స్వకీయము

శ్రీమాన్ మాడభూషి శ్రీనివాస శ్రీరామాచార్య అయ్యవార్లంగారు వారి సతీమణి శ్రీమతి రంగనాయకమ్మగారు

శ్రీమన్ నైధృవకాశ్యప మణి మాడభూషి శ్రీ  శ్రీనివాస శ్రీరామాచార్య అయ్యవార్లం గారు వారు సతీమణి శ్రీమతి మాడభూషి రంగనాయకమ్మ , మా  మాతామహులు ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీ మత్పరవస్తు అప్పన్  గోవిందాచార్య స్వామివారు, పూర్వాచారులు యొక్క సంస్కృత భాష మయములైన 20 స్త్రోత్రములను తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యములతో  వ్రాసిన దానిని భద్రపరచి 1969 సంవత్సరమున ” శ్రీ వైష్ణవ స్త్రోత్రమాల ”  అను గ్రంధమును శ్రీ వైష్ణవులకు అందజేసిరి.  గౌరవనీయమైన మా జననీ జనకులకు ద్రావిడ ప్రబంధమైన ” తిరువాయ్ మొழி ” నిత్య పఠనగ్రంధము, మరియు వారి నిరాడంబర జీవనము నాకు చూపిన మార్గదర్శకము.