేంచేసిన సర్వేశ్వరుడును, తిరు కడల్ మల్లై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న ఆశ్చర్యచేష్టితములుగల స్వామియును నిత్యశూరులకు శిరోభూషణముగ ప్రకాశించువాడును, తిరు తణ్ కాల్ దివ్యదేశములో వేంచేసిన మహాబలశాలియును, తన కృపలేని అభక్తులు తెలుసుకొనలేని స్వరూపముగలవాడును,మంచి ముత్యమువంటి వాడును, హంసావతారము ఎత్తినవాడును, మత్స్యావతారము ఎత్తినవాడును, నరసింహునిగను, హయగ్రీవునిగను అవతరించినవాడును, సకల విద్యాస్వరూపుడును; పూర్వము ఒకప్పుడు ఈ లోకములన్నింటిని మ్రింగి తన ఉదరమున నుంచుకొని రక్షించిన సర్వేశ్వరుడును, తిరుకోవలూరిడైకழிలో నిత్యవాసము చేయుచున్న మాయొక్క ఆశ్చర్య చేష్టితములుగల స్వామియును, మఱియు రక్కసి పూతన బిగ్గరగ రోదించునట్లు ఆమెయొక్క స్తన్యములను ఆస్వాదించిన బాలుడును, బురద ప్రదేశములందు హంసలచే ఆహారము వెదకబడుచుండు తిరు అழுన్దూర్ దివ్యదేశములో వేంచేసిన ప్రజ్వలించు జ్యోతిస్వరూపుడును, దక్షిణదిక్కునగల తిరు తిల్లై చ్చిత్తరకూడత్తులో వేంచేసిన నాయొక్క ఐశ్వర్యవంతుడును, ధగధగ ప్రకాశించు మెరుపులతో , మేఘములు , శిఖరములపై సంచరింపబడు తిరు వేంకటాద్రిపై కృపతో వేంచేసిన మాయొక్క ఆశ్చర్యచేష్టితములు గల స్వామియును;
మన్ననై మాలిరుఞ్జోలై మణాళనై ,
కొన్న విలుమాழிపడైయానై , కోట్టియూర్ 2874
అన్నవురువినరియై , తిరుమెయ్యత్తు
ఇన్నముతువెళ్ళత్తై ఇన్దళూర్ అన్దణనై , 2875
మన్ను మదిళ్ కచ్చి వేళుక్కై ఆళరియై ,
మన్నియ పాడగత్తు ఎమ్మైన్దనై , వెహ్ కావిల్ 2876
ఉన్నియ యోగత్తుఱక్కత్తై , ….. ……
మన్ననై = సర్వేశ్వరుడును; మాలిరుఞ్జోలై మణాళనై = తిరుమాలిరుఞ్జోలైయందు కృపతో వేంచేసిన పెండ్లికుమారుడును; కొల్ నవిలుమ్ ఆழிపడైయానై = విరోధులను సంహారము చేసెడి చక్రాయుధమును హస్తమున కలవాడును; కోట్టియూర్ = తిరు కోట్టియూర్ దివ్యదేశములో; అన్న ఉరువిన్ అరియై = అద్వితీయమైన స్వరూపముగల నరసింహమూర్తియును; తిరుమెయ్యత్తు = తిరు మెయ్యమ్ కొండపై; ఇన్న అముదు వెళ్ళత్తై = మధురమైన అమృతప్రవాహమువలె పరమ భోగ్యుడును; ఇందలూర్ అన్దణనై = తిరువిందలూర్ దివ్యదేశములో వేంచేసిన కరుణామయుడును; మన్ను మదిళ్ కచ్చి = దృఢమైన ప్రాకారములుగల కాంచీపురములో; వేళుక్కై ఆళరియై = తిరు వేళుక్కై దివ్యదేశమందున్న నరసింహుడును; పాడగత్తు మన్నియ ఎమ్ మైన్దనై = తిరు పాడగమందు నిత్యవాసము చేయుచున్న మనయొక్క నిత్యయౌవనుడును; వెహ్ కావిల్ = తిరువెహ్ కావిల్ దివ్యదేశమందు ; ఉన్నియ యోగత్తు ఉఱక్కత్తై = జాగరూకతతో కూడిన యోగనిద్రయందు యున్నవాడును;
సర్వేశ్వరుడును, తిరుమాలిరుఞ్జోలైయందు కృపతో వేంచేసిన పెండ్లికుమారుడును, విరోధులను సంహారము చేసెడి చక్రాయుధమును హస్తమున కలవాడును, తిరు కోట్టియూర్ దివ్యదేశములో అద్వితీయమైన స్వరూపముగల నరసింహమూర్తియును, తిరు మెయ్యమ్ కొండపై మధురమైన అమృతప్రవాహమువలె పరమ భోగ్యుడును, తిరువిందలూర్ దివ్యదేశములో వేంచేసిన కరుణామయుడును, దృఢమైన ప్రాకారములుగల కాంచీపురములో తిరు వేళుక్కై దివ్యదేశమందున్న నరసింహుడును ,తిరు పాడగమందు నిత్యవాసము చేయుచున్న మనయొక్క నిత్యయౌవనుడును, తిరువెహ్ కావిల్ దివ్యదేశమందు,జాగరూకతతో కూడిన యోగనిద్రయందు యున్నవాడును;
……. ……… ………… , ఊరకత్తుళ్
అన్నవనై అట్టపుయకరుత్తు ఎమ్మానేర్ట్రై , 2877
ఎన్నై మనఙ్గవర్ న్ద ఈశనై , వానవర్ తమ్
మున్నవనై మూழிక్కళత్తు విళక్కినై , 2878
అన్నవనై ఆదనూర్ ఆణ్డు అళక్కుమ్ ఐయనై ,
నెన్నలై యిన్ఱి నైనాళయై , నీర్మలై మేల్ 2879
మన్ను మఱై నాన్గుమ్ ఆనానై , పుల్లాణి
తెన్నన్ తమిழை వడమొழிయై ,నాఙ్గూరిల్ 2880
మన్ను మణిమాడక్కోయిల్ మణాళనై ,
నల్ నీర్ త్తలైచ్చఙ్గ నాణ్మదియై , నాన్ వణఙ్గుమ్ 2881
కణ్ణనై క్కణ్ణపురత్తానై , తెన్నఱైయూర్
మన్ను మణిమాడక్కోయిల్మణాళనై , 2882
కల్ నవిల్ తోళ్ కాళైయై కణ్డు ఆఙ్గు క్కైతొழுదు ,
ఎన్నిలైమై యెల్లామ్ అఱివిత్తాల్ ఎమ్బెరుమాన్ , 2883
తన్ అరుళుమ్ ఆకముమ్ తారానేల్ , తన్నై నాన్
మిన్ ఇడైయార్ శేరియిలుమ్ వేదియర్ గళ్ వాழ் విడత్తుమ్ , 2884
తన్నడియార్ మున్బుమ్ తరణి ముழுతాళుమ్ ,
కొల్ నవిలుమ్ వెల్ వేన్దర్ కూట్టత్తుమ్ నాట్టకత్తుమ్ , 2885
తన్నిలైమై యెల్లామ్ అఱివిప్పన్ , …….. …
ఊరకత్తుళ్ అన్నవనై=తిరువూరకత్తు దివ్యదేశములో వేంచేసిన విలక్షణస్వరూపుడును; అట్టపుయకరుత్తు ఎమ్మాన్ ఏర్ట్రై = అట్టపుయకరుత్తు దివ్యదేశమందు నా స్వామి శిఖామణియు; ఎన్నై మనమ్ కవర్ న్ద ఈశనై=నాయొక్క మనస్సును వశపరుచుకొనిన ప్రభువును; వానవర్ తమ్ మున్నవనై = దేవతలందరకిని ఆదిదేవుడును;మూழிక్కళత్తు విళక్కినై = తిరు మూழிక్కళమ్ దివ్యదేశములో ప్రకాశించుచున్నవాడును; అన్నవనై = ఇటువంటివాడు అని చెప్పశఖ్యముకానివాడును; ఆదనూర్ ఆణ్డు అళక్కుమ్ ఐయనై = తిరు అదనూర్ దివ్యదేశములో సకల కాలములకు నిర్వాహకుడగు స్వామియును; నెన్నలై యిన్ఱినై నాళయై = నిన్నటిదినము,నేటిదినము,రేపటిదినము అను చెప్పబడు మూడుకాలములకు ప్రవర్తుకుడును;నీర్మలై మేల్ మన్నుమ్=తిరు నీర్మలై దివ్యదేశములో నిత్యవాసము చేయు;మఱై నాన్గుమ్ ఆనానై = చతుర్వేద స్వరూపుడును; పుల్లాణి = తిరు పుల్లాణి దివ్యదేశములో వేంచేసినవాడును; తెన్నన్ తమిழை వడమొழிయై = ద్రావిడవేదము,సంస్కృతవేదము అను ఉభయ వేద ప్రతిపాద్యుడును; నాఙ్గూరిల్ = తిరు నాఙ్గూర్ ప్రాంతములోనున్న; మణిమాడక్కోయిల్ మన్ను మణాళనై = తిరు మణిమాడక్కోయిల్ దివ్యదేశములో వేంచేసిన పెండ్లికుమారుడును; నల్ నీర్ త్తలైచ్చఙ్గ నాణ్మదియై = మంచి నీటిచే చుట్టబడిన తలైచ్చఙ్గ దివ్యదేశములో వేంచేసిన నాన్మదీయన్ సర్వేశ్వరుడును;నాన్ వణఙ్గుమ్ కణ్ణనై=నేను సేవించు కృష్ణుడును;క్కణ్ణపురత్తానై=తిరుక్కణ్ణపురములో వేంచేసినవాడును; తెన్ నఱైయూర్ మన్ను మణిమాడక్కోయిల్ మణాళనై=తిరునఱైయూర్ మణిమాడక్కోయిల్ అని ప్రసిద్దిచెందిన సన్నిధిలో కృపతో వేంచేసిన పెండ్లికుమారుడును;కల్ నవిల్ తోళ్ కాళైయై= పర్వతమని చెప్పదగిన భుజములుగల యౌవనుడును; ఆఙ్గు కణ్డు క్కైతొழுదు = ఆ దివ్యదేశములందు దర్శించుకొనుచు సేవించి; ఎన్నిలైమై యెల్లామ్ అఱివిత్తాల్ = నాయొక్క పరిస్థితిని అంతయు విన్నవించుకొన్నప్పుడు;(అది విని), ఎమ్ పెరుమాన్= ఆ సర్వేశ్వరుడు; తన్ అరుళుమ్ ఆకముమ్ తారానేల్ = తనయొక్క పరమకృపను; దివ్య వక్షస్థలమును నాకు ఒసగనిచో;నాన్=(అతని చేష్టితములన్నియు తెలిసిన)నేను; మిన్ ఇడైయార్ శేర్ ఇయిలుమ్ = మెరుపువలె సన్నని నడుముగల స్త్రీల గుంపులలోను; వేదియర్ గళ్ వాழ் ఇడత్తుమ్ = వేదోత్తములు నివసించుచున్న స్థలములందును; తన్నడియార్ మున్బుమ్ = అతని భక్తుల ముందటను; తరణి ముழுదు ఆళుమ్ కొల్ నవిలుమ్ వెల్ వేన్దర్ కూట్టత్తుమ్ = భూమండలమంతయు పాలించు వారెదుటను, క్రూరమైన ఆయుధములు ధరించు రాజుల సభలలోను; నాడు అగత్తుమ్=ఇతరములైన దేశములంతటను;తన్ నిలమై ఎల్లామ్ అఱివిప్పన్= ఆ సర్వేశ్వరుడు సలుపు కృత్యముల స్వభావమంతయు ప్రకాశింపజేయుదును;
తిరువూరకత్తు దివ్యదేశములో వేంచేసిన విలక్షణస్వరూపుడును, అట్టపుయకరుత్తు దివ్యదేశమందు నా స్వామి శిఖామణియు, నాయొక్క మనస్సును వశపరుచుకొనిన ప్రభువును, దేవతలందరకిని ఆదిదేవుడును, తిరు మూழிక్కళమ్ దివ్యదేశములో ప్రకాశించుచున్నవాడును, ఇటువంటివాడు అని చెప్ప శఖ్యము కాని వాడును, తిరు అదనూర్ దివ్యదేశములో సకల కాలములకు నిర్వాహకుడగు స్వామియును, నిన్నటిదినము, నేటిదినము, రేపటిదినము అను చెప్పబడు మూడు కాలములకు ప్రవర్తుకుడును, తిరు నీర్మలై దివ్యదేశములో నిత్యవాసము చేయు చతుర్వేద స్వరూపుడును, తిరు పుల్లాణి దివ్యదేశములో వేంచేసినవాడును, ద్రావిడవేదము, సంస్కృతవేదము అను ఉభయ వేద ప్రతిపాద్యుడును, తిరు నాఙ్గూర్ ప్రాంతములోనున్న తిరు మణిమాడక్కోయిల్ దివ్యదేశములో వేంచేసిన పెండ్లికుమారుడును, మంచి నీటిచే చుట్టబడిన తలైచ్చఙ్గ దివ్యదేశములో వేంచేసిన నాన్మదీయన్ సర్వేశ్వరుడును, నేను సేవించు కృష్ణుడును, తిరుక్కణ్ణపురములో వేంచేసినవాడును,తిరునఱైయూర్ మణిమాడ క్కోయిల్ అని ప్రసిద్దిచెందిన సన్నిధిలో కృపతో వేంచేసిన పెండ్లికుమారుడును, పర్వతమని చెప్పదగిన భుజములుగల యౌవనుడును, ఆ దివ్యదేశములందు దర్శించు కొనుచు సేవించి నాయొక్క పరిస్థితిని అంతయు విన్నవించుకొన్నప్పుడు(అది విని), ఆ సర్వేశ్వరుడు తనయొక్క పరమకృపను దివ్య వక్షస్థలమును నాకు ఒసగనిచో(అతని చేష్టితములన్నియు తెలిసిన) నేను మెరుపువలె సన్నని నడుముగల స్త్రీల గుంపులలోను, వేదోత్తములు నివసించుచున్న స్థలములందును, అతని భక్తుల ముందటను, భూమండలమంతయు పాలించు వారెదుటను, క్రూరమైన ఆయుధములు ధరించు రాజుల సభలలోను, ఇతరములైన దేశములంతటను, ఆ సర్వేశ్వరుడు సలుపు కృత్యముల స్వభావమంతయు ప్రకాశింపజేయుదును;
………. ……… …….. , తాన్ ముననాళ్
మిన్నిడై యాయ్ చ్చియర్ తమ్ శేరి క్కళవిన్ కణ్, 2886
తున్ను పడల్ తిఱన్దు పుక్కు , తయిర్ వెణ్ణెయ్
తన్ వయిఱార విழுఙ్గ , కొழுఙ్గయర్కణ్ 2887
మన్ను మడవోర్ గళ్ పర్ట్రి ఓర్ వాన్ కయిర్ట్రాల్ ,
పిన్నుమ్ ఉరలోడు కట్టుణ్డ పెర్ట్రిమైయుమ్ , 2888
అన్నదు ఓర్ బూతమాయ్ ఆయర్ విழవిన్ కణ్ ,
తున్ను శకడత్తాల్ పుక్క పెరుఞ్జోర్ట్రై , 2889
మున్నిరున్దు ముర్ట్ర త్తాన్ తుర్ట్రియ తెర్ట్రెనవుమ్,
మన్నర్ పెరుమ్ శవైయుళ్ వాழ்వేన్దర్ తూదనాయ్, 2890
తన్నై యిగழ்న్దు ఉరైప్ప త్తాన్ ముననాళ్ శెన్ఱదువుమ్,
మన్ను పఱై కరఙ్గ మఙ్గైయర్ తమ్ కణ్ కళిప్ప, 2891
కొల్ నవిలుమ్ కూత్తనాయ్ ప్పేర్తుమ్ కుడమాడి ,
ఎన్ ఇవన్ ఎన్నప్పడుకిన్ఱ ఈడఱవుమ్ , 2892
తాన్=ఆ సర్వేశ్వరుడు; ముననాళ్ = పూర్వము ఒకప్పుడు (కృష్ణావతారమందు); మిన్నిడై ఆయ్ చ్చియర్ తమ్ శేరి = మెరుపువలె సన్నని నడుముగల గొల్లస్త్రీలు నివసించు పల్లెలలో;తున్ను పడల్ తిఱన్దు = దట్టముగ తాటాకులచే అల్లిన తలుపులను తెరిచి; కళవిన్ కణ్ పుక్కు = దొంగతనముగ ప్రవేశించి; తయిర్ వెణ్ణెయ్ = పెరుగు, వెన్నను; తన్ వయిఱార విழுఙ్గ = తన కడుపునిండ ఆరగింప; కొழு కయల్ కణ్ మన్ను మడవోర్ గళ్ = మంచి కయల్ మీనములవలె కన్నులుగల ఆ గోపస్త్రీలు;పర్ట్రి=అతనిని పట్టుకొని;ఓర్ వాన్ కయిర్ట్రాల్ = ఒక అందమైన చిన్న తాడుతో; ఉరలోడు = రోకలికి చేర్చి; కట్టుణ్డ పెర్ట్రిమైయుమ్ = కదలనీయక కట్టినారనెడి గొప్పవిషయమును; ఆయర్ విழవిన్ కణ్ = గోకులవాసులు (ఇంద్రునికై ) ఆరాధనచేయు ఉత్సవములో; తున్నుశకడత్తాల్ పుక్క పెరు శోర్ట్రై = అనేక బండ్లలో తీసుకునివచ్చి చేరవేసిన చాల భోజన పదార్థములను; అన్నదు ఓర్ బూతమాయ్= వర్ణింపశఖ్యము కాని ఒక పెద్ద భూతమయి; మున్నిరున్దు ముర్ట్ర త్తాన్ తుర్ట్రియ తెర్ట్రెనవుమ్ = తన ముంగిటనున్న ఆహార పదార్ధములంతను కొంచెమైనను మిగలకుండా తానొక్కడే ఆరగించిన ఒక వింతయును; మున నాళ్ = పూర్వము ఒకప్పుడు; వాழ்వేన్దర్ తూదనాయ్ = పాండవుల దూతగ; తన్నై యిగழ்న్దు ఉరైప్ప = తనను అందరు దూషించునట్లు; మన్నర్ పెరుమ్ శవైయుళ్ శెన్ఱదువుమ్ = (దుర్యోదనాదులు) మహారాజులుగల సభకు పోవుటయు; మఙ్గైయర్ తమ్ కణ్ కళిప్ప = (గోకులమందలి) కన్నెల కన్నులు సంతోషించునట్లు; మన్ను పఱై కరఙ్గ = నడుముకు కట్టుకున్న పఱైవాద్యము శబ్దించుచుండగ; కొల్ నవిలుమ్ కూత్తనాయ్ =(ఆ కన్నెలు)ఆనందముతో జీవించలేని విధముగ నృత్యము చేయుటయు; ప్పేర్తుమ్ = దానికి పైన; కుడమాడి=కుండలను పైకెగరవేయుచు నృత్యముచేసి;ఎన్ ఇవన్ ఎన్నప్పడుకిన్ఱ ఈడఱవుమ్ =” ఎవరైనా ఈ విధముగ నృత్యము చేయువారు ఉండుదురో!” అనునట్లు పేరు పొందుటయు;
ఆ సర్వేశ్వరుడుపూర్వము ఒకప్పుడు (కృష్ణావతారమందు) మెరుపువలె సన్నని నడుముగల గొల్లస్త్రీలు నివసించు పల్లెలలో దట్టముగ తాటాకులచే అల్లిన తలుపులను తెరిచి దొంగతనముగ ప్రవేశించిపెరుగు, వెన్నను తన కడుపునిండ ఆరగింప, మంచి కయల్ మీనములవలె కన్నులుగల ఆ గోపస్త్రీలు అతనిని పట్టుకొని ఒక అందమైన చిన్నతాడుతో; రోకలికి చేర్చి కదలనీయక కట్టినారనెడి గొప్పవిషయమును, గోకులవాసులు (ఇంద్రునికై ) ఆరాధనచేయు ఉత్సవములో అనేక బండ్లలో తీసుకునివచ్చి చేరవేసిన చాల భోజన పదార్థములను వర్ణింపశఖ్యము కాని ఒక పెద్ద భూతమయి తన ముంగిట నున్న ఆహార పదార్ధములంతను కొంచెమైనను మిగలకుండా తానొక్కడే ఆరగించిన ఒక వింతయును, పూర్వము ఒకప్పుడు పాండవుల దూతగ తనను అందరు దూషించునట్లు = (దుర్యోదనాదులు) మహారాజులుగల సభకు పోవుటయు, (గోకులమందలి) కన్నెల కన్నులు సంతోషించునట్లు నడుముకు కట్టుకున్న పఱైవాద్యము శబ్దించుచుండగ (ఆ కన్నెలు) ఆనందముతో జీవించలేని విధముగ నృత్యము చేయుటయు, దానికి పైన కుండలను పైకెగరవేయుచు నృత్యముచేసి”ఎవరైనా ఈ విధముగ నృత్యముచేయువారు ఉండుదురో!” అనునట్లు పేరు పొందుటయు;
తెన్నిలఙ్గైయాట్టి యరక్కర్ కులప్పావై ,
మన్ననిరావణన్ తన్ నల్ తఙ్గై , వాళెయుర్ట్రు 2893
తున్ను శుడు శినత్తు చ్చూర్పణకా చ్చోర్వెయిది ,
పొన్నిఱఙ్గొణ్డు పులర్ న్దెழுన్ద కామత్తాల్ , 2894
తన్నై నయన్దాళై త్తాన్ మునిన్దు మూక్కరిన్దు
మన్నియ తిణ్ణెనవుమ్, ……. …………. 2895
తెన్నిలఙ్గైయాట్టి=దక్షిణ లంకాపురికి నాయకరాలును; అరక్కర్ కులప్పావై = రాక్షస కులమందు పుట్టిన ప్రసిద్ధమైన రాక్షసస్త్రీ యును; మన్నన్ ఇరావణన్ తన్ నల్ తఙ్గై= లంకాపురికి ప్రభువైన రావణాసురుని యొక్క ప్రియమైన చెల్లెలును; వాళ్ ఎయుర్ట్రు= వాడియైన కత్తివలెనుండు పళ్ళు గలదియు;తున్ను శుడుశినత్తు= ఎప్పుడును (ఎదుటవారిపై) నిప్పులుగ్రక్కుచూ కోపముతో నుండునదియు;శూర్పణకా = శూర్పణఖ అను ఆమె;పులర్ న్దు ఎழுన్ద కామత్తాల్=అధికమైన కామముచే;పొన్ నిఱమ్ కొణ్డు=వివర్ణరాలై; శోర్వు ఎయ్ ది =పరవశించి;తన్నై నయన్దాళై=తనను ఆశించిన ఆరక్కసిని; తాన్ మునిన్దు= తాను కోపగించి; మూక్కు అరిన్దు = ఆ రక్కసి ముక్కును కోసి; మన్నియ తిణ్ణెనవుమ్ = ఇదియే ఒక ప్రతిష్టాత్మకమని తలచియుండుటయు;
దక్షిణ లంకాపురికి నాయకరాలును రాక్షసకులమందు పుట్టిన ప్రసిద్ధమైన రాక్షసస్త్రీ యును లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క ప్రియమైన చెల్లెలును వాడియైన కత్తివలెనుండు పళ్ళు గలదియు, ఎప్పుడును(ఎదుటవారిపై) నిప్పులుగ్రక్కుచూ కోపముతో నుండునదియు, శూర్పణక అను ఆమె అధికమైన కామముచే వివర్ణరాలై పరవశించి తనను ఆశించిన ఆరక్కసిని తాను కోపగించి ఆ రక్కసి ముక్కును కోసిన చర్య, ఇదియే ఒక ప్రతిష్టాత్మకమని తలచియుండుటయు;
…… ……. …….., వాయ్ త్త మలై పోలుమ్ ,
తన్ నిగరొన్ఱిల్లాద తాడకైయై , మామునిక్కా
తెన్నులగమేర్ట్రువిత్త తిణ్డిఱలుమ్ , మర్ట్రివైదాన్ 2896
ఉన్నియులవా వులగఱియ వూర్వన్ నాన్ ,
మున్నిముళైత్తు ఎழுన్దు ఓఙ్గి యొళిపరన్ద , 2897
మన్నియ పూమ్ పెణ్ణై మడల్ ll 2897 ½
వాయ్ త్త మలై పోలుమ్ = పెద్ద పర్వతము పోలిన ఆకారముగలదియు;తన్ నిగర్ ఒన్ఱు ఇల్లాద = (క్రూరత్వములో) తనకు సాటిలేక ఒప్పుచున్నదియు; తాడకైయై = తాటకి అను రక్కసిని; మా మునిక్కా = గొప్ప మునీశ్వరుడైన విశ్వామిత్రునకై; తెన్ను ఉలగమ్ ఏర్ట్రు విత్త = యమలోకమునకు చేరవేసిన; తిణ్ తిఱలుమ్ = ఆ గొప్ప పరాక్రమమును; మర్ట్రు ఇవై దాన్ = ఈ విధమైన పెక్కు చేష్టితములను; ఉన్ని ఉలవా = విపులముగ ఆలోచనచేయని విషయములను; ఉలగు అఱియ = లోకములోని జనులు తెలుసుకొను విధముగా; నాన్ = నేను( పరకాలనాయకి); మున్ని = అందరి ముంగిట; ముళైత్తు ఎழுన్దు ఓఙ్గి యొళిపరన్ద మన్నియ పూమ్ పెణ్ణై మడల్ = బాగుగ మొలచి పైకి ఎదిగిన ప్రకాశించు దృఢమైన అందమైన తాటాకులతో మడల్ ప్రక్రియ చేపట్టెదను.
పెద్ద పర్వతము పోలిన ఆకారముగలదియు (క్రూరత్వములో) తనకు సాటిలేక ఒప్పుచున్నదియు,తాటకి అను రక్కసిని గొప్ప మునీశ్వరుడైన విశ్వామిత్రునకై యమలోకమునకు చేరవేసిన, ఆ గొప్ప పరాక్రమమును, ఈ విధమైన పెక్కు చేష్టితములను విపులముగ ఆలోచనచేయని విషయములను లోకములోని జనులు తెలుసుకొను విధముగా నేను( పరకాలనాయకి) అందరి ముంగిట, బాగుగ మొలచి పైకి ఎదిగిన ప్రకాశించు దృఢమైన అందమైన తాటాకులతో మడల్ ప్రక్రియ చేపట్టెదను.
(కంబరు కవిగారు రచించిన పాశురమును ఈ ప్రభంధమునకు చేర్చి భక్తులుపాడుదురు)
ఎన్నిలైమైయెల్లామ్ అఱివిత్తాల్ ఎమ్బెరుమాన్ ,
తన్నరుళుమ్ ఆకముమ్ తారానేల్ , పిన్నైపోయ్
ఒణ్డురై నీర్వేలై యులగఱియ వూర్వన్ నాన్ ,
వణ్డరై పూమ్ పెణ్ణై మడల్ .
ఎన్ నిలైమై ఎల్లామ్ = నాయొక్క అవస్థలు అంతయు; అఱివిత్తాల్ = తెలియజేసిన పిదప; ఎమ్బెరుమాన్=నాయొక్క సర్వేశ్వరుడు;తన్ అరుళుమ్=తనయొక్క కృపయు;ఆగముమ్ = దివ్యమైన వక్షస్థలమును; తారానేల్ = (నాకు) ఒసగనిచో; పిన్నై పోయ్ = అటుపిమ్మట (నేను)పోయి;ఒణ్డురై నీర్ వేలై ఉలగఱియ=సముద్రముచే చుట్టుకొనియున్నఈ భూమండలమందు సిరిసంపదలుగల ప్రదేశములందు నివసించు జనులు తెలుసుకొను విధముగా; నాన్=నేను; వణ్డరై పూమ్ పెణ్ణై మడల్ ఊర్వన్=తుమ్మెదల ఝంకారములు చేయు అందమైన తాటాకులతో మడల్ ప్రక్రియ చేసెదను.
నాయొక్క అవస్థలు అంతయు తెలియజేసిన పిదప నాయొక్క సర్వేశ్వరుడు తనయొక్క కృపయు దివ్యమైన వక్షస్థలమును (నాకు) ఒసగనిచో అటుపిమ్మట (నేను) పోయి సముద్రముచే చుట్టుకొనియున్నఈ భూమండలమందు సిరిసంపదలుగల ప్రదేశములందు నివసించు జనులు తెలుసుకొను విధముగా నేను తుమ్మెదల ఝంకారములుచేయు అందమైన తాటాకులతో మడల్ ప్రక్రియ చేసెదను.
తిరుమఙ్గై ఆళ్వార్ తిరువడిగళే శరణం
*************