శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
అవతారిక :-
శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపచే తిరుమంత్రముపదేశము పొందిన తిరుమంగై ఆళ్వార్ మిక్కిలి భక్తిపారవశ్యముతో 86 దివ్యదేశములను దర్శించి 1084 పాశురములతో మంగళాశాసనము చేసిరి. అదియే మొదటి ప్రబంధమైన పెరియతిరుమొழி. సంసారబంధ విముక్తికై శ్రీమన్నారాయణుని వేడుకొనుచు ,సర్వేశ్వరుని రక్షకత్వమును, భక్తవాత్సల్యము మొదలగు కళ్యాణగుణములను రెండవ ప్రబంధమైన తిరుక్కుఱున్దాడకమ్ ద్వారా ప్రస్తుతించిరి. తిరుమంగై ఆళ్వార్ పరమభక్తి ప్రాప్తికై తిరుక్కుడందై దివ్యదేశములో కృపతో వేంచేసిన ఆరావముదు పెరుమాళ్ దివ్యచరణారవిందములందు తిరువెழுకూర్ట్రిరుక్కై యను మూడవప్రబంధము ద్వారా శరణాగతి చేసిరి. తనను ఉపేక్షించుచున్న నీలమేఘశ్యాముడైన శ్రీమన్నారాయణుని దివ్య కల్యాణ గుణములందు నిరంతరము పరవశించి ధ్యానించుచున్న తిరుమంగై ఆళ్వార్ అనన్యశేషత్వము , అనన్యశరణత్వము , అనన్యభోగత్వము గుణములచే పూర్ణత్వము కలిగిన కారణముచే పరకాలనాయకి అను యువతి అవస్ధను పొంది, విరహమందు మిక్కిలి తపించుచు, సర్వేశ్వరుని త్వరితముగ పొందవలెనని మిక్కిలి ఆశతో ” మడల్ ” అను ప్రక్రియ ఉపక్రమించు స్ధితిలో వెలువరించిన 115 చరణములు కలిగిన నాల్గవ ప్రభంధము ఈ ” శిరియతిరుమడల్ “.
(తమిళ భాషలో ” మడల్ ” అనగా తాటాకుకాండము. ఒక యువకుడు తను గాఢముగ ప్రేమించిన స్త్రీచే ఉపేక్షింపబడి ఆ విరహమును భరించలేక ఆమెను పొందుటకై తన శరీరమంతను బూడిద రాసుకొని, ఆమె చిత్రమును తీసుకొని, తాటాకులతోను, దాని కాండములతోను ఒక అశ్వమును చేసి, దానిపై ఎక్కి, వీధులలో మిత్రులు, బంధువులు ఎదుట ఆమె పేరును అరుచుకొనుచు, నిందించుచు, అపహాస్యము చేయుచు, కించపరచుచు, తనను బాదుకొనుచు, ఆమె దక్కనిచో మరణించెదననియు ఇట్లు అనేక విధములుగ ప్రయత్నములు చేసి ఎట్టకేలకు బంధువుల ద్వారా ఆమెను ఒప్పించి వివాహమాడుటను మడల్ ప్రక్రియ అందురు.)
తనియన్
పిళ్ళై తిరునఱైయూరరయర్ అనుగ్రహించినది
ముళ్ళిచ్చెழு మలరో l తారాన్ ముళై మతియమ్ l
కొళ్ళిక్కు ఎన్ ఉళ్ళమ్ కొతియామే l వళ్ళల్
తిరువాళన్ శీర్ క్కలియన్ l కార్ క్కలియైవెట్టి l
మరువాళన్ తన్దాన్ మడల్ ll
ముళ్ళిచ్చెழு మలరో తారాన్ = సాటిలేని అందమైన మల్లి పువ్వుల మాలను ధరించిన వారును; వళ్ళల్ = మిక్కిలి ఔదార్యము కలిగినవారును; తిరువాళన్ = శ్రీమన్నారాయణుని చరణారవిందములందు చేయు కైంకర్యమను అత్యున్నతమైన సంపదకలవారును; మరువాళన్ = వాడియైన కత్తి హస్తమందు కలవారును; శీర్ కలియన్ = కల్యాణ గుణములు గల తిరుమంగై ఆళ్వార్; ముళై మదియమ్ కొళ్ళిక్కు = (సర్వేశ్వరుని నుండి దూరమైన కారణముగ ) ఉదయించుచున్న చంద్రుడనే అందమైన అగ్నిచే ; ఎన్ ఉళ్ళమ్ = నాయొక్క హృదయము;కొతియామే = వ్యధ పొందనీయకుండ; కార్ కలియై వెట్టి = నల్లని(అఙ్ఞానము కలిగించు) కలిపురుషుని దోషములను పోగొట్టి, మడల్ తన్దాన్ =”శిఱియతిరుమడల్” అను దివ్యప్రబంధమును(ఆ సర్వేశ్వరుని దివ్య చరణములను శీఘ్రముగా పొందుటకు) ప్రసాదించిరి.
మల్లి పువ్వుల మాలను ధరించిన వారును, మిక్కిలి ఔదార్యము కలిగినవారును, వైష్ణవ శ్రీ సంపత్తు గలవారును, వాడియైన కత్తి హస్తమందు కలవారును, కల్యాణ గుణములుగల తిరుమంగై ఆళ్వార్, సర్వేశ్వరునినుండి దూరమైన నాయొక్క మనస్సు వ్యధ పొందనీయకుండ కలిదోషములను పోగొట్టి “శిఱియతిరుమడల్” అను దివ్యప్రభంధమును ఆ సర్వేశ్వరుని దివ్య చరణములను శీఘ్రముగా పొందుటకు ప్రసాదించిరి.
*****
** కారార్ వరై క్కొఙ్గై l కణ్ణార్ కడలుడుక్కై l ,
శీరార్ శుడర్ శుట్టి l శెమ్ కలుழி ప్పేరార్ట్రు l, 2673
ప్పేరార మార్విల్ l పెరుమామழைక్కూన్దల్ l ,
నీరారవేలి l నిలమఙ్గై యెన్ఱుమ్ l , ఇ 2674
ప్పారోర్ శొలప్పట్ట మూన్ఱన్ఱే l ,** అమ్మూన్ఱుమ్
ఆరాయిల్ తానే l అఱమ్బొరుళిన్బ మెన్ఱు l , 2675
ఆరార్ ఇవర్ట్రిన్ l ఇడైయతనై యెయుతువార్ l ,
శీరార్ l ఇరు కలైయుమ్ ఎయ్ తువర్ l ,శిక్కెనమర్ట్రు 2676
ఆరానుమ్ ఉణ్డెన్బార్ ఎన్బతు తానతువుమ్ ,
ఓరామైయన్ఱే యులగత్తార్ శొల్లుమ్ శొల్ , 2677
ఓరామైయామాఱు l అతు వురైక్కేన్ కేళామే l ,
కారార్ పురవి l యేழ் పూణ్డ తని యాழி l , 2678
తేరార్ నిఱై కదిరోన్ l మణ్డలత్తై కీణ్డు పుక్కు l ,
ఆరావముతమ్ l అఙ్గెయ్ తి l , అతిల్ నిన్ఱుమ్ 2679
వారాతొழிవతొన్ఱుణ్డే l , అతునిఱ్క l
ఏరార్ముయల్విట్టు l కాక్కైప్పిన్ పోవదే l , 2680
ఏరారిళములైయీర్ l ఎన్దనక్కు ఉర్ట్రుదుదాన్ l,
కారార్కుழలెడుత్తుక్కట్టి l , కదిర్ములయై 2681
వారార వీక్కి l మణి మేకలై తిరుత్తి l ,
ఆరార్ అయిల్ వేల్ కణ్ l అఞ్జనత్తిన్ నీఱు అణిన్దు l, 2682
శీరార్ శెழுమ్ పన్దు l కొణ్డు ఆడియా నిన్ఱేన్ నాన్ l,
నీరార్ కమలమ్బోల్ l శెఙ్గణ్మాలెన్ఱొరువన్ l, 2683
పారోర్ గళెల్లామ్ l మగిழ ప్పఱైకఱఙ్గ l,
శీరార్ కుడమ్ ఇరణ్డేన్ది l, శెழுన్దెరువే 2684
ఆరారెనచ్చొల్లి l ఆడుమదుకణ్డు l,
ఏరారిళములైయార్ l ఎన్నైయరుమెల్లారుం l, 2685
వారాయో వెన్ఱార్ క్కు l చ్చెన్ఱేన్ ఎన్వల్వినైయాల్ l
కారార్ మణి నిఱముమ్ l కైవళైయుమ్ కాణేన్ నాన్l, 2686
ఆరానుమ్l శొల్లిర్ట్రుమ్ కొళ్ళేన్ l , అఱివழிన్దు
తీరా వుడమ్బొడు l పేతురువేన్ కణ్డిరఙ్గి l , 2687
ఎరార్ కిళిక్కిళవి l యెమ్మనై తాన్ వన్దెన్నై l ,
శీరార్ l శెழுమ్ పుழுది క్కాప్పిట్టు l , శెమ్ కుఱిఞ్జి 2688
తారార్ l నఱు మాలై చ్చాత్తఱ్కు l, తాన్ పిన్నుమ్
నేరాదన l ఒన్ఱు నేర్ న్దాల్ l ,అదనాలుమ్ 2689
తీరాదు ఎన్ శిన్దైనోయ్ l తీరాదెన్ పేదుఱవు l ,
వారాదుమామై l యదుకణ్డుమర్ట్రాఙ్గే l , 2690
ఆరానుమ్ మూదఱియుమ్ l అమ్మనైమార్ శొల్లువార్ l ,
పారోర్ శొలప్పడుమ్ l కట్టుప్పడుత్తిరేల్ l, 2691
ఆరానుమ్ l మెయ్ ప్పడువనెన్ఱార్ l , అదుకేట్టు
క్కారార్ కుழల్ కొణ్డై l కట్టువిచ్చి కట్టేఱి l , 2692
శీరార్ శుళకిల్ l శిల నెల్ పిడిత్తు ఎఱియా l ,
వేరా వితిర్వితిరా l మెయ్ శిలిరాక్కైమోవా l , 2693
పేరాయిరముడైయాన్ l ఎన్ఱాళ్ l , పేర్తేయుమ్ l
కారార్ తిరుమేని కాట్టినాళ్ l , కైయతువుమ్ 2694
శీరార్ l వలమ్బురియే యెన్ఱాళ్ l , తిరుత్తుழாయ్
త్తారార్ నఱుమాలై l కట్టురైత్తాళ్ కట్టురైయా l , 2695
నీరేదుమ్ అఞ్జేల్ మిన్ l నుమ్మగళై నోయ్ శెయ్ దాన్ l ,
ఆరానుమల్లన్ l అఱిన్దేన్ అవనైనాన్ l , 2696
కూరార్వేల్ కణ్ణీర్ l ఉమక్కఱియ క్కూఱుగేనో l ,
ఆరాల్ ఇవ్వైయమ్ l అడియళప్పుణ్డదుదాన్ l , 2697
ఆరాల్ ఇలఙ్గై l పొడిపొడియా వీழ்న్దదు l , మర్ట్రు
ఆరాలే l కల్ మారి కాత్తదుదాన్ l , ఆழிనీర్ 2698
ఆరాల్ l కడైన్దిడప్పట్టదు l , అవన్ కాణ్మిన్
ఊర్ ఆనిరై మేయ్ త్తు l ఉలగెల్లాముణ్డుమిழ்న్దుమ్ l, 2699
ఆరాద తన్మైయనాయ్ l ఆఙ్గు ఒరునాళాయ్ ప్పాడి l ,
శీరార్ కలై యల్ గుల్ l శెమ్ తువర్ వాయ్ l , 2700
వారార్ వనములైయాళ్ l మత్తు ఆర ప్పర్ట్రిక్కొణ్డు l,
ఏరార్ ఇడై నోవ l ఎత్తనైయోర్ పోదుమాయ్ l , 2701
శీరార్ తయిర్ కడైన్దు l వెణ్ణెయ్ తిరణ్డదనై l ,
వేరార్ నుదల్ మడవాళ్ l వేఱోర్ కలత్తిట్టు l , 2702
నారార్ ఉఱి యేర్ట్రి l నన్గమైయ వైత్తదనై l,
పోరార్ వేల్ కణ్ మడవాళ్ l పోన్దనైయుమ్ పొయ్యుఱక్కమ్ l 2703
ఓరాదవన్ పోల్ l ఉఱఙ్గి యఱివుర్ట్రు l ,
తారార్ తడన్దోళ్ గళ్ l ఉళ్ళళవుం కైనీట్టి l , 2704
ఆరాద వెణ్ణెయ్ l విழுఙ్గి l అరుగిరిన్ద
మోరార్ కుడమ్ ఉరుట్టి l మున్ కిడన్ద తానత్తే l , 2705
ఓరాదవన్ పోల్ l కిడన్దానై కణ్డవళుమ్ l ,
వారాత్తాన్ l వైత్తదు కాణాల్ l , వయిఱడిత్తిఙ్గు 2706
ఆరార్ పుగుదువార్ l ఐవర్ ఇవరల్లాల్ l ,
నీరామ్ ఇదు శెయ్ దీర్ l ఎన్ఱు ఓర్ నెడుఙ్కయిర్ట్రాల్ l , 2707
ఊరార్ గళ్ ఎల్లారుం l కాణ వురలోడే l,
తీరా వెగుళియళాయ్ l చ్చిక్కెన వార్ త్తడిప్ప l , 2708
ఆరా వయిర్ట్రినోడు l ఆర్ట్రాదాన్ l , అన్ఱియుమ్
నీరార్ నెడుఙ్గయత్తై l చ్చెన్ఱలైక్క నిన్ఱు ఉరప్పి l , 2709
ఓరాయిరం పణ l వెంగో ఇయల్ నాగత్తై l ,
వారాయెనక్కెన్ఱు l మర్ట్రతన్ మత్తకత్తు l , 2710
శీరార్ l తిరువడియాల్ పాయ్ న్దాన్ l ,తన్ శీతైక్కు
నేరావన్ ఎన్ఱు l ఓర్ నిశాశరి తాన్ వన్దాళై , 2711
కూరార్ న్ద వాళాల్ l కొడిమూక్కుమ్ కాదిరణ్డుమ్ l ,
ఈరా విడుత్తు l అవట్కు మూత్తోనై l, వెన్నరకమ్ 2712
శేరావగైయే l శిలై కునిత్తాన్ l శెమ్ తువర్ వాయ్
వారార్ వనములైయాళ్ l వైదేవి కారణమా l , 2713
ఏరార్ తడన్దోళ్ l ఇరావణనై l, ఈరైన్దు
శీరార్ శిరమఱుత్తు l చ్చెర్ట్రుకన్ద శెఙ్గణ్ మాల్ l , 2714
పోరార్ నెడువేలోన్ l పొన్ పెయరోన్ ఆగత్తై l,
కూరార్ న్ద వళ్ళుగిరాల్ l కీణ్డు l కుడల్ మాలై 2715
శీరార్ l తిరుమార్బిన్ మేల్ కట్టి l శెఙ్కురుది
శోరాక్కిడన్దానై l కుఙ్గుమత్తోళ్ కొట్టి l , 2716
ఆరా ఎழுన్దాన్ l అరియురువాయ్ l , అన్ఱియుమ్
పేర్ l వామననాగియ కాలత్తు l , మూవడిమణ్ 2717
తారాయ్ ఎనక్కెన్ఱు l వేణ్డిచ్చలత్తినాల్ l ,
నేరేర్ట్రు ఉలగెల్లాం l నిన్ఱళన్దాన్ మావలియై l , 2718
ఆరాద పోరిల్ l అశురర్ గళుంతానుమాయ్ l ,
కారార్వరైనట్టు l నాగమ్ కయిఱాగ l , 2719
పేరామల్ తాఙ్గి కడైన్దాన్ , తిరుత్తుழாయ్
తారార్ న్ద మార్వన్ , తడమాల్వరై పోలుమ్ l , 2720
పోరానై పొయ్ గై వాయ్ l కోళ్ పట్టు నిన్ఱలఱి l ,
నీరార్ మలర్కమలమ్ l కొణ్డు ఓర్ నెడుఙ్గైయాల్ l , 2721
నారాయణా l ఓ మణివణ్ణా నాగణైయాయ్ l,
వారాయ్ l ఎన్ ఆర్ ఇడరై నీక్కాయ్ l , ఎన వెకుణ్డు 2722
తీరాద శీర్ట్రత్తాల్ l శెన్ఱిరణ్డు కూఱాగ l ,
ఈరా అదనై l యిడర్ కడిన్దాన్ ఎమ్బెరుమాన్ l, 2723
పేరాయిరముడైయాన్ l పేయ్ ప్పెణ్డీర్ నుమ్మగళై l,
తీరా నోయ్ శెయ్ దాన్ l ఎన వురైత్తాళ్ l ,శిక్కెన మర్ట్రు 2724
ఆరానుమ్ అల్లామై కేట్టు l ఎఙ్గల్ అమ్మనైయుమ్ l,
పోరార్ వేల్ కణ్డీర్ l అవనాగిల్ పూన్దుழாయ్ l , 2725
తారాతొழிయుమే l తన్ అడిచ్చియల్లళే l, మర్ట్రు
ఆరానుమల్లనే l ఎన్ఱొழிన్దాళ్ l , నాన్ అవనై 2726
క్కారార్ తిరుమేని l కణ్డదువే కారణమా l ,
పేరాపిదర్ట్రా l త్తిరితరువన్ l , పిన్నైయుం 2727
ఈరా ప్పుగుదలుమ్ l ఇవ్వుడలై తణ్ వాడై l,
శోరా మఱుక్కుమ్ వగైయఱియేన్ l , శూழ் కుழలార్ 2728
ఆరానుమ్ ఏశువర్ l ఎన్నుమదన్ పழிయై l,
వారామల్ కాప్పదర్కు l వాళా ఇరన్దొழிన్దేన్ l , 2729
వారాయ్ మడనెఞ్జే l వన్దు l , మణివణ్ణన్
శీరార్ తిరుత్తుழாయ్ l మాలై నమక్కరుళి l, 2730
తారాన్తరుమెన్ఱు l ఇరణ్డత్తి లొన్ఱదనై l ,
ఆరానుం ఒన్నాతార్ lకేళామే శొన్నక్కాల్ l, 2731
ఆరాయుమేలుమ్ l పణికేట్టు అదు అన్ఱెనిలుమ్ l ,
పోరా తొழிయాదే l పోన్దిడు నీ యెన్ఱేఱ్కు l , 2732
కారార్ కడల్ వణ్ణన్ l పిన్బోన నెఞ్జముమ్ l,
వారాదే l యెన్నై మఱన్దదుదాన్ l , వల్వినైయేన్ 2733
ఊరార్ ఉగప్పదే యాయినేన్ l , మర్ట్రెనక్కిఙ్గు l
ఆరాయ్ వారిల్లై l అழల్వాయ్ మెழுగుపోల్ l , 2734
నీరాయ్ ఉరుగుం ఎన్నావి l , నెడుఙ్గణ్గల్
ఊరార్ ఉఱఙ్గిలుం l తానుఱఙ్గా l , ఉత్తమన్దన్ 2735
పేరాయినవే l పిదర్ట్రువన్ l , పిన్నైయుమ్
కారార్కడల్ పోలుం l కామత్తరాయినార్ l , 2736
ఆరే పొల్లామై l యఱివార్ అదునిఱ్క l,
ఆరానుమాదానుం l అల్లళవళ్ కాణీర్ l , 2737
వారార్ వనములై l వాశవదత్తై ఎన్ఱు l ,
ఆరానుమ్ శొల్లపడువాళ్ l , అవళుంతన్ 2738
పేర్ ఆయమ్ ఎల్లామ్ l ఒழிయ పెరుమ్ తెరువే l,
తారార్ తడమ్ తోళ్ l తళై కాలన్ పిన్ పోనాళ్ l, 2739
ఊరార్ ఇగழ்న్దిడప్పట్టాళే l , మర్ట్రెనక్కిఙ్గు
ఆరానుమ్ కఱ్పిప్పార్ నాయగరే l , నానవనై 2740
కారార్ తిరుమేని l కాణుమ్ అళవుమ్ పోయ్ l
**శీరార్ తిరువేఙ్గడమే తిరుక్కోవ 2741
లూరే l**, మదిళ్ కచ్చియూరకమే పేరకమే
పేరా మరుతిఱుత్తాన్ వెళ్ళఱైయే వెహ్ కావే 2742
పేర్ ఆలి తణ్ కాల్ నఱైయూర్ తిరుప్పులియూర్ ,
ఆరామమ్ శూழ் న్ద అరఙ్గమ్ , కణమఙ్గై 2743
కారార్ మణినిఱ కణ్ణనూర్ విణ్ణగరమ్
శీరార్ కణపురం శేఱై తిరువழுన్దూర్ 2744
కారార్ కుడన్దై కడిగై కడల్ మల్లై
ఏరార్ పొழிల్ శూழ் ఇడవిన్దై నీర్ మలై , 2745
శీరారుమ్ మాలిరుఞ్జోలై తిరుమోగూర్
పారోర్ పుగழுమ్ వదరి వడమదురై 2746
ఊరాయవెల్లాం ఒழிయామే నానవనై
ఓరానై కొమ్బొశిత్తు ఓరానై కోళ్ విడుత్త 2747
శీరానై శెఙ్గణ్ నెడియానై త్తేన్ తుழாయ్
త్తారానై తామరైపోల్ కణ్ణానై ఎణ్ణరుమ్ శీర్ 2748
పేరాయిరముమ్ పిదర్ట్రి పెరున్దెరువే
ఊరార్ ఇగిழிలుం ఊరాదొழிయేన్ నాన్ 2749
వారార్ పూమ్ పెణ్ణై మడల్ , 2749 1/2
ఊరాదొழிయేన్ ఉలగఱియ వొణ్ణుదలీర్ ,
శీరార్ ములై త్తడఙ్గళ్ శేరళవుమ్ , పారెల్లామ్
అన్ఱోఙ్గి నిన్ఱు అళన్దాన్ , నిన్ఱ తిరునఱైయూర్ ,
మన్ఱోఙ్గ ఊర్వన్ మడల్.
(గమనిక: ఈ పాశురమును చిన్న చిన్న భాగములుగ విడదీసి ప్రతిపదార్ధములు ఒనరించినను, వానిని సమీకరించి ,అఖండమైన పాశురము యొక్క భావమును మనస్సునందు అనుభవింపవలయును.)
శ్రీమన్నారాయణుని ఎడబాటు సహించలేక మడల్ ప్రక్రియ ద్వారా శీఘ్రముగా పొందబూనిన పరకాలనాయకిని , ఆమెయొక్క తల్లి,బంధువులు, స్నేహితులు మొదలగు వారు వారించి ” ఇదు నీకు తగదు, ఆ సర్వేశ్వరుడే స్వయముగ వచ్చి నిన్ను చేకొనును , సహనము వహించి (సీతాదేవి వలె ) ఉండుము.” అని చెప్పగ, తృప్తిచెందని పరకాలనాయకి , తనవారికి తన మనోస్థితి తెలియునట్లు విపులముగ చెప్ప నిశ్చయించెను. దానికై మొదటిగ, (స్వచ్ఛంద కామము వలనే సర్వేశ్వరునియొక్క సానిధ్య ప్రాప్తికి కారణమగునని దృఢవిశ్వాశము గల ) పరకాలనాయకి, సర్వేశ్వరుని పత్నియు, మఱియు వివిద పురుషార్ధములు చేతనులు అవలంబించి ఉజ్జీవించుటకు అనువుగా భూమండలమునకు అధిదేవత అయిన భూదేవి కారణమగుటచేత,మొదట భూదేవి యొక్క వైభవమును, స్వచ్ఛంద కామపుషార్ధమును స్తుతించుచున్నారు.
** కారార్ వరై క్కొఙ్గై l కణ్ణార్ కడలుడుక్కై l ,
శీరార్ శుడర్ శుట్టి l శెమ్ కలుழி ప్పేరార్ట్రు l, 2673
ప్పేరార మార్విల్ l పెరుమామழைక్కూన్దల్ l ,
నీరారవేలి l నిలమఙ్గై యెన్ఱుమ్ l , ఇ 2674
ప్పారోర్ శొలప్పట్ట మూన్ఱన్ఱే l ,** ………….
కారార్ వరై క్కొఙ్గై = నల్లని మేఘములచే ఆవరింపబడి యుండు శిఖరములుగల దివ్య పర్వతములు(తిరుమాలిరుఞ్జోలై, తిరువేఙ్గడం)వక్షోజములుగను;కణ్ణార్ కడల్ ఉడుక్కై = దర్శనీయమైన విశాలమైన చుట్టుకొనియున్న సముద్రము చీరగను;శీరార్ శుడర్ శుట్టి = అందమైన కిరణములతో ప్రకాశించు సూర్యుడు శిరోభూషణము గను; శెమ్ కలుழி పేర్ ఆఱు = కుంకమపువ్వు, చందనకట్టెలు, రత్నములు మొదలగు వానిచే ఎఱ్ఱనైన పెద్ద నది (కావేరినది);పేర్ ఆరమ్ మార్విల్= వక్షస్ధలమందు విలక్షణమైన హారముగను; పెరు మా మழை క్కూన్దల్ = దట్టమైన నల్లని మేఘములు కుంతలములుగను; నీరారవేలి=చుట్టబడియున్న ఆవరణ జలములు రక్షణముగను కలిగిన నిలమఙ్గై యెన్ఱుమ్ = విలక్షణమైన శ్రీ భూదేవి అధిష్టానదేవతగా గల; ఇప్పారోర్ = ఈ భూమండలమందు నివసించు జనులచే; శొలప్పట్ట = చెప్పబడుచున్న పురుషార్ధములు; మూన్ఱు అన్ఱే = మూడు మాత్రమే అగును సుమా!
శ్రీమన్నారాయణుడు నిత్యవాసము చేయుచున్న , నల్లని మేఘములచే ఆవరింపబడి యుండు ఎత్తైన శిఖరములుగల దివ్య పర్వతములు తిరుమాలిరుఞ్జోలై, తిరువేఙ్గడం , వక్షోజములుగను , విశాలమైన చుట్టుకొనియున్న సముద్రము చీరగను, సూర్యుడు పాపిడి బిళ్ళ గను, రత్నములు మొదలగు వానిచే ఎఱ్ఱనైన పెద్ద కావేరినది వక్షస్ధలమందు అందమైన హారముగను,దట్టమైన నల్లని మేఘములు కుంతలములుగను,చుట్టబడియున్న ఆవరణ జలములు రక్షణముగను కలిగిన విలక్షణమైన శ్రీ భూదేవి అధిష్టానదేవతగా గల; ఈ భూమండలమందు నివసించు జనులచే చెప్పబడుచున్న పురుషార్ధములు మూడు మాత్రమే అగును సుమా! .
( మోక్షమను పురుషార్ధము లేదని తిరుమంగై ఆళ్వార్ చెప్పుచున్నారు )
…. ….. ……. …… , అమ్మూన్ఱుమ్
ఆరాయిల్ తానే l అఱమ్బొరుళిన్బ మెన్ఱు l , 2675
ఆరార్ ఇవర్ట్రిన్ l ఇడైయతనై యెయుతువార్ l ,
శీరార్ l ఇరు కలైయుమ్ ఎయ్ తువర్ l , …… 2676
అమ్మూన్ఱుమ్ ఆరాయిల్ తానే = ఆ మూడు పురుషార్ధములను పరిశీలించినచో, అందరి హృదయమందునుండెడి పురుషార్ధము కామమే ముఖ్యము సుమా!; అఱమ్ పొరుళ్ ఇన్బమ్ ఎన్ఱు = ధర్మము, అర్థము, కామము అని చెప్పబడు; ఆరార్ ఇవర్ట్రిన్ = ఎవరెవరు ఈ మూడు పురుషార్ధములందు; ఇడై యతనై యెయుతువార్ = ఉండెడి కామము యను పురుషార్ధము పొందినవారు; శీరార్ ఇరు కలైయుమ్ ఎయ్ తువర్ = అట్టి గుణవంతులు ధర్మము, అర్థము అను రెండు పురుషార్ధములును బడయుదురు;
ధర్మము, అర్థము, కామము అని చెప్పబడు మూడు పురుషార్ధములను పరిశీలించినచో, కామము యను పురుషార్ధము పొందిన గుణవంతులు ధర్మము, అర్థము (స్వచ్ఛంద కామపుషార్ధమునకు ఉపాయమగుటచే) అను రెండు పురుషార్ధములును బడయుదురు.
……. …….. ……. శిక్కెనమర్ట్రు
ఆరానుమ్ ఉణ్డెన్బార్ ఎన్బతు తానతువుమ్ ,
ఓరామైయన్ఱే యులగత్తార్ శొల్లుమ్ శొల్ , 2677
ఓరామైయామాఱు l అతు వురైక్కేన్ కేళామే l ,
కారార్ పురవి l యేழ் పూణ్డ తని యాழி l , 2678
తేరార్ నిఱై కదిరోన్ l మణ్డలత్తై కీణ్డు పుక్కు l ,
ఆరావముతమ్ l అఙ్గెయ్ తి l , …….. ….. 2679
ఆరానుమ్=అల్పఙ్ఞానముగలకొందరు; శిక్కెన మర్ట్రు ఉణ్డు ఎన్బార్ = నిత్యమైనదియు, ఆనందమయమైనదియు అయిన పురుషార్ధము మరియొకటి (మోక్షమనునది) ఉన్నది అని ధృడముగ చెప్పుదురు; ఎన్బతుతాన్ అతువుమ్ = చెప్పబడుచున్న అదియును; ఓరామై యన్ఱే = సక్రమముగ పరిశీలనచేసి చెప్పునది కాదు సుమా!;యులగత్తార్ శొల్లుమ్ శొల్ = లోకమందలి జనులు చెప్పుచున్న మోక్షమనువాదనను;ఓరామై ఆమ్ ఆఱు అతు వురైక్కేన్ = సక్రమముగ అవగాహమగు విధముగ ఆ పురుషార్ధ విషయమై (పరకాలనాయకి) చెప్పుచున్నాను; కేళామే = దయచేసి వినుడు ; కారార్ పురవి యేழ் =మేఘమండలములో నడచు ఏడు అశ్వములచే; పూణ్డ = కట్టియున్న , తని ఆழி తేరార్ = ఒంటి చక్రముతో నున్న రథమందు చక్కగా అమరియున్న ; నిఱై కదిరోన్ = మిక్కిలి తీక్షణమైన కిరణములు గల సూర్యునియొక్క; మణ్డలత్తై కీణ్డు పుక్కు = మండలమందు చేధించి ప్రవేశించి; ఆరావముతమ్ అఙ్గెయ్ తి = ఎంత అనుభవించినను తృప్తితీరని అమృతమువంటి భోగ్యుడగు సర్వేశ్వరుని అచట పొంది;
( మడల్ ప్రక్రియ చేపట్టాలని తలంచిన పరకలనాయకి మోక్షమను పురుషార్ధము నిజముగ కలదా? అను విషయమై చెప్పుచున్నారు ) సక్రమముగ శోధించక లోకమందు కొంతమంది అఙ్ఞానులు ,” నిత్యమైనదియు, ఆనందమయమైనదియు అయిన పురుషార్ధము మోక్షమనునది కలదు ” అని ధృడముగ చెప్పువారలకు పరకాలనాయకి అట్టి పురుషార్ధము లేదని నిరూపణ చేయుచున్నారు. మేఘమండలములో నడచు ఏడు అశ్వములచే ( అశ్వములు మేఘములలో నడవ శఖ్యమా? అదియును సరి సంఖ్యగాని ఏడు అశ్వములు ), కట్టియున్న ఒంటి చక్రముతోనున్న రథమందు చక్కగా అమరియున్న (రెండు లేక నాలుగు చక్రములతో రధము నడచును గదా!) మిక్కిలి తీక్షణమైన కిరణములుగల సూర్యమండలమందు ప్రవేశించి ( ఒక చిన్న దీపపు చెంత ఉష్ణమునకు తట్టుకోలేని అతిక్షుద్రుడు సూర్యునిచేర తరమా) , ఎంత అనుభవించినను తృప్తితీరని అమృతమువంటి భోగ్యుడగు సర్వేశ్వరుని అచట పొంది (ఇచట గోకులమందును, తిరు నరైయూర్ మొదలగు దివ్యదేశములలో మన ఎదుటనే సర్వేశ్వరుడు వేంచేసియుండగ,సూర్యమండలనడుమ దేనికై పోయి ఏమి పొందుటకు అను భావము?)
….. …… …….. ……, అతిల్ నిన్ఱుమ్ l
వారాతొழிవతొన్ఱుణ్డే l , అతునిఱ్క l
ఏరార్ముయల్విట్టు l కాక్కైప్పిన్ పోవదే l , 2680
ఏరారిళములైయీర్ l ఎన్దనక్కు ఉర్ట్రుదుదాన్ l,
………. …. …. …… ……..
అతిల్ నిన్ఱుమ్ = అట్టి పరమపదమునుండి; వారాదు ఒழிవదు ఒన్ఱు ఉణ్డే = వెనుదిరిగి (ఈ సంసారమునకు) వచ్చుట ఉండదనునది ఒకటి ఉండునా? ( కర్మపలమనుసరించి నరకమునకు పోయినవాడు తిరిగి స్వతంత్రముగ సంసారము చేకొనునా? కాని తానుగ పరమపదమును పోయి అచట సుఖమును అనుభవించుచు స్ధిరముగ ఉండుట జరుగునా? యోచింపుడు..); ఏరార్ ముయల్ విట్టు = (ఒక మాంసాహారి)అందమైన కుందేలును విడిచి (పట్టుకొనుటకు సులభము, తిని అనుభవించుటకు రుచికరము); కాక్కై ప్పిన్ పోవదే = ఎగిరిపోవుచుండు కాకి వెనుక పోవునట్లు కాదా! (పట్టుకొనుట కష్టతరము, మరియు ఉపయోగములేనిది) ; అతునిఱ్క = ఆ విషయమటులుండగ ; ఏరార్ ఇళ ములైయీర్ = అందమైన యౌవనమైన వక్షోజములుగల నా సఖులారా!; ఎన్దనక్కు ఉర్ట్రుదుదాన్ = నాకు ఏమి సంబవించినదో అదియే ( నేను మీకు చెప్పుచున్నాను );
మోక్షమను చెప్పబడునది ఉన్నచో అట్టి పరమపదమునుండి వెనుదిరిగి ఈసంసారమునకు వచ్చుట ఉండదనునది ఒకటి ఉండునా?. అయినను, సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశములు ఎదుట నుండగ పరమపదమందు సర్వేశ్వరునికై అభిలషించుట అనునది ఒక మాంసాహారి అందమైన కుందేలును విడిచి(పట్టుకొనుటకు సులభము, తిని అనుభవించుటకు రుచికరము);ఎగిరిపోవుచుండు కాకి వెనుక పోవునట్లుగ( పట్టుకొనుట కష్టతరము, మరియు ఉపయోగములేనిది)ఉండునుకదా!. నా అందమైన సఖులారా ! పరమపదవిషయములు అటులుంచి ప్రస్తుతము నాకు ఏమి సంబవించినదో మీకు చెప్పుచున్నాను వినుడు.
…… ….. …… …… ………
కారార్కుழలెడుత్తుక్కట్టి l , కదిర్ములయై 2681
వారార వీక్కి l మణి మేకలై తిరుత్తి l ,
ఆరార్ అయిల్ వేల్ కణ్ l అఞ్జనత్తిన్ నీఱు అణిన్దు l, 2682
శీరార్ శెழுమ్ పన్దు l కొణ్డు ఆడియా నిన్ఱేన్ నాన్ l,
……. …… ……. ……. …… …………
కారార్ కుழల్ ఎడుత్తు క్కట్టి = నల్లని దట్టమైన కుంతలములను చక్కగ కొప్పుగ కట్టి; కదిర్ ములయై వారార వీక్కి = యౌవనముతో ప్రకాశించు వక్షోజములను వస్త్రముతో అందముగ కట్టి;మణి మేకలై తిరుత్తి=మణులతోనిండిన మొలతాడును నడుముయందు ధరించి; ఆరార్ అయిల్ వేల్ కణ్=అందమైన వాడియైన ఈటెవలె పోలిన కనులయందు; అఞ్జనత్తిన్ నీఱు అణిన్దు = నల్లని కాటుక పెట్టుకొని; శీరార్ శెழுమ్ పన్దు కొణ్డు= మిక్కిలి సుందరమైన బంతి చేతులలో నుంచుకొని; నాన్ ఆడియా నిన్ఱేన్=నేను దానితో ఆడుకొనుచుంటిని.
నేను నా నల్లని దట్టమైన కురులను కొప్పుగ కట్టి,నా వక్షోజములను అందమైన వస్త్రముతో కప్పి, మణులతోనిండిన మొలతాడును నడుముయందు ధరించి, కనులయందు నల్లని కాటుక పెట్టుకుని, సుందరమైన బంతి చేతులలో నుంచుకొని ఆడుకొనుచుంటిని. ( అటువంటి సమయమున )
….. …… ….. ….. …… …..
నీరార్ కమలమ్బోల్ l శెఙ్గణ్మాలెన్ఱొరువన్ l, 2683
పారోర్ గళెల్లామ్ l మగిழ ప్పఱైకఱఙ్గ l,
శీరార్ కుడమ్ ఇరణ్డేన్ది l, శెழுన్దెరువే 2684
ఆరారెనచ్చొల్లి l ఆడుమదుకణ్డు l,
ఏరారిళములైయార్ l అన్నైయరుమెల్లారుం l, 2685
వారాయో వెన్ఱార్ క్కు l చ్చెన్ఱేన్ ఎన్వల్వియాల్ l
…… …….. ……. …….. ……. …..
నీరార్ కమలమ్బోల్=నీరుగలకొలనంతను కప్పిన పెద్ద తామరపుష్పమువలె; శెమ్ కణ్ మాల్ఎన్ఱ ఒరువన్ = ఎఱ్ఱని కన్నులతో చూపరులను దిగ్భ్రాంతి చేయు తిరుమాల్ అనబడు అద్వితీయమైన పురుషుడు; పారోర్ గళ్ ఎల్లామ్ మగిழ = లోకములోని జనులందరు సంతోషించునట్లు; ప్పఱై కఱఙ్గ = (ఒక రకమైన) పఱైయను డప్పులు ధ్వనించు చుండగ; శీరార్ కుడమ్ ఇరణ్డు ఏన్ది=విలక్షణమైన రెండు కుండలను తన హస్తమున ధరించి (ఒకటి తన హస్తమునందు నుండునట్లు మఱియొకటి పైకి ఆకాశమునందు నుండునట్లు ఎగరవేయుచు);శెழுన్దెరువే = (విశాలమైనది గాక) ఎవరు వచ్చుచున్నారని చూడతగు వీదులో; ఆర్ ఆర్ ఎన చ్చొల్లి = ఎవరైనను ఎప్పుడైనను ఈ ఆటను చూచినారా? (అని చెప్పుచు); ఆడుమ్ అదు కణ్డు=ఈ విధముగా సుందరముగ కుండలతో నృత్యముచేయువానిని చూచి; ఏరార్ ఇళ ములైయార్ = అందమైన యౌవనమైన వక్షోజములుగల( ఆ కుండలతో ఆడు మనోహరుడుని గాంచియు క్షతిపొందని వక్షోజములుగల) ;అన్నైయరమ్ ఎల్లారుమ్ = మాతృమూర్తులును, తదితరులందరును; వారాయో ఎన్ఱార్కు = (గృహమందున్న నన్ను ఉద్దేశించి , నృత్యము చూచుటకై) వచ్చుచున్నావా లేదా! అని పిలుచుచుండ; ఎన్ వల్ వినైయాల్ = నా యొక్క క్రూరమైన పాపము వలన ( ఆ జగన్మోహానాకారుని చూచిన పిదప పరమభక్తిచే, మిక్కిలి వ్యామోహముచెంది, సర్వేశ్వరుని ఎడబాటును సహించలేక, విరహవేదనతో తపించి తపించి వ్యధ అనుభవించిన దుస్ధితిని చెప్పు పరకాలనాయకి యొక్క నోటినుండి వెలువడిన మాటలు); శెన్ఱేన్ = (వారిపిలుపు ననుసరించి) నేను వెడలితిని;
నీటితోనిండిన కొలనులోగల పెద్ద తామరపుష్పమువలె చల్లని,విశాలమైన ఎఱ్ఱని కన్నులతో చూపరులను దిగ్భ్రాంతి చేయు తిరుమాల్ అనబడు అద్వితీయమైన పురుషుడు, లోకములోని జనులందరు సంతోషించునట్లు,డప్పులు ధ్వనించుచుండగ, (హస్తస్పర్శచే)విలక్షణమైన రెండు కుండలను ఒకటి తన హస్తమునందు నుండునట్లు మఱియొకటి పైకి ఎగరవేయుచు (అందముగ గారడి చేయుచు) వీదిలో, “ఎవరైనా నా బారినుండి తప్పించుకొనగలరా?” అని మందమైన చిరునవ్వుతో పలుకుచూ, నృత్యముచేయు జగన్మోహానాకారుని కనురెప్పలువాల్చక చూచుచూ నా మాతృమూర్తులును, తదితరులును, గృహమందున్న నన్ను( సర్వేశ్వరుని ధ్యాసలోమునిగియున్న నన్ను మరల్చుటకై) పలుమార్లు వాని నృత్యము చూచుటకై పిలవసాగరి. నాయొక్క క్రూరమైన పాపము వలన నేనునా తల్లులు,సహచరుల చెంతకు(ఆ జగన్మోహానాకారుని యొక్క నృత్యము చూచుటకై) చేరితిని.(అటువంటి నేను)
…… ……. …….. ………
కారార్ మణి నిఱముమ్ l కైవళైయుమ్ కాణేన్ నాన్l, 2686
ఆరానుమ్l శొల్లిర్ట్రుమ్ కొళ్ళేన్ l , అఱివழிన్దు
తీరా వుడమ్బొడు l పేతురువేన్ కణ్డిరఙ్గి l , 2687
కారార్ మణి నిఱముమ్ = శ్లాఘ్యమైన నీలమణి కాంతిని (మునుపు అతని కలియకవలన నాకు కలిగిన ప్రకాశమును); కైవళైయుమ్ = చేతులకలంకరించికొనిన కంకణములును; కాణేన్ నాన్= నేను పోగొట్టుకొంటిని;ఆరానుమ్ శొల్లిర్ట్రుమ్= నాయొక్క సహచరులు, బంధువులు ఎవరైనను చెప్పు హితమును; కొళ్ళేన్ = గ్రహింపశక్తి లేనైతిని; అఱివழிన్దు = జ్ఞానవిహీనమై; తీరా వుడమ్బొడు = సంపూర్ణముగ మాసిపోక నున్న శరీరముతో; పేతు ఉరువేన్ = మతిచెడినదాని వలె నున్న నన్ను;
మునుపు నీలమేఘశ్యాముని కలయికవలన కలిగిన ప్రకాశమును, చేతులకలంకరించికొనిన కంకణములును నేను పోగొట్టుకొంటిని. సహచరులు, బంధువులు చెప్పు హితమును గ్రహింపశక్తి లేనైతిని. జ్ఞానవిహీనమై, సంపూర్ణముగ మాసిపోక నున్న శరీరముతో మతిచెడినదాని వలె నున్న నన్ను ,
….. …… ….. కణ్డిరఙ్గి ,
ఎరార్ కిళిక్కిళవి l యెమ్మనై తాన్ వన్దెన్నై l ,
శీరార్ l శెழுమ్ పుழுది క్కాప్పిట్టు l , శెమ్ కుఱిఞ్జి 2688
తారార్ l నఱు మాలై చ్చాత్తఱ్కు l, తాన్ పిన్నుమ్
నేరాదన l ఒన్ఱు నేర్ న్దాల్ l ,అదనాలుమ్ 2689
ఎరార్ కిళిక్కిళవి = అందమైన చిలుక పలుకులకన్న అతి మధురమైన మాటలుగల; ఎమ్ మనై = నాయొక్క తల్లి; కణ్డు ఇరఙ్గి = (నాస్ధితిని)చూచి నామీదగల మిక్కిలి ప్రేమచే మనోవ్యధతో; తాన్ వన్దు=నా వద్దకు వచ్చి; ఎన్నై = నాకు; శీరార్ శెழுమ్ పుழுది క్కాప్పిట్టు = అచంచలమైన భక్తిమొదలగు సద్గుణములతో ఒప్పు విలక్షణమైన భాగవతుల దివ్య పాదధూళిని రక్షణగ నాకు నుదుటపెట్టి; శెమ్ కుఱిఞ్జి తారార్ నఱు మాలై శాత్తఱ్కు = ఎఱ్ఱని, పరిమళము కలిగిన కురింజి పుష్పముల మాల ధరించు శాస్తా అను దేవతకు; తాన్ పిన్నుమ్ = నాయొక్క తల్లి (భక్తుల పాదధూళిని రక్షణగ నాకు నుదుటపెట్టుటయే గాకుండ) ఆ పైన; నేరాదన ఒన్ఱు నేర్ న్దాల్ = తాను ఎన్నడూ చేయని అంజలి (నా కారణముగ)చేసి మ్రొక్కెను; అదనాలుమ్ = ఆ విధముగ ప్రయత్నములు చేసినను;
సర్వేశ్వరుని విషయమై మగ్నమైన నన్ను కఠినమైన మాటలచే వారించు నాయొక్క తల్లి నాస్ధితిని చూచి మిక్కిలి మనోవ్యధతో, మృదువైన మాటలతో నా వద్దకు వచ్చి, శ్రీమన్నారాయణుని పరమభక్తుల దివ్య పాదధూళిని రక్షణగ నాకు నుదుట పెట్టుటయే గాకుండ ఆ పైన, సర్వేశ్వరుని చరణములయందు తప్ప పరదేవతకు ఎన్నడూ మ్రొక్కని తల్లి నాకారణముగ, ఎఱ్ఱని, పరిమళము కలిగిన కురింజి పుష్పముల మాల ధరించు’ శాస్తా’ అను పరదేవతకు అంజలి చేసి మ్రొక్కెను. ఆ విధముగ ప్రయత్నములు చేసినను,
తీరాదు ఎన్ శిన్దైనోయ్ l తీరాదెన్ పేదుఱవు l ,
వారాదుమామై l యదుకణ్డుమర్ట్రాఙ్గే l , 2690
ఆరానుమ్ మూదఱియుమ్ l అమ్మనైమార్ శొల్లువార్ l ,
పారోర్ శొలప్పడుమ్ l కట్టుప్పడుత్తిరేల్ l, 2691
ఎన్ శిన్దైనోయ్ తీరాదు = నాయొక్క మనోవ్యాధి నశింపలేదు; ఎన్ పేదుఱవుతీరాదు = నాయొక్క మతిఅస్ధిరత్వముయు పోలేదు; మామై వారాదు=తొలగి పోయిన శరీరకాంతి తిరిగి కలుగలేదు; మర్ట్రుమ్ ఆఙ్గే =మరియు అచటనే;ఆరానుమ్ మూదు అఱియుమ్ = పూర్వము జరిగిన ఇటువంటి సంఘటనలు చూచిన కొంతమంది; అమ్మనైమార్ = వృద్ధ స్త్రీలు; అదు కణ్డు = నాయొక్క పరిస్థితిని గాంచి; శొల్లువార్ = ( నన్ను మెరుగుపరచుటకై తగిన మార్గములను ) చెప్పదొడంగిరి; పారోర్ శొలప్పడుమ్ కట్టుప్పడుత్తిరేల్ = (ఇటువంటి దుస్ధితి నివృత్తికై) లోకులచే చెప్పబడు విదానమేమనగ, సమర్ధవంతులైన జాతకమును చెప్పువారిని ఆశ్రయించినచో;
నాయొక్క మనస్తాపము నశింపలేదు కాని నాతల్లి ఇతర దేవతను ఆశ్రయించుటచే వృద్ధిచెందెను. నాయొక్క మతిఅస్ధిరత్వముయు పోలేదు. తొలగి పోయిన శరీరకాంతి తిరిగి కలుగనూలేదు. ఇటులుండగ పూర్వము జరిగిన ఇటువంటి సంఘటనలు చూచిన కొంతమంది వృద్ధ స్త్రీలు నాయొక్క పరిస్థితిని గాంచి నన్ను మెరుగుపరచుటకై తగిన మార్గములను చెప్పదొడంగిరి. లోకులచే చెప్పబడు విదానమేమనగ, సమర్ధవంతులైన జాతకమును చెప్పువారిని ఆశ్రయించినచో;
ఆరానుమ్ l మెయ్ ప్పడువనెన్ఱార్ l , అదుకేట్టు
క్కారార్ కుழల్ కొణ్డై l కట్టువిచ్చి కట్టేఱి l , 2692
శీరార్ శుళకిల్ l శిల నెల్ పిడిత్తు ఎఱియా l ,
వేరా వితిర్వితిరా l మెయ్ శిలిరాక్కైమోవా l , 2693
పేరాయిరముడైయాన్ l ఎన్ఱాళ్ l , పేర్తేయుమ్ l
కారార్ తిరుమేని కాట్టినాళ్ l , కైయతువుమ్ 2694
శీరార్ l వలమ్బురియే యెన్ఱాళ్ l , తిరుత్తుழாయ్
త్తారార్ నఱుమాలై l కట్టురైత్తాళ్ కట్టురైయా l , 2695
ఆరానుమ్ మెయ్ ప్పడువన్ ఎన్ఱార్ = ( ఈ దుస్థితికి కారకులు ) ఎవరైనను, సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుడైనను సరే, వారిని సత్యముగ వెలిబుచ్చెదరు; అదుకేట్టు=(ఆ వృద్ధ స్త్రీలు ) చెప్పుచున్న మాటలను విన్న; క్కారార్ కుழల్ కొణ్డై = నల్లని దట్టమైన కుంతలములు కలిగిన;కట్టువిచ్చి=(జాతకమును చెప్పగల సమర్ధవంతమైన ఆదివాసిని) కొఱవ స్త్రీ; కట్టేఱి = దైవశక్తిచే ఆవరింపబడి; శీరార్ శుళకిల్ = ( మిశ్రమ దినుసులను వేరుపరుచు గుణముచే ) విలక్షణమైన చేటనుండి; శిల నెల్ పిడిత్తు ఎఱియా = కొంచెము ధాన్యమును తీసుకుని ఎదుటజల్లి;వేరా=చెమటలుగ్రక్కుచూ; వితిర్ వితిరా= శరీరము ఊగిపోవుచూ;మెయ్ శిలిరా = గగుర్పాటుతో శరీరముపై వెంట్రుకలు నిక్కపొడుచుకొనగా; కై మోవా=చేతులను ఆఘ్రాణించి; పేరాయిరముడైయాన్ ఎన్ఱాళ్=(పరకాలనాయకి దుస్థితికి కారణభూతుడు)సహస్ర నామములు కలవాడని చెప్పెను; పేర్తేయుమ్ = అట్లు చెప్పిన పిదప; కారార్ తిరుమేని కాట్టినాళ్ = అతని దివ్యశరీరము వర్షాకాలమేఘము వలె నుండునని సంఙ్ఞనలచే చూపెను; కైయతువుమ్ = అతని హస్తమున; శీరార్ వలమ్బురియే యెన్ఱాళ్=అతివిలక్షణమైన శంఖము చేతిలో కలదని (సంఙ్ఞచే )చెప్పెను; తిరుత్తుழாయ్ త్తారార్ నఱుమాలై కట్టురైత్తాళ్ = పరిమళభరితమైన దివ్య తులసీ పుష్పమాల అలంకారమును ఆమె సంఙ్ఞనలచే చెప్పెను; కట్టురైయా = అట్లు పరకాలనాయకి పరిస్థితికి కారణభూతుడైనవాని చిహ్నములను చేష్టలతోను, అభినయనములతోను చూపినపిదప;(ఇపుడు మాటలచే చెప్పదొడంగెను).
పరకాలనాయకి దుస్థితికి కారణభూతులు ఎవరైనను, అది సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుడైనను సరే వారు జంకుగొంకులేక సత్యమును వెలిబుచ్చెదరు. ఈవిధముగా వృద్ధ స్త్రీలు పరకాలనాయకి యొక్క తల్లితో చెప్పుమాటలను వినిన (జాతకమును చెప్పగల సమర్ధవంతమైన ఆదివాసినియు,తనకు తానే,ఏ అపేక్షయులేని) ఒక కొఱవ స్త్రీ పరకాలనాయకి నకు స్వస్థత చేకూరుటకై ఏతెంచి ,చేటలో కొంచెము ధాన్యమును తీసుకుని ఎదుటజల్లి, దైవశక్తిచే ఆవరింపబడి,చెమటలుగ్రక్కుచూ, శరీరము వణుకుతూ ఊగిపోవుచూ,గగుర్పాటుతో శరీరముపై వెంట్రుకలు నిక్కపొడుచుకొనగా,పరకాలనాయకి యొక్క చేతులను ఆఘ్రాణించి; పరకాలనాయకి దుస్థితికి కారణభూతుడు సహస్ర నామములు కలవాడని చెప్పెను. అట్లు చెప్పిన పిదప , సంఙ్ఞనలచే అతని దివ్యశరీరము నీలమేఘము వలె నుండుననియు, హస్తమున శంఖము కలదనియు, పరిమళభరితమైన దివ్య తులసీ పుష్పమాలచే అలంకృతుడనియు మొదలగు చిహ్నములను సంఙ్ఞనలచే చూపినపిదప, (ఇప్పుడు మాటలచే చెప్పదొడంగెను).
నీరేదుమ్ అఞ్జేల్ మిన్ l నుమ్మగళై నోయ్ శెయ్ దాన్ l ,
ఆరానుమల్లన్ l అఱిన్దేన్ అవనైనాన్ l , 2696
నీరేదుమ్ అఞ్జేల్ మిన్=మీరు కొంచెమైనను భయపడనవసరము లేదు;నుమ్ మగళై= మీయొక్క కుమార్తెకు; నోయ్ శెయ్ దాన్ = వ్యధ కలిగించనవాడు; ఆరానుమ్ అల్లన్=ఏ ఒక క్షుద్రదేవతయు కాదు; అవనై నాన్ అఱిన్దేన్=వ్యధ కలిగించనవానిని నేను తెలుసుకొంటిని.
(పరకాలనాయకి తల్లి నుద్దేశించి , కొఱవ స్త్రీ..) మీరు మీ కుమార్తె విషయమై ఎటువంటి భయము పొందనవసరములేదు. ఆమెను ఏ ఒక క్షుద్రదేవతయు ఆవహించి వ్యధ కలిగించలేదు. ఆమె క్షతికి కారణభూతుడైనవానిని నేను తెలుసుకొంటిని.
కూరార్వేల్ కణ్ణీర్ l ఉమక్కఱియ క్కూఱుగేనో l ,
ఆరాల్ ఇవ్వైయమ్ l అడియళప్పుణ్డదుదాన్ l , 2697
ఆరాల్ ఇలఙ్గై l పొడిపొడియా వీழ்న్దదు l , మర్ట్రు
ఆరాలే l కల్ మారి కాత్తదుదాన్ l , ఆழிనీర్ 2698
ఆరాల్ l కడైన్దిడప్పట్టదు l , అవన్ కాణ్మిన్
…. ….. …. …… ………
కూరార్ వేల్ కణ్ణీర్ = వాడియైన ఈటెవలె పోలిన కన్నులుగలరమణులారా!;ఉమక్కు అఱియ =మీకు తెలియునట్లు; క్కూఱుగేనో = చెప్పమంటిరా?; ఇ వైయమ్ = ఈ భూమండలము;ఆరాల్ = ఎవని యొక్క ; అడి అళప్పు ఉణ్డదుదాన్ = పాదముచే కొలవబడి ఉండినదో; ఆరాల్ = ఎవనిచేత; ఇలఙ్గై = లంకాపురి; పొడిపొడియా వీழ்న్దదు = భస్మీపటలమైనదో;మర్ట్రు = మఱియు; ఆరాలే = ఎవనిచేత; కల్ మారి కాత్తదుదాన్ = రాళ్ళ వర్షమునుండి(గోకులమంతను) సంరక్షింపబడినదో; ఆழிనీర్ = అగాధమైన సముద్రము; ఆరాల్ = ఎవరిచేత; కడైన్దిడప్పట్టదు = చిలకబడి అమృతము తీయబడినదో; అవన్ కాణ్మిన్=అట్టి మహనీయుని తెలుసుకొనుడు;
పరకాలనాయకి వ్యధకు కారణభూతుడైనవానిని ఆమె తల్లికిని, ఇతరులకును స్పష్టమగునట్లు కొఱవ స్త్రీ , ఆ దివ్యపురుషుని వర్ణింపమొదలిడెను.ఈ భూమండలము తన పాదముచే కొలిచినవాడును, లంకాపురిని భస్మీపటలము చేసినవాడును, ఇంద్రునిచే కురుపించబడిన రాళ్ళ వర్షమునుండి గోకులమంతను సంరక్షించినవాడును, అగాధమైన సముద్రమును చిలికి అమృతమును తీసి దేవతలకు ఒసగినవాడును, అట్టి సర్వేశ్వరుడే పరకాలనాయకికి కలిగిన స్థితికి కారకుడని తెలుసుకొనమనెను . (ఇంత చెప్పినను విస్మయముతో స్థబ్ధురాలైనున్న పరకలనాయకి తల్లితో, కొఱవస్త్రీ ఆ మహనీయుని విషయమై విపులముగ చెప్పసాగెను.)
….. ……. …… ……. …….
ఊర్ ఆనిరై మేయ్ త్తు l ఉలగెల్లాముణ్డుమిழ்న్దుమ్ l, 2699
ఆరాద తన్మైయనాయ్ l ఆఙ్గు ఒరునాళాయ్ ప్పాడి l ,
శీరార్ కలై యల్ గుల్ l శెమ్ తువర్ వాయ్ l , 2700
వారార్ వనములైయాళ్ l మత్తు ఆర ప్పర్ట్రిక్కొణ్డు l,
ఏరార్ ఇడై నోవ l ఎత్తనైయోర్ పోదుమాయ్ l , 2701
శీరార్ తయిర్ కడైన్దు l వెణ్ణెయ్ తిరణ్డదనై l ,
వేరార్ నుదల్ మడవాళ్ l వేఱోర్ కలత్తిట్టు l , 2702
నారార్ ఉఱి యేర్ట్రి l నన్గమైయ వైత్తదనై l,
పోరార్ వేల్ కణ్ మడవాళ్ l పోన్దనైయుమ్ పొయ్యుఱక్కమ్ l , 2703
ఓరాదవన్ పోల్ l ఉఱఙ్గి యఱివుర్ట్రు l ,
తారార్ తడన్దోళ్ గళ్ l ఉళ్ళళవుం కైనీట్టి l , 2704
ఆరాద వెణ్ణెయ్ l విழுఙ్గి l అరుగిరిన్ద
మోరార్ కుడమ్ ఉరుట్టి l మున్ కిడన్ద తానత్తే l , 2705
ఓరాదవన్ పోల్ l కిడన్దానై కణ్డవళుమ్ l ,
వారాత్తాన్ l వైత్తదు కాణాల్ l , వయిఱడిత్తిఙ్గు 2706
ఆరార్ పుగుదువార్ l ఐవర్ ఇవరల్లాల్ l ,
నీరామ్ ఇదు శెయ్ దీర్ l ఎన్ఱు ఓర్ నెడుఙ్కయిర్ట్రాల్ l , 2707
ఊరార్ గళ్ ఎల్లారుం l కాణ వురలోడే l,
తీరా వెగుళియళాయ్ l చ్చిక్కెన వార్ త్తడిప్ప l , 2708
ఆరా వయిర్ట్రినోడు l ఆర్ట్రాదాన్ l , అన్ఱియుమ్
నీరార్ నెడుఙ్గయత్తై l చ్చెన్ఱలైక్క నిన్ఱు ఉరప్పి l , 2709
ఓరాయిరం పణ l వెంగో ఇయల్ నాగత్తై l ,
వారాయెనక్కెన్ఱు l మర్ట్రతన్ మత్తకత్తు l , 2710
శీరార్ l తిరువడియాల్ పాయ్ న్దాన్ l , తన్ శీతైక్కు
నేరావన్ ఎన్ఱు l ఓర్ నిశాశరి తాన్ వన్దాళై , 2711
ఊర్ ఆనిరై మేయ్ త్తు=అతను(గోకులమను)ఊరిలోనున్న పశువులమందను మేయించిన వాడును; ఉలగెల్లామ్ ఉణ్డు ఉమిழ்న్దుమ్=లోకములంతయును (ప్రళయకాలమున) ఆరగించి (సృష్ఠికాలమున) బైటకు వెలిపరచియు;ఆఙ్గు ఆరాద తన్మైయనాయ్ = ఆ పరమపదమందు,తృప్తితీరని స్వభావము గలవాడై;ఒరునాళ్=ఒకానొక రోజున;ఆయ్ ప్పాడి = గోకులములో; శీరార్ కలై అల్ గుల్ = అందమైన చీరచే చుట్టబడిన నడుముకలదియు; శీరడి=అందమైన కాళ్ళుకలదియు;శెమ్ తువర్ వాయ్=మిక్కిలి ఎఱ్ఱనైన అదరములు కలదియు; వారార్ వనములైయాళ్ =అందమైన వస్త్రముతో కప్పుకొన్న వక్షోజములుగల యశోదాదేవి; మత్తు ఆర ప్పర్ట్రిక్కొణ్డు = కవ్వమును బాగుగ పట్టుకొని; ఏరార్ ఇడై నోవ= అందమైన నడుము నొచ్చునట్లు; ఎత్తనైయోర్ పోదుమాయ్=చాలసేపు; శీరార్ తయిర్ కడైన్దు = మీగడ భరితమైన పెరుగును చిలికి;వెణ్ణై తిరణ్డదనై = వచ్చిన వెన్నముద్దను; వేరార్ నుదల్ మడవాళ్ = (చిలికిన అలసటచే) నుదుట మిక్కుటముగ చెమటగల యశోదాదేవి; వేఱు ఓర్ కలత్తు ఇట్టు =( ఆ వెన్నను ) వేరొక కుండలో ఉంచి; నారార్ ఉఱి యేర్ట్రి = దట్టముగ తాళ్ళచే అల్లిన ఉట్టిలో పెట్టి; నన్గు అమైయ వైత్తు అదనై = చక్కగా ఎవరికిని అందని విధముగ ఆ ఉట్టిని కట్టి; పోర్ ఆర్ వేల్ కణ్ మడవాళ్ = యుద్దమందు ఉపయోగించు వాడియైన ఈటెవలె పోలిన కన్నులుగల యశోదాదేవి; పోమ్ తనైయుమ్ = బయటకు పోవు పర్యంతము; పొయ్ ఉఱక్కమ్ = దొంగ నిద్రతో; ఓరాదవన్ పోల్ ఉఱఙ్గి = కదలక మెదలక ఏమియును తెలియనట్లు పరుండి; అఱివుర్ట్రు = (ఆమె బయటకు వెడలిన పిమ్మట) లేచి; తారార్ తడమ్ తోళ్ గళ్=పూలమాలచే అలంకృతమైన గొప్ప భుజములతొ; ఉళ్ళళవుం కైనీట్టి = (ఎక్కువగా వెన్న చేతిలో చేరునట్లు) కుండలో క్రిందవరకు చేతులను జొనిపి ;ఆరాద వెణ్ణెయ్=(ఎంత ఆరగించినను) తృప్తి తీర్పని వెన్నను;విழுఙ్గి=పూర్తిగ ఆరగించి; అరుగు ఇరిన్ద = చెంతలోనున్న; మోరార్ కుడమ్ ఉరుట్టి = మజ్జిగతో నిండియున్న కుండను నేలపాలుచేసి; మున్ కిడన్ద తానత్తే = మునుపు తాను పరుండిన చోటనే;ఓరాదవన్ పోల్ = కదలక,మెదలక ఏమియు తెలియనివానివలె; కిడన్దానై = పరుండియున్న శ్రీ కృష్ణుని; అవళుమ్ వారా కణ్డు = తిరిగివచ్చిన యశోదాదేవి ఉట్టిలో పెట్టిన కుండను చూచి; త్తాన్ వైత్తదు కాణాల్=తాను ఉంచిన వెన్న లేకపోవుటచే; వయిఱు అడిత్తు = (బాలునికి ఏము కీడు జరుగునోయని) తన కడపును బాధతో కొట్టుకొని; ఐయర్ ఇవర్ అల్లాల్ = (ఇచట పరుండియున్న) ఈ మహనీయుడు తప్ప; ఇఙ్గు ఆరార్ పుగుదువార్ = ఈ ప్రదేశమును ఎవరెవరు ప్రవేశింపగలరు?;(అని మిక్కిలి యోచనచేసి, నిశ్చయము చేసుకొని శ్రీ కృష్ణుని ఉద్దేశించి) నీరామ్ ఇదు శెయ్ దీర్ ఎన్ఱు = ” నీవే! ఈ వెన్ననంతయును ఆరగించితివి” అని పలుకుచూ; తీరా వెగుళియళాయ్= భరించలేని కోపముతో;ఓర్ నెడుమ్ కయిర్ట్రాల్ = తనకు చేతికందిన పెద్ద తాడుతో; ఊరార్ గళ్ ఎల్లారుం కాణ = గ్రామస్తులందరు చూచునట్లు; ఉరలోడే=రోకలికి; చ్చిక్కెన ఆర్తు అడిప్ప = గట్టిగా చేర్చికట్టి కొట్టగ; ఆరా వయిర్ట్రోడు ఆర్ట్రాదాన్ = మిక్కిలి దుఃఖముతోను, బాధతో నిలబడియున్నవాడును అన్ఱియుమ్ = మఱియు; నీరార్ నెడుమ్ కయత్తై శెన్ఱు = నీటితో నిండియున్న పెద్ద తటాకములో ప్రవేశించి; అలైక్క నిన్ఱు ఉరప్పి = నీరు వరదవలె బయటకు పొరులునట్లు అల్లకల్లోలముచేసి; ఓరాయిరం పణ వెంగో ఇయల్ నాగత్తై=వేయి ఫణములుగలదియు, మరియు యమునివలె క్రూరమైన స్వభావముగలదియు అయిన కాళియన్ అను సర్పమును; ఎనక్కు వారాయ్ ఎన్ఱు = ” నాతో యుద్ధమునకు రమ్ము ” అని పిలిచి; మర్ట్రు అదన్ మత్తకత్తు = (యుద్ధమును చేసి) మఱియు దాని పడగలపై; శీరార్ తిరువడియాల్ = తన దివ్య మహిషీమణులు ఒత్తు దివ్య చరణములతో; పాయ్ న్దాన్ = దుమికి నాట్యము చేసినవాడును;
గోకులమందు పశువులమందను మేయించినవాడే , ప్రళయకాలమున సర్వలోకములను ఆరగించి తన ఉదరముననుంచుకొని రక్షించి తిరిగి సృష్ఠికాలమున బైటకు వెలిపరచినవాడు , యశోదాదేవి బిడ్డగ వేంచేసిన ఆ మహనీయుడు, ఒక రోజున తన తల్లి ,మీగడ భరితమైన పెరుగును చిలికి వచ్చిన వెన్నముద్దను ఒక కుండలో ఉంచి భద్రముగ ఉట్టిలో పెట్టి చేతికందకుండ పైకి కట్టి , కదలక మెదలక ఏమియును తెలియనట్లు దొంగ నిద్రలో పరుండియున్న బాలకృష్ణని చూచి బయటకు వెడలగ, తాను లేచి కుండలో నున్న వెన్నను ఆరగించి, ప్రక్కనగల మజ్జిగతో నిండియున్న కుండను నేలపాలుచేసి తిరిగి కదలకమెదలక ఏమియును చేయనివానివలె పరుండగ, తిరిగివచ్చిన యశోదాదేవి ఉట్టిలో పెట్టిన కుండను చూచి తాను ఉంచిన వెన్న లేకపోవుటచే ,తన కుమారుని చేష్టయేయని గ్రహించి, పుత్రునకు ఏమి కీడు సంబవించునోయని వ్యధతో , మిక్కిలి కోపగించి, చిన్న తాడుతో అతని ఉదరమును (బ్రహ్మాండమును ఆరగించిన ఆ ఉదరమును) రోకలికి చేర్చి కట్టి, కొట్టగ, పద్మములవంటి కన్నులు బాష్పపూరితమై, (కొట్టితినే యనిరోదించు) తల్లి వైపు చూచినవాడును, మఱియు నీటితో నిండియున్న పెద్ద తటాకములో ప్రవేశించి , అచట నివసించుచున్న వేయి ఫణములుగల కాళియన్ అను సర్పముతో యద్దముచేసి దాని పడగలపై దుమికి అద్వితీయమైన నృత్యము చేసినవాడును,
…. …… …… …. ….. తన్ శీతైక్కు
నేరావన్ ఎన్ఱు l ఓర్ నిశాశరి తాన్ వన్దాళై , 2711
కూరార్ న్ద వాళాల్ l కొడిమూక్కుమ్ కాదిరణ్డుమ్ l ,
ఈరా విడుత్తు l అవట్కు మూత్తోనై l, వెన్నరకమ్ 2712
శేరావగైయే l శిలై కునిత్తాన్ l శెమ్ తువర్ వాయ్
వారార్ వనములైయాళ్ l వైదేవి కారణమా l , 2713
ఏరార్ తడన్దోళ్ l ఇరావణనై l, ఈరైన్దు
శీరార్ శిరమఱుత్తు l చ్చెర్ట్రుకన్ద శెఙ్గణ్ మాల్ l , 2714
తన్ శీతైక్కు= తన భార్య అయిన సీత కొఱకు; నేర్ ఆవన్ ఎన్ఱు = ” నేను సీతాదేవికి సరితూగగలను ” అని ఎంచి; ఓర్ నిశాశరి = ఒక రక్కసి శూర్పణఖ;తాన్ వన్దాళై= ఏవిధముగను సీతాదేవికి సరితూగని ఆ రక్కసి రాగా(శ్రీరాముని పరిణయమాడుటకు రాగా) ఆమెయొక్క; కూరార్ న్ద వాళాల్ = మిక్కిలి వాడియైన కత్తితో; కొడి మూక్కుమ్ కాదు ఇరణ్డుమ్ = తీగవలెనున్న ముక్కును, రెండు చెవులను; ఈరా విడుత్తు = ఖండించి బైటకు నెట్టియు; అవట్కు మూత్తోనై = (కోపముతో వచ్చిన) ఆమెయొక్క అన్నయగు ‘కర’ అను రాక్షసునుని; వెమ్ నరకమ్ = క్రూరమైన వేఱొక నరకమునకు,శేరావగైయే శిలై కునిత్తాన్= చేరనవసరము లేక సకలమైన నరకబాధలు అనుభవించినట్లు ధనస్సును వంచిన వాడును (బాణములను ప్రయోగించి నరకబాధ కలిగించినవాడును);శెమ్ తువర్ వాయ్ = మిక్కిలి ఎఱ్ఱనైన అదరములు కలదియు; వారార్ వనములైయాళ్ = అందమైన వస్త్రముతో కప్పుకొన్న వక్షోజములుగల; వైదేవి కారణమా = సీతాదేవి కొరకై; ఏరార్ తడమ్ తోళ్ ఇరావణనై = అందమైన గొప్ప బాహువులుగల రావణుని యొక్క; ఈరైన్దు = పది; శీరార్ శిరమ్ అఱుత్తు శెర్ట్రు = విశిష్టమైన తలలను త్రుంచి,వధించి; ఉగన్ద శెమ్ కణ్ మాల్ = (తన భక్తుల విరోధిని సంహరించినందులకు) మిక్కిలి సంతోషించిన , ఎఱ్ఱని నేత్రములుగల భక్తవత్సలుడును;
(చిత్రకూటమందు) సీతారాములనుచూచి , మోహితురాలై కామరూపమును దాల్చి ” తాను సీతాదేవి యొక్క అందమునకు సరితూగగలను ” అని ఎంచి, శ్రీరాముని పరిణయమాడుటకై రాగా, రామునిచే తిరస్కరింపబడి, దానికి కారణము సీతాదేవియే అని తలచి , ఆమెను చంపుటకై ఉపక్రమించిన రక్కసి శూర్పణఖ ముక్కుచెవులను వెంటనే కోసినవాడును,కోపముతో వచ్చిన ఆ రక్కసి అన్నయగు ‘కర’ అను రాక్షసునుని క్రూరమైన వేఱొక నరకమునకు చేరనవసరములేక సకలమైన నరకబాధలు అనుభవించినట్లు ధనస్సును వంచినవాడును, సీతాదేవిని అపహరించి లంకలో బంధించిన రావణాసురుని యొక్క పదితలలను తనయొక్కప్రఖ్యాతమైన కోదండవిల్లును ఎక్కుపెట్టి అద్వితీయమైన భాణములచే త్రుంచి, వధించిన భక్తవత్సలుడును,
పోరార్ నెడువేలోన్ l పొన్ పెయరోన్ ఆగత్తై l,
కూరార్ న్ద వళ్ళుగిరాల్ l కీణ్డు l కుడల్ మాలై 2715
శీరార్ l తిరుమార్బిన్ మేల్ కట్టి l శెఙ్కురుది
శోరాక్కిడన్దానై l కుఙ్గుమత్తోళ్ కొట్టి l , 2716
ఆరా ఎழுన్దాన్ l అరియురువాయ్ l , అన్ఱియుమ్
…… …… …… ……. ……..
పోరార్ నెడువేలోన్=యుద్దమునకు ఎల్లప్పుడు సంసిద్ధమైయుండు పొడుగైన ఈటె గలవాడైన; పొన్ పెయరోన్ = హిరణ్యాసురునియొక్క;ఆగత్తై =వక్షస్థలమును;అరియురువాయ్= నరసంహరూపముదాల్చి; కూరార్ న్ద వళ్ ఉగిరాల్ కీణ్డు = మిక్కిలి వాడియైన దట్టమైన నఖములచే చీల్చి; కుడల్ మాలై= పేగులను మాలగ ; శీరార్ తిరుమార్బిన్ మేల్ కట్టి = విజయలక్ష్మి నివాసస్థానమైన వక్షస్థలముపై వేసుకొని;శెమ్ కురుది శోరాక్కిడన్దానై = రక్తపు మడుగుయందు పడియున్న హిరణ్యాసురుని; కుఙ్గుమత్తోళ్ కొట్టి = కుంకుమచే అలంకృతమైన తన భుజములపై వేసుకొని ;ఆరా ఎழுన్దాన్ = మిక్కిలి భయంకరముగ అరచుచు నిలబడినవాడును; అన్ఱియుమ్ = మఱియు;
పరమభక్తుడైన ప్రహ్లాదుని హింసించుచున్న అతని తండ్రియైన హిరణ్యాసురుని విశాలవక్షస్ధలమును నరసంహరూపముదాల్చి తన వాడినఖములతో చీల్చి అతని పేగులను మాలగ శ్రీమహాలక్ష్మి నివాసస్థానమైన వక్షస్థలముపై వేసుకొని, రక్తపు మడుగుయందు పడియున్న ఆ హిరణ్యాసురుని, కుంకుమతో అలంకృతమైన తన భుజములపై వేసుకొని , మిక్కిలి భయంకరముగ అరచుచు నిలబడినవాడును; మఱియు,
……. …… … …………….
పేర్ l వామననాగియ కాలత్తు l , మూవడిమణ్ 2717
తారాయ్ ఎనక్కెన్ఱు l వేణ్డిచ్చలత్తినాల్ l ,
నేరేర్ట్రు ఉలగెల్లాం l నిన్ఱళన్దాన్ మావలియై l , 2718
పేర్ వామననాగియ కాలత్తు = ప్రఖ్యాతమైన వామనరూపమునుదాల్చిన కాలమందు; మావలియై = మహాబలిని; మూవడిమణ్=(తన పాదములచే కొలవగల) మూడడుగుల నేలను; తారాయ్ ఎనక్కు ఎన్ఱు వేణ్డి =” నాకు ఒసగుమా!” అని కోరి; నీరు ఏర్ట్రు = దానజలమును స్వీకరించిన వెంటనే; శలత్తినాల్ = కపటముతో ( కనపరచిన చిన్న పాదమును, త్రివిక్రముడై పెద్ద పాదముతో ); నిన్ఱు = ఎదిగి; ఉలగెల్లాం అళన్దాన్ = లోకములన్నింటిని కొలిచినవాడును;
ప్రఖ్యాతమైన వామనరూపమునుదాల్చిన కాలమందు, మహాబలిని మూడడుగుల నేలను యాచించి, దానజలమును స్వీకరించిన వెంటనే,కపటముతో త్రివిక్రముడై ఎదిగి లోకములన్నింటిని కొలిచినవాడును,
ఆరాద పోరిల్ l అశురర్ గళుంతానుమాయ్ l ,
కారార్వరైనట్టు l నాగమ్ కయిఱాగ l , 2719
పేరామల్ తాఙ్గి కడైన్దాన్ , తిరుత్తుழாయ్
తారార్ న్ద మార్వన్ , ………. ……….l . 2720
ఆరాద పోరిల్=ఎడతెగక దేవతలకును దానవులకును మధ్య జరుగుతున్న యుద్దమందు; అశురర్ గళుం తానుమ్ = దానవులు మరియు తానును; కారార్ వరై నట్టు = మేఘములతో ఆవరింపబడిన మందరపర్వతమును కవ్వముగా స్ధాపించి; నాగమ్ కయిఱాగ = వాసుకియను మహాసర్పమును కవ్వమునకు తాడుగ చేసుకొని; పేరామల్ తాఙ్గి = ఆ మందరపర్వతమును మునగనీయక, ప్రక్కలకు ఒరిగిపోకుండ కూర్మమై దానిని వీపునదాల్చి;తిరుత్తుழாయ్ తారార్ న్దమార్వన్=తులసీపుష్పమాలను ధరించిన వక్షస్థలము గలవాడు; కడైన్దాన్ = పాలసముద్రమును చిలికినవాడును;
తులసీపుష్పమాల వక్షస్థలమున గల సర్వేశ్వరుడు, ఎడతెగక దేవతలకును దానవులకును మధ్య జరుగుతున్న యుద్దమందు తాను (దేవతలపక్షపాతి అని తెలియనీయక) అసురులతో చేరి పెద్ద మందర పర్వతమును కవ్వముగాను వాసుకి యను మహాసర్పమును ఆకవ్వమునకు తాడుగ చేసుకొని, ఆమందరపర్వతమును మునగనీయక, ప్రక్కలకు ఒరిగిపోకుండ కూర్మమై దానిని వీపునదాల్చి పాలసముద్రమును చిలికినవాడును;
………….. ……….. , తడమాల్వరై పోలుమ్ l ,
పోరానై పొయ్ గై వాయ్ l కోళ్ పట్టు నిన్ఱలఱి l ,
నీరార్ మలర్కమలమ్ l కొణ్డు ఓర్ నెడుఙ్గైయాల్ l , 2721
నారాయణా l ఓ మణివణ్ణా నాగణైయాయ్ l,
వారాయ్ l ఎన్ ఆర్ ఇడరై నీక్కాయ్ l , ఎన వెకుణ్డు 2722
తీరాద శీర్ట్రత్తాల్ l శెన్ఱిరణ్డు కూఱాగ l ,
ఈరా అదనై l యిడర్ కడిన్దాన్ ఎమ్బెరుమాన్ l, 2723
పేరాయిరముడైయాన్ l పేయ్ ప్పెణ్డీర్ నుమ్మగళై l,
తీరా నోయ్ శెయ్ దాన్ l ఎన వురైత్తాళ్ l , ……… 2724
తడమాల్ వరై పోలుమ్ = విశాలమైన,ఎత్తైన పర్వతము పోలిన; పోర్ ఆనై = పర్వతములను ఢీకొని పిండిచేయగల గజేంద్రుడు; పొయ్ గై వాయ్ = పెద్ద నీటి మడుగులో; కోళ్ పట్టు నిన్ఱు అలఱి = మొసలి నోటికోరలలో చిక్కి , శక్తినశించి,మిక్కిలి వ్యధతో కన్నీరు కార్చుచూ; ఓర్ నెడుమ్ కైయాల్=ధీర్ఘమైన తన తొండముచే; నీరార్ = నీటిలో శరీరమంతా మునిగియున్న గజేంద్రుడు; మలర్ కమలమ్ కొణ్డు = అప్పుడే వికసించిన తామరపుష్పమును గైకొని ; ఓ నారాయణా మణివణ్ణా నాగణైయాయ్ = ఓ నారాయణా! ఓ నీలమణివంటి కాంతిగల స్వరూపుడా! ఓ శేషతల్పముపై పవళించియున్నవాడా!; వారాయ్ = వేంచేయుమా!; ఎన్ ఆర్ ఇడరై నీక్కాయ్ ఎన = నాయొక్క అమితమైన దుఃఖమును పోగొట్టుమా! అని ఎలుగెత్తి పిలువుగ; ( ఆ దుఃఖభరితమైన పిలుపులు విని ) వెకుణ్డు = మొసలిపై మిక్కిలి ఆగ్రహించి; తీరాద శీర్ట్రత్తాల్ శెన్ఱు = అమిత కోపావేశముతో మడుగు వద్దకు వెడలి; ఇరణ్డు కూఱాగ = (మొసలిని) రెండు ముక్కలుగ, ఈరా=(చక్రాయుధముచే) ఖండించి; అదనై యిడర్ కడిన్దాన్ ఎమ్బెరుమాన్=ఆ గజేంద్రుని దుఃఖమును పోగొట్టినటువంటి సర్వేశ్వరుడు; పేరాయిరముడైయాన్ = ఇట్లు ఆశ్రితుల సంరక్షణార్ధమై చేయు లెక్కలేని చేష్టితములు తెలుపు వేయి దివ్య నామములు గలవాడు; పేయ్ ప్పెణ్డీర్= (పరకాలనాయకి యందుగల ప్రీతిచే) అవివేకముతో నున్న యువతులారా!; నుమ్మగళై = ఈ మీ కుమార్తెకు; తీరా నోయ్ శెయ్ దాన్ = తొలగింపలేని వ్యధ కలగించెను; ఎన ఉరైత్తాళ్ = అని కొఱవ స్త్రీ పలికెను;
పర్వతముపోలిన ఆకారముగల మదజలము స్రవించు గజేంద్రుడు తామరపుష్పములను సర్వేశ్వరునికి సమర్పించుటకై నీటితోనిండిన తటాకములో దిగి,మొసలి నోటికోరలలో చిక్కి , శక్తినశించి, మిక్కిలి వ్యధతో కన్నీరు కార్చుచూ, నీటిలో శరీరమంతా మునిగియున్న గజేంద్రుడు తన తొండముచే అప్పుడే వికసించిన తామరపుష్పమును గైకొని ,”ఓ నారాయణా! ఓ నీలమణివంటి కాంతిగల స్వరూపుడా! శేషతల్పముపై పవళించియున్నవాడా!, నిన్ను కనలేని నాయొక్క అమితమైన దుఃఖమును పోగొట్టుమా!” అని ఎలుగెత్తి పిలువుగ,ఆ దుఃఖభరితమైన పిలుపులు విని,అమిత కోపావేశముతో మడుగు వద్దకు వెడలి,చక్రాయుధముచే మొసలిని రెండు ముక్కలుగ ఖండించి,ఆ గజేంద్రుని దుఃఖమును పోగొట్టినటువంటి సర్వేశ్వరుడును, ఈ విధముగా అనేక దివ్య చేష్టితములను తెలుపు సహస్రనామములచే స్తుతింపబడు శ్రీ మన్నారాయణుడే ఈ పరకాలనాయకికి తొలగింపలేని వ్యధ కలగించెను.ఇట్లు కొఱవస్త్రీ విసదీకరించి పలికెను.
……. …… ……..…. , శిక్కెన మర్ట్రు
ఆరానుమ్ అల్లామై కేట్టు l ఎఙ్గల్ అమ్మనైయుమ్ l,
పోరార్ వేల్ కణ్డీర్ l అవనాగిల్ పూన్దుழாయ్ l , 2725
తారాతొழிయుమే l తన్ అడిచ్చియల్లళే l, మర్ట్రు
ఆరానుమల్లనే l ఎన్ఱొழிన్దాళ్ l , ….. ……… 2726
ఎఙ్గల్ అమ్మనైయుమ్ = నాయొక్క తల్లి; మర్ట్రు ఆరానుమ్ అల్లామై శిక్కెన కేట్టు=ఏ ఒక క్షుద్రదేవతయు నావ్యధకు కారణము కాదని (కొఱవ స్త్రీ) చెప్పినదంతయు బాగుగ విని;( అచటగల వారితో ) పోరార్ వేల్ కణ్డీర్ = యుద్దమునకు సిద్ధముగనున్న ఈటెవలె వాడియైన కనులుగల రమణీయులారా!; అవనాగిల్=ఆ సర్వేశ్వరుడే కారణమయినచో; పూన్దుழாయ్ తారాదు ఒழிయుమే = తులసీపుష్పములను నాకుమార్తెకు ఒసగొక విడుచునా!; తన్ అడిచ్చియల్లళే = నాయొక్క కుమార్తె ఆ సర్వేశ్వరుని దివ్య చరణములయందే శరణుజొచ్చియున్నది కదా!;మర్ట్రు ఆరానుమ్ అల్లనే ఎన్ఱు ఒழிన్దాళ్= ఆ సర్వేశ్వరుడే తప్ప వేరెవరును కారణముకాదని పలుకుచూ, నా కొరకై చింతవదలి నిష్క్రమించెను;
ఏ ఒక క్షుద్రదేవతయు నావ్యధకు కారణము కాదని (కొఱవ స్త్రీ) చెప్పినదంతయు బాగుగ విని, నాయొక్క తల్లి ,అచటగల వారితో “నాయొక్క కుమార్తె ఆ సర్వేశ్వరుని దివ్య చరణములయందే శరణుజొచ్చియున్నది కదా!, ఆ శరణాగత వత్సలుడు నా కుమార్తెకు వలయు తులసీపుష్పముల ప్రసాదమును ఒసగక విడుచునా?” అని పలికి నా విషయమై నిశ్చింతయై నిష్క్రమించెను.
….. …… ……, నాన్ అవనై
క్కారార్ తిరుమేని l కణ్డదువే కారణమా l ,
పేరాపిదర్ట్రా l త్తిరితరువన్ l , పిన్నైయుం 2727
ఈరా ప్పుగుదలుమ్ l ఇవ్వుడలై తణ్ వాడై l,
శోరా మఱుక్కుమ్ వగైయఱియేన్ l , శూழ் కుழలార్ 2728
ఆరానుమ్ ఏశువర్ l ఎన్నుమదన్ పழிయై l,
వారామల్ కాప్పదర్కు l వాళా ఇరన్దొழிన్దేన్ l , 2729
నాన్ = (మడల్ ప్రక్రియ చేపట్టాలని తలచుచు పూలబంతితో ఆడు) నేను; అవనై = కుండలతో నృత్యముచేయువానిని; క్కారార్ తిరుమేని కణ్డదువే కారణమా = నల్లని అతని దివ్యశరీరముయొక్క దర్శన కారణముగ; పేరా పిదర్ట్రా త్తిరితరువన్ = ప్రశాంతతలేక, పొంతనలేని మాటలతో, ఇటు అటు తిరుగుచున్నాను;పిన్నైయుం=మఱియు;తణ్ వాడై = చల్ల గాలి;ఇవ్వుడలై ఈరా ప్పుగుదలుమ్=ఈ నాశరీరమును శిధిలపరచి ప్రవేశించియు ; శోరా మఱుక్కుమ్= ఎడతెగని మనఃక్లేశమును కలుగజేయుచున్న; వగైయఱియేన్= ఆ చిత్రహింసలను చెప్పలేకున్నాను; శూழ் కుழలార్ = ( ఆ నీలమేఘశ్యాముని వలలో చిక్కని) చెదరని దట్టమైన కొప్పులుగల ;ఆరానుమ్ = ఏ యువతియైనను;ఏశువర్ ఎన్నుమ్ = రకరకములైన అపవాదులు నాపై చెప్పుదురని ఎంచి; అదన్ పழிయై = అట్టి నిందలను, వారామల్ కాప్పదర్కు = రాకుండా కాపాడుకొనుటకై; వాళా ఇరన్దొழிన్దేన్ = మడల్ ప్రక్రియ ఏమియు చేయక ఉండిపోతిని;
నాయొక్క తల్లి నిశ్చింతయై వెడలినను , నేనైతే ఆ నీలమేఘశ్యాముని కాంచిన ఆనాటినుండియు, ప్రశాంతతలేక పొంతనలేని మాటలతో, ఇటు అటు తిరుగుచున్నాను. మరియు ఈ చల్లని గాలి నాశరీరమును శిధిలపరచి ప్రవేశించి,అది కలిగించే ఆచిత్రహింసలను చెప్పలేకున్నాను. ఆ నీలమేఘశ్యామునికి వశమొందని అందమైన చెదరని కొప్పులుగల స్త్రీలయొక్క అపవాదులు నాపై రాకుండటకై ఇదివరలో మడల్ ప్రక్రియ ఏమియు చేయక ఉండిపోతిని.
వారాయ్ మడనెఞ్జే l వన్దు l , మణివణ్ణన్
శీరార్ తిరుత్తుழாయ్ l మాలై నమక్కరుళి l, 2730
తారాన్తరుమెన్ఱు l ఇరణ్డత్తి లొన్ఱదనై l ,
ఆరానుం ఒన్నాతార్ lకేళామే శొన్నక్కాల్ l, 2731
ఆరాయుమేలుమ్ l పణికేట్టు అదు అన్ఱెనిలుమ్ l ,
పోరా తొழிయాదే l పోన్దిడు నీ యెన్ఱేఱ్కు l , 2732
కారార్ కడల్ వణ్ణన్ l పిన్బోన నెఞ్జముమ్ l,
వారాదే l యెన్నై మఱన్దదుదాన్ l , …….. 2733
మడనెఞ్జే=ఙ్ఞానము కోల్పోయిన నామనసా!;వారాయ్=లేచి రమ్ము!;వన్దు=నీవు (సర్వేశ్వరుని వద్దకు) వెడలి; మణివణ్ణన్ = ఆ నీలమణివంటి కాంతిగల సర్వేశ్వరుడు; నమక్కు అరుళి = మనపై కృపచేసి; శీరార్ తిరుత్తుழாయ్ మాలై = (సర్వేశ్వరుని తిరుమేను స్పర్శచే) విలక్షణమైన దివ్య తులసీమాలను;తారాన్ తరుమ్ ఎన్ఱు ఇరణ్డత్తిల్ ఒన్ఱు అదనై = ఒసగ నంగీకరించడో లేక ప్రీతితో ఒసగునో అను రెండింటిలో ఒక సందేశమును (నేను నీచే పంపుచున్న ఈవార్తలు); ఆరానుం ఒన్నాదార్ కేళామే శొన్నక్కాల్ = ఎవరైనను ప్రతికూలవ్యక్తులు విననట్లు నివేదనచేసినచో; పణికేట్టు=ఆ సందేశమును విని;ఆరాయుమేలుమ్= మిక్కిలి ప్రీతితో నా విషయమై నిన్నడగి తెలుసుకొనునో; అదు అన్ఱు ఎనిలుమ్ = అట్లుగాక విముఖతతో నుండిపోవునో;పోరాదు ఒழிయాదే=పోయి అచటనే నుండిపోక; నీ పోన్దిడు=నీవు నాచెంతకు రమ్ము; యెన్ఱేఱ్కు = ఈ విధముగా చెప్పినదానికి అంగీకరించి; కారార్ కడల్ వణ్ణన్ పిన్ పోన = నల్లని సముద్రము పోలిన తిరుమేనిగల సర్వేశ్వరుని చెంతకుపోయిన; నెఞ్జముమ్=నాయొక్క మనస్సు;వారాదే= తిరిగిరాక; యెన్నై మఱన్దదుదాన్ =(సర్వేశ్వరుని చెంత నుండిపోయి) నన్ను మరిచిపోయినది;
నేను నా మనస్సును ఆ నీలమేఘశ్యాముని చెంతకు దూతగ పంపుటకు నిశ్చయించి, ” ఓ మనసా! నీవు ఆ సర్వేశ్వరుని వద్దకు వెడలి ఏకాంతములో నాయొక్క స్ధితిని,మనోవాంఛను నివేదించుమా! నా సందేశమును విని ఆ సర్వేశ్వరుడు (అత్యంతమైన ఆశాభావము కలిగి చెప్పుచున్న మాటలు)మిక్కిలి ప్రితితో తన దివ్య తులసీమాలను నాకు అనుగ్రహించుటకు సమ్మతించునో, లేక (భరించలేని వ్యధతో ,దుంఖముతో, చెప్పుచున్న మాటలు) విముఖతతో నుండిపోవునో, తెలుసుకొని వెంటనే నావద్దకు తిరిగిరమ్ము”.అటుల నేను పంపిన నామనస్సు నీలమేఘశ్యాముని చెంతకుపోయి అచటనే ఉండిపోయినది. నన్ను మరిచిపోయినది.
……. …….. ……. , వల్వినైయేన్
ఊరార్ ఉగప్పదే యాయినేన్ l , మర్ట్రెనక్కిఙ్గు l
ఆరాయ్ వారిల్లై l అழల్వాయ్ మెழுగుపోల్ l , 2734
నీరాయ్ ఉరుగుం ఎన్నావి l , నెడుఙ్గణ్గల్
ఊరార్ ఉఱఙ్గిలుం l తానుఱఙ్గా l , ఉత్తమన్దన్ 2735
పేరాయినవే l పిదర్ట్రువన్ l , పిన్నైయుమ్
కారార్కడల్ పోలుం l కామత్తరాయినార్ l , 2736
ఆరే పొల్లామై l యఱివార్ అదునిఱ్క l,
……. ……. ………,
వల్ వినైయేన్ = ( సర్వేశ్వరునిచే ఉపేక్షింపబడుటచే) క్రూరమైన పాపముగల నేను; ఊరార్ ఉగప్పదే ఆయినేన్ = నాయొక్క స్వభావమును విరోధించు యువతులందరూ సంతోషముచెందునటుల శిథిలమైపోతిని; మర్ట్రు ఎనక్కు ఇఙ్గు = మరియు నాకు ఇచట;ఆరాయ్ వార్ ఇల్లై = పలుకరించి క్షేమము అడుగువారు ఎవ్వరును లేరు; ఎన్ ఆవి = నాయొక్క ప్రాణము; అழల్ వాయ్ మెழுగుపోల్ = అగ్ని సమక్షమున మైనమువలె; నీరాయ్ ఉరుగుం = ద్రవించి కరిగిపోవుచున్నది; నెడుమ్ కణ్గల్ = నా విశాల నేత్రములు; ఊరార్ ఉఱఙ్గిలుం తాన్ ఉఱఙ్గా = ఈ ప్రదేశమునగల జనులందరు నిదురించినను తాను నిదురించదు; ఉత్తమన్ తన్ = ఆ పురుషోత్తముని యొక్క; పేరాయినవే పిదర్ట్రువన్=దివ్య నామములనే నేను తోచినవిధముగ పలుకుచుందును;పిన్నైయుమ్=మరియు; కారార్ కడల్ పోలుం కామత్తర్ ఆయినార్=నల్లని అగాధమైన సముద్రము వలె అంతములేని కామముతోనిండినవారు; ఆరే పొల్లామై యఱివార్ = ఎవరు తమ స్వరూపమునకు తగదని తలచెదరు; అదునిఱ్క= అది అటులనే ఉండును సుమీ !
నాకు బాసటగా నుండు నాయొక్క మనస్సు నీలమేఘశ్యాముని చెంతనే ఉండిపోయినది. ఉపేక్షించుచున్న నీలమేఘశ్యాముని బడయుటకు నేను చేయనెంచిన ప్రయత్నములు విరోధించు యువతులందరూ సంతోషముచెందునటుల శిథిలమైపోతిని మరియు ఇచట నా క్షేమము అడుగువారు ఎవ్వరును లేరు. అగ్ని సమక్షమున మైనము వలె నాయొక్క ప్రాణము ద్రవించి కరిగిపోవుచున్నది. నా కనులు నిదుర ఎరుంగదు. ఎల్లవేళల ఆ సర్వేశ్వరుని దివ్య నామములే తోచినవిధముగ పలుకుచుందును. మరియు అగాధమైన సముద్రము వలె అంతులేని కామముతో నిండినవారు ఎవ్వరును తమ ప్రవృత్తి తమ స్వరూపమునకు తగదని ఎన్నడును తలచరు. అది అటులనే ఉండును , తప్పిదము లేదు.
ఆరానుమాదానుం l అల్లళవళ్ కాణీర్ l , 2737
వారార్ వనములై l వాశవదత్తై ఎన్ఱు l ,
ఆరానుమ్ శొల్లపడువాళ్ l , అవళుంతన్ 2738
పేర్ ఆయమ్ ఎల్లామ్ l ఒழிయ పెరుమ్ తెరువే l,
తారార్ తడమ్ తోళ్ l తళై కాలన్ పిన్ పోనాళ్ l, 2739
ఊరార్ ఇగழ்న్దిడప్పట్టాళే l , మర్ట్రెనక్కిఙ్గు
ఆరానుమ్ కఱ్పిప్పార్ నాయగరే l , నానవనై 2740
కారార్ తిరుమేని l కాణుమ్ అళవుమ్ పోయ్ l,
…… ……. ……. ……………… ,
ఆరానుమ్ ఆదానుం అల్లళ్ అవళ్ కాణీర్ = సామాన్య యువతివలె గాక జ్ఞానమందు ఏవిధముగను లోటులేనట్టియు , అందరిచే కొనియాడబడు నట్టి మహిళ విషయమై తెలుసుకొనుడు;వారార్ వనములై=అందమైన వస్త్రముతో కట్టుకొనిన యౌవనమైన వక్షోజములుగల; వాశవదత్తై ఎన్ఱు = వాశవదత్త అని పేరుగల ఆమె; ఆరానుమ్ శొల్లపడువాళ్ = ఎవరినోటైనను కొనియాడబడుచూ నుండునట్టి; అవళుమ్ = ఆ వాశవదత్త కూడ; తన్ పేర్ ఆయమ్ ఎల్లామ్ ఒழிయ=తన యొక్క సఖుల పెద్ద సమూహమంతయును విడిచి;పెరుమ్ తెరువే = విశాలమైన రాజవీదిలో; తారార్ తడమ్ తోళ్ తళై కాలన్ పిన్ పోనాళ్ =అందమైన మాలలచే అలంకృతమైన విశాలమైన భుజములును, కాళ్ళకు సంకెళ్ళుగల వత్సరాయనుని వెంట చనుదెంచిన ఆ వాశవదత్తను ; ఊరార్ ఇగழ்న్దిడప్పట్టాళే = ఊరిలోనున్నవారెవరిచే ఆమె దూషింపబడినది? మర్ట్రు = మఱియు; ఎనక్కు ఇఙ్గు=నాకు ఇచట; ఆరానుమ్ కఱ్పిప్పార్ నాయగరే = ఎవరైనను నేను చేయదలచిన మడల్ ప్రక్రియను తగదని బోధనచేయువారు నాయొక్క నాయకులగుదురా?; (నాకు వారి మాటలు ఎన్నటికీ సమ్మతము కాదు); నాన్ అవనై = నేను ఆ సర్వేశ్వరుని యొక్క; కారార్ తిరుమేని కాణుమ్ అళవుమ్ పోయ్ = నల్లని దట్టమైన మేఘమువంటి స్వరూపమును ప్రత్యక్షముగ గాంచువరకు పోయి;(ఎచ్చటెచ్చటకు అనగ)
జ్ఞానవంతురాలైనట్టియు, మిక్కిలి సౌందర్యవతియుయైన వాసవదత్త యను యువతి వత్సరాయునియందు అమిత ప్రేమానురాగములు కలిగియుండుటచే తన సఖులందరిని విడిచిపెట్టినది. మరియు తన స్వజనులను విరోధించి విశాలమైన రాజవీధిలో కాళ్ళకు సంకెళ్ళుగల వత్సరాయనుని వెంట చనుదెంచినది. అటువంటి వాసవదత్తను లోకమందు జనులు ప్రతిఒక్కరును కొనియాడిరి. సర్వేశ్వరుని పొందగోరి నేను తలంచిన మడల్ ప్రక్రియ తగదని బోధనచేయువారి మాటలు నాకు ఎన్నటికీ సమ్మతము కాదు. నేను ఆ నీలమేఘశ్యాముని ప్రత్యక్షముగ గాంచువరకు పోయి (ఎచ్చటెచ్చటకనగ)
శీరార్ తిరువేఙ్గడమే తిరుక్కోవ 2741
లూరే , మదిళ్ కచ్చియూరకమే పేరకమే
పేరా మరుతిఱుత్తాన్ వెళ్ళఱైయే వెహ్ కావే 2742
పేర్ ఆలి తణ్ కాల్ నఱైయూర్ తిరుప్పులియూర్ ,
ఆరామమ్ శూழ் న్ద అరఙ్గమ్ , కణమఙ్గై 2743
కారార్ మణినిఱ కణ్ణనూర్ విణ్ణగరమ్
శీరార్ కణపురం శేఱై తిరువழுన్దూర్ 2744
కారార్ కుడన్దై కడిగై కడల్ మల్లై
ఏరార్ పొழிల్ శూழ் ఇడవిన్దై నీర్ మలై , 2745
శీరారుమ్ మాలిరుఞ్జోలై తిరుమోగూర్
పారోర్ పుగழுమ్ వదరి వడమదురై 2746
శీరార్ తిరువేఙ్గడమే = నిత్యశూరులచేతను,భూలోక వాసులచేతను కొలవబడు ప్రఖ్యాతమైన తిరుమల దివ్య దేశమును, తిరుక్కోవలూరే = గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తి గోకులవాసులను సంరక్షించిన సర్వేశ్వరుడు కృపతోవేంచేసిన తిరుక్కోవలూరు దివ్య దేశమును; మదిళ్ కచ్చియూరగమే=ప్రాకారములుగల కంచిలో త్రివిక్రముడై సర్వలోకములను తన దివ్య పాదారవిందములచే కొలిచిన జగత్పభువు కృపతో వేంచేసిన ఊరగమను దివ్య దేశమును; పేరకమే = తిరు ప్పేర్ దివ్య దేశమును; పేరా మరుదు ఇఱుత్తాన్ వెళ్ళఱైయే =దృఢమైన రెండు మద్ది వృక్షములు పడత్రోసిన ఆ చిన్ని కృష్ణుడు వేంచేసిన తిరు వెళ్ళఱై దివ్య దేశమును; వెహ్ కావే = భక్తులు చెప్పిన విధముగ సంచరించు సర్వేశ్వరుడు వేంచేసిన తిరు వెహ్ కావే దివ్య దేశమును;పేర్ ఆలి = కీర్తిచెందిన తిరువాలి దివ్య దేశమును; తణ్ కాల్ = ఆహ్లాదము కలిగించు చల్లని మారుతమువలె భక్తుల దుఃఖములను తీర్చు సర్వేశ్వరుడు వేంచేసిన తణ్ కాల్ దివ్య దేశమును; నఱైయూర్ = తిరు నఱైయూర్ దివ్యదేశమును; తిరుప్పులియూర్ = తిరు పులియూర్ దివ్య దేశమును; ఆరామమ్ శూழ் న్ద అరఙ్గమ్ = తోటలచే చుట్టబడిన శ్రీ రంగం దివ్య దేశమును; కణమఙ్గై = తిరు కణమఙ్గై దివ్య దేశమును;కారార్ మణినిఱ కణ్ణనూర్ విణ్ణగరమ్ = నీలమణి కాంతితో ప్రకాశించు సుందరమైన రూపముగల శ్రీకృష్ణుడు వేంచేసిన విణ్ణగరమ్ దివ్యదేశమును;శీరార్ కణపురం = ప్రసిద్ధిచెందిన తిరుకణపురం దివ్య దేశమును; శేఱై = తిరు శేఱై దివ్య దేశమును; తిరువழுన్దూర్ = తిరువழுన్దూర్ దివ్య దేశమును; కారార్ కుడన్దై = నీలమేఘశ్యాముడైన ఆరావముదు పెరుమాళ్ వేంచేసిన తిరు కుడందై దివ్య దేశమును; కడిగై = తిరు కడిగై దివ్య దేశమును (చోళసింహపురమ్); కడల్ మల్లై = తిరు కడల్ మల్లై దివ్యదేశమును;ఏరార్ పొழிల్ శూழ் ఇడవిన్దై = అతిసుందరమైన తోటలతో చుట్టుకొనియున్న తిరువిడవెన్దై దివ్య దేశమును; నీర్ మలై = తిరు నీర్ మలై దివ్య దేశమును; శీరారుమ్ మాలిరుఞ్జోలై =అందమైన తిరుమాలిరుఞ్జోలై దివ్య దేశమును; తిరుమోగూర్ = తిరుమోగూర్ దివ్యదేశమును; పారోర్ పుగழுమ్ వదరి = లోకులందరిచే కొనియాడబడు బదరికాశ్రమమను దివ్య దేశమును; వడమదురై = ఉత్తరమునగల మధుర దివ్య దేశమును, మొదలగు
నిత్యశూరులచేతను,భూలోక వాసులచేతను కొలవబడు ప్రఖ్యాతమైన తిరుమల దివ్య దేశమును,గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తి గోకులవాసులను సంరక్షించిన సర్వేశ్వరుడు కృపతోవేంచేసిన తిరుక్కోవలూరు దివ్య దేశమును, త్రివిక్రముడై సర్వలోకములను తన దివ్య పాదారవిందములచే కొలిచిన జగత్పభువు కృపతో వేంచేసిన ఊరగమను దివ్య దేశమును, తిరు ప్పేర్ దివ్య దేశమును, దృఢమైన రెండు మద్ది వృక్షములు పడత్రోసిన ఆ చిన్ని కృష్ణుడు వేంచేసిన తిరు వెళ్ళఱై దివ్య దేశమును,భక్తులు చెప్పిన విధముగ సంచరించు సర్వేశ్వరుడు వేంచేసిన తిరు వెహ్ కావే దివ్య దేశమును,తిరువాలి దివ్య దేశమును,భక్తుల దుఃఖములను తీర్చు సర్వేశ్వరుడు వేంచేసిన తణ్ కాల్ దివ్య దేశమును,తిరు నఱైయూర్ దివ్యదేశమును, తిరుపులియూర్ దివ్య దేశమును,తోటలచే చుట్టబడిన శ్రీరంగం దివ్య దేశమును,తిరు కణమఙ్గై దివ్య దేశమును,శ్రీకృష్ణుడు వేంచేసిన విణ్ణగరమ్ దివ్యదేశమును,ప్రసిద్ధిచెందిన తిరుకణపురం దివ్య దేశమును,తిరు శేఱై దివ్య దేశమును,తిరువழுన్దూర్ దివ్య దేశమును, నీలమేఘశ్యాముడైన ఆరావముదు పెరుమాళ్ వేంచేసిన తిరు కుడందై దివ్య దేశమును,తిరు కడిగై దివ్య దేశమును,తిరు కడల్ మల్లై దివ్యదేశమును, అతిసుందరమైన తోటలతో చుట్టుకొనియున్న తిరువిడవెన్దై దివ్యదేశమును, తిరు నీర్ మలై దివ్య దేశమును, అందమైన తిరుమాలిరుఞ్జోలై దివ్య దేశమును,తిరుమోగూర్ దివ్య దేశమును, లోకులందరిచే కొనియాడబడు బదరికాశ్రమమను దివ్య దేశమును; ఉత్తరమునగల మధుర దివ్య దేశమును, మొదలగు. ……
ఊరాయవెల్లాం ఒழிయామే నానవనై
ఓరానై కొమ్బొశిత్తు ఓరానై కోళ్ విడుత్త 2747
శీరానై శెఙ్గణ్ నెడియానై త్తేన్ తుழாయ్
త్తారానై తామరైపోల్ కణ్ణానై ఎణ్ణరుమ్ శీర్ 2748
పేరాయిరముమ్ పిదర్ట్రి పెరున్దెరువే
ఊరార్ ఇగిழிలుం ఊరాదొழிయేన్ నాన్ 2749
వారార్ పూమ్ పెణ్ణై మడల్ , 2749 1/2
ఊరాయ ఎల్లామ్ ఒழிయామే = అట్టి దివ్యదేశములన్నియు ఏఒక్కటినివిడువక; నాన్ అవనై =నేను నన్ను విడిచిన ఆ సర్వేశ్వరుని;ఓరానై కొమ్బొశిత్తు ఓరానై కోళ్ విడుత్త=ఒక ఏనుగుయొక్క (కువలయాపీడము యొక్క) దంతములను విరిచినవాడును, ఒక ఏనుగుయొక్క (మొసలి నోటికోరలలో చిక్కి శక్తినశించిన గజేంద్రుని) దుఃఖమును పోగొట్టినవాడును;శీరానై = కల్యాణ గుణములగలవాడును; శెఙ్గణ్ నెడియానై = ఎఱ్ఱని నేత్రములుగలవాడును, నాకు దూరమైనవాడును; త్తేన్ తుழாయ్ త్తారానై = తేనెలొలుకు తులసీమాల నాకు ఒసగనివాడును; తామరైపోల్ కణ్ణానై = తామరపుష్పమువంటి కన్నులుగలవాడును; ఎణ్ణరుమ్ శీర్ పేరాయిరముమ్ పిదర్ట్రి=లెక్కకట్టరాని కల్యాణ గుణములను వర్ణించు సహస్రనామములు చెప్పుచు అవి నా విషయమై సత్యముకాదని నిందలువేయుచు; పెరుమ్ తెరువే = దివ్యదేశములలోని పెద్ద మాడ వీధులలో;ఊరార్ ఇగిழிలుం = అచటి జనులు నన్ను దూషించినను;నాన్=నేను; వారార్ పూమ్ పెణ్ణై మడల్ = మిక్కిలి అందమైన తాటిమట్టతో మడల్ ప్రక్రియను(నన్ను బాదుకొనుచు);ఊరాదు ఒழிయేన్ = ఆచరించుచూ ఆ సర్వేశ్వరుడు నన్ను చేరువరుకు మడల్ ప్రక్రియ చేపట్టియుండెదను.
సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశములన్నియు ఏ ఒక్కటిని విడువక, నన్ను ఉపేక్షించుచున్న సర్వేశ్వరుడును,కువలయాపీడము యొక్క దంతములను విరిచినవాడును,మొసలి నోటికోరలలో చిక్కి శక్తినశించిన గజేంద్రుని దుఃఖమును పోగొట్టినవాడును,ఎఱ్ఱని నేత్రములు గలవాడును, తేనెలొలుకు తులసీమాల ప్రసాదము నాకు ఒసగనివాడును,లెక్కకట్టరాని కల్యాణ గుణములను వర్ణించు వాని సహస్రనామములు చెప్పుచు అవి నావిషయమై సత్యముకాదని నిందలువేయుచు, దివ్యదేశములలోని పెద్దమాడ వీధులలో, అచటి జనులు నన్ను దూషించినను, నేను ఆ నీలమేఘశ్యాముడు నన్ను చేరువరుకు తాటిమట్టతో మడల్ ప్రక్రియను ఆచరించుచూ నుండుదును.
(కంబరు కవిగారు రచించిన పాశురమును ఈ ప్రభంధమునకు చేర్చి భక్తులుపాడుదురు)
ఊరాదొழிయేన్ ఉలగఱియ వొణ్ణుదలీర్ ,
శీరార్ ములై త్తడఙ్గళ్ శేరళవుమ్ , పారెల్లామ్
అన్ఱోఙ్గి నిన్ఱు అళన్దాన్ , నిన్ఱ తిరునఱైయూర్ ,
మన్ఱోఙ్గ ఊర్వన్ మడల్.
ఒణ్ నుదలీర్ = ప్రకాశించు మొఖములుగల యువతులారా!; పారెల్లామ్ అన్ఱు ఓఙ్గి నిన్ఱు అళన్దాన్ = త్రివిక్రమావతారమందు మహాబలి యాగభూమివద్దకు వామనమూర్తియై వేంచేసి దానజలమును స్వీకరించిన వెంటనే ఆకాశపర్యంతము ఎదిగి లోకములన్నింటిని కొలిచిన సర్వేశ్వరుడు; శీరార్ ములై త్తడఙ్గళ్ శేరళవుమ్ = నాయొక్క విలక్షణమైన వక్షోజములను చేరనంతవరకు; ఉలగఱియ = జనులందరు తెలుసుకొనునట్లు; ఊరాదొழிయేన్ = నేను మడల్ ప్రక్రియను నిలుపను; నిన్ఱ తిరునఱైయూర్ మన్ఱు ఓఙ్గ ఊర్వన్ మడల్ = ఆ సర్వేశ్వరుడు వేంచేసిన తిరునఱైయూర్ దివ్య దేశములోని మాడవీధులలో మడల్ ప్రక్రియను నేను ఆచరించెదను.
నా ప్రియసఖులారా! త్రివిక్రమావతారమందు మహాబలి యాగభూమివద్దకు వామనమూర్తియై వేంచేసి దానజలమును స్వీకరించిన వెంటనే ఆకాశపర్యంతము ఎదిగి లోకములన్నింటిని కొలిచిన సర్వేశ్వరుడు నాయొక్క వక్షోజములను చేరనంతవరకు ,జనులందరు తెలుసుకొనునట్లు ఆ సర్వేశ్వరుడు వేంచేసిన తిరునఱైయూర్ దివ్య దేశములోని మాడవీధులలో మడల్ ప్రక్రియను నేను ఆచరించెదను.
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
***********